-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 6th November 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 06 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Nov 06, 2026 09:20 IST
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో DSP భీమ్‌రెడ్డికి IT షాక్
రూ.59.4లక్షల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన IT
పటాన్‌చెరులోని రెండు ఇళ్లు జప్తు చేసిన IT
ముత్తంగిలోని బృందావన్ గార్డెన్స్‌లో 200 చ.గ. రెండు ఇళ్లు గుర్తింపు
3.20 ఎకరాల వ్యవసాయ భూములు తాత్కాలికంగా జప్తు
రూ.22లక్షల విలువైన కారు స్వాధీనం చేసుకున్న IT అధికారులు
-
Nov 06, 2026 09:15 IST
బెంగళూరులో దారుణం
ఏడుగురిని చంపిన క్యాబ్ డ్రైవర్ శేఖర్
భార్య, ఆమె బంధువులతో సహా ఏడుగురి హత్య
విభేదాలతో భార్య, ఆమె కుటుంబాన్ని చంపిన శేఖర్
భార్యను చంపి మృతదేహం మాయం చేసిన శేఖర్
ఒకరి తర్వాత ఒకరిని రోకలిబండతో కొట్టి చంపిన శేఖర్
-
Nov 06, 2026 09:00 IST
హైదరాబాద్: మెట్రో–ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు భారీగా తగ్గింపు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం కీలక నిర్ణయం
నెలవారీ పాస్ రూ.8,500 నుంచి రూ.4,000కు తగ్గింపు
రోజువారీ పాస్ రూ.400 నుంచి రూ.275కు కుదింపు
నవంబర్ 8 నుంచి కొత్త ధరలు అమల్లోకి
వివరాలు వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్
-
Nov 06, 2026 08:45 IST
కర్నూలు: చిప్పగిరి మండలం గుమ్మనూరులో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
నిన్న జరిగిన గొడవపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఘర్షణకు సంబంధించి 20 మందిపై కేసులు
ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Nov 06, 2026 08:30 IST
బాపట్ల: చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
మురసు తుఫాన్ ప్రభావంతో ఈనెల 3 నుంచి నేటికి వాయిదా
చీరాల ఇంజినీరింగ్ కాలేజీలో కౌంటింగ్ చేపట్టిన అధికారులు
44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు చైర్మన్ స్థానానికి ఓట్ల లెక్కింపు
-
Nov 06, 2026 08:20 IST
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో బిగ్ డాడీ బార్ వద్ద అర్ధరాత్రి హంగామా
సమయం దాటినా బార్ మూసివేయకపోవడంపై పోలీసుల ఆదేశాలు
రోజూ ఒంటిగంట వరకు నడుపుతామంటూ పోలీసులతో వాగ్వాదం
పరిస్థితి అదుపుతప్పడంతో లాఠీచార్జ్ చేసి, బార్ సీజ్ చేసిన పోలీసులు
-
Nov 06, 2026 08:15 IST
భద్రాద్రి: అశ్వారావుపేటలో మంత్రి తుమ్మల పర్యటన
భారీ వరదలకు గండి పడిన వెంకమ్మ చెరువు పరిశీలన
ఉద్యాన, వరి పంటలు నీటి పాలయ్యాయి: మంత్రి తుమ్మల
పంట నష్టం, రోడ్ల మరమ్మతులపై నివేదిక సిద్ధం చేయాలి: మంత్రి తుమ్మల
-
Nov 06, 2026 08:00 IST
నంద్యాల: కొలిమిగుండ్ల మండలం కోర్నపల్లె సమీపంలోని గుహలో శివలింగం ప్రత్యక్షం
గుహలో శివలింగాన్ని గుర్తించిన స్థానికులు
శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు
గుహ వద్దకు తరలివస్తున్న స్థానికులు
-
Nov 06, 2026 07:45 IST
శ్రీకాకుళం: రూరల్ మండలం పొన్నాం-2లో రీ పోలింగ్
విధానపరమైన లోపం కారణంగా రీపోలింగ్‌కు నిర్ణయం
నిబంధనల ప్రకారం తిరిగి పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడి
పోలింగ్ కేంద్రంలో 932 మంది ఓటర్లు
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
-
Nov 06, 2026 07:30 IST
మార్కాపురం: పుల్లలచెరువు మండలం గంగవరంలో రీ పోలింగ్ ప్రారంభం
ఐదో పోలింగ్ కేంద్రంలో కొనసాగుతున్న రీపోలింగ్
నిన్న సీల్ వేసిన బ్యాలెట్ బాక్సును ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
ఈ ఘటనతో నేడు రీపోలింగ్ నిర్వహిస్తున్న అధికారులు
-
Nov 06, 2026 07:15 IST
నంద్యాల: మెడికల్ కళాశాలలో బిర్యానీ సరిగా ఉడకలేదని విద్యార్థుల ధర్నా
హాస్టల్ మెస్ భోజనంపై అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద నిరసన
ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ హామీతో ఆందోళన విరమణ
మెస్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడి
-
Nov 06, 2026 07:00 IST
కర్నూలు: కోసిగి మండలం ఆర్లబండ పోలింగ్ స్టేషన్-2లో ప్రారంభమైన పోలింగ్
పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు
భద్రతా ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
-
Nov 06, 2026 06:30 IST
రంగారెడ్డి: రాజేంద్రనగర్ కూడలి దగ్గర ప్రమాదం
బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన మరో బైక్
యువకుడు అయ్యప్ప మృతి, కేసు నమోదు
-
Nov 06, 2026 06:20 IST
నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంత్రుల పర్యటన
మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, అడ్లూరి పర్యటన
-
Nov 06, 2026 06:15 IST
నేడు మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హరీశ్ రావు పర్యటన
ఎండిపోయిన పంటలను పరిశీలించనున్న హరీశ్ రావు
-
Nov 06, 2026 06:10 IST
నేటి నుంచి చార్మినార్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు
దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి రద్దీ
నేటి నుంచి ఈనెల 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
మదీనా-చార్మినార్, ముర్గీచౌక్-చార్మినార్‌తో పాటు శాలిబండ-చార్మినార్ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
Nov 06, 2026 06:07 IST
ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో 67.24% పోలింగ్ నమోదు
ఏపీలో 2,24,32,460 ఓట్లకు గాను పోలైన 1,50,84,014 ఓట్లు
శ్రీసత్యసాయి జిల్లాలో అత్యధికంగా 82.60 శాతం పోలింగ్
అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 59 శాతం పోలింగ్ నమోదు
విశాఖపట్నం జిల్లాలో 75 శాతంతో భారీ పోలింగ్
నంద్యాల 73.70%, గుంటూరు 73.12% చొప్పున భారీ పోలింగ్
-
Nov 06, 2026 06:05 IST
ఏపీలో నేడు 204 కేంద్రాల్లో పోలింగ్... 6 చోట్ల రీపోలింగ్
తుఫాన్ ప్రభావంతో ఎన్నికలు వాయిదా పడిన ప్రాంతాల్లో పోలింగ్
-
Nov 06, 2026 06:02 IST
రాప్తాడు కేసులో దాఖలైన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
నిందితుడు హేమంత్ మీద కాల్పుల ఘటనపై పిటిషన్ దాఖలు
స్కూల్లో భద్రతా చర్యలు లేనందునే ఘటన జరిగిందన్న పిటిషనర్
-
Nov 06, 2026 06:00 IST
నేడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
మురసు తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
రూ.1,918 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా
కేంద్రానికి సమగ్ర నష్ట నివేదిక పంపాలని సీఎం ఆదేశం