-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 18th October 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Oct 18 , 2026 | 06:00 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Oct 18, 2026 06:45 IST
నంద్యాల: ఆళ్లగడ్డ మండలం బత్తులూరు దగ్గర ప్రమాదం
హైవేపై ఓవర్టేక్ చేయబోయి మహేశ్వరి ట్రావెల్స్ బస్సును ఢీకొన్న అమల ట్రావెల్స్ బస్సు
ప్రయాణికులు సురక్షితం, బస్సు ముందు భాగం ధ్వంసం
20 మందితో పొద్దుటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న అమలా ట్రావెల్స్ బస్సు
27 మందితో బద్వేల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న మహేశ్వరి ట్రావెల్స్ బస్సు
-
Oct 18, 2026 06:40 IST
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
భక్తులపై దూసుకెళ్లిన ట్రక్కు, 12 మంది మృతి
39 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
గ్వాలియర్ జిల్లాలోని శీతలా మాత ఆలయం దగ్గర ఘటన
-
Oct 18, 2026 06:35 IST
స్థిరంగా బంగారం ధరలు
24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,47,660
22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,35,350
కిలో వెండి ధర రూ.2,30,000
-
Oct 18, 2026 06:30 IST
కోల్కతా దుర్గాపూజ మండపంలో తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: సీఎం చంద్రబాబు
గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థన: సీఎం చంద్రబాబు
-
Oct 18, 2026 06:29 IST
కడప: ఎంపీ అవినాశ్ రెడ్డి హౌస్ అరెస్ట్
పులివెందులలో భారీగా పోలీసుల మోహరింపు
నామినేషన్ల చివరి రోజు కావడంతో ముందస్తు చర్యలు
ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదంటూ నిన్న నోటీసులు
-
Oct 18, 2026 06:25 IST
తిరుమలలో 7వ రోజుకు చేరుకున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు
నర్తన కృష్ణుడు అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీనివాసుడు
-
Oct 18, 2026 06:22 IST
నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు
-
Oct 18, 2026 06:20 IST
ఏపీలో నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు
మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు అవకాశం
-
Oct 18, 2026 06:17 IST
అనకాపల్లి జిల్లాలో కాటేసిన నాగుపాముతో వ్యక్తి వీరంగం
ప్రభుత్వ ఆసుపత్రిలో పామును పట్టుకుని బాధితుడి వీరంగం
భయంతో పరుగులు తీసిన వైద్య సిబ్బంది
నాగుపాముతో ఆసుపత్రి కారిడార్లలో తిరిగిన బాధితుడు నర్సింగరావు
-
Oct 18, 2026 06:15 IST
జెలెన్స్కీ పత్రికా సమాశం.. దుర్గంధంతో ఇక్కట్లు
ఉక్రెయిన్ అధ్యక్షుడి రాకకోసం విలేకరులు వేచి చూస్తుండగా ఘటన
అకస్మాత్తుగా దుర్గంధం వ్యాపించడంతో బయటకు వెళ్లిన విలేకరులు
అపానవాయువు వదిలిందెవరంటూ నెట్టింట విలేకరులు సరదా ప్రశ్నలు
-
Oct 18, 2026 06:13 IST
నేటి నుంచి పారా ఆసియా క్రీడలు
11 క్రీడాంశాల్లో బరిలోకి దిగనున్న 168 మంది అథ్లెట్లు
-
Oct 18, 2026 06:11 IST
తెలంగాణకు 2 రోజుల పాటు వర్షసూచన
పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
నేడు, రేపు ఉరుములతో జల్లులు
పలు ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు
-
Oct 18, 2026 06:10 IST
కోల్కతా దుర్గామాత మండపం దగ్గర తొక్కిసలాట
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన బెంగాల్ సీఎం సువేందు అధికారి
ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం సువేందు అధికారి
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటన
-
Oct 18, 2026 06:08 IST
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న శరన్నవరాత్రులు
8వ రోజు శ్రీదుర్గాదేవి అలంకారంలో అమ్మవారు
-
Oct 18, 2026 06:07 IST
నేడు కోల్కతాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
నేటి అమిత్ షా పశ్చిమబెంగాల్ పర్యటన రద్దు
-
Oct 18, 2026 06:05 IST
హైదరాబాద్: నేడు ట్యాంక్బండ్పై సద్దుల బతుకమ్మ ఉత్సవాలు
మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచన
-
Oct 18, 2026 06:03 IST
రంగారెడ్డి: నాదర్గుల్ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
ప్రమాదంలో యువతులు మృతిచెందడం బాధాకరం
మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
గాయపడిన విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
ప్రమాదానికి బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలకు సీఎం ఆదేశం
-
Oct 18, 2026 06:00 IST
రంగారెడ్డి: నాదర్గుల్లో అగ్నిప్రమాదం
దాండియా ఈవెంట్లో చెలరేగిన మంటలు
లైటింగ్ సిస్టమ్ పడి ఇద్దరు యువతుల మృతి
మరో ఆరుగురు యువతుల పరిస్థితి విషమం
ప్రైవేట్ ఆస్పత్రుల్లో విద్యార్థినులకు చికిత్స
MVSR ఇంజినీరింగ్ కాలేజ్లో ఘటన