3 రోజుల పాటు EPFO పోర్టల్ మూసివేత.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Jun 25 , 2026 | 09:48 PM
మూడు రోజుల పాటు ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో ఉండవు. డేటాబేస్ కన్సాలిడేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ కోసం మూడు రోజుల పాటు పోర్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఈపీఎఫ్ఓ, కేంద్ర ప్రభుత్వం.. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డిజిటల్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఈపీఎఫ్‌వో 3.0ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల పాటు ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులో ఉండవు. డేటాబేస్ కన్సాలిడేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ కోసం మూడు రోజుల పాటు పోర్టల్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
జూన్ 26వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 28వ తేదీ అర్ధరాత్రి వరకు పోర్టల్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. జూన్ 29వ తేదీ నుంచి పోర్టల్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కాగా, సరికొత్త డిజిటల్ ప్లాట్ ఫామ్ 'ఈపీఎఫ్ఓ3.0' కింద పీఎఫ్ ఖాతాదారులు ఇకపై తమ పీఎఫ్ డబ్బును నేరుగా యూపీఐ యాప్‌లు, ఈపీఎఫ్ఓ అనుసంధానిత ఏటీఎంల ద్వారా సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సరికొత్త సదుపాయం ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి రానుంది. పీఎఫ్ ఖాతాదారులు తమ మొత్తం నిల్వలో గరిష్ఠంగా 75 శాతం వరకు నగదును యూపీఐ లేదా ఏటీఎంల ద్వారా తక్షణమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
బీఈడీ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే!
హైపోథెర్మియా.. శరీర ఉష్ణోగ్రత తగ్గితే ప్రాణాపాయం!