Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 09 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 09, 2026 21:36 IST

    చైనా: షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

    • మంటల్లో చిక్కుకుని 28 మంది మృతి

    • ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జిన్‌జియాంగ్ నగరంలో ఘటన

  • Jul 09, 2026 21:35 IST

    విశాఖ: ఎండాడలో వివాహిత సంధ్య(24) ఆత్మహత్య

    • మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న రాము, సంధ్య

    • భర్త రాముపై అనుమానం వ్యక్తం చేసిన మృతురాలి తల్లిదండ్రులు

    • మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించిన పోలీసులు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పీఎం పాలెం పోలీసులు

  • Jul 09, 2026 21:08 IST

    టర్కీపై 2020లో విధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించిన ట్రంప్

    • రష్యా S-400 కొనుగోలు కారణంగా టర్కీపై ఆంక్షలు విధించిన అమెరికా

    • టర్కీకి F-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న ట్రంప్

    • టర్కీకి F-35ల విక్రయాన్ని వ్యతిరేకించిన ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు

    • తుది నిర్ణయంపై అమెరికా కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

  • Jul 09, 2026 21:06 IST

    శివసేన రెండు వర్గాలు మళ్లీ కలిసే అవకాశంపై మంత్రి ప్రతాప్ సర్ణాయక్ కీలక వ్యాఖ్యలు

    • ‘భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

    • శరద్ పవార్-ఏక్‌నాథ్ షిండే భేటీతో మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చ

    • రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న సర్ణాయక్

    • సంజయ్ రౌత్ విమర్శలను తిప్పికొట్టిన మంత్రి సర్ణాయక్

  • Jul 09, 2026 20:57 IST

    నిజామాబాద్‌లో విద్యుత్ షాక్‌తో కార్మికుడి మృతి

    • బోర్గం గ్రామంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదం

    • మహారాష్ట్రకు చెందిన కిరణ్ మృతి

    • మరో కార్మికుడు దీపక్‌కు తీవ్ర గాయాలు

    • లిఫ్ట్ పైపులు ఎత్తుతుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం

  • Jul 09, 2026 20:50 IST

    మష్హాద్‌లో అయతొల్లా అలీ ఖమేనీకి వేలాదిమంది నివాళులు

    • కుటుంబ సభ్యులతో కలిసి అంతిమ వీడ్కోలు పలికిన ప్రజలు

    • ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్‌లో విషాద వాతావరణం

  • Jul 09, 2026 20:42 IST

    దేశంలో ప్రారంభం కానున్న తొలి హైడ్రోజన్ రైలు సేవలు

    • జూలై 17న జింద్ నుంచి ప్రారంభించే అవకాశం

    • హర్యానాలో జింద్–సోనిపట్ మార్గంలో నడవనున్న రైలు

    • హైడ్రోజన్ రైళ్లు నడిపే దేశాల జాబితాలో చేరనున్న భారత్

  • Jul 09, 2026 20:39 IST

    హైదరాబాద్: రోడ్స్ అండ్ బిల్డింగ్ మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో ట్విస్ట్

    • బినామీగా ఉన్న మోహన్ మరదలు పద్మినిని విచారించిన ఏసీబీ

    • గచ్చిబౌలిలోని రెండు ఫ్లాట్లు మోహన్ నాయక్ డబ్బులతోనే కొనుగోలు చేసినట్లు పద్మిని వాంగ్మూలం

    • పద్మిని స్టేట్‌మెంట్‌ను కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ

    • రెండు ఫ్లాట్ల విలువ రూ.2.44 కోట్లు అని అంచనా

    • బినామీల పేర్లతో పవర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులపైనా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ

  • Jul 09, 2026 20:32 IST

    హైదరాబాద్: టీబీజేపీ నేతలతో కేంద్రమంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యలు

    • తెలంగాణ బీజేపీ డోర్స్ ఓపెన్ చేయండి: జేపీ నడ్డా

    • ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోండి: జేపీ నడ్డా

    • బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారు: జేపీ నడ్డా

    • ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు: జేపీ నడ్డా

    • బీజేపీ నేతలు విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలి: జేపీ నడ్డా

  • Jul 09, 2026 20:32 IST

    చైనాలో వరదలతో బయటకు వచ్చిన వందలాది పాములు

    • గ్వాంగ్జీ ప్రాంతంలో బయటకు వచ్చిన 900కిపైగా పాములు

    • పాము కాటుతో ఓ మహిళ మృతి

    • వరద నీటిలో పాములు సంచరిస్తున్న వీడియోలు వైరల్

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

  • Jul 09, 2026 19:56 IST

    పోలవరం టూరిజం హబ్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష

    • తుది దశకు చేరిన టూరిజం హబ్ డిజైన్లు

    • ఈ నెల 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు

    • డిజైన్లను పరిశీలించి తుది ఆమోదం ఇవ్వనున్న సీఎం

    • పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళిక

    • మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లకు ప్రతిపాదనలు

    • పోలవరం-పాపికొండలు-భద్రాచలం టూరిజం కారిడార్‌కు ప్రణాళికలు

  • Jul 09, 2026 19:52 IST

    హైదరాబాద్: తాడిచెర్లను సింగరేణికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

    • తెలంగాణ జెన్‌కోకు ఒడిశా నుంచి నైనీ బ్లాక్‌ అనుమతులు: కిషన్ రెడ్డి

    • సింగరేణిలో తాడిచెర్ల అతిపెద్ద మైనింగ్‌ రిజర్వ్‌గా మారబోతోంది: కిషన్‌ రెడ్డి

    • తాడిచెర్లలో 434 మిలియన్ టన్నుల రిజర్వులు: కిషన్‌ రెడ్డి

    • తెలంగాణ ఇంధన భద్రతకు తాడిచెర్ల సుదీర్ఘ భరోసా: కిషన్‌ రెడ్డి

    • కొత్తగా వచ్చిన బ్లాక్‌లతో 3వేల మందికి ఉద్యోగాలు: కిషన్‌ రెడ్డి

    • తాడిచెర్లపై రాజకీయాలు చేయదలచుకోలేదు: కిషన్‌ రెడ్డి

    • ఉపముఖ్యమంత్రి భట్టి కూడా సింగరేణి హితంపై మాట్లాడాలి: కిషన్‌ రెడ్డి

  • Jul 09, 2026 19:47 IST

    విజయవాడ జీజీహెచ్ ఘటనపై మంత్రి సత్యకుమార్ సీరియస్

    • మృతదేహం తరలింపుపై విచారణకు ఆదేశించిన మంత్రి

    • డీఎంఈ డా. విష్ణువర్ధన్‌కు దర్యాప్తు బాధ్యతలు

    • ప్రైవేట్ అంబులెన్స్ ఎందుకు వినియోగించారో నివేదిక కోరిన మంత్రి

    • బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి

  • Jul 09, 2026 19:40 IST

    గ్రీస్‌లో ఎఫ్-16 ఫైటర్ జెట్‌లో సాంకేతిక లోపం

    • జకింతోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్

    • ల్యాండింగ్ సమయంలో ఫైటర్ జెట్ కింద చెలరేగిన మంటలు

    • వెంటనే స్పందించి.. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

    • పైలట్ సురక్షితం

  • Jul 09, 2026 19:34 IST

    బిహార్‌: గయా-పట్నా రైల్వే మార్గంలో ఓహెచ్‌ఈ వైర్ చోరీ

    • సుమారు 100 మీటర్ల విద్యుత్ తీగను అపహరించిన దొంగలు

    • ఈ ఘటనతో దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు

  • Jul 09, 2026 19:32 IST

    కోల్‌కతా: బీజేపీలో చేరిన మాజీ టీఎంసీ నేతలు

    • బీజేపీలో చేరిన సుష్మితా దేవ్, సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాశ్ చిక్ బరైక్

    • కోల్‌కతాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య సమక్షంలో చేరిక

    • ముగ్గురు నేతలకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ నాయకత్వం

    • వీరి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్న సమిక్ భట్టాచార్య

  • Jul 09, 2026 19:27 IST

    ఖమ్మంలో ఈగల్ ఫోర్స్, పోలీసుల సంయుక్త ఆపరేషన్

    • రూ.57 లక్షల విలువైన 113 కిలోల గంజాయి స్వాధీనం

    • నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్

    • ఖమ్మం బైపాస్ వద్ద రెండు వాహనాలను అడ్డగించిన పోలీసులు

    • ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టివేత

  • Jul 09, 2026 19:20 IST

    హైదరాబాద్: ఫాతిమా విద్యాసంస్థల భవనాలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు

    • మరో కోర్టులో కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం

    • భవనాల వ్యవహారంపై స్టే కొనసాగదని స్పష్టం చేసిన హైకోర్టు

  • Jul 09, 2026 19:19 IST

    రేపు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

    • జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో పాల్గొననున్న సీఎం

    • రైతు భరోసా నిధులు, ఈ-పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ

    • 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల నిధులు రైతుల ఖాతాలో జమ చేసిన సర్కార్

  • Jul 09, 2026 19:15 IST

    తన మనవడికి పూరీలు చేసి పెట్టిన సీఎం రేవంత్..

  • Jul 09, 2026 18:58 IST

    విజయ్‌ 'జననాయగన్‌' సినిమాకు A సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు

  • Jul 09, 2026 18:17 IST

    విజయవాడ: పవన్ అధ్యక్షతన జనసేన సమావేశం

    • హాజరైన ప్రజాప్రతినిధులు

    • రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చ

  • Jul 09, 2026 18:16 IST

    అమరావతి: ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • బకాయిల చెల్లింపు వివాదాల పరిష్కారానికి కీలక నిర్ణయం

    • ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల పునర్వ్యవస్థీకరణకు జీవో-165 జారీ

    • రెండేళ్ల కాలపరిమితితో కొత్త కౌన్సిళ్ల ఏర్పాటు

    • మంగళగిరిలో ప్రధాన ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు

  • Jul 09, 2026 18:15 IST

    హైదరాబాద్: స్పోర్ట్స్‌ పాలసీ తేవడంలో కేంద్రం విఫలం: సీఎం రేవంత్‌

    • దేశానికి అకాడమీలు, వసతులు అవసరం: సీఎం రేవంత్‌

    • క్రీడల్లో భారత్‌ వెనుకబడి ఉంది: సీఎం రేవంత్‌

    • అంతర్జాతీయ క్రీడల పతకాల పట్టికలో భారత్‌ అట్టడుగు స్థానంలో ఉంటోంది: సీఎం రేవంత్‌

    • క్రీడాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి: సీఎం రేవంత్‌

    • క్రీడాకారులకు సంపూర్ణ సహకారం అందిస్తాం: సీఎం రేవంత్‌

  • Jul 09, 2026 18:11 IST

    హైదరాబాద్‌: గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్

    • యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ & స్పోర్ట్స్‌ వర్సిటీని ప్రారంభించిన సీఎం

    • స్పోర్ట్స్‌ వర్సిటీ వెబ్‌సైట్‌, లోగో ఆవిష్కరించిన సీఎం రేవంత్‌

  • Jul 09, 2026 17:38 IST

    అర్జెంటీనా, ఈజిప్ట్‌ మ్యాచ్ వివాదం.. స్పందించిన ఫిఫా

    • ఫిఫా నిర్ణయాలపై ఎవరి ప్రభావం ఉండదని వెల్లడి

    • అర్జెంటీనా స్టార్‌ మెస్సిని ప్రపంచ కప్‌లో ఆడించేందుకే పక్షపాత ధోరణి అంటూ విమర్శలు

  • Jul 09, 2026 17:37 IST

    బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి శాటిలైట్‌ ఫోన్‌

    • ధర రూ.1.34 లక్షలుగా నిర్ణయం

    • నెట్‌వర్క్‌ లేని ప్రాంతాల్లోనూ కాల్స్‌ చేసుకునేందుకు వెసులుబాటు

    • శాటిలైట్‌ ఆధారిత కమ్యూనికేషన్‌ సౌకర్యం

    • అత్యవసర పరిస్థితుల్లోనూ కనెక్టివిటీ

    • ప్రత్యేక ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌

  • Jul 09, 2026 17:36 IST

    మరో ఏఐ మోడల్‌‌ను లాంచ్ చేసిన స్పేస్ఎక్స్ఏఐ

    • గ్రోక్ 4.5 పేరిట కొత్త మోడల్ ఆవిష్కరించిన స్పేస్ఎక్స్‌ఏఐ

    • ఆంత్రోపిక్‌ సంస్థ టాప్ మోడల్స్‌కు గ్రోక్ 4.5 గట్టి పోటీ

    • అనేక అంశాల్లో గ్రోక్ 4.5 ఇతరుల కంటే మెరుగని వ్యాఖ్య

  • Jul 09, 2026 16:48 IST

    తిరుపతి: పెళ్లకూరు మండలం చిల్లకూరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం

    • విగ్రహం కోసం తీసిన గుంతను పూడ్చివేసిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి

    • సంఘటన స్థలానికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు

    • గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు

    • భారీగా మోహరించిన పోలీసులు

  • Jul 09, 2026 16:35 IST

    మెల్‌బోర్న్: ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర స్థావరాలను కూల్చివేశాం: ప్రధాని మోదీ

    • ఆపరేషన్ సిందూర్‌తో భారత్ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచం గుర్తించింది: ప్రధాని

    • ఉగ్రవాదంపై భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చింది: ప్రధాని

    • ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణం: ప్రధాని

  • Jul 09, 2026 16:20 IST

    హైదరాబాద్: హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్

    • హరీశ్‌పై కేసీఆర్‌కు నమ్మకం లేకే మంత్రి పదవి నుంచి తొలగించారన్న ఉత్తమ్

    • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులు వచ్చే వేసవిలోగా పూర్తి చేస్తామని వెల్లడించిన మంత్రి

    • బ్యారేజీల మరమ్మతులు చిత్తశుద్ధితో చేపడుతున్నామన్న ఉత్తమ్

    • హరీశ్ వ్యాఖ్యలకు సరైన సమయంలో పూర్తి సమాధానం ఇస్తానన్న ఉత్తమ్

  • Jul 09, 2026 16:18 IST

    ఢిల్లీలో భారీ జాబ్ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

    • ఇన్‌కమ్ టాక్స్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన ముఠా

    • ముగ్గురు నిందితుల అరెస్ట్

    • మాజీ ఐటీ ఉద్యోగి చిరాగ్ అగర్వాల్ కీలక నిందితుడని గుర్తించిన పోలీసులు

    • ఐటీ కార్యాలయంలోనే నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి మోసం

    • ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1-2 లక్షల వసూలు

    • 4 మొబైళ్లు, నకిలీ పత్రాలు స్వాధీనం

    • ప్రధాన సూత్రధారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు

  • Jul 09, 2026 16:07 IST

    ముంబై: లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

    • నిఫ్టీ 80.75 పాయింట్లు పెరిగి 23,962.80 వద్ద ముగింపు

    • సెన్సెక్స్ 238.22 పాయింట్లు లాభపడి 76,741.82 వద్ద క్లోజ్

  • Jul 09, 2026 16:05 IST

    కాకినాడ జిల్లాలో బోటు ప్రమాదం

    • తొండంగి మండలం ఎల్లయ్యపేట వద్ద ఘటన

    • బోటులో గ్యాస్ ప్రమాదంతో నలుగురు మత్స్యకారులకు తీవ్ర గాయాలు

    • సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో ప్రమాదం

    • వంట చేస్తుండగా గ్యాస్ లీక్‌ అవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం

  • Jul 09, 2026 15:49 IST

    మెల్‌బోర్న్: భారత్‌-ఆస్ట్రేలియా సంబంధాలు దృఢమైనవి: ప్రధాని మోదీ

    • 2014లో ఆస్ట్రేలియాలో పర్యటించా: ప్రధాని మోదీ

    • 12 ఏళ్లలో మూడుసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించా: మోదీ

    • ఇరుదేశాల మధ్య బంధం బలోపేతంలో ప్రవాస భారతీయుల పాత్ర కూడా ఉంది: ప్రధాని మోదీ

    • మెల్‌బోర్న్‌ను మినీ ఇండియాగా పిలుస్తారు: ప్రధాని మోదీ

    • మెల్‌బోర్న్‌ ప్రాంతం భారతీయ సంస్కృతితో నిండి ఉంటుంది: మోదీ

    • భారత్‌ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలి: మోదీ

    • గ్రో మోర్‌.. అచీవ్‌ మోర్‌ నినాదంతో ముందుకెళ్లాలి: మోదీ

  • Jul 09, 2026 15:47 IST

    చైనాలో భారీ వరదలకు 39 మంది బలి

    • 'మైసాక్' తుఫాన్ ధాటికి అతలాకుతలమైన దక్షిణ చైనా

    • జలాశయం డ్యామ్ కూలి 26 మంది మృతి

    • చైనాకు పొంచివున్న మరో ముప్పు

    • శనివారం తీరం దాటనున్న భీకర టైఫూన్ ‘బావి’

  • Jul 09, 2026 15:37 IST

    మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో అద్భుత ఆతిథ్యం లభించింది: మోదీ

    • ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌కు ధన్యవాదాలు: మోదీ

    • గతంలో రెండుసార్లు మిమ్మల్ని సిడ్నీలో కలిశా: మోదీ

    • అహ్మదాబాద్‌లో అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ఉంది: మోదీ

    • మెల్‌బోర్న్‌లోనూ ఐకానిక్‌ స్టేడియం ఉంది: మోదీ

    • ఇవాళ స్టేడియం అంతా జనంతో హోరెత్తింది: మోదీ

    • ఆస్ట్రేలియాలో ఈ ప్రదర్శన హౌస్‌ఫుల్‌, బ్లాక్‌బస్టర్‌

    • భారత్‌-ఆస్ట్రేలియా మధ్య దృఢమైన బంధం: మోదీ

  • Jul 09, 2026 15:36 IST

    ఫిఫా ప్రపంచ కప్: రేపటి నుంచి క్వార్టర్ ఫైనల్స్

    • రేపు ఫ్రాన్స్, మొరాకో మధ్య తొలి మ్యాచ్

    • బోస్టన్ వేదికగా రాత్రి 1:30 గంటలకు మ్యాచ్

  • Jul 09, 2026 15:29 IST

    మోదీ ఒక విజనరీ లీడర్‌: ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌

    • ప్రపంచ దేశాలకు మోదీ ఒక స్ఫూర్తి: ఆంథోనీ ఆల్బనీస్‌

    • మోదీ మాకు ఆప్త మిత్రుడు: ఆంథోనీ ఆల్బనీస్‌

    • ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదిగింది: ఆంథోనీ ఆల్బనీస్‌

  • Jul 09, 2026 15:28 IST

    ఆస్ట్రేలియా: మెల్‌బోర్న్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సమావేశం

    • మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ కార్యక్రమానికి హాజరైన 30 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు

    • మెల్‌బోర్న్‌ మార్వెల్‌ స్టేడియంలో కార్యక్రమం

    • మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ఘన స్వాగతం

  • Jul 09, 2026 15:26 IST

    హైదారబాద్: వైద్య ఆరోగ్యశాఖ అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి గుడ్‌న్యూస్

    • ప్రతి నెల 1వ తేదీన వేతనాల చెల్లింపునకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు

    • శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి ప్రయోజనం

    • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అమలు

  • Jul 09, 2026 15:15 IST

    కడప జిల్లా మాసాపేటలో యువతి అనుమానాస్పద మృతి

    • ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందిన మౌనిక

    • ఘటనపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు

    • మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోన్న పోలీసులు

  • Jul 09, 2026 15:13 IST

    దేశంలో అక్రమ భవనాలు, నిర్మాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    • అక్రమ భవనాలు, నిర్మాణాల కూల్చివేతలపై నివేదికలు సమర్పించాలని ఆయా మున్సిపల్ అధికారులకు ఆదేశం

    • ఆగస్ట్‌ 4న విచారణకు అధికారులు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశం

  • Jul 09, 2026 15:10 IST

    హైదరాబాద్: కవిత ఆరోపణలపై సీబీఐ విచారణకు ఎంపీ అర్వింద్ డిమాండ్

    • సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని విజ్ఞప్తి

    • బీఆర్ఎస్ నిధులు, క్విడ్ ప్రో కో ఆరోపణలపై దర్యాప్తు కోరిన అర్వింద్

    • కాళేశ్వరం, ఈ-కార్ రేస్ కేసుల్లో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అర్వింద్

    • పారదర్శక దర్యాప్తుతో నిజాలు వెలికితీయాలని అర్వింద్ డిమాండ్

  • Jul 09, 2026 15:06 IST

    థానె: శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం) కార్పొరేటర్ దాడి ఘటనలో మరో కీలక పరిణామం

    • తన ఉద్యోగానికి రాజీనామా చేసిన వైద్యురాలు

    • భద్రతపై భయంతో థానె వదిలి వెళ్తునట్లు ప్రకటించిన వైద్యురాలు

    • తిరిగి థానెకు వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన వైద్యురాలు

  • Jul 09, 2026 15:00 IST

    హైదరాబాద్: మెహిదీపట్నం సెయింట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్‌లో దారుణం

    • యూకేజీ విద్యార్థినిపై టీచర్ రజనీ దాడి

    • రైటింగ్ ప్యాడ్‌తో కొట్టడంతో చిన్నారి చెవికి తీవ్ర గాయం

    • స్కూల్ యాజమాన్యం, టీచర్‌పై ఆసిఫ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు

    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

    • ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం

  • Jul 09, 2026 14:59 IST

    భారత్‌-పాక్‌ యుద్ధంపై మరోసారి ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

    • భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధాన్ని ఆపింది నేనే: ట్రంప్‌

    • మొత్తం 8 యుద్ధాలను ఆపా: ట్రంప్‌

    • నోబెల్‌ శాంతి బహుమతి నాకే దక్కాలి.. కానీ ఇవ్వలేదు: ట్రంప్‌

  • Jul 09, 2026 14:52 IST

    కాకినాడ: చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు

    • ఇంటి వెనుక కొండపై మళ్లీ విస్తృతంగా శోధన

    • కొండ ప్రాంతంపై అవగాహన ఉన్న వారితో గాలింపు

    • జ్ఞానేశ్వరి కుటుంబానికి కలెక్టర్ హరీందర ప్రసాద్ పరామర్శ

    • కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: కలెక్టర్

    • ఆర్థిక సాయం అందిస్తామని కలెక్టర్ ప్రసాద్ హామీ

  • Jul 09, 2026 14:16 IST

    మూసీ పునరుజ్జీవ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

    • రూ.7,345.12 కోట్లతో జోన్-1 పనులు చేపట్టేందుకు అనుమతి

  • Jul 09, 2026 14:02 IST

    నంద్యాల: ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండాలి: సీఎం చంద్రబాబు

    • రాయలసీమలో ఫ్యాక్షన్‌ లేకుండా చేసిన చరిత్ర టీడీపీది: సీఎం చంద్రబాబు

    • మతకలహాలు అణిచివేసిన పార్టీ.. టీడీపీ: సీఎం చంద్రబాబు

    • సమస్యలు, సంక్షేమంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది: సీఎం చంద్రబాబు

  • Jul 09, 2026 14:00 IST

    ఇంట్లో ఉన్న నన్ను బయటకు రప్పించారు: ABNతో సురేఖ

    • ఈనెల 14న మీనాక్షి నటరాజన్‌ను కలుస్తా: కొండా సురేఖ

    • కలిసి పనిచేయడం కడియం శ్రీహరికి ఇష్టం లేనట్టుంది: కొండా సురేఖ

    • మంత్రి చేయాల్సిన పనులు కడియం చేస్తానంటే ఎలా?: కొండా సురేఖ

    • 3 నెలలుగా అధికారులపై కడియం ఒత్తిడి చేశారు: కొండా సురేఖ

  • Jul 09, 2026 13:59 IST

    ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

    • వరి ఉత్పత్తి సుమారు 15% తగ్గే అవకాశం ఉంది: మంత్రి నాదెండ్ల మనోహర్

    • సమస్యలను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు: మంత్రి నాదెండ్ల

    • 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం: మంత్రి నాదెండ్ల

    • 11.53 లక్షల మంది రైతులకు నగదు చెల్లించాం: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Jul 09, 2026 13:30 IST

    నంద్యాల: బనగానపల్లె బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    • ఐదేళ్లు అధికారంలో ఉండి వైసీపీ నేతలు అరాచక పాలన చేశారు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    • గొడ్డలి పార్టీ నేతలకు నేను సవాల్ విసురుతున్నా: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    • ఐదేళ్లలో రాయలసీమకు మీరేం చేశారు.. మేము ఏం చేశామో బహిరంగ చర్చకు రావాలి: మంత్రి

  • Jul 09, 2026 13:15 IST

    తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి

    • ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉంది: సీఎం రేవంత్‌ రెడ్డి

    • హైదరాబాద్‌ను కూడా కాలుష్య సమస్య వేధిస్తోంది: సీఎం రేవంత్‌ రెడ్డి

    • మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం: సీఎం రేవంత్‌ రెడ్డి

    • కోర్ అర్బన్ ఏరియాను డెవలప్ చేయడానికి ప్రత్యేక పాలసీ: సీఎం రేవంత్‌ రెడ్డి

    • పరిశ్రమలను ఔటర్ అవతలకు తరలించబోతున్నాం: సీఎం రేవంత్‌ రెడ్డి

  • Jul 09, 2026 13:00 IST

    హైదరాబాద్: కొనసాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్

    • పలువురు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సీరియస్

    • సీఎం, పీసీసీ చీఫ్‌ చెప్పినా.. SIR పట్ల అలసత్వంగా ఉన్నారని ఆగ్రహం

    • SIR పట్ల అప్రమత్తంగా లేకపోతే ఊరుకునేది లేదని గతంలో సీఎం రేవంత్ హెచ్చరిక

  • Jul 09, 2026 12:55 IST

    నంద్యాల: బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన

    • రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం

    • గత పాలకుల తీరుతో ప్రజలు ఇబ్బంది పడ్డారు: సీఎం చంద్రబాబు

    • వైసీపీ పాలన ప్రజలకు శాపంగా మారింది: సీఎం చంద్రబాబు

    • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజలను భయపెట్టారు: సీఎం చంద్రబాబు

    • మాట వినని వారి భూములను 22ఏలో పెట్టారు: సీఎం చంద్రబాబు

  • Jul 09, 2026 12:50 IST

    ఫీజురీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

    • గత విచారణలో విధించిన స్టే ఎత్తివేయాలని కోరిన ప్రభుత్వం

    • స్టేతో కొత్తగా చేరే విద్యార్థులకు ఇబ్బంది కలుగుతోందన్న ప్రభుత్వం

    • ఈ ఏడాది కొత్త అడ్మిషన్లతో పాటు 2, 3, 4వ ఏడాది విద్యార్థులకు ఫీజు చెల్లిస్తామన్న ప్రభుత్వం

  • Jul 09, 2026 12:45 IST

    BRS పార్లమెంటరీ పార్టీ నేతగా వద్దిరాజు రవిచంద్ర

    • KR సురేష్‌రెడ్డి స్థానంలో ఎంపీ వద్దిరాజు నియామకం

    • రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కేసీఆర్ లేఖ

  • Jul 09, 2026 12:40 IST

    అమెరికాలో భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవినాష్ నార్నె అరెస్ట్

    • భార్య రజితను హత్యచేసినట్టు నిర్ధారించిన పోలీసులు

    • బాత్‌రూమ్‌లో కిందపడి చనిపోయిందంటూ అవినాష్ డ్రామా

    • గొంతు నులిమి హత్య చేసినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో గుర్తింపు

    • భార్య మృతదేహం ఫొటోను భారత్‌లోని ప్రియురాలికి పంపిన అవినాష్‌

    • కింగ్ కౌంటీ జైలుకు నిందితుడు అవినాష్ నార్నె తరలింపు

  • Jul 09, 2026 12:35 IST

    సింగరేణి సంస్థను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది: బాల్క సుమన్

    • సింగరేణిని కేసీఆర్ బంగారు గనిలా మార్చారు: బాల్క సుమన్

    • కాంగ్రెస్ హయాంలో సింగరేణిలో స్కామ్‌లు తప్ప.. స్కీమ్‌లు లేవు

    • బొగ్గు నిల్వల మాయంపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదు?

    • సింగరేణి స్కామ్‌పై సీబీఐ విచారణ జరపాలి: బాల్క సుమన్

  • Jul 09, 2026 12:30 IST

    హైదరాబాద్: తాడిచర్ల బ్లాక్ కేటాయింపు BRS విజయమే: కొప్పుల ఈశ్వర్

    • తాడిచర్ల కేటాయింపుపై బీజేపీ సంబరాలు హాస్యాస్పదం: కొప్పుల ఈశ్వర్

    • సింగరేణి సంస్థ కోసం ఏనాడైనా కిషన్‌రెడ్డి మాట్లాడారా?

    • సింగరేణి బలోపేతానికి కేసీఆర్ కృషి చేశారు: కొప్పుల ఈశ్వర్

  • Jul 09, 2026 12:26 IST

    ఖమ్మం: ఎల్‌నినో ప్రభావం నుంచి బయటపడాలి: మంత్రి తుమ్మల

    • వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు వస్తున్నాయి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

    • తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే పంటలు వేయండి: మంత్రి తుమ్మల

    • దేశంలో రైతు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్: మంత్రి తుమ్మల

    • కేంద్రం సహకరించకపోయినా రైతులకు అండగా ఉంటున్నాం: మంత్రి తుమ్మల

    • కేంద్రంతో కొట్లాడి ఎరువులు తీసుకొచ్చి అందజేస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • Jul 09, 2026 12:24 IST

    ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్‌

    • రొనాల్డినోలా నిన్ను జైలుకు పంపుతా: సెలెస్టే అమరిల్లా

    • మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు: అమరిల్లా

    • ఎంబాపె నాకు క్షమాపణ చెప్పాలి: అమరిల్లా

  • Jul 09, 2026 12:23 IST

    నాగర్‌కర్నూల్: మన్ననూర్‌ PTG పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్

    • 27 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

  • Jul 09, 2026 12:20 IST

    రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

    • కొంతకాలంగా భుజ కండరాల నొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్

    • ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్

    • చికిత్స చేయించుకోవాలని సూచించిన వైద్యులు

    • పవన్ కల్యాణ్‌కు రేపు సాయంత్రం చికిత్స చేయనున్న వైద్యులు

  • Jul 09, 2026 12:14 IST

    గాల్లోనే విమానం నుంచి దూకిన ఇన్‌స్ట్రక్టర్‌

    • అర్జెంటీనాలో విషాద ఘటన

    • ట్రైనీతో చివరి మాటలు చెప్పి కిందకు దూకేసిన ఇన్‌స్ట్రక్టర్‌

    • విమానాన్ని సురక్షితంగా దించిన ట్రైనీ పైలట్

  • Jul 09, 2026 11:59 IST

    అమరావతి: తుళ్లూరులో జేఏసీ కీలక సమావేశం

    • అమరావతి అభివృద్ధి వేగవంతంపై కార్యాచరణ

    • భూ సమీకరణలో భాగస్వాములైన రైతుల సమస్యలపై చర్చ

    • అమరావతి అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని JAC నిర్ణయం

  • Jul 09, 2026 11:58 IST

    తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఎంపీ చామల స్పందన

    • నేను ఎమ్మెల్యే సామేల్‌కు వ్యతిరేకం కాదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • సామేల్ తీసుకునే నిర్ణయాలను నేను వ్యతిరేకించను: ఎంపీ చామల

    • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాలి: ఎంపీ చామల

    • పదవుల కోసం కొట్టుకుంటే ప్రజల్లో చులకన అవుతాం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • Jul 09, 2026 11:44 IST

    వరంగల్: డ్రగ్స్ రహిత భారత్, తెలంగాణ.. మన బాధ్యత: గవర్నర్

    • వరంగల్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పర్యటన

    • IDOCలో నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీ ప్రారంభించిన గవర్నర్

    • IDOC నుంచి ఆర్ట్స్‌ కాలేజీ వరకూ నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీ

  • Jul 09, 2026 11:44 IST

    కర్ణాటక: ఎల్లాపుర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

    • అదుపుతప్పి లారీని ఢీకొట్టిన జీపు, ఆరుగురి మృతి

    • మరో ముగ్గురి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు

    • చనిపోయిన యువకులంతా పార్ట్‌టైమ్ డెలివరీ బాయ్స్‌గా గుర్తింపు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 09, 2026 11:15 IST

    భారత్-ఆస్ట్రేలియా రక్షణ బంధంలో కొత్త అధ్యాయం

    • తొలిసారి భారత్-ఆస్ట్రేలియా జాయింట్ డిక్లరేషన్

    • మెల్‌బోర్న్ వేదికగా కీలక రక్షణ ఒప్పందం

    • సముద్ర భద్రత పెంపునకు ఇరుదేశాలూ గ్రీన్‌సిగ్నల్

    • ఏటా రక్షణ మంత్రుల చర్చలకు నిర్ణయం

  • Jul 09, 2026 11:14 IST

    ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన

    • భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ వ్యాపారవేత్తలకు ఆహ్వానం

    • ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీతో మోదీ ద్వైపాక్షిక చర్చలు

  • Jul 09, 2026 11:02 IST

    యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ వ్యాఖ్యలపై కపిల్‌ స్పందన

    • యోగ్‌రాజ్‌ ఇప్పటికీ స్నేహితుడేనన్న కపిల్‌ దేవ్‌

    • కాకపోతే తనకు కఠిన మనస్తత్వం నచ్చదని కపిల్‌ స్పష్టీకరణ

    • గతంలో కపిల్‌ దేవ్ ఇంటికి వెళ్లి తిట్టినట్లు వెల్లడించిన యోగ్‌రాజ్‌.. దీనిపై క్షమాపణలు చెప్పిన యువరాజ్‌

    • యువరాజ్‌ను ప్రశంసించిన కపిల్‌ దేవ్‌

    • వివాదంపై తొలిసారి స్పందించిన కపిల్‌ దేవ్

  • Jul 09, 2026 10:58 IST

    నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థినిల ధర్నా

    • హాస్టల్‌లో తాగు నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్

    • వర్సిటీకి వచ్చిన ఆర్టీసీ బస్సును నిలిపివేసి నిరసన

  • Jul 09, 2026 10:56 IST

    హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

    • సిద్ధిఖి కబాబ్ సెంటర్‌లో నిబంధనలకు విరుద్ధంగా మాంసం నిల్వ

    • శ్రీ ద్వారకాలో కాలం చెల్లిన బటర్, శనగపప్పు సీజ్

    • అరేబియన్ మండి రెస్టారెంట్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడకం

    • వైన్ అండ్ డైన్ బార్‌లో కాలం చెల్లిన పుట్టగొడుగుల గుర్తింపు

    • ఆయా రెస్టారెంట్లకు నోటీసులు ఇచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

  • Jul 09, 2026 10:55 IST

    ఢిల్లీలో ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు

    • పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిపోయిన వర్షపు నీరు

    • ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం రేఖా గుప్తా

    • అన్ని ప్రధాన రహదారులపై పరిస్థితి అదుపులో ఉందని తెలిపిన ప్రభుత్వం

  • Jul 09, 2026 10:47 IST

    హైదరాబాద్: మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    • మంత్రి సీతక్కకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్ష

    • ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని అభినందనలు

    • రాష్ట్రాభివృద్ధికి ఆమె సేవలు కొనసాగాలన్న సీఎం రేవంత్ రెడ్డి

  • Jul 09, 2026 10:35 IST

    విజయవాడ: సీఐ నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్

    • షరతులతో కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధంగా లేని సిట్

    • హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లిన సిట్

    • సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాక సీఐ నాగరాజుని కస్టడీకి తీసుకునే ఛాన్స్‌

  • Jul 09, 2026 10:34 IST

    ఇరాన్ చాబహార్‌ పోర్టుపై అమెరికా వైమానిక దాడులు

    • ట్రంప్‌ హెచ్చరికల తర్వాతే దాడులు

    • హోర్ముజ్‌లో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు

    • వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు

    • ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా

  • Jul 09, 2026 10:06 IST

    స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

    • రూ.1,43,240కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,31,300కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,45,000

  • Jul 09, 2026 10:06 IST

    టైరు పేలి అశోక్ లేలాండ్ ట్రాలీ బోల్తా.. ఒకరి మృతి

    • వరంగల్: నర్సంపేట మండలం ముత్తోజిపేటలో టైరు పేలి ట్రాలీ బోల్తా

    • ప్రమాదంలో ఒకరి మృతి, మరో నలుగురికి గాయాలు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 09, 2026 10:05 IST

    ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక

    • మరోసారి నౌకల జోలికొస్తే భీకరదాడులు చేస్తాం: ట్రంప్

    • ఇరాన్ చేసే ఒక్కో దాడికి 20 రెట్ల తీవ్రమైన ప్రతిదాడి చేస్తాం: ట్రంప్

  • Jul 09, 2026 09:30 IST

    మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు

    • 1.4శాతం పెరిగి 79 డాలర్లకు చేరిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్

    • 74 డాలర్లకు చేరిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్

  • Jul 09, 2026 09:25 IST

    కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ బిజీబిజీ

    • కియా మోటార్స్ బృందంతో సియోల్‌లో లోకేశ్ చర్చలు

    • అనంతపురం కియా ప్లాంట్‌ను విస్తరించాలని లోకేశ్ విజ్ఞప్తి

    • PBV వాహనాలతో సహా ఈవీ తయారీ కేంద్రం ఏర్పాటుకు వినతి

    • విశాఖ సమీపంలో CKD అసెంబ్లీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటుకు విజ్ఞప్తి

  • Jul 09, 2026 09:24 IST

    తెలంగాణకు IMD ఎల్లో అలర్ట్‌ జారీ

    • తెలంగాణకు 7 రోజుల పాటు వర్ష సూచన

    • ఉత్తర తెలంగాణలో 60 కి.మీ. వేగంతో గాలులు వీచే ఛాన్స్‌

    • రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

  • Jul 09, 2026 09:21 IST

    హైదరాబాద్: సైదాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం

    • బైక్ స్కిడ్ కావడంతో ఆర్టీసీ బస్సు కింద పడిన యువకుడు

    • అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 09, 2026 09:20 IST

    జోగులాంబ గద్వాల: మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామంలో దారుణం

    • మద్యం మత్తులో భార్య మహేశ్వరి తలపై భర్త తిమ్మప్ప కొడవలితో దాడి

    • మహేశ్వరి పరిస్థితి విషమం.. కర్నూల్ ఆసుపత్రికి తరలింపు

    • పోలీసుల అదుపులో భర్త తిమ్మప్ప

  • Jul 09, 2026 09:18 IST

    శంషాబాద్ సమీపంలోని శాతం రాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్న ముగ్గురు మహిళలపైకి దూసుకెళ్లిన మిర్చి లోడ్ వాహనం

    • బొలెరో వాహనం కింద నలిగిపోయిన ముగ్గురు మహిళలు

    • ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి.. మరొకరి పరిస్థితి విషమం

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jul 09, 2026 09:00 IST

    అనంతపురం: టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడికి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్కెచ్

    • ఇంట్లో మారణాయుధాలు, రాళ్లు ఉన్నాయనే సమాచారం

    • పోలీసుల తనిఖీల్లో బయటపడ్డ రాళ్లు

    • పోలీసులతో ప్రకాష్‌రెడ్డి తండ్రి ఆత్మారామిరెడ్డి వాగ్వాదం

    • ప్రకాష్‌రెడ్డి ఇంటి ముందు, లోపల ఉన్న రాళ్ల తొలగింపు

  • Jul 09, 2026 08:55 IST

    అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు

    • MLA ఎంఎస్ రాజు, మాజీ MLA తోపుదుర్తి మధ్య సవాళ్లు

    • ఎంఎస్ రాజు, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఇళ్ల దగ్గర పోలీసుల మోహరింపు

    • ఎంఎస్ రాజు నివాసానికి ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు

    • ఎంఎస్ రాజు నివాసానికి భారీగా చేరుకుంటున్న టీడీపీ శ్రేణులు

  • Jul 09, 2026 08:50 IST

    తిరుపతి: లక్ష్మీపురం డబుల్ మర్డర్ కేసు.. పోలీసుల అదుపులో నిందితులు

    • ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • ఇటీవల కుటుంబ కలహాలతో భార్యను వదిలేసిన సునీల్‌

    • ఓ వివాహ వేడుకలో సునీల్‌ను ప్రశ్నించిన మధ్యవర్తులు

    • మునిరత్నం, మణికంఠపై కత్తులతో సునీల్‌ దాడి

    • తీవ్రగాయాలతో మునిరత్నం, మణికంఠ మృతి

  • Jul 09, 2026 08:45 IST

    అమరావతి: ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ ఉద్యమం

    • నేటి నుంచి MLAలకు వినతిపత్రాలు అందజేయనున్న ఉద్యోగులు

    • ఈ-బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ఆపాలని జేఏసీ డిమాండ్

    • ఆర్టీసీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జేఏసీ విజ్ఞప్తి

    • ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

  • Jul 09, 2026 08:40 IST

    అమరావతి: సాయంత్రం 5గంటలకు జనసేన పార్టీ కీలక సమావేశం

    • జనసేన MLA, MLC, MPలతో పవన్ కల్యాణ్‌ భేటీ

    • ప్రస్తుత రాజకీయాలు, పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతంపై చర్చ

  • Jul 09, 2026 08:30 IST

    హైదరాబాద్: బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు

    • పోక్సో కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న బండి భగీరథ్

  • Jul 09, 2026 08:25 IST

    పెద్దపల్లి: రామగుండం ఎరువుల పరిశ్రమలో అమ్మోనియం లీక్

    • యూరియా ఉత్పత్తి ప్లాంట్‌ తాత్కాలికంగా షట్‌డౌన్

  • Jul 09, 2026 08:16 IST

    నేటి నుంచి సిట్ కస్టడీకి సస్పెండైన సీఐ నాగరాజు

    • విజయవాడ కోర్టు విధించిన షరతులను సవరించిన హైకోర్టు

    • సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఏపీ హైకోర్టు అనుమతి

    • 8 రోజుల పాటు నాగరాజును ప్రశ్నించనున్న సిట్

  • Jul 09, 2026 08:14 IST

    అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం మార్టూరు జంక్షన్ వద్ద లారీలో అగ్నిప్రమాదం

    • షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు

    • లారీ నుంచి బయటకు దూకిన డ్రైవర్, క్లీనర్

    • మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బంది

  • Jul 09, 2026 07:46 IST

    వరంగల్‌: నర్సంపేట మున్సిపాలిటీ పరిధి ముత్తోజిపేట దగ్గర ప్రమాదం

    • మినీ ట్రక్కు బోల్తాపడి ఒకరి మృతి, 15 మందికి గాయాలు

    • టైరు పేలి హైవే పైనుంచి చెట్లపొదల్లోకి దూసుకెళ్లిన మినీట్రక్కు

    • సూర్యాపేట నుంచి మేడారం వెళ్తుండగా ప్రమాదం

    • గాయపడిన వారిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

  • Jul 09, 2026 07:29 IST

    హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌పై నేడు అధికారిక ప్రకటన

    • నేడు ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్‌ భవన్‌ ప్రారంభం

    • ఒలింపిక్‌ భవన్‌లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ విగ్రహావిష్కరణ

    • పాల్గొననున్న మంత్రి వాకిటి శ్రీహరి, పీటీ ఉష

  • Jul 09, 2026 07:05 IST

    నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా

    • బీబీనగర్‌ ఎయిమ్స్‌ నిర్మాణ పనుల పర్యవేక్షణ

    • వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించే యోచన

    • మధ్యాహ్నం బీజేపీ ముఖ్య నేతలతో నడ్డా భేటీ

  • Jul 09, 2026 07:05 IST

    నేడు వరంగల్‌కు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

    • IDOCలో స్వయం సహాయక సంఘాల స్టాల్స్‌ సందర్శన

    • స్వయం సహాయక సంఘాల సభ్యులతో ముఖాముఖి

    • IDOC-ఆర్ట్స్‌ కాలేజీ వరకూ నషా ముక్త్‌ భారత్‌ ర్యాలీ

    • ర్యాలీని ప్రారంభించనున్న గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

  • Jul 09, 2026 06:55 IST

    నేడు సరిహద్దు జిల్లాల ఎస్పీలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమావేశం

    • అక్రమ చొరబాట్ల నిరోధంపై ప్రధానంగా చర్చ

    • సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులపై ప్రత్యేక నిఘా

    • డ్రోన్లు, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ అరికట్టడంపై ఫోకస్‌

    • కేంద్ర-రాష్ట్ర భద్రతా సంస్థల సమన్వయంపై చర్చ

  • Jul 09, 2026 06:54 IST

    ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు

    • నేడు ఢిల్లీకి ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

    • లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక హెచ్చరిక

    • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచన

  • Jul 09, 2026 06:54 IST

    నేడు జోసెఫ్‌ రావణ్‌ కస్టడీ పిటిషన్‌పై కోర్టు విచారణ

    • కస్టడీ పిటిషన్‌ను విచారించనున్న గన్నవరం కోర్టు

  • Jul 09, 2026 06:53 IST

    కర్నూలు: పంచాయతీ కార్యదర్శులపై అవినీతి ఆరోపణలు

    • నేడు కమిషనరేట్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశం

    • డీజిల్‌ బిల్లులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు

    • రూ.80 లక్షలకు పైగా కాజేసిన 25 మంది కార్యదర్శులు

  • Jul 09, 2026 06:53 IST

    నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు భట్టి, తుమ్మల పర్యటన

    • జగన్నాథపురంలో అగ్రి షోను ప్రారంభించనున్న మంత్రులు

  • Jul 09, 2026 06:52 IST

    నేడు భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య నాల్గో T20 మ్యాచ్‌

    • రాత్రి 10 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

    • ఇప్పటికే సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఇంగ్లండ్‌

  • Jul 09, 2026 06:37 IST

    మరింతగా తగ్గిన బంగారం ధరలు

    • రూ.1,43,120కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

    • రూ.1,31,190కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం

    • కిలో వెండి ధర రూ.2,44,900

    పూర్తి కథనం..

  • Jul 09, 2026 06:00 IST

    రంగారెడ్డి: రేపు సీతారాంపూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

    • ప్రీమియర్‌ ఎనర్జీస్‌ సోలార్‌ యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్

    • అల్యూమినియం ప్లాంట్‌ నిర్మాణ పనులకు శ్రీకారం