-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 25th June 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jun 25 , 2026 | 07:14 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jun 25, 2026 21:56 IST
అనంతపురంలో గాయపడిన చిరుతకు సకాలంలో సంరక్షణ
కల్యాణదుర్గం రేంజ్‌లో మలపనగుడిలో అపస్మారక స్థితిలో చిరుత
తిరుపతి SV జూకు చిరుత తరలింపు
-
Jun 25, 2026 21:35 IST
వైసీపీ నేతలు రాష్ట్రంలో అల్లర్లకు పాల్పుడుతున్నారు: కొల్లు రవీంద్ర
ఇలాంటి ఘటనలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు: కొల్లు రవీంద్ర
అరాచక శక్తులను జగన్ ప్రోత్సహిస్తున్నాడు: మంత్రి కొల్లు రవీంద్ర
-
Jun 25, 2026 21:14 IST
ముడు రోజుల పాటు EPFO పోర్టల్ మూసివేత
ATM ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు EPFO పోర్టల్‌లో మార్పులు చేస్తున్న కేంద్రం
-
Jun 25, 2026 20:31 IST
ఎర్రచందనం స్మగ్లర్లను వదలొద్దు: 'X'లో డిప్యూటీ సీఎం పవన్
అటవీ సంపద పరిరక్షణలో రాజీలేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
70 % ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించాం: డిప్యూటీ సీఎం పవన్
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసిన టాస్క్‌ఫోర్స్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు
-
Jun 25, 2026 20:26 IST
దేశవ్యాప్తంగా ఏడాది B.Ed కోర్సుకు NCTE ఆమోదం
2026-27 నుంచి అమలుకు సన్నాహాలు
Master's Degree పూర్తి చేసిన వారితో పాటు నాలుగేళ్ల Undergraduate Degree చేసినవారికీ అవకాశం
-
Jun 25, 2026 20:16 IST
అమరావతి: ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష
అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి లోకేశ్
ఇప్పటివరకూ వివిధ యూనివర్సిటీలకు 1.89 లక్షల దరఖాస్తులు: లోకేశ్
రాష్ట్రంలో స్కిల్ వర్సిటీల ఏర్పాటుకు విధివిధానాల రూపకల్పన: లోకేశ్
జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.30లక్షలమందికి ఉద్యోగాలు: లోకేశ్
పీఎం సేతు పథకం కింద ఏపీకి కేంద్రం 5 క్లస్టర్లు మంజూరు: మంత్రి లోకేశ్
-
Jun 25, 2026 20:06 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో అమిత్ షా భేటీ
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ అంటూ ఊహాగానాలు
రెండు రోజుల క్రితమే రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ పూర్తిచేసేలా మోదీ-అమిత్ షా కసరత్తు
-
Jun 25, 2026 20:06 IST
ఆసిఫాబాద్: రెబ్బెన బాలికల గురుకులం జూనియర్ కాలేజ్ సెకండియర్ బాలిక అదృశ్యం
గోడదూకి బయటికెళ్లినట్లు CCTV ఫుటేజ్‌లో గుర్తింపు
పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపాల్
-
Jun 25, 2026 20:05 IST
హైదరాబాద్: గురుకులాల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల పేరు మార్పు
TGWCW MJPREISగా సంస్థ పేరు మార్చేందుకు ఆమోదం
గురుకులాలకు డెస్క్‌టాప్ కంప్యూటర్ల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్
బీసీ గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Jun 25, 2026 19:37 IST
సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ఎజెండా: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
హాస్టళ్లు, గురుకులాల్లో మరమ్మతులు నెల రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశం
2023 నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని సూచన
-
Jun 25, 2026 19:36 IST
ఏపీ అభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
కొత్త రాజ్యసభ సభ్యులకు రామ్మోహన్ నాయుడు సన్మానం
కేంద్రమంత్రి రామ్మోహన్‌ను కలిసిన ఎంపీలు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్
-
Jun 25, 2026 19:35 IST
'SIR'పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటన
'SIR'అనేది కేంద్ర ఎన్నికల సంఘం కార్యక్రమం
'SIR' రాజ్యాంగ, చట్టబద్ధమైన కార్యక్రమం: కిషన్‌రెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికల జాబితా సవరణ
'SIR'ను రాజకీయ కోణంలో చూడకూడదు: కిషన్‌రెడ్డి
'SIR'పై కొన్ని రాజకీయ పక్షాలు దుష్ప్రచారం: కిషన్‌రెడ్డి
-
Jun 25, 2026 19:27 IST
ఎల్‌పీజీపై కేంద్రం కీలక నిర్ణయం
దేశీయేతర ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాపై అన్ని రకాల రంగాల పరిమితుల ఎత్తివేత
పశ్చిమాసియా సంక్షోభానికి ముందు నాటి స్థాయికి.. ప్యాక్డ్ LPG సరఫరాను పునరుద్ధరించిన ప్రభుత్వం
గతంలో నిలిపివేసిన బల్క్ LPG సరఫరాపై ఆంక్షల సడలింపు
సంక్షోభానికి ముందు నాటి వినియోగంలో 50% సరఫరాకు అనుమతి
-
Jun 25, 2026 19:07 IST
పాస్‌పోర్ట్ ఫీజులను పెంచిన కేంద్రం
60 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500కి పెంపు
60 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్‌కి రూ.6 వేలు
36 పేజీల పాస్‌పోర్ట్ ఫీజు రూ.2,500కి పెంపు
36 పేజీల తత్కాల్ పాస్‌పోర్ట్‌కి రూ.5 వేలు
పెంచిన ఫీజులు జులై 1 నుంచి అమలు
-
Jun 25, 2026 18:37 IST
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆగ్రహం
మహిళలను కించపరిచే వ్యాఖ్యలు సమర్థనీయం కాదు
హోం మంత్రి అనితకు గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి: PVN మాధవ్
-
Jun 25, 2026 18:27 IST
హైదరాబాద్: చందానగర్–లింగంపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
సీలింగ్, పైప్‌లైన్లపై జిడ్డు పేరుకుపోయినట్లు గుర్తింపు
గడువు ముగిసిన మటన్‌ను సీజ్ చేసిన అధికారులు
లేబుల్ లేని పెరుగును గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
మెడికల్ ఫిట్‌నెస్ రికార్డులు అందుబాటులో లేవని గుర్తింపు
-
Jun 25, 2026 18:25 IST
జగన్ ట్వీట్‌కు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్
జగన్ దుష్ప్రచారం చేసినా నంబర్లు ఎప్పుడూ నిజాలే చెబుతాయి: మంత్రి కొండపల్లి
జగన్ అబద్ధాలు చెప్పినా చరిత్ర ఎప్పుడూ నిజమే : మంత్రి కొండపల్లి
-
Jun 25, 2026 18:23 IST
నెల్లూరు ఆర్టీసీ మెయిన్ బస్టాండ్‌లో ప్రమాదం
బ్రేక్ ఫెయిలై అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
11వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ దగ్గర ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు
వృద్దుడు, ఇద్దరు మహిళలకి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం
-
Jun 25, 2026 18:20 IST
నేను గుంపు మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి
ఈ గుంపు అంతా నాదే.. వీళ్లకు నేనే మేస్త్రీ: సీఎం రేవంత్
కార్మికులు, కర్షకులకు నేను మేస్త్రీనే: రేవంత్
నేను దొరను కాను.. నాకు గడీలు లేవు: సీఎం రేవంత్ రెడ్డి
-
Jun 25, 2026 18:04 IST
హైదరాబాద్: ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమా పథకానికి శ్రీకారం
సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో MoUలపై సంతకాలు
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకూ వర్తింపు
-
Jun 25, 2026 18:04 IST
హైదరాబాద్: గృహనిర్మాణ శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష
CURE పరిధిలో 10 అంతస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి
ఈ ఏడాది లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: పొంగులేటి
తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికీ 500 ఇళ్లు: పొంగులేటి
-
Jun 25, 2026 17:14 IST
మేడ్చల్: శామీర్‌పేట్ MRO సుచరిత నివాసంలో ACB సోదాలు
MRO సుచరితపై అక్రమాస్తుల కేసులో మరోసారి ACB తనిఖీలు
సుచరిత నివాసం సహా బంధువుల ఇళ్లలోనూ సోదాలు
రైతుల నుంచి రూ.30 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో ఇప్పటికే MRO సుచరిత అరెస్టు
-
Jun 25, 2026 17:08 IST
నెల్లూరు: సోమశిల డ్యాం దగ్గర మాజీ మంత్రి కాకాణి ఓవరాక్షన్
చలో సోమశిల పేరుతో డ్యాం దగ్గరకు వెళ్లిన వైసీపీ నేతలు
డ్యాం సిబ్బంది గేటు తెరవకపోవడంతో కాకాణి చిందులు
తమాషాలు చేస్తున్నారా.. అంటూ డ్యాం సిబ్బందిపై ఆగ్రహం
సోమశిల డ్యాం సందర్శనలో నిబంధనలు ఉల్లంఘించిన కాకాణి
-
Jun 25, 2026 17:07 IST
అమరావతి: IAS శ్రీలక్ష్మికి పోస్టింగ్
GAD స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి
శంషేర్‌సింగ్ రావత్ నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు శ్రీలక్ష్మికి అప్పగింత
-
Jun 25, 2026 17:06 IST
ఢిల్లీ నుంచి పోటీ చేస్తే 10 లక్షల ఓట్లు వస్తాయన్నారు: మెలోని
2023లో భారత్ పర్యటన సందర్భంగా ఎదురైన విశేషాలను గుర్తుచేసుకున్న ఇటలీ ప్రధాని
తనకు స్వాగతం పలికేందుకు రోడ్లకు ఇరువైపులా భారీగా పోస్టర్లు ఏర్పాటు చేశారని వెల్లడి
ఆ అనుభవాలను తాజాగా విడుదలైన పుస్తకంలో ప్రస్తావించిన మెలోని
-
Jun 25, 2026 16:33 IST
హైదరాబాద్ : తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఈ నెల 5 నుంచి 12 వరకు జరిగిన పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 31,542 మంది విద్యార్థుల హాజరు
-
Jun 25, 2026 16:29 IST
అమరావతి: రూ.9.86 కోట్లతో 16 వ్యసన విముక్తి కేంద్రాల అభివృద్ధి: మంత్రి సత్యకుమార్
విశాఖ, విజయవాడ, కడపలోని కేంద్రాలను 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ'లుగా గుర్తింపు
జిల్లాల వారీగా ఖాళీల భర్తీకి చర్యలు: మంత్రి సత్యకుమార్ యాదవ్
-
Jun 25, 2026 16:26 IST
ఫిరాయింపు MLAల కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ
10 మంది BRS MLAలు పార్టీ మారలేదని గతంలో స్పీకర్ తీర్పు
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలువురు MLAల పిటిషన్
అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు కాపీలను అందజేయాలని ఆదేశం
-
Jun 25, 2026 16:25 IST
ప్రధాని మోదీతో అమెజాన్ CEO ఆండీ జెస్సీ భేటీ
భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనున్న అమెజాన్
2030 నాటికి అమెజాన్ 48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
భారత్‌లో Ai, క్లౌడ్ ఇన్‌ఫ్రా విస్తరణకు 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ CEO
-
Jun 25, 2026 16:08 IST
టీజీ లాసెట్, టీజీ పీజీఎల్‌సెట్-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
జూన్ 26న కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
జులై 5 నుంచి 10 వరకు LAWCET అభ్యర్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
జులై 16 నుంచి 19 వరకు LAWCET వెబ్ ఆప్షన్ల నమోదు
జులై 24న LAWCET సీట్ల కేటాయింపు
జులై 25 నుంచి 28 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
జులై 27 నుంచి 31 వరకు PGLCET అభ్యర్థుల రిజిస్ట్రేషన్
-
Jun 25, 2026 15:45 IST
కర్నూలు: మాధవరం చేరుకున్న సీఎం చంద్రబాబు
పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Jun 25, 2026 15:40 IST
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
109 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
34 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jun 25, 2026 15:31 IST
ఏపీ లిక్కర్ రవాణా కేసుపై నాంపల్లి కోర్టు విచారణ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితుల విచారణ
వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌ను చంచల్‌గూడ జైలు నుంచి హాజరుపరిచిన ED
తదుపరి విచారణ జులై 9కి వాయిదా
-
Jun 25, 2026 15:22 IST
చెన్నై: DMKకు మరో షాక్
విజయ్ TVK పార్టీతో జతకట్టనున్న వైగో
ఈ నెల 27న విజయ్‌తో భేటీ కానున్న వైగో
ఇప్పటికే TVK నేతలతో MDMK నేతల చర్చలు
-
Jun 25, 2026 15:21 IST
మంచిర్యాల: లక్సెట్టిపేట పట్టణంలో ప్రమాదం
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొని మహిళ మృతి
మృతురాలు వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఎల్గం దేవక్క (60)గా గుర్తింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 25, 2026 15:19 IST
కామారెడ్డి: భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఒకరి మృతి, మరో నలుగురికి గాయాలు
మృతుడు బస్వాపూర్‌కు చెందిన రమేష్ గౌడ్‌గా గుర్తింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 25, 2026 15:17 IST
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం
మొదటి అంతస్తులో ఎగిసిపడుతున్న మంటలు
విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు
మంటలను అదుపుచేస్తున్న ఫైర్ సిబ్బంది
-
Jun 25, 2026 15:17 IST
ఢిల్లీ: SIRపై BLAలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ చామల
బిహార్, తమిళనాడు, బెంగాల్‌లో భారీగా ఓట్లు తొలగించారు
తెలంగాణలో బిల్లా, రంగాలు SIRపై చర్చించట్లేదు: చామల
BJPతో BRSకు ఓ అవగాహన ఒప్పందం ఉంది: ఎంపీ చామల
అందుకే SIRపై BRS నేతలు మాట్లాడటం లేదు: ఎంపీ చామల
-
Jun 25, 2026 14:51 IST
నిజామాబాద్: జిల్లా వ్యాప్తంగా చల్లబడ్డ వాతావరణం
పలు మండలాల్లో కురుస్తున్న వర్షం
నగరంలో సుమారు గంట నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షం
తొలకరి వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు
-
Jun 25, 2026 14:42 IST
విజయవాడ: CI నాగరాజును కస్టడీ కోరిన సిట్
12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్
నాగరాజు కస్టడీ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా
సాయికృష్ణ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో నాగరాజు
-
Jun 25, 2026 14:41 IST
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
ఇటీవల పాస్‌పోర్ట్‌తో పౌరసత్వం రాదన్న విదేశాంగ శాఖ
విదేశాంగ శాఖ ప్రకటనపై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
త్వరలో BJP సభ్యత్వం ఉన్నవారికే పౌరసత్వం: అసదుద్దీన్
కేంద్రం నిర్ణయాలతో సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు: అసదుద్దీన్
-
Jun 25, 2026 14:38 IST
ప్రైవేట్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో ఊరట
G.O.9లోని మార్గదర్శకాలపై టీజీ హైకోర్టు స్టే
ఈ నెల 30 వరకు స్టే విధించిన హైకోర్టు
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు పలు ప్రశ్నలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎంత బడ్జెట్ కేటాయించారు?: హైకోర్టు
బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఫీజులు వసూలు చేయొద్దనడం సరికాదు: హైకోర్టు
-
Jun 25, 2026 14:02 IST
కర్ణాటక: తుంగభద్ర తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: సీఎం చంద్రబాబు
తుంగభద్ర డ్యామ్‌కు 70 ఏళ్ల చరిత్ర ఉంది : సీఎం చంద్రబాబు
ప్రాజెక్టు నిర్వహణ బాగుంటేనే భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుంది: సీఎం చంద్రబాబు
6 నెలల్లో 33 గేట్ల పునరుద్ధరణ చేసిన అందరికీ ధన్యవాదాలు: సీఎం
నీటి సమస్యల పరిష్కారానికి సీఆర్ పాటిల్ కృషి చేస్తున్నారు: సీఎం
-
Jun 25, 2026 14:00 IST
కర్ణాటక: కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో చరిత్రాత్మక తీర్మానం చేశాం: సీఎం డీకే శివకుమార్
3 రాష్ట్రాల రైతుల కోసం తీసుకున్న నిర్ణయం ఓ చరిత్ర: డీకే
చంద్రబాబు, రేవంత్, నేను చరిత్ర సృష్టిస్తాం: డీకే
అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తాం: డీకే
3 రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తాం: డీకే
-
Jun 25, 2026 13:52 IST
కర్ణాటక: తుంగభద్ర డ్యామ్ 33 గేట్ల పునరుద్ధరణ పనులు చరిత్రలో నిలుస్తాయి: సీఎం రేవంత్
మనందరి కష్టాలు, సమస్యలు తెలిసిన నాయకుడు చంద్రబాబు: సీఎం రేవంత్
కర్నూలు, అనంతపురం రైతుల సమస్యలు నాకు తెలుసు: సీఎం రేవంత్
పాలమూరు వలసల గురించి నాకు అవగాహన ఉంది: సీఎం రేవంత్
మూడు రాష్ట్రాల కరువు జిల్లాలకు ఇది పరిష్కారం చూపబోతోంది: సీఎం రేవంత్
-
Jun 25, 2026 13:09 IST
కర్ణాటక: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ
భేటిలో పాల్గొన్న కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
హాజరైన మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు
ఏపీ, తెలంగాణ, కర్ణాటక నీటి సమస్యలపై సమావేశంలో చర్చ

-
Jun 25, 2026 13:00 IST
హైదరాబాద్: గాంధీభవన్ ముట్టడికి బంజారా నేతల యత్నం
బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్
ఇచ్చిన హామీలు నెరవేర్చాకే ఎమ్మెల్యేల బస్సు యాత్ర చేయాలని డిమాండ్
ఆందోళనకారులను అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
-
Jun 25, 2026 13:00 IST
కర్ణాటక: తుంగభద్ర డ్యాం కొత్త స్పీల్ వే గేట్లు ప్రారంభం
గేట్లు ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీఆర్ పాటిల్
రూ.51 కోట్లతో 33 కొత్త స్పీల్ వే గేట్లు ఏర్పాటు చేసిన ఏపీ, కర్ణాటక
హోస్‌పేట్‌లో బహిరంగ సభ ప్రదేశానికి బయల్దేరిన ముగ్గురు సీఎంలు, కేంద్రమంత్రి
కాసేపట్లో బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నిమ్మల, పయ్యావుల కేశవ్
-
Jun 25, 2026 12:06 IST
విశాఖ షీలానగర్ పోర్ట్ రోడ్‌లో రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనదారుడి మృతి
ఘటనాస్థలానికి చేరుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు
ప్రమాదంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jun 25, 2026 11:59 IST
కృష్ణా: కానూరులో టీడీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలు
ఘటనాస్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ శ్రేణులు
కంకర, ఇసుక, సిమెంట్‌తో వెంటనే దిమ్మె పునర్నిర్మాణం
కార్యకర్తలు, శ్రామికులతో కలిసి పనుల్లో పాల్గొన్న బోడే ప్రసాద్
ఇరు వర్గాల నినాదాలతో ఉద్రిక్తత
భారీగా మొహరించిన పోలీసు బలగాలు
-
Jun 25, 2026 11:46 IST
ఢిల్లీ: సుప్రీంకోర్టుకు చేరిన అయోధ్య రామాలయ ఆర్థిక అవకతవకల అంశం
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ పిటిషన్
అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
జూన్ 29న పిటిషన్‌ను మెన్షన్ చేయాలని న్యాయవాదికి సూచన
-
Jun 25, 2026 11:31 IST
నెల్లూరు: రేపటి నుంచి బారాషహీద్ దర్గాలో రొట్టెల పండుగ
ఇప్పటికే భారీగా తరలివస్తున్న భక్తులు
ఈ ఏడాది 15–20 లక్షల మంది హాజరవుతారని అంచనా
దర్గా, స్వర్ణాల చెరువు వద్ద విస్తృత ఏర్పాట్లు
సీసీ, డ్రోన్ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
-
Jun 25, 2026 11:29 IST
ఫిఫా ప్రపంచ కప్2026 నుంచి చెకియా ఔట్
మెక్సికో చేతిలో 3-0 తేడాతో ఓటమి
-
Jun 25, 2026 11:28 IST
ఫిఫా ప్రపంచ కప్: నాకౌట్‌కు చేరిన సౌతాఫ్రికా
దక్షిణ కొరియాను 1-0 తేడాతో ఓడించిన సౌతాఫ్రికా
గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే నాకౌట్‌కు చేరిన మెక్సికో
-
Jun 25, 2026 11:25 IST
వెనెజువెలాలో శతాబ్దంలోనే అతిపెద్ద భూకంపం
7.5 తీవ్రతతో దేశ చరిత్రలో రెండో అతిపెద్ద భూకంపం నమోదు
40 సెకన్ల ముందు 7.2 తీవ్రతతో భూకంపం
1900లో నమోదైన 7.7 తీవ్రత భూకంపమే ఇప్పటికీ అతిపెద్దది
ఈ రెండు భూకంపాల కేంద్రాలు 1900 నాటి భూకంప కేంద్రానికి సమీపంలో నమోదు
-
Jun 25, 2026 11:19 IST
ముంబై: అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం
ప్రధాన నిందితులు సియా, చేతన్‌కు వైద్య పరీక్షలు
నిన్న 5గంటల పాటు ఇద్దరిని ప్రశ్నించిన పోలీసులు
-
Jun 25, 2026 11:18 IST
కర్నూలులో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
అద్దె ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందిన గాడిబండ బోయజు (24)
మృతుడు బోయజు గోనెగొండ్ల మండలం ఆల్వాల గ్రామ వాసిగా గుర్తింపు
గర్ల్‌ఫ్రెండ్ ఫోన్‌లో మాట్లాడటం లేదని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం
ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jun 25, 2026 11:01 IST
డిజిటల్ అరెస్ట్ ముఠాలపై దేశవ్యాప్తంగా CBI తనిఖీలు
ఆపరేషన్ చక్ర-IV పేరుతో 16 రాష్ట్రాల్లో సోదాలు
చెన్నై, కోల్‌కతాలో ఇద్దరు కీలక నిందితుల అరెస్ట్
రూ.2కోట్ల నేరపూరిత లావాదేవీలు గుర్తించిన CBI
సుప్రీంకోర్టు పేరుతో వెలుగులోకి నకిలీ డొమైన్
-
Jun 25, 2026 11:00 IST
అమెరికా: కాలిఫోర్నియాలోనూ భూకంపం
రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.6గా నమోదు
-
Jun 25, 2026 10:59 IST
పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్
తన ఫ్రెండ్ అక్షితను వివాహం చేసుకున్న ఆకాశ్ దీప్
వారణాసిలో ఘనంగా జరిగిన పెళ్లి
వివాహానికి హాజరైన పలువురు ప్రముఖులు
-
Jun 25, 2026 10:43 IST
హోర్ముజ్‌లో కొత్త మార్గాన్ని మేం అంగీకరించం: ఇరాన్
నౌకలు IRGC గుర్తించిన మార్గాల్లోనే వెళ్లాలి: ఇరాన్
-
Jun 25, 2026 10:42 IST
నల్లగొండ: నలుగురి హత్య కేసులో వీడిన మిస్టరీ
సుల్తాన్, హసీనా కుటుంబ నేపథ్యంలోనే సుపారీ గ్యాంగ్‌తో హత్య
నిందితులంతా పాతబస్తీ రౌడీషీటర్స్
పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
-
Jun 25, 2026 10:41 IST
వెనెజువెలా భూకంపాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వెనెజువెలాకు సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించిన ట్రంప్
ప్రభుత్వ శాఖలన్నింటినీ అత్యవసర సన్నద్ధతలో ఉండాలని ఆదేశించిన ట్రంప్
వెనెజువెలా ప్రజలకు అండగా ఉంటామని ట్రంప్ హామీ
భూకంప నష్టంపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు
-
Jun 25, 2026 10:38 IST
వెనెజువెలా భూకంప విధ్వంసంపై ఎక్స్‌లో ప్రధాని మోదీ పోస్ట్
భారత ప్రజల తరఫున వెనెజువెలాకు సానుభూతి ప్రకటించిన మోదీ
అన్నివిధాలా వెనెజువెలాకు సాయం అందిస్తాం: ప్రధాని మోదీ
భూకంప మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: మోదీ
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: ఎక్స్‌లో మోదీ
-
Jun 25, 2026 10:36 IST
తొలిసారి 70 డాలర్ల దిగువకు ముడి చమురు
69 డాలర్ల దగ్గర WTI, 72 డాలర్ల దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడింగ్
-
Jun 25, 2026 10:34 IST
అమరావతి: సినీ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తాం: మంత్రి లోకేశ్
AI టెక్నాలజీతో సినిమా పరిశ్రమను ఉన్నతికి తీసుకెళ్తాం: మంత్రి
రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు అమరావతి నుంచే ప్రారంభం కావాలి: లోకేశ్
సినీ పరిశ్రమకు సంపూర్ణ సహకారం అందిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్
-
Jun 25, 2026 10:33 IST
హైదరాబాద్: కళాశాల ఆవరణలోనే ప్రసవించిన విద్యార్థిని
జన్మనిచ్చిన అనంతరం చిన్నారిని చంపినట్లు ఆరోపణ
కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు
-
Jun 25, 2026 10:33 IST
ఏపీలో పెద్ద సినిమాకు క్లాప్ కొట్టి 20 ఏళ్లు అయింది: నందమూరి బాలకృష్ణ
సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు: బాలకృష్ణ
ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సీఎం, డిప్యూటీ సీఎం కృషి: బాలయ్య
పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండూ ముడిపడి ఉన్నాయి: బాలకృష్ణ
-
Jun 25, 2026 10:32 IST
అమరావతి: నందమూరి బాలకృష్ణ 'NBK 112' గ్రాండ్ లాంచ్
ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేశ్
క్లాప్ కొట్టి, కెమెరా స్విచ్చాన్ చేసిన మంత్రులు
ముహూర్తపు షాట్‌కు యాక్షన్ చెప్పిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల
-
Jun 25, 2026 10:25 IST
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,130
22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,450
హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,30,000
-
Jun 25, 2026 10:00 IST
హైదరాబాద్ నుంచి కర్ణాటక బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్ వెంట మంత్రులు ఉత్తమ్, జూపల్లి, ఉన్నతాధికారులు
-
Jun 25, 2026 09:40 IST
హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌లో కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
కండ్లకోయలో చెట్టు కొమ్మలు కట్ చేస్తుండగా ప్రమాదం
కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిన జాగారామ్
ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పేట్ బషీరాబాద్ పోలీసులు
మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలింపు, కేసు నమోదు
-
Jun 25, 2026 09:32 IST
లాభాల్లో దేశీయ సూచీలు..
460 పాయింట్ల లాభంతో సెన్సెక్స్..
140 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ..
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.28
-
Jun 25, 2026 08:59 IST
వెనెజువెలాను వణికించిన వరుస భూప్రకంపనలు
10 వేల నుంచి లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్న USGS
నష్టం తీవ్రతను అంచనా వేస్తున్న అధికారులు
సహాయక చర్యలు ముమ్మరం చేసిన వెనెజువెలా ప్రభుత్వం
-
Jun 25, 2026 08:48 IST
నంద్యాల: ఫకీరు వేషంలో వచ్చి ఇంట్లో దొంగతనం చేసిన దుండగుడు
సౌరదిన్నెలో మహిళను మాయమాటలతో నమ్మించిన ఫకీరు
పూజలు చేయాలని చెప్పి బయటకు పంపినట్లు ఆరోపణ
మహిళ ఇంట్లోకి చొరబడి రూ.50 వేల నగదు అపహరణ
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కాశింభీ
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jun 25, 2026 08:45 IST
బిల్‌గేట్స్ సంచలన వ్యాఖ్యలు
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలతో తనను బ్లాక్‌మెయిల్ చేయాలని ఎప్‌స్టీన్ ఆలోచించి ఉండొచ్చు: బిల్‌గేట్స్
అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట గోప్య విచారణలో అంగీకరించిన గేట్స్
ముగ్గురు మహిళలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడించిన గేట్స్
వారిలో ఇద్దరి గురించి ఎప్‌స్టీన్‌కు తెలుసని వెల్లడి
నన్ను బ్లాక్‌మెయిల్ చేయలేదు, కానీ అలా చేయాలని ఆలోచించి ఉండొచ్చు: గేట్స్

-
Jun 25, 2026 08:41 IST
నేడు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జీవిత బీమా పథకం ప్రారంభం
సా. 5 గంటలకు రవీంద్రభారతిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రూ.1.2కోట్ల వరకు ఉచిత బీమా రక్షణ
-
Jun 25, 2026 08:41 IST
ఇరాన్‌పై యుద్ధానికి మద్దతు ఇవ్వని నాటో సభ్య దేశాలపై ట్రంప్ అసంతృప్తి
నాటో చీఫ్ మార్క్ రుట్టేతో సమావేశంలో వ్యాఖ్యలు
‘మాకు సహాయం అవసరం లేదు, కానీ మద్దతు తెలిపి ఉంటే బాగుండేది’ అని ట్రంప్ వ్యాఖ్య
ఇరాన్‌ను తొలి వారంలోనే పూర్తిగా దెబ్బతీశామని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు
వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ వ్యాఖ్యలు

-
Jun 25, 2026 08:36 IST
వెనెజువెలాలో భూకంప దృశ్యాలు..
-
Jun 25, 2026 08:35 IST
వెనెజువెలాలో భూకంప దృశ్యాలు..
-
Jun 25, 2026 08:33 IST
వరుస భూకంపాలతో వెనెజువెలాలో భారీ నష్టం
తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలా ప్రధాన విమానాశ్రయం
సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం తాత్కాలిక మూసివేత
విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన వెనెజువెలా ప్రభుత్వం
ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసిన తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్
దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆస్పత్రులకు హాజరు కావాలని ఆదేశాలు
క్షతగాత్రులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం
-
Jun 25, 2026 08:16 IST
కాకినాడ: పెద్దాపురం సబ్‌జైలులో కలకలం.. రిమాండ్ ఖైదీ పరారీ
బైక్ దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న పోతుల సుందరం అదృశ్యం
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఖైదీని పట్టుకున్న పోలీసులు
జైలు సిబ్బంది సహకారంతోనే పరారయ్యాడా? అనే అనుమానాలు
ఖైదీ జైలు క్యాంటీన్‌లోనే దాక్కున్నాడని అధికారుల వివరణ
ఘటనపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్న అధికారులు
ఖైదీ జైలు నుంచి ఎలా బయటకు వెళ్లాడన్న దానిపై విచారణ కొనసాగుతోంది
-
Jun 25, 2026 07:22 IST
నేటి నుంచి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల బస్సుయాత్ర
బస్సు యాత్రను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
మూడు దఫాలుగా కొనసాగనున్న బస్సు యాత్ర
గాంధీభవన్ నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర
-
Jun 25, 2026 07:21 IST
విశాఖ: NAD ఫ్లైఓవర్‌పై తప్పిన ప్రమాదం
గాజువాక నుంచి వస్తున్న భారీ కంటైనర్ బోల్తా
జన సంచారం లేకపోవడంతో తప్పిన ప్రమాదం
కంటైనర్‌ను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు
-
Jun 25, 2026 07:21 IST
మహిళల టీ20 ప్రపంచకప్: నేడు బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్
మాంచెస్టర్‌లో రాత్రి.7 గంటలకు బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్
-
Jun 25, 2026 07:20 IST
నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
మంత్రాలయం మం. మాధవరంలో పార్టీ సమావేశానికి హాజరు కానున్న సీఎం
మ.3గంటలకు మంత్రాలయం నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ
అనంతరం రాఘవేంద్రస్వామిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు
-
Jun 25, 2026 07:19 IST
TG20 లీగ్‌లో నేటి మ్యాచ్‌లు
రంగారెడ్డి రైజర్స్ Vs హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్
మధ్యాహ్నం 2:15కు మ్యాచ్ ప్రారంభం
రాత్రి 7:15కు పాలమూరు స్ట్రయికర్స్ Vs మెదక్ ఫాల్కన్స్
-
Jun 25, 2026 07:18 IST
తెలంగాణ వాతావరణ వివరాలు
ఈ నెల 28 వరకు తెలంగాణలో మోస్తరు వర్షాలు
గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
-
Jun 25, 2026 07:18 IST
కర్ణాటక: నేడు తుంగభద్ర డ్యామ్ గేట్ల ప్రారంభోత్సవం
హాజరుకానున్న సీఎంలు చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్
మునీరాబాద్ బహిరంగసభలో పాల్గొననున్న ముగ్గురు సీఎంలు
అత్యంత పటిష్ఠమైన 33 క్రస్ట్ గేట్ల పునరుద్ధరణ
-
Jun 25, 2026 07:17 IST
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం
శుభన్‌శ్రీ, కెయిపన్యార్ జిల్లాలను ముంచెత్తిన వరదలు
భారీ వర్షాలకు ఐదుగురి మృతి, పలువురి గల్లంతు
కొట్టుకుపోయిన ఇళ్లు, వంతెనలు ధ్వంసం
-
Jun 25, 2026 07:16 IST
కోల్‌కతా గోడౌన్ కూలిన ఘటనలో 8కి చేరిన మృతుల సంఖ్య
10 మందికి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స
20 మందిని కాపాడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు
-
Jun 25, 2026 07:15 IST
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం
జులై 24 వరకు నెలరోజుల పాటు కొనసాగనున్న సర్వే
http://voters.eci.gov.in/లో వివరాలు నమోదు చేసుకోవచ్చు
జులై 31న డ్రాఫ్ట్ లిస్ట్ ప్రకటన
జులై 31- ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
అక్టోబర్ 1న తుదిజాబితా విడుదల
-
Jun 25, 2026 07:14 IST
వెనెజువెలాలో సునామీ హెచ్చరికలు జారీ
జపాన్‌లోనూ 6.9 తీవ్రతతో కంపించిన భూమి
భూకంపం కారణంగా జపాన్‌లో రైలు సర్వీసులు నిలిపివేత
-
Jun 25, 2026 07:14 IST
వెనెజువెలా, జపాన్‌లో భారీ భూకంపం
వెనెజువెలాలో బీభత్సం సృష్టించిన భారీ భూకంపం
నిమిషాల వ్యవధిలోనే వెనెజువెలాలో రెండుసార్లు భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై 7.1గా భూకంప తీవ్రత నమోదు
రాజధాని కారకాస్‌తో పాటు పలుచోట్ల కంపించిన భూమి
ప్రకంపనల తీవ్రతకు కుప్పకూలిన పలు భవనాలు
భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
మోరాన్ టౌన్‌కు 21 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం నమోదు