Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 28 , 2026 | 06:43 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 28, 2026 21:24 IST

    హైదరాబాద్: గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్స్‌

    • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్ హీరోస్ Vs ముంబై డ్రీమర్స్ ఫైనల్‌ మ్యాచ్‌

    • విజేతకు ట్రోఫీ అందించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

  • Jun 28, 2026 21:16 IST

    జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ ప్రక్రియ

    • పార్టీ సెంట్రల్‌ ఆఫీస్‌ నుంచి సమన్వయానికి కమిటీ ఏర్పాటు

    • ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించిన పవన్ కల్యాణ్‌

    • కమిటీలో తమ్మిరెడ్డి శివశంకరరావు, పెదపూడి విజయ్‌కుమార్, పంచకర్ల సందీప్, బుర్రా దివ్యరాజ్, పి.సుబ్బారాయుడు

    • రేపటి నుంచి 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రారంభం‌కానున్న జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ

  • Jun 28, 2026 21:09 IST

    అమరావతి: సునీల్ మిత్తల్‌తో సీఎం చంద్రబాబు భేటీ

    • భవిష్యత్తు డిజిటల్ మౌలిక సదుపాయాలపై కీలక చర్చ

    • గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సేవల విస్తరణపై చర్చ

    • డేటా సెంటర్ల పెట్టుబడులకు ప్రోత్సాహంపై చర్చ

    • ఏపీలో డిజిటల్ కనెక్టివిటీ బలోపేతంపై దృష్టి: చంద్రబాబు

  • Jun 28, 2026 21:03 IST

    నల్గొండలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు హరీశ్ రావు కౌంటర్‌

    • మా MLAలను లాక్కొని ప్రగల్భాలు పలుకుతున్నారు: హరీశ్ రావు

    • మా దగ్గర లాక్కున్న MLAలతో రాజీనామా చేయించి ఎన్నికల బరిలో నిలిచే దమ్ము రేవంత్‌కు ఉందా?: హరీశ్ రావు

    • 2034 వరకు అధికారం కాంగ్రెస్‌దేనని పగటికలలు కంటున్నారు: హరీశ్ రావు

    • అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వస్తే ఎవరి సత్తా ఏంటో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం: హరీశ్ రావు

  • Jun 28, 2026 20:49 IST

    మహిళల టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియా టార్గెట్ 171

    • భారత మహిళల స్కోర్ 170/4

    • హాఫ్ సెంచరీతో రాణించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(56)

  • Jun 28, 2026 20:47 IST

    అంతర్జాతీయ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్

    • ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ స్టోక్స్ రిటైర్‌మెంట్

    • న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తన కెరీర్‌లో ఆఖరిదని వెల్లడి

    • వీడియో పోస్ట్ చేసిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు

  • Jun 28, 2026 20:39 IST

    హైదరాబాద్‌: పార్టీ నాయకులతో నితిన్‌ నబీన్‌ సమావేశం

    • పాల్గొన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ సహా ఎంపీలు, MLAలు, MLCలు, ఇతర సీనియర్‌ నేతలు

    • తెలంగాణలో పార్టీ పరిస్థితిపై జాతీయ అధ్యక్షుడు నబీన్‌ రివ్యూ

    • రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నబీన్‌ దిశానిర్దేశం

  • Jun 28, 2026 20:31 IST

    రాజమండ్రి: సీతానగరం మండలం రాజంపేటలో విషాదం

    • గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి

    • రాజంపేటకు చెందిన మహి(14), దుర్గాప్రసాద్‌(15) మృతి

  • Jun 28, 2026 19:47 IST

    ఐర్లాండ్‌తో రెండో టీ20: భారత్ టార్గెట్ 155

    • ఐర్లాండ్ స్కోర్ 154/8

    • హాఫ్ సెంచరీ చేసిన హ్యారీ టెక్టర్(53)

    • అరంగేట్రంలోనే 3 వికెట్లతో రాణించిన భారత బౌలర్ ప్రిన్స్ యాదవ్

  • Jun 28, 2026 19:46 IST

    ఫ్రాన్స్‌లో వడగాలులు.. వెయ్యి మంది మృతి

    • జూన్ 24 నుంచి 28 వరకూ అదనంగా వెయ్యి మంది మరణం

    • అధికారుల అంచనాలకు మించిన మరణాల సంఖ్య

    • మృతుల్లో అధిక శాతం మంది 65 ఏళ్లకు పైబడిన వారే

    • ఫ్రాన్స్ ఆరోగ్య శాఖ ప్రకటన

  • Jun 28, 2026 19:45 IST

    నా జీవితలక్ష్యం మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఎవరు అడ్డొచ్చినా, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా మూసీ నది ప్రక్షాళన ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి

    • ఎవరైన అడ్డొస్తే తొక్కుతా.. కానీ మూసీ పనులు ఆపను: సీఎం రేవంత్

    • దేశానికి తలమానికంగా మూసీని ప్రక్షాళన చేసి చూపిస్తాం: సీఎం రేవంత్

    • హైదరాబాద్‌కు ఎవరొచ్చినా మూసీ చూసేలా చేస్తాం: రేవంత్‌

    • 2034 వరకు మూడురంగుల జెండా ఎగురుతుంది: రేవంత్‌రెడ్డి

  • Jun 28, 2026 19:43 IST

    భద్రాద్రి కొత్తగూడెం: పిడుగుపాటుకు గురై యువకుడి మృతి

    • అశ్వారావుపేట మం. గాడ్రాల గ్రామంలో పిడుగు పడటంతో దావీద్‌(22) అనే యువకుడి మృతి

  • Jun 28, 2026 19:25 IST

    తిరుపతి: సత్యవేడు మండలం చెరివి దగ్గర కారు బోల్తా

    • 9 మందికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

  • Jun 28, 2026 19:17 IST

    అల్లూరి జిల్లా: అరకులోయలో 80 కిలోల గంజాయి స్వాధీనం

    • అరకులోయ ఐటీఐ వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో కారులో పట్టుబడిన 80 కిలోల గంజాయి

    • ఇద్దరి అరెస్ట్, మరో ఇద్దరు నిందితుల పరార్

    • కార్ సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించిన పోలీసులు

  • Jun 28, 2026 19:03 IST

    శ్రీకాకుళం: భావనపాడు సముద్ర తీరం దగ్గర విషాదం

    • తీరంలో గల్లంతై ఇంజినీరింగ్‌ విద్యార్థులు అగస్తిమ, యశ్వంత్‌ మృతి

  • Jun 28, 2026 19:01 IST

    గుంటూరు: పెనుమాక ఘర్షణలో కీలకంగా లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు

    • ఘర్షణలో అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు ఉమామహేశ్వర్‌ రెడ్డి గుర్తింపు

    • గతంలోనూ టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో ఉన్న ఉమామహేశ్వర్‌ రెడ్డి

  • Jun 28, 2026 18:56 IST

    ప.గో.: వెలిగొండ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్‌ సమస్యకు ముగింపు: నిమ్మల

    • అబద్ధాలు, ఫేక్ ప్రచారాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్‌రెడ్డి: నిమ్మల

    • దోపిడీలు, హత్యలు, కిరాతకాలు, అబద్ధాలు, వంచనకు జగన్‌రెడ్డి పేటెంట్‌ హక్కులు తీసుకున్నారు: నిమ్మల

    • ప్రకాశం జిల్లా రైతులను జగన్‌ మోసం చేశారు: మంత్రి నిమ్మల

  • Jun 28, 2026 18:47 IST

    నల్లగొండ: సీఎం రేవంత్‌ సభ ముగిశాక కాంగ్రెస్‌ నేతల ఆందోళన

    • వేదికపై మేయర్‌ చైతన్య శ్రీనివాస్‌ను అడ్డుకున్న సీఎం సెక్యూరిటీ

    • సెక్యూరిటీ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలు, తోపులాట

  • Jun 28, 2026 18:41 IST

    సౌదీలో కూలిన హెలికాప్టర్‌, 14 మంది మృతి

    • చమురు సంస్థ ఆరామ్‌కోకు చెందిన హెలికాప్టర్‌గా గుర్తింపు

  • Jun 28, 2026 18:37 IST

    మహిళల టీ20 ప్రపంచ కప్: ఆస్ట్రేలియాతో కీలక పోరు.. టాస్ నెగ్గిన భారత్

    • బ్యాటింగ్ ఎంచుకున్న హర్మన్ ప్రీత్ కౌర్

    • తొలుత ఫీల్డింగ్ చేయనున్న ఆస్ట్రేలియా

  • Jun 28, 2026 18:10 IST

    ఫ్రాన్స్‌లో కూలిన స్కై డైవింగ్‌ విమానం, 11 మంది మృతి

    • పైలట్‌ సహా ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు ట్రైనర్ల మృతి

  • Jun 28, 2026 18:02 IST

    తాము త్యాగాలు చేశారని BRS నేతలు చెబుతుంటారు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • ఉద్యమం తొలిదశలో తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన నాయకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ: సీఎం

    • లక్ష్మణ్‌ బాపూజీ తర్వాత పదవీ త్యాగం చేసిన నేత కోమటిరెడ్డి: సీఎం

    • BRS త్యాగం అంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్‌: సీఎం రేవంత్‌

  • Jun 28, 2026 18:01 IST

    SIRపై కాంగ్రెస్‌, BRS, MIM ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి?: కిషన్‌రెడ్డి

    • SIR ప్రక్రియలో భాగంగా వస్తున్నది తెలంగాణ ఉద్యోగులే: కిషన్‌రెడ్డి

    • BLOలుగా ఉన్నది తెలంగాణ ఉద్యోగులు కాదా?: కిషన్‌రెడ్డి

    • సీఎం రేవంత్‌కు తెలంగాణ ఉద్యోగులపై నమ్మకం లేదు: కిషన్‌రెడ్డి

  • Jun 28, 2026 18:00 IST

    పూటకో పేరు మార్చుకునే BRS.. కాంగ్రెస్‌ను విమర్శిస్తోంది: కోమటిరెడ్డి

    • నిన్న TRS, ఇవాళ BRS.. రేపు HRS అవుతుంది: మంత్రి కోమటిరెడ్డి

    • త్వరలో హరీశ్‌రావు రాష్ట్ర సమితి(HRS) వస్తుంది: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

    • కేసీఆర్ పదేళ్లపాటు నల్లగొండ జిల్లాను మోసం చేశారు: మంత్రి కోమటిరెడ్డి

    • గత పదేళ్లలో నల్లగొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదు: కోమటిరెడ్డి

  • Jun 28, 2026 17:59 IST

    భారత్-ఎ, శ్రీలంక-ఎ తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ డ్రా

    • ఫలితం తేలేలా కనిపించకపోవడంతో డ్రాకు అంగీకరించిన ఇరు జట్ల కెప్టెన్లు

    • తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ స్కోర్ 452/6, శ్రీలంక-ఎ 330 ఆలౌట్

    • రెండో ఇన్నింగ్స్‌లో భారత్-ఎ స్కోర్ 189/8

    • 312 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక-ఎ స్కోర్ 72/2

    • వర్షం కారణంగా నిలిచిపోయిన ఆట.. డ్రా చేసుకున్న కెప్టెన్లు

  • Jun 28, 2026 17:49 IST

    తెలంగాణకు డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అవసరం ఉంది: కిషన్‌రెడ్డి

    • వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం: కిషన్‌రెడ్డి

    • అందరం కలిసికట్టుగా పోరాడి తెలంగాణలో BJPని అధికారంలోకి తీసుకురావాలి: కిషన్‌రెడ్డి

    • హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది: కిషన్‌రెడ్డి

  • Jun 28, 2026 17:36 IST

    ఐర్లాండ్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన భారత్

    • టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్

    • తొలుత బ్యాటింగ్‌కు దిగనున్న ఐర్లాండ్

    • భారత్ తరఫున ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గె అరంగేట్రం

  • Jun 28, 2026 17:34 IST

    ప్రభుత్వం హ్యామ్‌రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది: మంత్రి ఉత్తమ్

    • ఒకేసారి రూ.13 వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు: ఉత్తమ్

    • దేశంలోనే అత్యధికంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం: ఉత్తమ్

    • ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 81 లక్షల టన్నుల వరి సేకరించాం: ఉత్తమ్

    • ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో రూ.19,300 కోట్లు వేశాం: ఉత్తమ్

    • ధాన్యానికి రూ.20 వేల కోట్లు చెల్లించిన రాష్ట్రం మరొకటి లేదు: ఉత్తమ్

  • Jun 28, 2026 17:23 IST

    అమరావతి: ఏపీలో మరో రెండు రోజులపాటు మేఘావృత వాతావరణం

    • చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం

    • ఉత్తరాంధ్ర తీరం-ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావం

    • రాయలసీమ మీదుగా కొమోరిన్ వరకు మరో ద్రోణి విస్తరణ

    • రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

  • Jun 28, 2026 17:09 IST

    బాపట్ల జిల్లా: రేపల్లె ఓల్డ్ టౌన్ వద్ద రెండు బైక్‌లు ఢీ

    • ఇద్దరి మృతి, మరోకరి కి తీవ్ర గాయాలు

  • Jun 28, 2026 16:57 IST

    అమరావతి: జులై నెల పెన్షన్లకు రూ.2,711.79 కోట్ల నిధులు విడుదల

    • జులై 1న ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

  • Jun 28, 2026 16:53 IST

    హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలకు నిరసనగా ఎంపీ ఈటెల ధర్నా

    • అస్మత్ పేటలో హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఈటెల ధర్నా

    • హైడ్రా భూకబ్జాదారుల భరతం పడతుందనుకున్నాం కానీ తక్కువ కాలంలోనే నిజస్వరూపం బయటపెట్టింది: ఈటెల

    • పేదల ఇళ్లను వారి కళ్లముందే హైడ్రా కూల్చుతోంది: ఎంపీ ఈటెల

    • దమ్ములేక దొంగచాటుగా హైడ్రా కూల్చివేతలు చేస్తోంది: ఈటెల

    • సీఎం రేవంత్‌ అండతో ఇష్టానుసారం కూల్చివేస్తున్నారు: ఈటల

  • Jun 28, 2026 16:39 IST

    తెలంగాణ పర్యటనలో BJP జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్

    • రంగారెడ్డి జిల్లా BJP ఆఫీస్‌ను ప్రారంభించిన నితిన్‌ నబిన్‌

    • పలు జిల్లాల BJP ఆఫీస్‌లను వర్చువల్‌గా ప్రారంభించిన నబిన్‌

    • దేశంలో అనేక రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది: నితిన్‌ నబిన్‌

    • బెంగాల్‌లో కార్యకర్తలు కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చారు: నితిన్ నబిన్

    • బెంగాల్‌ కంటే తెలంగాణలో కార్యకర్తలు రెండింతలు కష్టపడాలి: నితిన్ నబిన్

  • Jun 28, 2026 16:16 IST

    విజయవాడ: 'కాపు చైతన్య రథం' పేరుతో కాపు నేతల సమావేశం

    • కాపులను అడ్డుపెట్టుకుని వైసీపీ కుట్రలు చేస్తోందని నేతల ఆగ్రహం

    • వైసీపీ కుట్రలకు దీటుగా బదులు ఇవ్వాలని నిర్ణయం

    • రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానం

    • కాపుల పట్ల వైసీపీ మొసలికన్నీరు కారుస్తోందని ఆగ్రహం

  • Jun 28, 2026 16:10 IST

    కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

    • ఏపీలో తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు సీఎం లేఖ

    • తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు

    • తోతాపురి మామిడి కొనుగోలుకు రూ.281 కోట్ల ఆర్థికసాయం అందించాలని వినతి

  • Jun 28, 2026 16:02 IST

    నల్లగొండ: కనగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • హ్యామ్‌ రోడ్ల పనుల పైలాన్‌ ఆవిష్కరించిన రేవంత్

    • తెలంగాణ వ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో హ్యామ్‌ రోడ్ల నిర్మాణం

    • 441 రోడ్ల ఉన్నతీకరణకు తెలంగాణ సర్కార్‌ శ్రీకారం

    • నల్లగొండలో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

    • కాసేపట్లో నాగార్జున డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ

  • Jun 28, 2026 15:47 IST

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

    • జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్‌లో వర్షం

  • Jun 28, 2026 15:25 IST

    కాసేపట్లో నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

    • కనగల్‌లో హ్యామ్‌ రోడ్ల పనుల పైలాన్‌ ఆవిష్కరించనున్న రేవంత్

    • తెలంగాణ వ్యాప్తంగా రూ.13 వేల కోట్లతో హ్యామ్‌ రోడ్ల నిర్మాణం

    • 441 రోడ్ల ఉన్నతీకరణకు తెలంగాణ సర్కార్‌ నిర్ణయం

    • నల్లగొండలో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన

    • అనంతరం నాగార్జున డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌లో బహిరంగ సభ

  • Jun 28, 2026 15:25 IST

    ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు

    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్‌ ఉల్లంఘిస్తోంది: ట్రంప్

    • చమురు నౌకలపై మళ్లీ దాడిచేస్తే సహించేదిలేదు: ట్రంప్

    • నేను సైగ చేస్తే.. ఇరాన్‌ ఉనికే ఉండదు: ట్రంప్‌

  • Jun 28, 2026 15:09 IST

    ప్రధాని మోదీకి సీషెల్స్‌ దేశ అత్యున్నత పురస్కారం

    • మోదీకి గార్డియన్‌ ఆప్‌ ద హారిజన్‌ బిరుదు ప్రదానం

    • పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధిలో పురస్కారం

  • Jun 28, 2026 15:04 IST

    కాసేపట్లో హైదరాబాద్‌కు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్

    • మూడు రోజుల పాటు తెలంగాణలో నితిన్ నబిన్ పర్యటన

    • 9 జిల్లాల్లో బీజేపీ ఆఫీసులు వర్చువల్‌గా ప్రారంభం

    • సాయంత్రం GHMC బూత్ కమిటీ నేతలతో సమావేశం

    • రేపు వరంగల్‌లో కార్యకర్తల సదస్సుకు నితిన్ నబిన్

  • Jun 28, 2026 14:58 IST

    అమరావతి: చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన చంద్రబాబు

    • ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి: సీఎం చంద్రబాబు

    • పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత తీసుకోవాలి: చంద్రబాబు

    • పరిస్థితులు మారాయి.. ఇప్పుడు సంతానం భారం కాదు.. సంపద: చంద్రబాబు

  • Jun 28, 2026 14:51 IST

    హైదరాబాద్: ఐటీ కారిడార్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఫుడ్‌సేఫ్టీ దాడులు

    • గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్‌లోని ప్రముఖ హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ బృందాల తనిఖీలు

    • నిబంధనలు ఉల్లంఘించిన పలు రెస్టారెంట్లకు నోటీసులు

    • అపరిశుభ్రత, నాణ్యత లోపాలపై అధికారుల ఆగ్రహం

    • తెరిచి ఉన్న డ్రెయిన్లు, లేబుళ్లు లేని ఆహార పదార్థాల గుర్తింపు

  • Jun 28, 2026 14:42 IST

    ప్రధాని నరేంద్ర మోదీ 135వ మన్‌ కీ బాత్

    • రక్షణ, వైమానిక రంగాల్లో స్వయంసమృద్ధిపై మోదీ హర్షం

    • C-295 విమానాలు భారత్‌లోనే తయారవుతున్నాయి: మోదీ

    • నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గేందుకు ప్రజలు సహకరించాలి: మోదీ

    • పీఎం జీవన్‌జ్యోతి బీమా యోజన ద్వారా పేద ప్రజలకు లబ్ధి: మోదీ

    • పర్యావరణాన్ని పరిరక్షించే పక్షులను రక్షించుకోవాలి: మోదీ

    • మట్టివినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలి: ప్రధాని మోదీ

    • దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉంది: మోదీ

  • Jun 28, 2026 14:30 IST

    తిరుమల: భక్తుల రద్దీతో ప్రొటోకాల్‌ బ్రేక్‌ దర్శన భక్తులకు లఘు దర్శనం

    • రెఫరల్‌, డోనర్స్‌, జనరల్‌ బ్రేక్‌ దర్శన భక్తులకు మహాలఘు దర్శనం కల్పించిన టీటీడీ

  • Jun 28, 2026 14:14 IST

    పల్నాడు: సత్తెనపల్లి మం. ధూళిపాళ్ల దగ్గర రోడ్డు ప్రమాదం

    • రెండు బైక్‌లను ఢీకొన్న మినీ లారీ

    • ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

  • Jun 28, 2026 14:03 IST

    యూపీ: అయోధ్య విరాళాల చోరీ కేసు

    • 8 మంది నిందితుల ఇళ్లపై ఏకకాలంలో పోలీసుల దాడులు

    • ముగ్గురు నిందితుల ఇళ్లకు తాళాలు, స్థానికులను ప్రశ్నిస్తున్న పోలీసులు

  • Jun 28, 2026 13:45 IST

    భద్రాద్రి: కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

    • సమీప ప్రాంతాల్లోని గిరిజనులను అప్రమత్తం చేసిన అటవీ అధికారులు

  • Jun 28, 2026 13:38 IST

    విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

    • రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నిలిచిన వర్షపు నీరు

    • వర్షంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు

    • లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వతో ట్రాఫిక్‌కు అంతరాయం

  • Jun 28, 2026 13:22 IST

    అమరావతి: కేశినేని నాని లేఖపై ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్

    • మాజీ ఎంపీ నాని తెలంగాణ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కౌంటర్: చిన్ని

    • ఈర్ష్య, ద్వేషం, కసి, పగతో నిత్యం రగిలిపోతున్న రెట్టల నాని: చిన్ని

    • ఇంతకుమించి దిగజారవు అనుకున్న ప్రతిసారి ఇంకా ఇంకా దిగజారుతూనే ఉన్నావు: చిన్ని

    • రేవులో తాడి చెట్టు మాదిరి పెరిగావు ఇంగిత జ్ఞానం మాత్రం లేదు: చిన్ని

    • ప్రధానికి, రాష్ట్రపతికి ఇరువురు ముఖ్యమంత్రులకు ఫిర్యాదు చేశావ్: చిన్ని

    • ఇక మిగిలింది ట్రంప్, పుతిన్, కిమ్, KA పాల్ మాత్రమే: చిన్ని

    • నీరెట్టలో 1% కూడా నిజం లేదు.. పక్కకెళ్లి ఆడుకోపో: కేశినేని చిన్ని

  • Jun 28, 2026 12:26 IST

    మన్‌కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ

    • PM జీవన్‌జ్యోతి బీమా యోజనతో పేద ప్రజలకు లబ్ధి: మోదీ

    • క్రీడలను కెరీర్‌గా ఎంచుకుని యువత కష్టపడాలి: ప్రధాని మోదీ

    • బంగారం కొనుగోళ్లు తగ్గించాలన్న పిలుపుతో ప్రజల్లో ఏకీభవించారు: మోదీ

  • Jun 28, 2026 12:20 IST

    నల్లగొండ: గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

    • టైర్ పేలడంతో డివైడర్ దాటి బోల్తా పడిన డి-మ్యాక్స్ వాహనం

    • బోల్తా పడిన వాహనాన్ని ఢీకొన్న రెండు కార్లు

    • వరుసగా మూడు వాహనాలు బోల్తా పడడంతో హైవేపై కలకలం

    • ప్రమాదంలో సుమారు 8 మందికి తీవ్ర గాయాలు

    • క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

    • హైదరాబాద్ వైపు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్

    • ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది

  • Jun 28, 2026 11:46 IST

    22 రాష్ట్రాల్లో విస్తరించిన రుతుపవనాలు

    • ఇవాళ యూపీలోకి నైరుతి ప్రవేశించే ఛాన్స్‌

    • గతేడాది కంటే 9 రోజులు ఆలస్యంగా రుతుపవనాల ఎంట్రీ

    • గత 16 రోజులుగా బిహార్‌ సరిహద్దు వద్దే ఆగిపోయిన రుతుపవనాలు

    • రాజస్థాన్‌ సహా ఏడు రాష్ట్రాల్లో మండుతున్న ఉష్ణోగ్రతలు

  • Jun 28, 2026 11:27 IST

    ఎన్టీఆర్: నందిగామ మండలం కంచలలో ఇసుక అక్రమ రవాణా

    • 3 ఇసుక లారీలు, జేసీబీని స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • అర్ధరాత్రి సమయంలో కొనసాగుతున్న అక్రమ రవాణా

    • ఇసుక తరలిస్తున్న లారీలకు తెలంగాణ రిజిస్ట్రేషన్‌

  • Jun 28, 2026 11:26 IST

    తమిళనాడు: చెన్నై సమీపంలోని వండలూరు కరసంగల్‌ ప్రాంతంలో కాల్పుల కలకలం

    • గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న రౌడీపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Jun 28, 2026 11:25 IST

    భద్రాద్రి: అశ్వాపురం మండలం నెల్లిపాక గోదావరి నది ఒడ్డున క్షుద్రపూజల కలకలం

    • ఇసుకలో గుండం గీసి చుట్టూ మేకులు కొట్టి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు

    • కోళ్లు, మేకను బలి ఇచ్చి అక్కడే వదిలి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

    • భయాందోళనలో గ్రామస్థులు

    • అర్ధరాత్రి సమయంలో పోలీసుల నిఘా పెంచాలని ఆవేదన

  • Jun 28, 2026 11:24 IST

    తమిళనాడు: కల్లకురిచి జిల్లాలో రోడ్డుప్రమాదం

    • అదుపుతప్పి హోర్డింగ్‌ను ఢీకొట్టిన కారు

    • ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

    • మరో ముగ్గురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • ఉళుందూర్‌పేట సమీపంలోని సెంగురిచ్చి దగ్గర ఘటన

  • Jun 28, 2026 11:23 IST

    శ్రీకాకుళం: కవిటి మండలం జమేధారిపుట్టుగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

    • ముగ్గురు మహిళల మృతి

    • ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొట్టడంతో ప్రమాదం

    • మృతులు.. రాపాకపుట్టుగ గ్రామానికి చెందిన నర్తు పద్మ, గుజ్జుపుట్టుగ గ్రామానికి చెందిన మురిపాల భారతి, ఇచ్ఛాపురం ఏఎస్ పేటకు చెందిన మద్దిలి తరినమ్మగా గుర్తింపు

  • Jun 28, 2026 11:16 IST

    అమరావతి: మాజీ ప్రధాని పీవీకి ఏపీ సీఎం చంద్రబాబు ఘన నివాళి

    • క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని అభివృద్ధి పథాన నడిపించిన పీవీ

    • ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన పీవీ: చంద్రబాబు

  • Jun 28, 2026 11:04 IST

    హైదరాబాద్‌: చిక్కడపల్లి ట్రాఫిక్‌ పీఎస్‌ హోంగార్డు వేధింపులు

    • చైతన్యపురిలో కేసు నమోదు

    • వివాహితను ప్రేమ పేరుతో వేధించిన ట్రాఫిక్‌ పీఎస్‌ హోంగార్డు

    • కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 28, 2026 11:04 IST

    అమరావతి: జగన్‌పై మంత్రి నారా లోకేశ్ ఫైర్

    • స్మార్ట్ కిచెన్లతో ప్రభుత్వ బ‌డుల్లో విద్యార్థుల‌కు శుచి, రుచి, శుభ్రత‌తో భోజ‌నం పెడుతుంటే జ‌గ‌న్ ఓర్వలేక‌పోతున్నారు: లోకేశ్

    • స్మార్ట్ కిచెన్లలో ఉన్నవారితోపాటు మ‌హిళ‌లు, పేద‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తుంటే ఉసూరుమంటున్నారు: లోకేశ్

  • Jun 28, 2026 11:02 IST

    నల్లగొండ: సీఎం రేవంత్‌ పర్యటన నేపథ్యంలో గందరగోళం

    • ఫొటో లేకపోవడంతో అధికారులపై మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం

    • ఫ్లెక్సీలతో కనిపించని DCC అధ్యక్షుడు పున్నా కైలాష్‌ ఫొటో

    • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి అంశంలో గతంలో సీఎం సభలో ప్లకార్డులతో హల్‌చల్‌ చేయడంపై పోలీసుల ముందస్తు చర్యలు

  • Jun 28, 2026 10:12 IST

    అమరావతి రైతులు మధ్య చిచ్చు పెట్టాలన్న వైసీపీ కుట్రలు భగ్నం: మంత్రి అనగాని సత్యప్రసాద్

    • పర్యటన పేరుతో వైసీపీ నేతలు దిగజారి వ్యవహరించారు: మంత్రి అనగాని

    • రౌడీలు, గూండాలను వెంటేసుకొచ్చి అమరావతి రైతులపై దాడులు: అనగాని

    • రాజధానిని మార్చేస్తాం అంటున్న వైసీపీకి అమరావతిలో పర్యటించే నైతిక హక్కు లేదు: అనగాని

    • రాజధాని రైతులు కలిసికట్టుగా ప్రతిఘటించి వైసీపీ కుట్రను భగ్నం చేశారు: అనగాని

    • క్షమాపణలు చెప్పిన తర్వాతే అమరావతికి వైసీపీ నేతలు రావాలి: మంత్రి అనగాని

  • Jun 28, 2026 10:11 IST

    అమరావతి: ఎంపీ కేశినేని చిన్నిపై మరోసారి కేశినేని నాని ఆరోపణలు

    • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు నాని వెల్లడి

    • చిన్ని కుటుంబానికి చెందిన బినామీ సంస్థపై భూ కుంభకోణం ఆరోపణలు

    • TGIIC ఐటీ పార్క్‌కు కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణ యత్నం జరుగుతోందని ఫిర్యాదు

    • ED ఫ్రీజ్ ఆదేశాలు, NCLT పరిమితులను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు

    • ఆరోపణలకు సంబంధించి పూర్తి ఆధారాలు సమర్పించినట్లు తెలిపిన కేశినేని నాని

  • Jun 28, 2026 09:57 IST

    హైదరాబాద్: కుల్సుంపుర పీఎస్‌ పరిధిలో ఉద్రిక్తత

    • వినాయక చవితి షెడ్ అంశంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం

    • కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి, పలువురికి గాయాలు

    • ఇంటి ఎదుట ఖాళీ ప్రదేశంలో వినాయకచవితి పేరుతో షెడ్‌ వేసి భూ కబ్జా్కు యత్నిస్తున్నారని బాధితుల ఆరోపణ

    • మహిళలపై స్థానిక యువకుల దాడి, పీఎస్‌లో కేసు నమోదు

  • Jun 28, 2026 09:53 IST

    మాజీ ప్రధాని, భారతరత్న పీవీకి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

    • ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం

    • తెలంగాణ ముద్దుబిడ్డగా గర్వించదగ్గ మహా నేత పీవీ

    • సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని సమర్థంగా నడిపించిన పీవీ: రేవంత్‌

  • Jun 28, 2026 09:18 IST

    హనుమకొండ: కమలాపూర్ మండలం ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం

    • అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

    • కారులోని నలుగురు ప్రయాణికుల్లో ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

    • మృతుడు కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన కళ్లెం శ్రీనివాస్

  • Jun 28, 2026 08:46 IST

    ఏలూరు: చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్‌లో వార్డెన్ దాష్టీకం

    • దుప్పటి అడిగిందన్న కోపంతో 8వ తరగతి విద్యార్థిని అక్షయను హాస్టల్ నుంచి పంపేసిన వార్డెన్

    • రాత్రి పదిగంటల సమయంలో ఘటన

    • అప్పటికప్పుడు వచ్చి విద్యార్థినిని తీసుకువెళ్లిన తల్లిదండ్రులు

  • Jun 28, 2026 08:12 IST

    తిరుమల: శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం

    • టీటీడీకి రూ.27.5 కోట్లతో 25 ఎలక్ట్రిక్‌ బస్సులు ఇచ్చేందుకు అంగీకారం

    • ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

    • బస్సు డ్రైవర్లకు జీతభత్యాలు రిలయన్స్ సంస్థ నుంచే ఇస్తామని తెలిపిన అనంత్‌ అంబానీ

  • Jun 28, 2026 08:11 IST

    హైదరాబాద్‌: మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న వ్యక్తి అరెస్ట్

    • నాగతేజ అలియాస్ నానిని అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు

    • స్నాప్‌చాట్‌లో మహిళలను పరిచయం చేసుకుంటున్న నిందితుడు

    • మహిళలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నాగతేజ

  • Jun 28, 2026 07:55 IST

    నేడు దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం

    • ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు

  • Jun 28, 2026 06:53 IST

    జపాన్‌లో భూ ప్రకంపనలు

    • జపాన్ ఈశాన్య తీర ప్రాంతంలో భూ ప్రకంపనలు

    • భూకంప తీవ్రత 6.1గా నమోదు

  • Jun 28, 2026 06:53 IST

    మేడ్చల్‌: బోడుప్పల్‌ దేవేందర్‌నగర్‌లో దారుణం

    • గృహ ప్రవేశం జరిగిన ఇంటిపై దుండగుల దాడి

    • ఇంట్లోకి చొరబడి మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడి

    • బంధువుల్లో పలువురికి గాయాలు

  • Jun 28, 2026 06:52 IST

    నేడు నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

    • మధ్యాహ్నం 3.35 గంటలకు కనగల్‌ AMC మార్కెట్‌ యార్డు ప్రాంగణంలో హ్యామ్‌ రోడ్లకు శంకుస్థాపన పైలాన్‌ ఆవిష్కరించనున్న రేవంత్‌

    • సాయంత్రం 4 గంటలకు నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌కు రేవంత్‌

    • రూ.83 కోట్లతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-1కు శంకుస్థాపన చేయనున్న రేవంత్‌

    • అనంతరం సీఎం రేవంత్‌ బహిరంగ సభ

  • Jun 28, 2026 06:50 IST

    నేడు తెలంగాణకు బీజీపీ చీఫ్‌ నితిన్ నబీన్‌

    • తెలంగాణలో నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన

    • బీజేపీ జిల్లాల ఆఫీసులు ప్రారంభించనున్న నబీన్‌

    • సాయంత్రం GHMC బూత్‌ కమిటీ నేతలతో సమావేశం

    • రేపు వరంగల్‌లో కార్యకర్తల సదస్సుకు నితిన్‌ నబీన్‌

  • Jun 28, 2026 06:50 IST

    ఏపీ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావం

    • బంగాళాఖాతం, దక్షిణ కోస్తాపై ఉపరితల ఆవర్తనం

    • నేడు శ్రీకాకుళం, ఎన్టీఆర్‌, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు

  • Jun 28, 2026 06:49 IST

    వెనెజువెలాలో పెరుగుతున్న భూకంప మృతుల సంఖ్య

    • 1,430కి చేరిన భూకంప మృతుల సంఖ్య

    • కొనసాగుతున్న సహాయక చర్యలు

  • Jun 28, 2026 06:48 IST

    ఇరాన్‌లోని కీలక స్థావరాలపై రెండో రోజు అమెరికా దాడులు

    • ట్రంప్ ఆదేశాలతో దాడులు చేసినట్లు US కంట్రోల్‌ కమాండ్‌ వెల్లడి

    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌

    • వాణిజ్య నౌకలపై ఇరాన్ వరుస దాడులు

    • ఇరాన్ దాడులకు అమెరికా ప్రతిదాడులు

    • హోర్ముజ్‌ జలసంధిలో చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ డ్రోన్ దాడి

    • ఇరాన్‌ నిఘా, వాయు రక్షణ స్థావరాలపై అమెరికా దాడులు

  • Jun 28, 2026 06:47 IST

    ఫిఫా ప్రపంచకప్‌.. నేటి మ్యాచ్‌లు..

    • అర్జెంటీనా Vs జోర్డాన్‌

    • అల్జీరియా Vs ఆస్ట్రియా

    • దక్షిణాఫ్రికా Vs కెనడా

  • Jun 28, 2026 06:47 IST

    నేడు మాజీ ప్రధాని పీవీ 105వ జయంతి

    • ఢిల్లీలోని ప్రధాని మ్యూజియంలో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు

  • Jun 28, 2026 06:43 IST

    నేడు నెల్లూరు స్వర్ణాల చెరువులో భక్తుల రొట్టెల మార్పిడి

    • భారీ సంఖ్యలో తరలిరానున్న భక్తులు