Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 25 , 2026 | 07:27 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 25, 2026 21:59 IST

    జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ ఫైర్

    • ’ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు‘ అంటూ జగన్‌పై మంత్రి నారాయణ ఆగ్రహం

    • ప్రజలు కళ్లతో చూస్తున్నారు.. చెవులతో వింటున్నారు: మంత్రి నారాయణ

    • అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదు': మంత్రి నారాయణ

    • ఇలాగే మాట్లాడితే 11 సీట్లు కాస్తా.. సున్నా అవుతాయి: మంత్రి నారాయణ

  • May 25, 2026 21:24 IST

    అమరావతి:సేవలు సులభంగా అందేలా బిజినెస్ రూల్స్ మారుద్దాం: సీఎం చంద్రబాబు

    • బిజినెస్ రూల్స్ మార్పునకు కార్యాచరణ సిద్ధం చేయాలి

    • టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.. నిబంధనల పేరుతో జాప్యం సరికాదు

    • రోటీన్ పద్ధతులకు స్వస్తి పలకాలి.. వినూత్నంగా ఆలోచించాలి

    • కుల ధృవీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు తొలగించాలి

    • ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

  • May 25, 2026 21:22 IST

    స్వార్థం కోసం జగన్ ఎవరినైనా బలిచేస్తాడు: మంత్రి అచ్చన్నాయుడు

    • విశాఖ ఉక్కును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూసింది: మంత్రి అచ్చన్నాయుడు

    • విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి, విలువైన భూములను అక్రమించుకోవాలని కుట్ర పన్నారు

    • విశాఖ ఉక్కు పరిరక్షణకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు: మంత్రి అచ్చన్నాయుడు

  • May 25, 2026 21:00 IST

    ఎన్టీఆర్‌: మైలవరం నియోజకవర్గంలో ఈదురుగాలుల బీభత్సం

    • ఈదురుగాలులతో విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం

    • మైలవరం మండలంలోని పలు గ్రామాల్లో విరిగిపడిన చెట్లు

    • పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

    • జగదల్‌పూర్‌-ఇబ్రహీంపట్నం హైవేపై భారీ ట్రాఫిక్‌ జామ్‌

  • May 25, 2026 20:58 IST

    విజయవాడ: రేపటి నుంచి దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత

    • మరమ్మత్తుల నేపథ్యంలో ఘాట్ రోడ్డు మూసేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు

    • రేపటి నుంచి జూన్ 12 వరకూ ఘాట్ రోడ్డు మూసివేత

    • భక్తులు కనకదుర్గానగర్ వైపు, లిఫ్ట్ మార్గంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలని సూచన

  • May 25, 2026 20:23 IST

    ఇందిరమ్మ ఇళ్లపై కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్‌

    • రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు అడగదు: మంత్రి పొంగులేటి

    • డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు లేని గ్రామాల్లో BRS ఓట్లు అడగకూడదు: పొంగులేటి

    • చెల్లి, బావ ఫోన్‌లు ట్యాప్‌ చేసిన కేటీఆర్‌కు.. ఇందిరమ్మ పేరు పలికే అర్హత లేదు: పొంగులేటి

  • May 25, 2026 19:44 IST

    తమిళనాడులో చిన్న, సన్నకారు రైతులకు భారీ ఊరట

    • సహకార బ్యాంకుల ద్వారా తీసుకున్న పంట రుణాల మాఫీ

    • రూ.50 వేల వరకూ ఉన్న క్రాప్‌ లోన్లు పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం విజయ్‌

    • రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి

    • ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు లాభం చేకూరనున్నట్టు అంచనా

  • May 25, 2026 19:36 IST

    ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన CJP నేత అభిజీత్‌ దీస్కే

    • CJP (Cockroach Janta Party) ట్విట్టర్ ఖాతా నియంత్రణపై సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌

  • May 25, 2026 19:34 IST

    ముగిసిన IAS అమోయ్‌కుమార్ విచారణ

    • అమోయ్‌కుమార్‌ను 9గంటలు ప్రశ్నించిన ఈడీ

    • భూదాన్ భూముల అంశంలో మనీలాండరింగ్‌ కోణంలో అమోయ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఈడీ

  • May 25, 2026 19:34 IST

    మచిలీపట్నంలో MSME పార్క్‌కు మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన

    • యువత ఉపాధి, బందరు అభివృద్ధికి MSME కీలక అడుగు

    • MSME పార్కులో 82 పారిశ్రామిక ప్లాట్లు: మంత్రి కొల్లు రవీంద్ర

    • 2027 జనవరి నాటికి మచిలీపట్నం పోర్టు ప్రారంభం

  • May 25, 2026 19:33 IST

    మున్సిపాల్టీల్లోని వివిధ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

    • అమృత్‌ 2.0,UIDF, AIIB చేపట్టిన పనులపై చర్చ

    • పెండింగ్ డిజైన్లు పూర్తిచేయాలని మంత్రి నారాయణ ఆదేశం

  • May 25, 2026 19:32 IST

    సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్‌ (ATA)

    • జులైలో జరిగే ATA సమావేశాలకు హాజరుకావాలని సీఎంకు అసోసియేషన్ ప్రతినిధుల ఆహ్వానం

  • May 25, 2026 19:32 IST

    తమిళనాడులో సినీ పరిశ్రమకు ప్రభుత్వం భారీ ఊరట

    • కొత్త సినిమాలకు తొలివారంలో 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి

    • థియేటర్‌ నియంత్రణ నిబంధనల్లో ప్రభుత్వం సవరణలు

  • May 25, 2026 19:26 IST

    తమిళనాడు రాజకీయాలు సాఫీగా జరిగిపోయాయి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌

    • నాకు అసూయ కలిగేంత చక్కగా రాజకీయాలు సాగాయి: పవన్‌

    • అక్కడి నటుడు కటౌట్లు పెట్టుకుంటే సీఎం అయిపోయారు: పవన్‌

    • నేను ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు పట్టింది: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

  • May 25, 2026 18:46 IST

    అమరావతి: సముద్రతీర అభివృద్ధిపై నిపుణులతో సీఎం చంద్రబాబు భేటీ

    • సముద్ర సంపద అందిపుచ్చుకునేలా కార్యాచరణ

    • తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణ చర్యలు: సీఎం చంద్రబాబు

  • May 25, 2026 18:43 IST

    ఏపీలో రికార్డు స్థాయిలో ఎండల తీవ్రత

    • కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదు

    • బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు

    • 14 జిల్లాల్లోని 115 మండలాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

  • May 25, 2026 18:42 IST

    నిజామాబాద్‌: ఇందల్వాయి మండలం చంద్రయన్‌పల్లిలో రోడ్డు ప్రమాదం

    • ఆగి ఉన్న లారీని ఢీకొన్న 7 కార్లు

    • ఒకరి మృతి, పలువురికి గాయాలు

  • May 25, 2026 18:15 IST

    సుప్రీంకోర్టులో NHAIకు దక్కని ఊరట

    • తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

    • భూములు కోల్పోయిన యజమానులు పెంచిన నష్టపరిహారాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు

    • యాదాద్రి-వరంగల్‌ హైవే భూ సేకరణ వివాదంలో భూ యజమానులకు అనుకూలంగా సుప్రీం తీర్పు

  • May 25, 2026 18:10 IST

    చెన్నై: మనలి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

    • ఆయిల్ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు

    • పేలిన బాయిలర్లు, పరుగులు తీసిన కార్మికులు

    • ప్రమాద సమయంలో కంపెనీలో లక్ష లీటర్ల ఆయిల్‌

  • May 25, 2026 17:45 IST

    సూర్యాపేట: కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం

    • విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

    • బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలు

    • జాతీయ రహదారి విస్తరణ పనులతో సింగిల్ రోడ్డులో వెళ్తున్న వాహనాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • May 25, 2026 17:42 IST

    రైలు ఢీకొని.. పెద్ద పులి మృతి

    • నంద్యాల జిల్లా: మహానంది మండలం నల్లమల అడవి చలమ రైల్వే ట్రాక్ సమీపంలో ప్రమాదం

    • రైలు ఢీకొని.. పెద్ద పులి మృతి

    • ​​అర్ధరాత్రి గూడ్స్ రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నిర్ధారించిన అధికారులు

  • May 25, 2026 17:40 IST

    రేపు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ కానున్న సినీ నిర్మాతలు

    • చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చ

  • May 25, 2026 17:40 IST

    హైదరాబాద్: చిరంజీవితో ముగిసిన ఎగ్జిబిటర్స్‌ సమావేశం

    • పర్సంటేజ్ విధానంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం: దిల్‌రాజు

  • May 25, 2026 17:33 IST

    ఎబోలా వైరస్‌ ముప్పుపై కేంద్రం హైఅలర్ట్‌

    • కేంద్రమంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష

    • దేశంలో ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, సరిహద్దుల దగ్గర స్క్రీనింగ్‌ నిర్వహించాలని ఆదేశం

    • ICMR, NCDC సంస్థలు అలర్ట్‌గా ఉండాలని జేపీ నడ్డా ఆదేశం

    • ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక నిఘా: కేంద్రం

  • May 25, 2026 17:32 IST

    నాంపల్లి: అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పురోగతి

    • బెంగళూరు హైవేపై హత్యకు ఉపయోగించిన స్కార్కియో వాహనం స్వాధీనం

    • ఇంటి నుంచి బయటకు వచ్చిన ఖాజాను ఢీకొట్టి హత్య

    • కారు అమ్మిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు

    • 6 నెలల క్రితమే కారును విక్రయించినట్లు పోలీసులకు చెప్పిన యజమాని

    • ఇప్పటికే పోలీసుల అదుపులో కల్వకుర్తికి చెందిన వినయ్‌

    • భూ తగాదాలే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు

  • May 25, 2026 16:54 IST

    హైదరాబాద్: చిరంజీవితో దిల్ రాజు, ఎగ్జిబిటర్ల బృందం సమావేశం

    • పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ చర్చ

  • May 25, 2026 16:54 IST

    సూర్యాపేట : మోతే మండలం రాఘవపురం స్టేజీ వద్ద ప్రమాదం

    • లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు

    • కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల మృతి.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

    • హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా ఘటన

  • May 25, 2026 16:30 IST

    మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీ ఫ్లైఓవర్‌పై రైతుల రాస్తారోకో

    • మార్కెట్ యార్డ్‌లో వరి ధాన్యం కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆందోళన

    • వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్

  • May 25, 2026 16:27 IST

    భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • సెన్సెక్స్‌ 1,070, నిఫ్టీ 310 పాయింట్ల లాభం

  • May 25, 2026 16:26 IST

    తమిళనాడు: AIADMKకు ముగ్గురు ఎమ్మెల్యేల షాక్

    • పార్టీకి మరగతం కుమరేశన్‌, సత్యభామ, జయకుమార్ రాజీనామా

    • స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖలు సమర్పించిన MLAలు

  • May 25, 2026 14:27 IST

    విజయవాడ: ఏపీలో వనరులు వినియోగించుకునేలా MSME: సీఎం చంద్రబాబు

    • MSME పాలసీతో పాటు ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కుల పాలసీలు: సీఎం చంద్రబాబు

    • వన్ ఫ్యామిలీ- వన్ ఆంత్రప్రెన్యూర్ కింద భారీఎత్తున పారిశ్రామిక యూనిట్లు

    • ఇప్పటికే రూ.500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల

    • రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రారంభం

    • ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు

  • May 25, 2026 14:24 IST

    రాజమండ్రి: పరిశ్రమల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ

    • ప్రభుత్వపరంగా పరిశ్రమలకు తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ

    • పరిశ్రమల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు పాటించాలి: పవన్ కల్యాణ్

    • CSR నిధులను పుష్కరాల పనులు, పర్యావరణ పరిరక్షణకు అనుసంధానించి వినియోగించాలి: పవన్ కల్యాణ్

  • May 25, 2026 13:29 IST

    హైదరాబాద్ మెట్రోకు IRFC రూ.13,600కోట్ల రుణం

    • IRFCతో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఒప్పందం

    • IRFC సీఎండీ, తెలంగాణ సీఎస్ సమక్షంలో ఒప్పందం

    • హైదరాబాద్ మెట్రోపై ఆర్థిక భారం తగ్గించేందుకు రీఫైనాన్సింగ్

    • మెట్రో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు ఆర్థిక వెసులుబాటు

  • May 25, 2026 13:27 IST

    నెల్లూరు: ఆత్మకూరు మండలం బట్టేపాడులో దారుణం

    • ఆస్తి కోసం బ్లేడుతో తల్లి రమణమ్మ గొంతు కోసిన కూతురు సుమతి

    • రమణమ్మకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

  • May 25, 2026 13:10 IST

    నెల్లూరు: సంగం మండలం దువ్వూరు గ్రామంలో విషాదం

    • చేపల చెరువులో పడి అభిలాష్ అనే ఏడాదిన్నర బాలుడు మృతి

  • May 25, 2026 13:05 IST

    మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు

    • వర్చువల్‌గా బక్రీద్ నిర్వహించుకోవాలని మంత్రి సలహా

    • కంప్యూటర్‌లో మేక ఫొటో పెట్టుకుని వధిస్తున్నట్టు చూపాలని చెప్పగలిగే ధైర్యం పర్యావరణవాదులకు ఉందా?: నితీష్ రాణే

    • హోళీ, దీపావళి పండగలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని.. హిందువులకు సలహాలు ఇవ్వడానికి ముందుకు వస్తారు: నితీష్ రాణే

    • హిందువులకు కొందరు హిందువుల వల్లే ప్రమాదం: నితీష్ రాణే

  • May 25, 2026 13:03 IST

    ఖమ్మం: బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కులేదు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    • ధాన్యం కొనుగోలు ఆలస్యానికి కారణం కేంద్రమే: మంత్రి తుమ్మల

    • సిగ్గులేకుండా టీబీజేపీ నేతలు బస్సు యాత్ర చేస్తున్నారు: తుమ్మల

    • బెంగాల్‌లో సంక్షోభం కారణంగా కనీసం గన్నీ బ్యాగ్‌లు తేలేని పరిస్థితి: తుమ్మల

    • దుర్మార్గమైన బీజేపీ విధానాలతో రైతాంగం ఇబ్బందులు పడుతోంది: తుమ్మల

  • May 25, 2026 13:01 IST

    హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల నిరసన

    • నిన్న రాత్రి విధుల్లో ఉన్న వైద్యుడిపై రోగి బంధువులు దాడి

    • సూపరింటెండెంట్ ఆఫీస్‌లో జూడాలతో DME సమావేశం

  • May 25, 2026 12:48 IST

    నాగర్‌కర్నూల్: రైస్ మిల్లుల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ

    • రైస్ మిల్లుల యజమానులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

    • లోడ్‌తో వచ్చిన లారీలను తక్షణమే అన్‌లోడ్ చేసి పంపాలి: మంత్రి జూపల్లి

    • అన్‌లోడ్ చేయకపోతే చర్యలు తప్పవు: మంత్రి జూపల్లి

    • రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదు: మంత్రి జూపల్లి

  • May 25, 2026 12:47 IST

    తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారం

    • మెడిసిన్ విభాగంలోకి చొరబడిన చిరుతపులి

    • తలుపులు మూసి అటవీ అధికారులకు సమాచారం ఇచ్చిన సిబ్బంది

    • చిరుతను బంధించి ఎస్వీ జూపార్క్‌కు తరలించిన అటవీ అధికారులు

  • May 25, 2026 12:46 IST

    హైదరాబాద్: సచివాలయంలో తెలంగాణ, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల భేటీ

    • నదీ జలాల పంపకాలు, అభ్యంతరాలపై చర్చ

  • May 25, 2026 12:33 IST

    గుంటూరు: కులాల మధ్య చిచ్చుపెట్టడమే వైసీపీ పని: ధూళిపాళ్ల నరేంద్ర

    • వైసీపీ హయాంలో బలహీన వర్గాలపై దాడులు చేశారు: ధూళిపాళ్ల

    • ప్రజల తీర్పు చూశాక కూడా వైసీపీ నేతల్లో మార్పు రాలేదు: ధూళిపాళ్ల

    • వివాదాలు సృష్టించి యువతను కేసుల్లో ఇరికిస్తున్నారు: ధూళిపాళ్ల

    • ఎక్కడికెళ్లినా డ్రామాలు ఆడటమే వైసీపీ నేతల పని: ధూళిపాళ్ల నరేంద్ర

  • May 25, 2026 12:32 IST

    అస్సాం అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు

    • UCC బిల్లుపై అస్సాం అసెంబ్లీలో ఎల్లుండి చర్చ

    • UCC బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

    • విస్తృత ప్రజాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్

  • May 25, 2026 12:31 IST

    బీజేపీ నేతలు బస్సు యాత్ర కాదు.. ఢిల్లీ యాత్ర చేయాలి: ఆది శ్రీనివాస్

    • బీజేపీ, BRS మిత్రపక్షాలు.. అందుకే కేంద్రాన్ని ఒక్క మాట అనడం లేదు

    • రైతులను అడ్డు పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోంది: ఆది శ్రీనివాస్

  • May 25, 2026 12:29 IST

    నటి ట్విషా శర్మ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    • తక్షణమే CBI దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశం

    • సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఆదేశాలు

    • మీడియా కూడా సంయమనం పాటించాలని సూచన

  • May 25, 2026 12:29 IST

    ద్రవ్యోల్బణ సూత్రధారి మోదీ మళ్లీ తన పని చూపించారు: రాహుల్ గాంధీ

    • పెట్రోల్, డీజిల్ ధరలను విడతలవారీగా పెంచుతున్నారు: రాహుల్

    • ఆర్థిక తుఫాన్ రాబోతోందని హెచ్చరిస్తూనే ఉన్నా: రాహుల్

    • కానీ మోదీ ఎప్పటిలాగే ఎన్నికలతో బిజీగా ఉన్నారు: రాహుల్

  • May 25, 2026 12:28 IST

    తిరుపతి వెటర్నరీ వర్సిటీలో చిరుత సంచారంపై డిప్యూటీసీ సీఎం పవన్ ఆరా

    • చిరుతను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పవన్ ఆదేశం

    • విద్యార్థులు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచన

  • May 25, 2026 12:17 IST

    నీట్ పేపర్ లీక్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

    • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు నోటీస్

    • నీట్ పేపర్ లీక్‌పై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీం

    • NTA ఇంకా గుణపాఠం నేర్చుకోలేదన్న ధర్మాసనం

    • దీనిపై గతంలోనే కమిటీ ఏర్పాటు చేశామన్న సుప్రీంకోర్టు

  • May 25, 2026 12:16 IST

    విజయవాడ: MSME గ్రోత్ సమ్మిట్‌-2026

    • అంబేద్కర్ కళావేదికను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

    • 38 MSME పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం

    • మెటా, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలతో MoU

  • May 25, 2026 11:45 IST

    హైదరాబాద్: ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్ అమోయ్ కుమార్

    • భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ విచారణ

    • మనీలాండరింగ్ కోణంలోనూ ఈడీ అధికారుల విచారణ

    • సేల్ డీడ్ వివరాలతో ఈడీ విచారణకు వచ్చిన అమోయ్

  • May 25, 2026 11:44 IST

    దేశ ప్రజలను లూటీ చేయడంలో మోదీని మించినవారు లేరు: ఏపీసీసీ చీఫ్ షర్మిల

    • 10 రోజుల్లో నాలుగుసార్లు ఇంధన ధరలు పెంచడం దారుణం: షర్మిల

    • నష్టాల పేరుతో మొత్తం భారాన్ని ప్రజలపై రుద్దడం మోదీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం: షర్మిల

    • రాష్ట్రాలు వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు: షర్మిల

  • May 25, 2026 11:43 IST

    అమరావతి: ఈడీ నోటీసుపై స్పందించిన ఎంపీ కేశినేని చిన్ని

    • లిక్కర్ స్కామ్ కేసులో నా భార్యకు నోటీసు ఆరోపణలు అవాస్తవం

    • ప్రైడ్ ఇన్‌ఫ్రా సంస్థలో నా భార్య ఒక డైరెక్టర్ మాత్రమే: కేశినేని చిన్ని

    • నోటీసు వచ్చింది కంపెనీకి.. నా భార్యకు కాదు: ఎంపీ కేశినేని చిన్ని

    • కంపెనీకి వచ్చిన నోటీసుపై ఈనెల 27న వివరణ ఇస్తాం: కేశినేని చిన్ని

  • May 25, 2026 11:42 IST

    తూర్పుగోదావరి: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

    • పుష్కరాల సన్నద్ధత సరిగాలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్

    • ఏడాదిలో చేపట్టాల్సిన పనులకు ఇంకా DPR ఎందుకు సిద్ధం కాలేదని అధికారులను ప్రశ్నించిన పవన్

    • ఏడాదిలో 7వేల పనులు ఏ విధంగా పూర్తి చేస్తారు?: డిప్యూటీ సీఎం పవన్

    • ఇష్టానుసారంగా ఖర్చు పెడదామనుకుంటే కేంద్రం నిధులు ఇవ్వదు: పవన్

  • May 25, 2026 11:39 IST

    అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన క్రూడాయిల్ ధర

    • ఒక్కరోజులో 6శాతం పడిపోయిన ముడిచమురు ధరలు

    • బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల దిగువకు చేరి 98 దగ్గర ట్రేడింగ్

    • అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలతో ధరల తగ్గుదల

  • May 25, 2026 11:38 IST

    సిద్దిపేట: పంట కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: హరీష్‌రావు

    • మిషన్ మోడ్‌లో వడ్లు కొనాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు: హరీష్‌రావు

    • రేవంత్‌ది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: హరీష్‌రావు

    • ఢిల్లీ ట్రిప్పులు మాని.. లారీల ట్రిప్పులు పెంచాలి: హరీష్‌రావు

    • 2 రోజుల్లో మార్పు రాకుంటే కలెక్టరేట్ దగ్గర నిరవధిక ధర్నా చేస్తా: హరీష్‌రావు

  • May 25, 2026 11:36 IST

    భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ఆగ్రహం

    • స్వామీజీలపై భూమన కరుణాకర్‌రెడ్డి వ్యాఖ్యలు బాధాకరం: భానుప్రకాష్‌

    • హిందువుల పట్ల ఎంత ద్వేషం ఉందో మీ మాటల్లోనే తెలుస్తోంది: భానుప్రకాష్‌

    • వెంటనే స్వామీజీలు, హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి: భానుప్రకాష్‌

  • May 25, 2026 11:35 IST

    నిర్మల్: కడెం మండలం ఎల్లాపూర్ దగ్గర రైతుల నిరసన

    • వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరపాలని రాస్తారోకో

    • నిర్మల్-మంచిర్యాల హైవేపై నిలిచిన రాకపోకలు

    • ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్

    • నిరసనలో పాల్గొన్న ఓ రైతుకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

  • May 25, 2026 11:31 IST

    ఫ్రెంచ్ ఓపెన్.. సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్రుడు

    • ఏడో సీడ్ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై అమెరికా ప్లేయర్ నిశేష్ బసవరెడ్డి సంచలన విజయం

    • వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగి రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన బసవరెడ్డి

    • ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మూలాలున్న కుటుంబంలో జన్మించిన బసవరెడ్డి

  • May 25, 2026 11:29 IST

    పెరిగిన బంగారం ధరలు..

    • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 320 రూపాయలు

    • 22 క్యారెట్ల బంగారంపై 300 రూపాయలు

    • 18 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు పెరుగుదల

    పూర్తికథనం

  • May 25, 2026 11:28 IST

    కరీంనగర్ మార్కెట్ యార్డులో రైతుల ఆందోళన

    • వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

    • ధాన్యం తెచ్చి 40రోజులు దాటినా తూకం వేయడం లేదని ఆగ్రహం

    • మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి రైతుల నిరసన

  • May 25, 2026 11:21 IST

    తిరుమల: వారం రోజుల్లో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

    • 7 రోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న 6,13,996 మంది భక్తులు

    • హుండీ ద్వారా రూ.28.58 కోట్ల ఆదాయం

    • తలనీలాలు సమర్పించుకున్న 3,27,063 మంది భక్తులు

  • May 25, 2026 11:12 IST

    జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర నెట్‌వర్క్‌లే లక్ష్యంగా NIA దాడులు

    • శ్రీనగర్‌తో పాటు దక్షిణ కశ్మీర్‌ జిల్లాల్లో సోదాలు

    • ఉగ్రవాద నిధుల సమీకరణపై NIA నిఘా

    • అనుమానితులతో సంబంధాలున్న నివాసాల్లో సోదాలు

  • May 25, 2026 11:11 IST

    తమిళనాడు: మధురైలో దారుణహత్య

    • మీనాక్షి ఆలయం సమీపంలో కుబేంద్రన్(17)ను అర్ధరాత్రి నరికి చంపిన దుండగులు

    • చిత్తిరై ఉత్సవాల్లో జరిగిన గొడవే కారణమని అనుమానం

    • నిందితుల కోసం పోలీసుల గాలింపు

  • May 25, 2026 11:10 IST

    ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

    • ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు

    • ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ

    • ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP కంపెనీతో కసిరెడ్డి లింకులపై ఈడీ ఆరా

    • లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నట్టు ఈడీ అనుమానం

    • గతంలోనూ జానకిలక్ష్మికి ఈడీ సమన్లు

    • తాజాగా మరోసారి సమన్లు జారీ చేసిన ఈడీ

  • May 25, 2026 10:58 IST

    తెలంగాణ: న్యాయవాది హత్య కేసుపై NHRC కేసు నమోదు

    • న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుతో కేసు

    • కేసులో పరిపాలనా పక్షపాతం, నిర్లక్ష్యం జరిగిందని రామారావు ఫిర్యాదు

  • May 25, 2026 10:57 IST

    విజయవాడ: ఆయిల్ కంపెనీల తీరుపై పెట్రోల్ బంక్ యజమానుల ఆగ్రహం

    • 4 రోజులుగా పెట్రోల్, డీజిల్ సరఫరా చేయకపోవడంపై అభ్యంతరం

    • ధరలు పెరుగుతాయన్న సమచారంతో ఆర్డర్ పెట్టినా సరఫరా చేయలేదని ఆరోపణ

    • ప్రస్తుతం పెరిగిన ధరల ప్రకారం కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆవేదన

    • ఆయిల్ కంపెనీల నిర్వాకంతో నష్టపోయామంటున్న బంకు యజమానులు

    • ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

  • May 25, 2026 10:56 IST

    హైదరాబాద్‌: కొత్తగా పదవులు పొందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆహ్వానం

    • 18 మంది కులసంఘాల ఫెడరేషన్ల చైర్మన్లు, 11 మంది వైస్ చైర్మన్లకు పిలుపు

    • సీఎం రేవంత్‌ రెడ్డిని కలవనున్న మహిళా కమిషన్ చైర్మన్లు, మెంబర్లు

    • మొత్తం 35 మందికి సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు

    • పదవులు పొందిన వారిని అభినందనలు తెలపనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • May 25, 2026 10:52 IST

    CJP కార్యకలాపాలపై CBI విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్

    • కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, CBIను ప్రతివాదులుగా చేర్చిన పిటిషనర్

  • May 25, 2026 10:49 IST

    ఆదిలాబాద్: నేరడిగొండ మండలం వడూర్‌లో పెద్దపులి సంచారం

    • అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అటవీ శాఖ అధికారుల హెచ్చరిక

  • May 25, 2026 10:45 IST

    సిద్దిపేట: పంట కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: హరీశ్ రావు

    • కోటి మెట్రిక్ టన్నుల్లో 70 లక్షలు మాత్రమే కొంటే మిగిలిన ధాన్యం రైతులు ఏం చేసుకోవాలి?: హరీశ్ రావు

    • మిషన్ మోడ్‌లో వడ్లు కొనాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారు: హరీశ్ రావు

    • రేవంత్‌ది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్: హరీశ్‌ రావు

  • May 25, 2026 10:39 IST

    నిర్మల్ జిల్లా: కడెం మండలం ఎల్లాపూర్ దగ్గర రైతుల నిరసన

    • వరి, మొక్కజొన్న కొనుగోళ్లు జరపాలని రాస్తారోకో

    • నిర్మల్-మంచిర్యాల హైవేపై నిలిచిన వాహన రాకపోకలు

    • ఎమ్మెల్యే, కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్

    • నిరసనలో పాల్గొన్న ఓ రైతుకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

  • May 25, 2026 10:36 IST

    తూర్పు గోదావరి: జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

    • జిల్లాలో గోదావరి నది కాలుష్య కారణాలపై పవన్ ఆరా

    • క్లీన్ కృష్ణా, గోదావరి మిషన్ పనితీరుపై పవన్ అసంతృప్తి

    • పరిశ్రమ వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవకూడదు: పవన్

  • May 25, 2026 09:39 IST

    పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులతో భారీగా పెరుగుతున్న ఇంధన ధరలు

    • భారత్‌లో 7.8 శాతం పెరిగిన ఇంధన ధరలు

    • మయన్మార్‌లో 100 శాతం ఇంధన ధరల పెంపు

    • UAEలో 86 శాతం, వియత్నాంలో 47శాతం ఇంధన ధరలు పెంపు

    • చైనాలో 27.7శాతం, కెనడాలో 32శాతం పెరిగిన ఇంధన ధరలు

  • May 25, 2026 09:34 IST

    కుల్కచెర్లకు తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం

    • రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో రైతు పోరుబాట

    • టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన పోరుబాట

  • May 25, 2026 09:34 IST

    పదే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దుర్మార్గం: సీపీఐ నేత ఈశ్వరయ్య

    • 10 రోజుల్లో రూ.8 వరకు ధరలు పెంచారు: సీపీఐ నేత ఈశ్వరయ్య

    • ప్రజలపై భారం మోపడమే కేంద్రం పనిగా పెట్టుకుంది: ఈశ్వరయ్య

    • పెంచిన ధరలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి: ఈశ్వరయ్య

  • May 25, 2026 09:17 IST

    హైదరాబాద్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేలిన గ్యాస్ సిలిండర్

    • కాప్రా లైఫ్ లైన్ ఎదురుగా ఉన్న బేకరీలో తెల్లవారుజాము 5 గంటల సమయంలో పేలిన సిలిండర్

    • రోడ్డుపై ప్రయాణిస్తున్న వ్యక్తి చేతికి తీవ్ర గాయం

  • May 25, 2026 09:15 IST

    గుంటూరు: తెనాలిలో కరెంట్ తీగలు తగిలి మహిళ మృతి

    • వాజర్ పేటలో కరెంట్ షాక్‌తో సయ్యద్ ప్యారిజాన్ అనే మహిళ మృతి

    • నిన్న గాలి వానకు తెగి పడిన విద్యుత్తు తీగలు

    • తెగి పడిన కరెంట్ తీగ తగిలి మహిళ మృతి

  • May 25, 2026 08:56 IST

    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ ధమాకా

    • ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం

    • 90 రోజుల కూలీ చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

    • రూ.5 లక్షల సాయానికి అదనంగా రూ.27వేల లబ్ధి

    • రోజుకు రూ.300చొప్పున లబ్ధిదారులకు ఆర్థిక సాయం

    • కలెక్టర్లు, MPDOలకే నేరుగా అనుమతి అధికారాలు

    • లబ్ధిదారులను వెంటనే గుర్తించాలని అధికారులకు ఆదేశాలు

  • May 25, 2026 08:55 IST

    మహారాష్ట్ర: రాయ్‌గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం

    • అంబెనాలి ఘాట్‌లో అదుపుతప్పి లోయలో పడ్డ జీపు

    • ప్రమాదంలో 8 మంది మృతి

  • May 25, 2026 07:57 IST

    హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు

    • నేడు రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల మహిళా భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన

    • ఉదయం 11 గంటలకు సచివాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం

    • మహిళా సంఘాల ప్రతినిధులతో సీఎం ముఖాముఖి

    • మే 31 వరకు మహిళా వారోత్సవాల నిర్వహణ

  • May 25, 2026 07:55 IST

    ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

    • టీ20 టోర్నీ లేదా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన టీనేజర్‌గా వైభవ్ రికార్డు

    • ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకున్న వైభవ్

    • ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 583 పరుగులు చేసిన వైభవ్

  • May 25, 2026 07:36 IST

    నంద్యాల: ఆత్మకూరు మండలం ఎస్ఎన్ తండా సమీపంలో తప్పిన ప్రమాదం

    • మొక్కజొన్న లోడ్‌తో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

    • సకాలంలో మంటలార్పడంతో తప్పిన ప్రమాదం

    • మాచర్ల నుంచి కర్నూలు వెళ్తుండగా ఘటన

  • May 25, 2026 07:31 IST

    ఈనెలలో నాలుగుసార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • ఈనెల 15న లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3చొప్పున పెంపు

    • 19న లీటర్‌ పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపు

    • 23న లీటర్‌ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు

    • ఇవాళ లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86లు పెంపు

    • 10రోజుల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.7.57, డీజిల్‌పై రూ.7.6 పెంపు

  • May 25, 2026 07:31 IST

    దేశంలోని ప్రధాన నగరాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలు

    • హైదరాబాద్‌: లీటర్‌ పెట్రోల్‌ రూ.115.58, డీజిల్‌ రూ.103.82

    • విజయవాడ: లీటర్‌ పెట్రోల్‌ రూ.117.19, డీజిల్‌ రూ.104.88

    • ఢిల్లీ: లీటర్ పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20

    • కోల్‌కతా: లీటర్ పెట్రోల్ రూ.113.51, డీజిల్ రూ.99.82

    • ముంబై: లీటర్ పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.83

    • చెన్నై: లీటర్ పెట్రోల్ రూ.107.77, డీజిల్ రూ.99.55

  • May 25, 2026 07:27 IST

    దేశవ్యాప్తంగా మరోసారి భారీగా పెరిగిన పెట్రోలు ధరలు

    • లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86లు పెంపు

    • ఉ.6 గంటల నుంచే పెరిగిన పెట్రోల్‌ ధరలు అమలు

    • 10 రోజుల్లో నాలుగుసార్లు ఇంధన ధరల పెంపు