-
-
Home » Mukhyaamshalu » Ap Telangana National International Latest Breaking and trending ABN Andhrajyothy news Live Updates of 20th March 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Mar 20 , 2026 | 07:29 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Mar 20, 2026 10:08 IST
పెరిగిన బంగారం, వెండి ధరలు
రూ.650 పెరిగి రూ.1,50,930కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.600 పెరిగి రూ.1,38,350కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,64,900
-
Mar 20, 2026 09:57 IST
అమెరికా-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధం
అమెరికా F-35 ఫైటర్‌జెట్‌ను టార్గెట్ చేసిన ఇరాన్
F-35ని కూల్చేశామని ప్రకటించిన IRGC
ఇరాన్ దాడిలో అమెరికా ఫైటర్‌జెట్ ధ్వంసం
తమ ఫైటర్‌జెట్ సురక్షితంగా ల్యాండైందన్న అమెరికా
-
Mar 20, 2026 09:56 IST
ఏపీలో 3 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అకాల వర్షాలు
అకాల వర్షాలు, వడగళ్ల వానతో భారీగా పంట నష్టం
6 జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం
-
Mar 20, 2026 09:55 IST
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 800, నిఫ్టీ 260 పాయింట్లకు లాభం
-
Mar 20, 2026 09:15 IST
హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన
జలసంధిని తిరిగి తెరిచేందుకు జపాన్‌తో కలిసి పనిచేస్తున్నాం: ట్రంప్
హోర్ముజ్ జలసంధి అంశంలో నాటో దేశాలపై ట్రంప్ మండిపాటు
నాటో దేశాలు ఏమాత్రం సాయం చేయడంలేదని ట్రంప్ ఆగ్రహం
-
Mar 20, 2026 08:45 IST
గౌతమ్ గంభీర్ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ
వ్యక్తిగత హక్కులు కాపాడాలంటూ గంభీర్ పిటిషన్
-
Mar 20, 2026 08:30 IST
నేడు కర్నూలు జిల్లా కైరుప్పలలో పిడకల సమరం
కైరుప్పల పిడకల సమరానికి భారీ పోలీసు బందోబస్తు
-
Mar 20, 2026 08:13 IST
భారత్, పాకిస్థాన్ సంబంధాలకు అణ్వస్త్ర ముప్పు: అమెరికా
అమెరికా నిఘా విభాగం నివేదిక విడుదల
భారత్, పాక్ బహిరంగ సైనిక ఘర్షణ కోరుకోవడం లేదు
ఉగ్రవాద సంస్థలతో దాడులు చేసి సైనిక సంక్షోభాన్ని సృష్టించేందుకు కుట్ర
ఐసిస్-కె ఉగ్రవాద సంస్థ దక్షిణాసియాలో దాడులు చేసే అవకాశం
క్షిపణి సాంకేతికత అభివృద్ధి చేసే పనిలో పాకిస్థాన్
-
Mar 20, 2026 08:11 IST
ఏపీలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం: విపత్తు నిర్వహణ శాఖ
ఏపీలో మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం
కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం
-
Mar 20, 2026 08:10 IST
అమెరికా కోసం ట్రంప్ మంచి నిర్ణయాలు తీసుకుంటారు: నెతన్యాహు
ట్రంప్ విజ్ఞప్తితో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేస్తుంది
యుద్ధం అనుకున్న దానికన్నా చాలా త్వరగా ముగుస్తుంది
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఇప్పటివరకు బయటకు రాలేదు
ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తాం
-
Mar 20, 2026 08:10 IST
ఇజ్రాయెల్, అమెరికా నిజమైన భాగస్వాములు: నెతన్యాహు
ఇరాన్ యుద్ధంలో అమెరికా సహకారంతో చాలా సాధించాం
ఇజ్రాయెల్ గతం కన్నా చాలా బలంగా ఉంది
మిడిల్‌ఈస్ట్ మారుస్తామని మాట ఇచ్చాం
మిడిల్‌ఈస్ట్‌పై ఇరాన్ దాడి చేస్తోంది
పశ్చిమాసియా, అమెరికా ఆస్తులపై ఇరాన్ దాడి
ప్రపంచం మొత్తాన్ని ఇజ్రాయెల్, అమెరికా కాపాడుతోంది
-
Mar 20, 2026 07:55 IST
మిడిల్ఈస్ట్ ఉద్రిక్తతలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు ప్రధాని మోదీ ఫోన్
ఉద్రిక్తతల నియంత్రణకు అవసరమైన చర్చలకు ప్రాధాన్యం
ఘర్షణలకు ముగింపు పలికేలా దౌత్య మార్గాలను పునఃప్రారంభించాలి: ప్రధాని మోదీ
-
Mar 20, 2026 07:49 IST
నేడు తెలంగాణ మంత్రివర్గం సమావేశం
సీఎం రేవంత్ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం
మ.12 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్‌బాబు
-
Mar 20, 2026 07:32 IST
నేడు తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన
రేపు శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబసభ్యులు
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు కుటుంబం
శ్రీవారి దర్శనం తర్వాత పలు పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం