-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 22nd October 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 22 , 2026 | 07:19 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 22, 2026 08:50 IST
రానున్న 3 గంటల్లో కాకినాడ, కోనసీమ జిల్లాలకు వర్ష సూచన
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్
అమలాపురం, కట్రెనికోన ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ
-
Oct 22, 2026 08:48 IST
హైదరాబాద్: ఈ నెల 26న కేఆర్ఎంబీ సమావేశం
30న జీఆర్ఎంబీ సమావేశం
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కీలక చర్చ
సాగర్, శ్రీశైలంలోని నీటిని తాగు అవసరాలకే వినియోగించాలని గత కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయం
కృష్ణాలో తమ వాటాను పెంచాలని కోరుతున్న తెలంగాణ
గోదావరి, కావేరీ అనుసంధానంపై చర్చించే అవకాశం
పోలవరం నుంచి కావేరీ అనుసంధానానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తెలంగాణ
-
Oct 22, 2026 08:39 IST
ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 238గా పాయింట్లుగా నమోదు
అధికారికంగా వెల్లడించిన సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు
దసరా అనంతరం ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం
-
Oct 22, 2026 08:38 IST
‘కత్తితో బ్రతికేవాడు కత్తితోనే చస్తాడు.. ’
డెమోక్రాట్లకు ఎలాన్ మస్క్ వార్నింగ్
మధ్యంతర ఎన్నికల్లో గెలిస్తే మస్క్‌పై డెమోక్రాట్లు విచారణ జరిపిస్తారని వార్తలు
అసలు సూత్రధారుల పని కూడా పడతా అంటూ మస్క్ వార్నింగ్
-
Oct 22, 2026 08:37 IST
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు దగ్గరపడిందని ట్రంప్ కామెంట్
అమెరికా, ఉక్రెయిన్‌లతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలకు రష్యా అంగీకారం
పుతిన్‌తో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్ సమావేశం
నార్వేలో జెలెన్‌స్కీతో కూడా అమెరికా ప్రతినిధుల చర్చలు
-
Oct 22, 2026 07:23 IST
హైదరాబాద్ గోల్కొండ పరిధిలో దారుణం..
కారు అద్దె డబ్బుల వివాదంతో యువకుడిపై దాడి
మరమ్మతుల కోసం రూ.40 వేలు డిమాండ్..
డబ్బులు చెల్లించలేదని యువకుడికి వేధింపులు
అర్బాజ్‌కు గుండు గీయించి, నగ్నంగా డ్యాన్స్ చేయించిన నిందితులు
అర్బాజ్ ఫిర్యాదుతో కేసు నమోదు.. ఐదుగురు నిందితుల అరెస్ట్
-
Oct 22, 2026 07:23 IST
SA vs AUS: సౌతాఫ్రికా అరుదైన ఘనత
డబ్ల్యూటీసీ చరిత్రలో తొలిసారి ఫాలో ఆన్‌లో ఆస్ట్రేలియా
ఆసీస్‌ను ఫాలో ఆన్ ఆడించిన తొలి జట్టుగా సౌతాఫ్రికా రికార్డు
-
Oct 22, 2026 07:22 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,46,070
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,33,890
కిలో వెండి ధర రూ.2,29,000
-
Oct 22, 2026 07:22 IST
కాకినాడ: శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
భవాని భక్తులను ఢీకొన్న స్కార్పియో నలుగురి మృతి
విజయనగరం జిల్లా డెంకాడ నుంచి బస్సులో విజయవాడ బయలుదేరిన భవాని భక్తులు
-
Oct 22, 2026 07:20 IST
తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ..
శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
సర్వదర్శనానికి 6 గంటల సమయం