Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 31 , 2026 | 07:25 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 31, 2026 21:59 IST

    అమరావతి: జనసేన నేతలతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ సమావేశం

    • 'సేనాగళం' కమిటీ ఏర్పాటుచేస్తున్నట్లు పవన్ ప్రకటన

    • అన్నివర్గాలనూ గౌరవించేలా కమిటీ పనిచేయాలని దిశానిర్దేశం

    • వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి: పవన్‌

    • సామాజిక వర్గాలను ఈ వ్యవహారంలోకి లాగకూడదు: పవన్ కల్యాణ్

  • May 31, 2026 21:55 IST

    హైదరాబాద్‌: ఘనంగా పటేల్‌ 150వ జయంతి వేడుకలు

    • ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమం

    • హాజరైన కేంద్రమంత్రి షెకావత్‌, టి బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • పటేల్‌.. చారిత్రక వ్యక్తి కాదు.. 'కాలాతీత శక్తి': షెకావత్‌

    • పటేల్ దూరదృష్టితోనే అఖండ భారత్‌ సాధ్యమైంది: షెకావత్‌

  • May 31, 2026 21:21 IST

    రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్‌ 156

    • గుజరాత్ టైటాన్స్ 155/8

    • RCB బ్యాటింగ్‌: వాషింగ్టన్ సుందర్‌ 50 నాటౌట్‌

  • May 31, 2026 21:03 IST

    రేపు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌

    • సాయంత్రం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

    • రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ

    • అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి సమావేశం

  • May 31, 2026 20:16 IST

    రేపు తిరుచ్చిలో సీఎం విజయ్ పర్యటన

    • తిరుచ్చి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న సీఎం విజయ్‌

  • May 31, 2026 20:15 IST

    అభివృద్ధికి తొలి కొలబద్ద విద్య: 'X'లో సీఎం రేవంత్‌రెడ్డి

    • ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి

    • టీచర్ల నియామకం, డిజిటల్‌ విద్య, స్కూళ్లకు ఉచిత విద్యుత్‌: సీఎం రేవంత్ రెడ్డి

  • May 31, 2026 20:14 IST

    జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ ప్రారంభం చారిత్రక మైలురాయి: సీఎం చంద్రబాబు

    • రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్పు: 'X'లో సీఎం చంద్రబాబు

    • ఏపీని లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చేందుకు ఇదో మైలురాయి: చంద్రబాబు

  • May 31, 2026 19:39 IST

    అమలాపురంలో మంత్రి నారాయణ పర్యటన

    • హౌసింగ్ బోర్డు కాలనీలో చిల్డ్రన్ పార్క్‌ పరిశీలన

    • పార్క్ అభివృద్ధి పనులకు రూ.50 లక్షల నిధుల విడుదల

  • May 31, 2026 19:09 IST

    అమరావతి: జనసేన ఆఫీస్‌లో కీలక నేతలతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

    • కీలక అంశాలపై నేతలకు పవన్‌కల్యాణ్ దిశానిర్దేశం

  • May 31, 2026 19:08 IST

    ఈటలకు అండగా నిలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులు

    • ఈటలకు వ్యతిరేకంగా బ్యానర్లను ఏర్పాటు చేయడాన్ని ఖండించిన బీజేపీ నేతలు

    • ఈటలపై వ్యక్తిగత దాడి సరికాదు: బీజేపీ నేతలు

    • బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలి: బీజేపీ నేతలు

  • May 31, 2026 19:08 IST

    DSC పేపర్‌ లీక్ అయిందంటూ దుష్ప్రచారం: మంత్రి అనగాని సత్యప్రసాద్

    • ప్రశ్నపత్రాలు దొంగిలించడం, లీక్ చేయడం జగన్‌కే తెలుసు: మంత్రి అనగాని

    • హైదరాబాద్‌లో టెన్త్‌ చదివేటప్పుడు ప్రశ్నపత్రం దొంగిలించి జగన్ లీక్‌ చేయలేదా: అనగాని

  • May 31, 2026 19:07 IST

    టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న RCB

    • అహ్మదాబాద్‌లో గుజరాత్ Vs బెంగళూరు మ్యాచ్‌

    • రెండోసారి టైటిల్ వేటలో బెంగళూరు, గుజరాత్‌

    • డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు

  • May 31, 2026 18:02 IST

    అమరావతి: YS విగ్రహం ధ్వంసం కేసులో వైసీపీ డ్రామా బట్టబయలు

    • నంద్యాలలో YS విగ్రహం తల ధ్వంసం చేసిన కేసులో వెలుగులోకి వైసీపీ కుట్రలు

    • ఘటనకు పాల్పడింది వైసీపీ కార్యకర్త జమలయ్యగా ఇప్పటికే గుర్తింపు

    • విగ్రహ ధ్వంసం అంశంలో కేసు నమోదు, పోలీసుల దర్యాప్తు

    • నిందితుడు జమలయ్య.. మాజీ MLA శిల్పా రవికిషోర్ రెడ్డి అనుచరుడు

    • విగ్రహం ధ్వంసం కేసులో ఇతర పార్టీల ప్రమేయం లేదని తేల్చిన పోలీసులు

  • May 31, 2026 17:13 IST

    సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు హరీష్‌రావు కౌంటర్‌

    • నా పుట్టుక BRSలోనే.. చావు కూడా BRSలోనే: హరీష్‌రావు

    • జీవితాంతం KCR, BRSతోనే ఉంటానని చాలాసార్లు చెప్పా: హరీష్‌రావు

    • ఇదే విషయం మరోసారి చెబుతున్నా: హరీష్‌రావు

    • పూటకో పార్టీ మారే వ్యక్తి రేవంత్‌: హరీష్‌రావు

  • May 31, 2026 15:59 IST

    నిర్మల్‌: ఖానాపూర్ మండలం బావపూర్‌లో విషాద ఘటన

    • విద్యుత్‌ లైన్‌కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం

    • ప్రకాష్‌ అనే వ్యక్తి.. స్తంభం పైనుంచి జారిపడి మృతి

  • May 31, 2026 15:44 IST

    గాంధీ భవన్‌లో క్రమశిక్షణా కమిటీ సమావేశం

    • కొనసాగుతున్న పాలకుర్తి నియోజకవర్గ పంచాయితీ

    • హాజరైన పాలకుర్తి MLA యశస్వినీ రెడ్డి

    • పాలకుర్తి నియోజకవర్గంలో అంతర్గత పోరుపై చర్చ

    • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పరస్పర ఆరోపణలు

  • May 31, 2026 15:43 IST

    హైదరాబాద్‌: కూకట్‌పల్లి బీజేపీలో భగ్గుమన్న విభేదాలు

    • ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా KPHBలో ఫ్లెక్సీలు

    • బీజేపీలో వర్గాలు ప్రోత్సాహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారంటూ ఫ్లెక్సీ

    • బీజేపీలో అసంతృప్తి వెళ్లగక్కుతూ పదవులు పొoదుతున్నారని ఆరోపణలు

  • May 31, 2026 15:25 IST

    సాయంత్రం బీజేపీ కీలక సమావేశం

    • సాయంత్రం 5గంటలకు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    • రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు

    • మొత్తం 24 స్థానాల్లో 11 సీట్లలో నేరుగా పోటీచేయనున్న బీజేపీ

    • పోటీచేస్తున్న స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం

    • కూటమి భాగస్వామ్య పక్షాల కోసం మరో 6 స్థానాలు

  • May 31, 2026 14:30 IST

    పుణె కల్తీ మద్యం ఘటనలో పెరిగిన మృతులు

    • పుణె కల్తీ మద్యం ఘటనలో 24కి చేరిన మృతుల సంఖ్య

    • నిర్లక్ష్యంగా వ్యవహరించిన 21 మంది సస్పెన్షన్

    • ఇప్పటివరకు 22 మంది అరెస్ట్

    • భీవండీ కేంద్రంగా సాగిన నకిలీ మద్యం దందా

  • May 31, 2026 13:58 IST

    హైదరాబాద్: ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదు: కేటీఆర్

    • కొత్త ఇళ్లు కట్టేది లేదు.. ఉన్నవాటిని కూల్చుతున్నారు : కేటీఆర్

    • రేవంత్ చేసేది చెప్పరు.. చెప్పింది చేయరు: కేటీఆర్

    • మేం చేసిన పనులకు రేవంత్ రిబ్బన్ కట్ చేస్తున్నారు: కేటీఆర్

  • May 31, 2026 13:36 IST

    జనాలు ఛీకొట్టినా.. జగన్ డ్రామాలు మానడం లేదు: మంత్రి లోకేశ్

    • బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్: లోకేశ్

    • రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్ర చేస్తున్నారు: లోకేశ్

    • తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించాడు: లోకేశ్

  • May 31, 2026 13:32 IST

    ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతోంది: ప్రభుత్వ విప్ వేముల వీరేశం

    • ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే కిషన్‌రెడ్డి ఎజెండా: వీరేశం

    • బీజేపీది రైతు భరోసా యాత్రనా? రాజకీయ యాత్రనా?: వీరేశం

    • తెలంగాణ ద్రోహులుగా బీజేపీ నేతలు మిగిలిపోతారు: వీరేశం

  • May 31, 2026 13:31 IST

    తూ.గో.: బిక్కవోలు మండలం కాపవరంలో దారుణం

    • భార్య ఉషను గొంతుకోసి చంపిన భర్త సురేంద్ర

    • ఒడిషా నుంచి కాపవరం వచ్చిన దంపతులు

  • May 31, 2026 13:19 IST

    నేటి 'మన్ కీ బాత్'లో భారత క్రీడాకారుల అద్భుత ప్రదర్శనలను ప్రశంసించిన ప్రధాని మోదీ

    • క్రీడాకారులు దేశానికి గర్వకారణమని కొనియాడిన ప్రధాని

    • రెండు రోజుల్లోనే మూడుసార్లు జాతీయ రికార్డు బద్దలవడం భారత అథ్లెటిక్స్ అభివృద్ధికి నిదర్శనం: ప్రధాని

    • తీవ్ర ఎండలు, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచన

  • May 31, 2026 12:47 IST

    కర్నూలు: తుంగభద్ర నదిలో గల్లంతైన ఐదుగురి మృతదేహాలు లభ్యం

    • మంత్రాలయం తుంగభద్ర నదిలో నిన్న గల్లంతైన ఐదుగురు

    • యమన్, సతీష్‌, ధను, రాఘవేంద్ర, సంధ్య మృతదేహాల వెలికితీత

  • May 31, 2026 12:42 IST

    ఖమ్మం: కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటన

    • కొన్ని పార్టీలు ఆలయాల పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి

    • కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుంది: మంత్రి

    • పుష్కరాల నాటికి భద్రాచలం పనులు పూర్తి: మంత్రి

    • ఆలయాల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు కేటాయింపు: మంత్రి

  • May 31, 2026 12:04 IST

    వియత్నాంతో భారత్ రక్షణ ఒప్పందం ఖరారు

    • రూ.6వేల కోట్ల సూపర్ సోనిక్ 'బ్రహ్మోస్' క్షిపణుల సరఫరాకు డీల్

    • సింగపూర్‌లో భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ ప్రకటన

    • ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ కొనుగోలు చేస్తున్న రెండో ఏషియన్ దేశంగా వియత్నాం

  • May 31, 2026 11:32 IST

    గాజువాక బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

    • బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన పల్లా

    • బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సూచించాం: పల్లా

  • May 31, 2026 11:27 IST

    ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో హింస

    • PSG ఛాంపియన్స్ లీగ్‌ విజయోత్సవాల్లో ఘర్షణ

    • పారిస్ వీధుల్లో హంగామా సృష్టించిన అభిమానులు

    • పలు షాపులు ధ్వంసం, వాహనాలకు నిప్పు

    • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పారిస్ పోలీసులు

  • May 31, 2026 11:19 IST

    30 ఔషధాల రిటైల్ ధరలను నిర్ణయించిన జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA)

    • విటమిన్ D3 ఓరల్ సొల్యూషన్ ధర ఖరారు

    • కాల్షియం, విటమిన్ D3 కలయిక ఔషధాల ధరలు నిర్ణయం

    • మెథైల్‌కోబాలమిన్, ఎల్-మెథైల్‌ఫోలేట్ కాల్షియం ధరల స్థిరీకరణ

    • పైరిడాక్సల్-5 ఫాస్ఫేట్ సహా పలు మందులకు కొత్త ధరలు

  • May 31, 2026 11:07 IST

    రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల

    • నీటిని విడుదల చేసిన మంత్రి కందుల దుర్గేష్‌, పాల్గొన్న ఎంపీలు

    • కాల్వల మరమ్మతుల దృష్ట్యా దశల వారీగా నీటి విడుదల

  • May 31, 2026 11:04 IST

    హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

    • రూ.3కోట్ల విలువైన 7 కిలోల గంజాయి స్వాధీనం

    • హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు అరెస్ట్

  • May 31, 2026 11:00 IST

    ఢిల్లీ: మోస్ట్‌ వాంటెడ్ క్రిమినల్ ఆశిష్ అరెస్ట్

    • పోలీసులు, హిమాంశు గ్యాంగ్ మధ్య కాల్పులు

    • హింమాంశు గ్యాంగ్‌లో షార్ప్ షూటర్ ఆశిష్‌

    • నిందితుడిపై 8కి పైగా క్రిమినల్ కేసులు

  • May 31, 2026 10:54 IST

    సోషల్ మీడియాలో ఏఐ ఫొటో షేర్ చేసిన ట్రంప్

    • ఆ ఫొటోలో సైనిక దుస్తుల్లో యుద్ధ శైలిలో కనిపించిన ట్రంప్

    • ‘గందరగోళానికి గురవుతున్నారు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టిన ట్రంప్

    • ఇరాన్‌తో వార్ నేపథ్యంలో ట్రంప్ పోస్ట్‌కు ప్రాధాన్యం

  • May 31, 2026 10:44 IST

    ఢిల్లీ: భారత నూతన సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ఎన్‌ఎస్ రాజా సుబ్రమణి

    • జనరల్ అనిల్ చౌహాన్ స్థానంలో రాజా సుబ్రమణి నియామకం

  • May 31, 2026 10:20 IST

    నిర్మల్: బాసర అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

    • వేసవి సెలవులు, పౌర్ణమి రోజు కావడంతో పోటెత్తిన భక్తులు

    • అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది

  • May 31, 2026 10:19 IST

    ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పథకం అమలుపై సీఎం రేవంత్ సమీక్ష

    • ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు

    • ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు

    • పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం

    • ప్రభుత్వ ఉద్యోగినే ట్రస్ట్ సీఈవోగా నియామకం

    • సోమవారం ట్రస్ట్ కమిటీ ప్రకటనకు అవకాశం

  • May 31, 2026 10:14 IST

    సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు నివాళులు

    • నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా విశిష్ట సేవలందించారు: సీఎం

    • అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు: సీఎం

  • May 31, 2026 09:58 IST

    కర్నూలు: తుంగభద్రలో ముగ్గురి మృతదేహాలు లభ్యం

    • మంత్రాలయం తుంగభద్ర నదిలో నిన్న ఈతకు వెళ్లి ఐదుగురి గల్లంతు

    • యమన్ చంద్ర, సతీష్‌ చంద్ర, ధను మృతదేహాల వెలికితీత

    • గల్లంతైన రాఘవేంద్ర, సంధ్య కోసం గాలిస్తున్న పోలీసులు

  • May 31, 2026 09:56 IST

    విశాఖ: గాజువాక ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్

    • మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి

    • గాజువాక ప్రమాద బాధితులను పరామర్శించిన పల్లా శ్రీనివాసరావు

  • May 31, 2026 09:19 IST

    సూర్యాపేట: చివ్వెంల మండలం గుంజలూరు స్టేజి వద్ద ఆటోను ఢీకొట్టిన కారు

    • ఒకరి పరిస్థితి విషమం, ఇద్దరికి తీవ్ర గాయాలు

    • క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • May 31, 2026 09:17 IST

    ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్‌న్లను కూల్చివేశామని ఐఆర్‌జీసీ ప్రకటన

    • MQ-1 డ్రోన్‌ను క్షిపణులతో ధ్వంసం చేసినట్లు ఇరాన్ వెల్లడి

    • హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని స్పష్టం చేసిన ఇరాన్

    • నౌకలు నిర్ణీత మార్గాల్లోనే ప్రయాణించాలని ఆదేశాలు

    • నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక

  • May 31, 2026 09:13 IST

    హైదరాబాద్: AICC చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

    పలు కీలక అంశాలపై ఖర్గేతో చర్చిస్తున్న రేవంత్, మహేష్‌గౌడ్

    ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, SIR అంశంపై చర్చ

    ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో..

    చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చ

  • May 31, 2026 08:06 IST

    కర్నూలు: కోస్గి మండలం కందుకూరులో వైసీపీ నేత బెట్టన గౌడ్ దాష్టీకం

    • రామదాసు అనే వ్యక్తిపై కత్తులతో దాడికి యత్నం

    • త్రుటిలో తప్పించుకున్న రామదాసు

    • తెలియకుండా పొలం ఎలా సాగు చేస్తావంటూ రామదాసుపై దాడి చేసిన బెట్టన గౌడ్

    • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రామదాసు

  • May 31, 2026 08:02 IST

    ఢిల్లీ: నేడు ఉ.11 గంటలకు ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌

    • 134వ ఎడిషన్‌కు చేరుకున్న మోదీ మన్‌ కీ బాత్‌

    • దేశాభివృద్ధి సహా కీలక అంశాలపై మాట్లాడనున్న మోదీ

  • May 31, 2026 08:01 IST

    జూన్‌ 7 నుంచి 14 రోజుల పాటు ఏపీలో యోగాంధ్ర

    • జూన్‌ 21న యోగాంధ్ర 2026 కార్యక్రమం

  • May 31, 2026 07:34 IST

    చార్‌ధామ్ యాత్రలో భారీ ట్రాఫిక్ జామ్

    • జోషిమఠ్‌లో 30 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

    • విష్ణుప్రయాగ్ నుంచి జోషిమఠ్ వరకు ట్రాఫిక్ జామ్

    • కాలినడక మార్గంలోనూ కిలోమీటర్ల మేర రద్దీ

  • May 31, 2026 07:33 IST

    ఢిల్లీలో కూలిన ఐదంతస్తుల భవనం

    • ఇద్దరికి తీవ్రగాయాలు, 12 మందిని కాపాడిన సహాయక సిబ్బంది

    • సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో ఘటన

    • మూడో అంతస్తులో నిర్మాణ పనుల కారణంగా కూలిన భవనం

  • May 31, 2026 07:33 IST

    విశాఖ: గాజువాకలో రోడ్డుప్రమాదం

    • ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

    • ముగ్గురి మృతి, మరో ఏడుగురికి గాయాలు

    • రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఘటన

    • ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు

  • May 31, 2026 07:32 IST

    నంద్యాల: శ్రీనివాసనగర్‌లో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం

    • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • ​ఘటనా స్థలానికి భారీగా చేరుకుంటున్న వైఎస్సార్ అభిమానులు

  • May 31, 2026 07:25 IST

    నేడు IPL-2026 ఫైనల్‌ మ్యాచ్‌

    • ఫైనల్‌లో బెంగళూరు Vs గుజరాత్‌

    • అహ్మదాబాద్‌లో రాత్రి 7:30కు మ్యాచ్‌