Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jul 23 , 2026 | 07:15 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jul 23, 2026 08:47 IST

    హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో స్థల కబ్జా అంశంపై సినీ నిర్మాతలపై కేసు

    • నిర్మాతలు సి.కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు

    • వ్యాపారవేత్త కాంతమనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు

  • Jul 23, 2026 08:31 IST

    ఢిల్లీ: సీజేపీ నిరసనలపై యువరాజ్ సింగ్ స్పందన

    • చర్చలతోనే సమస్యకు పరిష్కారం: యువరాజ్ సింగ్

  • Jul 23, 2026 08:05 IST

    అర్థరాత్రి జంతర్‌ మంతర్‌ వద్దకు భారీగా CJP కార్యకర్తలు

    • కేంద్రమంత్రి రాజీనామా చేసేవరకు ఆందోళన ఆగదన్న CJP

    • ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో విద్యార్థుల ఆగ్రహం

    • జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌కు వెళ్లే రోడ్లన్నీ దిగ్బంధం

    • పార్లమెంట్‌ స్ట్రీట్‌, జంతర్‌ మంతర్‌ రోడ్డు, కేరళ హౌస్‌ రోడ్ల మూసివేత

    • బహుళ అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసిన పోలీసులు

    • భారీగా CRPF, RAF, ప్రత్యేక పోలీసు బలగాల మోహరింపు

  • Jul 23, 2026 08:04 IST

    నేడు భారత్‌, జింబాబ్వే తొలి టీ20 మ్యాచ్‌

    • సాయంత్రం 4:30 గంటలకు హరారే వేదికగా మ్యాచ్‌

    • జింబాబ్వేతో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్న భారత్‌

  • Jul 23, 2026 08:03 IST

    వరంగల్‌: మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ఏఏఐ టెండర్లు

    • రూ.203.49 కోట్లతో విమానాశ్రయ పనులు

    • రన్‌వే పునర్నిర్మాణానికి టెండర్లు

  • Jul 23, 2026 08:03 IST

    అమెరికా ప్రభుత్వానికి న్యూయార్క్‌ మేయర్‌ మమ్దానీ లేఖ

    • నెతన్యాహును అరెస్ట్‌ చేయాలని కోరిన మమ్దానీ

    • నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించిన మమ్దానీ

    • ఐసీసీ వారెంట్‌ అమలు చేయాలని కోరిన మమ్దానీ

  • Jul 23, 2026 08:02 IST

    ప్రధాని మోదీకి లేఖ రాసిన అన్నా హజారే

    • ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల తీరుపై ఆవేదన

    • కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడొద్దని అన్నా హజారే విజ్ఞప్తి

    • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అన్నా హజారే సూచన

  • Jul 23, 2026 08:01 IST

    అమెరికాకు ఇరాన్‌ తీవ్ర హెచ్చరికలు

    • అమెరికాలో 9/11 తరహా దాడులు చేస్తామన్న ఇరాన్‌

    • యుద్ధం కొనసాగితే అమెరికాలో జాతీయ సంతాప దినాలు: ఇరాన్‌

    • ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ అనుబంధ వార్తాసంస్థ 'తస్నిమ్‌' ప్రకటన

  • Jul 23, 2026 08:00 IST

    సీజేపీ నిరసనకు నటుడు దుల్కర్ సల్మాన్ మద్దతు

    • ‘గుండెల్ని పిండేస్తోంది’ అంటూ దుల్కర్ భావోద్వేగ పోస్ట్

    • కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు సెలబ్రిటీల మద్దతు

    • సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్న పలువురు నటీనటులు

    dulquer-salmaan.jpg

  • Jul 23, 2026 07:46 IST

    తిరుపతి: అలిపిరి మెట్ల మార్గంలో విగ్రహం చోరీ కేసు నిందితుడి గుర్తింపు

    • పోలీసుల అదుపులో విగ్రహం చోరీకి పాల్పడిన విశాఖ వాసి జస్వంత్‌

    • 7వ మైలు దగ్గర ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహం చోరీ

    • సీసీ కెమెరా ఫుటేజ్‌తో నిందితుడిని గుర్తించిన టీటీడీ విజిలెన్స్‌

  • Jul 23, 2026 07:28 IST

    శ్రీకాకుళం: కాశీబుగ్గ పీఎస్‌లోనే మాజీ మంత్రి అప్పలరాజు

    • పలాసలో 163 BNSS సెక్షన్‌ అమలు

    • ర్యాలీలు, ఊరేగింపులు, గుంపుగా సమావేశాలు నిర్వహించడం నిషేధం

    • శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని పోలీసుల విజ్ఞప్తి

  • Jul 23, 2026 07:24 IST

    ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు

    • ఇరాన్ సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు

    • అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతో దాడులు ప్రారంభించినట్లు CENTCOM ప్రకటన

    • ఇరాన్ సామర్థ్యాలను మరింత దెబ్బతీయడమే లక్ష్యమన్న అమెరికా

  • Jul 23, 2026 07:19 IST

    తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

    • నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌కు భారీ వర్ష సూచన

    • నైరుతి దిశ నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

  • Jul 23, 2026 07:16 IST

    నేటి నుంచి గ్లాస్గోలో కామన్వెల్త్‌ గేమ్స్‌ ప్రారంభం

    • ఆగస్టు 2 వరకు కొనసాగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌

    • కామన్వెల్త్‌ పోటీల్లో 126 మంది భారత క్రీడాకారులు

  • Jul 23, 2026 07:15 IST

    అమరావతి: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ

    • పలు అభివృద్ధి పనులకు పరిపాలనా ఆమోదం తెలపనున్న కేబినెట్‌

    • ఉద్యోగుల డిమాండ్లపై కేబినెట్‌లో చర్చించే అవకాశం

    • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పైనా కేబినెట్‌లో చర్చించే చాన్స్‌

    • పలు కీలక అంశాలకు ఆమోదముద్రే ప్రధాన అజెండాగా కేబినెట్‌