-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National International breaking Live Updates of 15th August 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 15 , 2026 | 06:04 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Aug 15, 2026 21:04 IST
అమరావతి: మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
సభలో చర్చించాల్సిన అంశాల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం
ఈనెల 18న కేబినెట్ భేటీలో వివిధ బిల్లుల ఆమోదంపై చర్చ
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు
-
Aug 15, 2026 20:34 IST
నంద్యాల: శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద
ఇన్ ఫ్లో 6,738 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 14,126 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 877.60 అడుగులు
కుడి జలవిద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
-
Aug 15, 2026 20:06 IST
విజయవాడ: కృష్ణానదిలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతి
ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీసిన పోలీసులు
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చిన కృష్ణ లంక పోలీసులు
-
Aug 15, 2026 19:23 IST
విజయవాడ: కృష్ణా నదిలో ముగ్గురు యువకుల గల్లంతు
ఈతకు వెళ్లి కృష్ణలంక యువకుల గల్లంతు
యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు
గల్లంతైన యువకులు గౌతమ్, జాషువా, తేజ
-
Aug 15, 2026 18:57 IST
ఏపీలో ఇమామ్ మౌజన్ల గౌరవ వేతనాల విడుదల
రూ.22.50 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
ఏప్రిల్-జూన్ నెలలకు సంబంధించి నిధుల విడుదల
-
Aug 15, 2026 18:46 IST
హైదరాబాద్: లోక్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం
ఎట్ హోమ్‌కు హాజరుకాని BRS నేతలు
-
Aug 15, 2026 18:37 IST
గాలె టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట
ఆట ముగిసే సమయానికి భారత్- 288/2
క్రీజులో దేవ్‌దత్ పడిక్కల్ 131, రిషభ్ పంత్ 27
భారత బ్యాటింగ్: రాహుల్ 77(రిటైర్డ్ హర్ట్), జైస్వాల్ 32, గిల్ 16
-
Aug 15, 2026 18:14 IST
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కౌంటర్
పంద్రాగస్టున పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీశ్‌రావు
ప్రజల గురించో.. సమస్యలపైనో మాట్లాడాలి: హరీశ్‌రావు
సీఎం రేవంత్‌వి అన్నీ 420 మాటలే: హరీశ్‌రావు
సభలో మెదక్ జిల్లాకు ఏం చేస్తారో ఒక్కమాటైనా చెప్పలేదు: హరీశ్‌రావు
-
Aug 15, 2026 17:58 IST
శ్రీశైలం-హైదరాబాద్ ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం నుంచి డ్యామ్ మార్గంలో 15 కి.మీ. వరకు స్తంభించిన వాహనాలు
ట్రాఫిక్ అంతరాయంతో భక్తుల ఇబ్బందులు
-
Aug 15, 2026 17:45 IST
విజయవాడ: లోక్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం
హాజరైన సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు
-
Aug 15, 2026 17:39 IST
హైదరాబాద్: మాదాపూర్‌లో పోలీసుల తనిఖీలు
1.45 కేజీల గంజాయి స్వాధీనం, ఒకరి అరెస్ట్
-
Aug 15, 2026 17:20 IST
హైదరాబాద్: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం
వందన హోటల్ సమీపంలో స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
స్కూటీపై వెళ్తున్న సురేశ్ దంపతులు, కుమార్తె శ్రావణి
లారీ ఢీకొట్టడంతో కిందపడిన శ్రావణి
శ్రావణి పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికడే దుర్మరణం
-
Aug 15, 2026 17:10 IST
SL vs IND: రెండో వికెట్ కోల్పోయిన భారత్
ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటైన గిల్(16)
జయసూర్య బౌలింగ్‌లో లాహిరుకు క్యాచ్ ఇచ్చిన గిల్
63 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోర్ 239/2
వర్షం కారణంగా నిలిచిన ఆట
-
Aug 15, 2026 17:03 IST
కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
రైతులకు ఎవరేం చేశారో అసెంబ్లీలో చర్చకు KCR సిద్ధమా?: సీఎం రేవంత్
పదేళ్లలో మీరేం చేశారో.. రెండున్నరేళ్లలో మేం ఏం చేశామో చర్చకు సిద్ధం: రేవంత్
అతి తక్కువ అప్పుల్లో తెలంగాణ రైతులు ఉన్నారని కేంద్రం చెబుతోంది: రేవంత్
కేంద్రం చెప్పేది BJP నేతలకు కనిపించడం లేదా?: సీఎం రేవంత్
-
Aug 15, 2026 16:55 IST
ఆదిలాబాద్: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఉద్రిక్తత
రేషన్ కార్డులపై మోదీ ఫొటో లేదని బీజేపీ అభ్యంతరం
బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం
అడ్డుకున్న పోలీసులు, తోపులాట
రేషన్ కార్డులపై మోదీ ఫొటో పెట్టాలని బీజేపీ డిమాండ్
-
Aug 15, 2026 16:51 IST
సంగారెడ్డి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన రేవంత్
తెలంగాణలో 1.06 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు: రేవంత్
అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ రేషన్ కార్డులు: రేవంత్
సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం రేవంత్
రూ.14,800 కోట్లతో ఉచితంగా సన్నబియ్యం: సీఎం రేవంత్
-
Aug 15, 2026 16:47 IST
IND vs SL: టీమ్ఇండియా బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీ
తొలి టెస్టులో శతకంతో మెరిసిన పడిక్కల్
134 బంతుల్లో సెంచరీ బాదిన పడిక్కల్
60 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 234/1
ప్రస్తుతం క్రీజులో పడిక్కల్(105), గిల్(16)
-
Aug 15, 2026 16:46 IST
AUS vs BAN: బంగ్లాదేశ్ భారీ స్కోరు
రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో ఆస్ట్రేలియా
తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 161/4
-
Aug 15, 2026 16:45 IST
జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర హోదాను రద్దు చేయకపోయుంటే.. పీవోకే మళ్లీ కలిసేది: ఒమర్ అబ్దుల్లా
పీవోకేలో ఆందోళన చేస్తున్న ప్రజలపై జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయి: ఒమర్ అబ్దుల్లా
రాష్ట్ర హోదాను, ఇతర రాజ్యాంగపరమైన హామీలను పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నాం: ఒమర్ అబ్దుల్లా
-
Aug 15, 2026 16:30 IST
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం
ఎట్‌హోమ్ కార్యక్రమానికి దూరంగా డిప్యూటీ సీఎం పవన్
లోక్‌భవన్ అధికారులకు సమాచారం అందించిన పవన్ పేషీ
రాజమండ్రిలో పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు
-
Aug 15, 2026 16:28 IST
తెలంగాణ చరిత్రలో ఈరోజు ప్రత్యేకమైనది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
గత ప్రభుత్వం పదేళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు: ఉత్తమ్
కాంగ్రెస్ వచ్చాకే మళ్లీ రేషన్ కార్డులు ఇవ్వడం ప్రారంభించాం: ఉత్తమ్
రేషన్ విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: ఉత్తమ్
రూ.14,800 కోట్లతో ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం: ఉత్తమ్
-
Aug 15, 2026 16:27 IST
హోర్ముజ్‌ను ఓ ట్వీట్‌తో స్వాధీనం చేసుకోలేరు: ఇరాన్
అమెరికా ఓటమిని ఒప్పుకునేవరకు హోర్ముజ్‌ను దిగ్బంధిస్తామని వ్యాఖ్య
-
Aug 15, 2026 16:03 IST
కడప: రాష్ట్రానికే ఆదర్శంగా స్మార్ట్ కిచెన్స్: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
ప్రతీ ఇంటి నుంచీ ఒక స్టార్టప్ రావాలి: బీసీ జనార్దన్‌రెడ్డి
ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట: బీసీ జనార్దన్‌రెడ్డి
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నాం: జనార్దన్ రెడ్డి
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ పెట్టుబడులు తెస్తున్నాం: జనార్దన్‌రెడ్డి
-
Aug 15, 2026 15:58 IST
సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
నెహ్రూ, రాజీవ్ గాంధీ విగ్రహాలు ఆవిష్కరించిన సీఎం రేవంత్
కాసేపట్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
-
Aug 15, 2026 15:53 IST
విశాఖలో ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సుల ప్రారంభం
విశాఖ నుంచి భోగాపురానికి EV బస్సుల ప్రారంభం
విశాఖకు తొలి విడతగా 20 ఈవీ బస్సులు
బస్సులను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎంపీ శ్రీభరత్
-
Aug 15, 2026 15:33 IST
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్
ఉగ్రసంస్థలతో లింకులున్నట్టు ఆరోపణలు
అఫ్గాన్‌కు చెందిన టీటీపీ ఉగ్రసంస్థ హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం
భారత్, పాకిస్థాన్‌లో దాడులకు ప్రణాళికలు రచించినట్టు ఆరోపణలు
-
Aug 15, 2026 15:28 IST
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం
ఎగువ సుబన్‌సిరి, దిబాంగ్ వ్యాలీ జిల్లాల్లో విరిగిపడిన కొండచరియలు
నలుగురి మృతి, ఐదుగురు ఆర్మీ సిబ్బంది గల్లంతు
గాలింపు చర్యల్లో సైన్యం, స్థానిక యంత్రాంగం
-
Aug 15, 2026 15:26 IST
రాజస్థాన్: నాగౌర్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
రూ.100 కోట్ల విలువైన MDMA డ్రగ్స్ సీజ్
ఇంట్లోనే ల్యాబ్ ఏర్పాటుతో డ్రగ్స్ తయారీ
-
Aug 15, 2026 15:18 IST
సంగారెడ్డికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
కాసేపట్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
-
Aug 15, 2026 15:03 IST
తమిళనాడు: సీఎంగా విజయ్ తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం
'వణక్కమ్ జెన్ జీ' అంటూ యువతకు ప్రత్యేక పలకరింపు
అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి విజయ్ పిలుపు
కేంద్రానికి సహకరిస్తూనే, రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తే వ్యతిరేకిస్తామని వెల్లడి
చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
మొదటి వరుసలో ఆసీనులైన విజయ్ తల్లిదండ్రులు, నటి త్రిష
-
Aug 15, 2026 14:57 IST
తెలంగాణ: జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న మంత్రులు
తెలంగాణలో గతంలో 2.81 కోట్ల మందికి రేషన్ కార్డులు: పొంగులేటి
కాంగ్రెస్ పాలనలో మరో 62 లక్షల మందికి కార్డులు జారీ: పొంగులేటి
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 3.42 కోట్లకు చేరిక
-
Aug 15, 2026 14:56 IST
నేడు సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ
లక్ష మందితో సీఎం సభ నిర్వహణకు ఏర్పాట్లు
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్న రేవంత్
-
Aug 15, 2026 14:35 IST
విజయనగరం: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు CISF బలగాలు
ఎయిర్‌పోర్టుకు 450 మంది CISF సిబ్బందిని కేటాయించాం: CISF DG
దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ ఎయిర్‌పోర్టుగా భోగాపురం గుర్తింపు
CISF బలగాలతో పాటు డాగ్ స్క్వాడ్ ఏర్పాటు: CISF DG ప్రవీర్ రంజన్
-
Aug 15, 2026 14:21 IST
కర్ణాటక: చామరాజనగర్ జిల్లాలో వేటగాళ్లపై కాల్పులు
వన్యప్రాణులను వేటాడి అధికారులకు ఎదురుపడ్డ ముగ్గురు వ్యక్తులు
వేటగాళ్లను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారుల యత్నం
అధికారులపై వేటగాళ్ల దాడులు
అటవీ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్ల మృతి
కావేరీ వన్యప్రాణుల అభయారణ్యంలో ఘటన
-
Aug 15, 2026 13:40 IST
విజయవాడ: రేపు DSC-2025 ద్వారా ఎంపికైన టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ
ఉదయం 10:30కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ర్యాలీ
అంబేద్కర్ విగ్రహం వరకూ ర్యాలీ చేయనున్న టీచర్లు
పాల్గొననున్న ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ప.గో. జిల్లాల టీచర్లు
-
Aug 15, 2026 13:38 IST
యోగా గురు బాబారాందేవ్ సంచలన వ్యాఖ్యలు
99 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు: బాబారాందేవ్
పేపర్ లీక్‌లతో విద్యార్థులకు తీరని నష్టం: బాబారాందేవ్
వ్యవస్థలో మార్పులు రాకపోతే తిరుగుబాటు తప్పదు: బాబారాందేవ్
-
Aug 15, 2026 13:01 IST
భారత్‌కు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియా
భారత్-అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా ఉన్నాయని వెల్లడి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యమే ఇందుకు కారణమన్న మర్కో రుబియా
-
Aug 15, 2026 12:55 IST
భద్రాద్రి: ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగుకు ఇబ్బందులు: మంత్రి తుమ్మల
రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారింది
మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం నెలాఖరులోపు పూర్తి చేయాలి
నీటి దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: మంత్రి తుమ్మల
-
Aug 15, 2026 12:54 IST
భద్రాద్రి: రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలు విడుదల
నీటిని విడుదల చేసిన మంత్రి తుమ్మల
అశ్వాపురం మండలం సీతారామ పంప్ హౌస్ దగ్గర మోటార్ స్విచ్ ఆన్ చేసిన మంత్రి
పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
-
Aug 15, 2026 12:53 IST
హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాల వయోపరిమితిపై ప్రభుత్వం కీలక నిర్ణయం
అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు
ఇప్పటికే ఉన్న 5 ఏళ్ల వయో సడలింపునకు అదనంగా మరో 2 ఏళ్ల రిలాక్సేషన్
మొత్తం 7 ఏళ్ల వరకూ అదనపు వయో సడలింపు వర్తింపు
-
Aug 15, 2026 12:34 IST
భారత్ జోడో యాత్ర స్ఫూర్తితో తెలంగాణలో కులగణన: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని అరికట్టాలి: మహేశ్ గౌడ్
యువత వాస్తవాలను తెలుసుకుని చైతన్యవంతం కావాలి: మహేశ్ గౌడ్
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
-
Aug 15, 2026 12:25 IST
అమరావతి: స్త్రీశక్తి లబ్ధిదారులతో బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు
క్యాంప్ కార్యాలయంలో మహిళలతో సీఎం చంద్రబాబు తేనేటి విందు
స్త్రీశక్తి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోవాలని సీఎం సూచన
స్త్రీ శక్తి అమలుతో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి: సీఎం చంద్రబాబు
-
Aug 15, 2026 12:20 IST
రాజమండ్రి: ధవళేశ్వరంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
సెంట్రల్ క్రాప్ట్ వుడ్ బ్యాంక్ ప్రారంభించిన పవన్ కల్యాణ్
-
Aug 15, 2026 12:15 IST
కరీంనగర్: బీజేపీ కార్పొరేటర్ బండారు వేణు ఇంటిపై దాడి
వేణు ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేసిన BRS స్థానిక నేతలు
ఇటీవల MLA గంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వేణు
ఆగ్రహంతో వేణు ఇంటిపై రాత్రి కోడిగుడ్లతో దాడి
బండారు వేణు ఇంటి దగ్గర భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
-
Aug 15, 2026 12:00 IST
కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం: బండి సంజయ్
ప్రభుత్వం మారితే స్మార్ట్‌కార్డులు నిరుపయోగమవుతాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్
కర్ణాటకలో సిద్దరామయ్య హయాంలో ఇలాగే చేశారు: బండి సంజయ్
వందల కోట్లతో చేసిన స్మార్ట్ కార్డులన్నీ వృథా అయ్యాయి: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
Aug 15, 2026 11:50 IST
పగో: భీమవరంలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్‌లో 80వ స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు
జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన మంత్రి నిమ్మల
-
Aug 15, 2026 11:45 IST
సూర్యాపేట: పారదర్శకత కోసమే స్మార్ట్ కార్డుల పంపిణీ: మంత్రి ఉత్తమ్
నిరుపేదల కడుపు నింపే స్మార్ట్ కార్డులపై రాజకీయం చేయొద్దు: ఉత్తమ్
అరకొర ఇచ్చినవారు, అసలు ఇవ్వనివారు కామెంట్స్ చేస్తున్నారు
మా ప్రయత్నాన్ని విమర్శించడం మాని.. అభినందించండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
Aug 15, 2026 11:30 IST
ఖమ్మం: రామనగరం దగ్గర గంజాయి పట్టివేత
6.36 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్
ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న నిందితులు
ఒడిశాకు చెందిన మారి కామేష్, కారా రాజేంద్రపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు
-
Aug 15, 2026 11:15 IST
హైదరాబాద్: ఆల్ఫ్రాజోలం పట్టివేత కేసులో కీలక పరిణామం
SM ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాణిక్యరెడ్డి అరెస్ట్
SM ల్యాబ్స్‌లో రూ.74కోట్ల విలువైన ఆల్ఫ్రాజోలం స్వాధీనం
-
Aug 15, 2026 11:00 IST
తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ దాడులు
బరువు తగ్గించే మెడిసిన్స్‌పై DCA అధికారుల నిఘా
మౌంజారో, ఓజెంపిక్, వేగోవీ మందులపై స్పెషల్ డ్రైవ్
నిబంధనలు ఉల్లంఘించిన 43 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు
-
Aug 15, 2026 10:45 IST
తిరుపతి: రామచంద్రాపురం మండలం కేసీ పేట వద్ద ప్రమాదం
టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి
తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి ఎల్లయ్య (60)గా గుర్తింపు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 15, 2026 10:30 IST
హైదరాబాద్: గాంధీ భవన్‌లో స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ జెండా ఎగరేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హాజరైన ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్, టీపీసీసీ నేతలు
-
Aug 15, 2026 10:15 IST
తిరుపతి: స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత
పరేడ్ గ్రౌండ్‌లో ప్రసంగిస్తూ స్టేజిపై స్పృహతప్పి పడిపోయిన ఆనం
అంబులెన్స్ వద్దని సభా వేదికపైనే కూర్చున్న మంత్రి ఆనం రాంనారాయణ
బీపీ డౌన్ అయినట్టు గుర్తించిన వైద్యులు
ఆనం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
మంత్రి ప్రసంగాన్ని కంటిన్యూ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్లు
-
Aug 15, 2026 09:45 IST
సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం మాది: సీఎం రేవంత్‌రెడ్డి
ఈ ప్రభుత్వ 32 నెలల కృషి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది: సీఎం రేవంత్‌రెడ్డి
తలసరి ఆదాయంలో టాప్‌లో ఉన్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
వ్యవసాయాన్ని పండగ చేయాలని నిర్ణయించాం: సీఎం రేవంత్‌రెడ్డి
రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది: సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 15, 2026 09:30 IST
హైదరాబాద్: గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి
గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్
గోల్కొండ కోటపై తొలిసారి 'వందేమాతరం' గీతాలాపన
-
Aug 15, 2026 09:00 IST
ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు
జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి: భట్టి
రూ.200కోట్ల నిధులతో యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తున్నాం
నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
-
Aug 15, 2026 08:45 IST
కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన పవన్
ఒక తరం స్వాతంత్య్రం కోసం పోరాడితే.. ఒక తరం కాపాడింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ అడుగులు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Aug 15, 2026 08:30 IST
విజయవాడలో జెండా ఆవిష్కరించిన మంత్రి నారా లోకేశ్
పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, MLA బొండా ఉమా
స్వాతంత్య్ర వేడుకలను సరికొత్త స్ఫూర్తితో జరుపుకొందాం: నారా లోకేశ్
సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం: నారా లోకేశ్
వికసిత్ భారత్ నిర్మాణంలో భాగమవుదాం: మంత్రి నారా లోకేశ్
-
Aug 15, 2026 08:15 IST
యువత కేంద్రంగా ప్రధాని మోదీ కీలక ప్రకటనలు
యువతకు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందిస్తాం: మోదీ
-
Aug 15, 2026 08:10 IST
ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్య్రం: ప్రధాని మోదీ
తొలిసారి ఎర్రకోట వద్ద వందేమాతరం ఆలపించాం: ప్రధాని మోదీ
ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోంది: ప్రధాని మోదీ
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది: ప్రధాని మోదీ
దేశం కొత్త సంకల్పంతో ముందుకెళ్తోంది: ప్రధాని మోదీ
వికసిత్ భారత్-2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం: ప్రధాని మోదీ
-
Aug 15, 2026 08:06 IST
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేసిన మోదీ
హెలికాప్టర్ ద్వారా ఎర్రకోటపై పూల వర్షం కురిపించిన వాయుసేన
దేశ చరిత్రలోనే తొలిసారిగా 'వందేమాతరం' గేయం ఆలాపన
-
Aug 15, 2026 08:05 IST
ఢిల్లీ: రాజ్‌ఘాట్ దగ్గర ప్రధాని మోదీ నివాళులు
మహాత్మాగాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ
-
Aug 15, 2026 08:00 IST
భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు
ఆగస్ట్ 7తో ముగిసిన వారానికి 707.002 బిలియన్ డాలర్లకు చేరినట్లు ప్రకటించిన RBI
-
Aug 15, 2026 07:45 IST
కేరళ: రేపు శబరిమల ఆలయం పునఃప్రారంభం
చింగం మాస పూజల నిమిత్తం ఆలయం తెరవనున్నట్లు తెలిపిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్
-
Aug 15, 2026 07:30 IST
బ్రిటన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వివాదాస్పద వ్యాఖ్యలు
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆప్ బ్రిటన్‌గా వ్యాఖ్యానించిన నెతన్యాహు
ప్రపంచంలో అణ్వాస్త్రాలు ఉన్న తొలి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా అభివర్ణించిన నెతన్యాహు
-
Aug 15, 2026 07:15 IST
ప్రజలకు సీఎం చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే: సీఎం చంద్రబాబు
దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి
2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారం చేయాలి: సీఎం చంద్రబాబు
వందేళ్ల స్వాతంత్య్ర వేడుకల నాటికి సమృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు
దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలి: సీఎం చంద్రబాబు
-
Aug 15, 2026 07:00 IST
ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
స్వాతంత్య్ర వేడుకలు ప్రజల్లో నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలి: సీఎం రేవంత్ రెడ్డి
అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కొత్త ఊపునివ్వాలని ఆకాంక్ష
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని సీఎం పిలుపు
-
Aug 15, 2026 06:45 IST
నెదర్లాండ్స్: నేటి నుంచి హాకీ ప్రపంచకప్
తొలి మ్యాచ్‌లో వేల్స్‌తో భారత్ ఢీ
సాయంత్రం 4:30 గంటలకు హాకీ మ్యాచ్
-
Aug 15, 2026 06:30 IST
నేటి నుంచి భారత్-శ్రీలంక తొలి టెస్ట్
శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనున్న భారత్
-
Aug 15, 2026 06:25 IST
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్వాతంత్య్ర దినోత్సవ సందేశం
వికసిత్ భారత్ లక్ష్యంగా మనం పనిచేయాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి..
అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికీ అందాలి..
వందేమాతరం గీతాన్ని మనం గౌరవించాలి..
యువత తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
Aug 15, 2026 06:20 IST
హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబైన గోల్కొండ కోట
గోల్కొండ కోటలో అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలు
80వ స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఉదయం 9:55 గంటలకు గోల్కొండ కోటకు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి
ఉదయం 10 గంటలకు జెండా ఆవిష్కరించనున్న సీఎం
-
Aug 15, 2026 06:15 IST
నేడు రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాంతంత్య్ర వేడుకలు
80వ స్వాతంత్య్ర వేడుకలకు రాయపూడిలోని పరేడ్ మైదానంలో ఏర్పాట్లు
స్వర్ణాంధ్ర-2047 థీమ్‌తో వేడుకలు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం
స్వాతంత్య్ర వేడుకలకు హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు
-
Aug 15, 2026 06:14 IST
80వ స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబైన భారతావని
80వ పంద్రాగస్టుకు ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధం
ఎర్రకోటలపై వరుసగా 13వ సారి జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని మోదీ
ఈ ఏడాది 80వ స్వాతంత్య్ర వేడుకలకు మరో ప్రత్యేకత
దేశ చరిత్రలోనే తొలిసారిగా వందేమాతరం గేయం ఆలాపన
-
Aug 15, 2026 06:10 IST
ఢిల్లీ: నేడు ‘ఆపరేషన్ సింధూర్’ డాక్యుసిరీస్ ప్రసారం
రాత్రి 9 గంటలకు డిస్కవరీ, డిస్కవరీ ప్లస్‌లో ప్రసారం
'ఆపరేషన్ సింధూర్’ డాక్యుసిరీస్‌లో మాట్లాడిన అజిత్ దోవల్
-
Aug 15, 2026 06:07 IST
అమరావతి: 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు పథకానికి నేటితో ఏడాది పూర్తి
'స్త్రీ శక్తి' ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్
నేడు 'స్త్రీ శక్తికి సంవత్సరం-రెట్టింపైన ఆత్మగౌరవం' కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Aug 15, 2026 06:05 IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ ఆమోదం
డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ 2.0: మంత్రి పొంగులేటి
సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలు: మంత్రి పొంగులేటి
-
Aug 15, 2026 06:04 IST
ఇండోనేషియాలో భారీ భూకంపం
భూకంప తీవ్రత 7.7గా నమోదు
గంటన్నర వ్యవధిలో 5సార్లు భూప్రకంపనలు
-
Aug 15, 2026 06:00 IST
నేడు సంగారెడ్డిలో సీఎం రేవంత్ బహిరంగ సభ
లక్ష మందితో సీఎం సభ నిర్వహణకు ఏర్పాట్లు
కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్న సీఎం రేవంత్ రెడ్డి
జిల్లా కేంద్రాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న మంత్రులు