-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National International Breaking Live Updates of 17th April 2026 Siva
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 17 , 2026 | 08:02 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 17, 2026 11:23 IST
డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా డీఎంకే నిరసన
డీలిమిటేషన్ బిల్లును డీఎంకే వ్యతిరేకిస్తోంది: కనిమొళి
డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: కనిమొళి
బిల్లుకు వ్యతిరేకంగా నల్ల దుస్తులతో హాజరైన డీఎంకే ఎంపీలు
-
Apr 17, 2026 11:23 IST
హరివంశ్ నారాయణ్‌కు ప్రధాని మోదీ అభినందనలు
హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఉపయోగపడుతుంది: మోదీ
-
Apr 17, 2026 11:22 IST
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్
ఏకగ్రీవంగా ఎన్నికైన హరివంశ్ నారాయణ్
-
Apr 17, 2026 11:18 IST
మహిళా రిజర్వేషన్ గెజిట్ విడుదలపై ప్రశ్నించిన కేసీ వేణుగోపాల్
నిన్న రాత్రి మహిళా రిజర్వేషన్ గెజిట్ విడుదల చేశారు: కేసీ
-
Apr 17, 2026 11:16 IST
రెండో రోజు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
మహిళా రిజర్వేషన్ సహా కీలక బిల్లులపై చర్చ
తేజస్వి వ్యాఖ్యలపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీల నిరసన
తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
-
Apr 17, 2026 10:58 IST
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు పరిసరాలలో పెద్ద పులి కలకలం
కార్మికుల కంట పడిన పెద్దపులి
పెద్దపులిని చూసి భయబ్రాంతులకు గురైన కార్మికులు
రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు
-
Apr 17, 2026 10:53 IST
పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా ఆస్తులపై ఈడీ దాడులు
లూధియానా సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు
పారిశ్రామిక శాఖ భూములు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణ
-
Apr 17, 2026 10:52 IST
అరేబియా సముద్రంలో పోటాపోటీగా భారత్-పాక్ ఆయుధ పరీక్షలు
నోటీస్ టు ఎయిర్‌మన్‌లు జారీ చేసిన ఇరు దేశాలు
ఈనెల 20, 21న పాక్, 22, 25న భారత్ నోటామ్ జారీ
-
Apr 17, 2026 10:51 IST
హనుమకొండ: ఎస్ఐ శ్రీకాంత్‌పై అత్యాచారం కేసు
సుబేదారి పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదు
తనను లోబరుచుకుని అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదు
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఎస్ఐ శ్రీకాంత్
-
Apr 17, 2026 10:49 IST
మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది: కిషన్‌రెడ్డి
డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది
రాజకీయ దురుద్దేశంతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు
సౌత్, నార్త్ మధ్య యుద్ధం జరుగుతుందని దుష్ప్రచారం
ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా డీలిమిటేషన్
-
Apr 17, 2026 10:45 IST
లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
సెన్సెక్స్150, నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభం
-
Apr 17, 2026 10:44 IST
స్త్రీ శక్తే బలమైన భారత్‌కు గుర్తింపు: ప్రధాని మోదీ
ప్రతి రంగంలోనూ స్త్రీల సంకల్పం, నిష్ఠ, సేవ ప్రతిబింబిస్తోంది
అదే భారత్ కీర్తిని ఇనుమడింపజేస్తోంది: ఎక్స్‌లో మోదీ
-
Apr 17, 2026 10:42 IST
కామారెడ్డిలో విషాదం..
ఇంట్లో కూలర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో రాజిరెడ్డి మృతి
మృతుడికి ఇద్దరు కూతుళ్లు.. తీవ్ర విషాదంలో కుటుంబసభ్యులు
-
Apr 17, 2026 10:41 IST
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ పట్టివేత
3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్ చేసిన కస్టమ్స్
థాయ్ ఎయిర్‌వేస్‌లో బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ దగ్గర గుర్తింపు
మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు
-
Apr 17, 2026 09:54 IST
హైదరాబాద్: జస్టిస్ సుదర్శన్‌రెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ
పాల్గొన్న మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, మంత్రి పొన్నం
డీలిమిటేషన్ అంశంపై చర్చించిన నేతలు
-
Apr 17, 2026 09:44 IST
నేడు రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నిక
ఉదయం 11 గంటలకు రాజ్యసభలో ఎన్నిక
-
Apr 17, 2026 09:43 IST
డీలిమిటేషన్ బిల్లుపై నేడు లోక్‌సభలో ఓటింగ్
సా.4గంటలకు ఓటింగ్ జరపనున్న స్పీకర్
2/3 మెజారిటీ ఉంటేనే రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం
ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు
ఎన్డీయే బలం 293.. విపక్షాల బలం 233
ఎన్డీయేకు ఇంకా 67 మంది మద్దతు అవసరం
360 మంది మద్దతిస్తేనే బిల్లు పాస్
-
Apr 17, 2026 09:41 IST
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
పార్లమెంట్‌లో ఆందోళన చేయనున్న కాంగ్రెస్ ఎంపీలు
కాసేపట్లో రేవంత్‌రెడ్డితో భేటీకానున్న కాంగ్రెస్ ఎంపీలు
ఉద్యమాన్ని కించపర్చేలా వ్యాఖ్యానించారన్న ఎంపీలు
తేజస్వి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎంపీలు డిమాండ్
-
Apr 17, 2026 09:41 IST
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివరణ కోరిన అమిత్‌షా
నిన్న రాత్రి అమిత్‌షాను కలిసిన తేజస్వి సూర్య
తన వ్యాఖ్యల సారాంశాన్ని వివరించిన తేజస్వి
తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారన్న తేజస్వి
తెలంగాణ ఉద్యమంపై నా మాటలను వక్రీకరించారు
తెలంగాణ అమరవీరుల పట్ల గౌరవం ఉంది: తేజస్వి
-
Apr 17, 2026 09:40 IST
అనకాపల్లిలో అర్ధరాత్రి భూప్రకంపనలు
ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో కంపించిన భూమి
రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 3.7గా నమోదు
-
Apr 17, 2026 09:02 IST
తిరుపతి: శ్రీకాళహస్తి మండలంలో విషాదం
అరవ కొత్తూరులో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
మృతులు త్రిశూల్(12), తరుణ్‌రెడ్డి(25)
-
Apr 17, 2026 08:09 IST
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్‌లో విషాద ఘటన
తండ్రి మృతి తట్టుకోలేక బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
మృతురాలు పాములపాటి జ్ఞానశ్రీ (21)
ఏలూరు జిల్లా చాట్రాయి నివాసి
‘డాడీ లేని జీవితం ఊహించలేను’ అంటూ సూసైడ్ లేఖ
-
Apr 17, 2026 08:06 IST
మేడ్చల్: కీసర పీఎస్ పరిధిలో రోడ్డుప్రమాదం
యాద్గార్పల్లి చౌరస్తా సమీపంలో చెట్టును ఢీకొట్టిన బైక్
ఇద్దరు యువకులు మృతి, కేసు నమోదు
మృతులు కనకరాజు(22), అరుణ్(20)
-
Apr 17, 2026 08:05 IST
అమరావతి: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు
ఉ.11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పార్టీ ఆఫీస్‌లో చంద్రబాబు
పార్టీ కొత్త టీమ్‌కు అభినందనలు తెలపనున్న సీఎం చంద్రబాబు
శిక్షణా తరగతులకు హాజరుకానున్న చంద్రబాబు
-
Apr 17, 2026 08:04 IST
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
10 రోజుల పాటు కాల్పుల విరమణకు లెబనాన్, ఇజ్రాయెల్ ఆమోదం
ఇజ్రాయెల్, లెబనాన్ నేతలతో మాట్లాడా: ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలను పరిష్కరించా: ట్రంప్
ఇప్పుడు తాజాగా పదో యుద్ధాన్ని ఆపా: ట్రూత్‌లో ట్రంప్
-
Apr 17, 2026 08:02 IST
మూడు కీలక బిల్లులపై నేడు లోక్‌సభలో ఓటింగ్
డీలిమిటేషన్ బిల్లుపై రెండో రోజు లోక్‌సభలో చర్చ
సా.4 గంటలకు ఓటింగ్ జరపనున్న స్పీకర్