Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - May 13 , 2026 | 07:04 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • May 13, 2026 20:33 IST

    ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన బెంగళూరు

    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ

    • మొదట బ్యాటింగ్ చేయనున్న కోల్‌కతా

    • మరికాసేపట్లో ప్రారంభంకానున్న మ్యాచ్

  • May 13, 2026 20:07 IST

    ప.గో: గణపవరం మండలం ఎస్‌.కొండేపాడులో ఫుడ్‌పాయిజన్‌

    • బజ్జీలు తినడంతో 13 మందికి తీవ్ర అస్వస్థత

    • నలుగురు బాధితులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

    • ముగ్గురి పరిస్థితి విషమం

  • May 13, 2026 19:31 IST

    అమూల్‌, మదర్‌ డెయిరీ పాల ధరల పెంపు

    • లీటర్‌కు రూ.2 చొప్పున పెంచుతూ నిర్ణయం

    • రేపటి నుంచి పెరిగిన ధరల అమలు

  • May 13, 2026 19:27 IST

    విద్యార్థుల యూనిఫాం విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

    • మతపరమైన గుర్తులను ధరించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి

  • May 13, 2026 19:13 IST

    IPK 2026: RCB vs KKR రాయ్‌పుర్‌లో తగ్గిన వర్షం

    • మైదానాన్ని సిద్ధం చేస్తున్న సిబ్బంది

    • వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం

  • May 13, 2026 19:08 IST

    ఈ నెల 16న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • నరసన్నపేట మండలం తామరపల్లిలో ప్రజావేదిక సమావేశం

    • ప్రజలతో ముఖాముఖి, టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ

  • May 13, 2026 19:02 IST

    రాష్ట్ర GSDP వృద్ధిపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

    • కీలక పనితీరు సూచికలు-KPIల ఆడిటింగ్‌పై అధికారులతో సీఎం చర్చ

    • GSDPకి అనుసంధానంగా శాఖల పనితీరు మెరుగుదలపై సమీక్ష

    • రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి డేటా ఆధారిత విధానాలపై సీఎం ఫోకస్

  • May 13, 2026 19:00 IST

    ఐపీఎల్ 2026: బెంగళూరు vs కోల్ కతా మ్యాచ్

    • వర్షం కారణంగా టాస్ ఆలస్యం

  • May 13, 2026 18:46 IST

    అమరావతి: పిఠాపురం టెన్త్ టాపర్లకు డిప్యూటీ సీఎం పవన్ భరోసా

    • ప్రభుత్వ స్కూళ్లలో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య

    • పిఠాపురం నియోజకవర్గం నుంచి 31 మంది విద్యార్థుల ఎంపిక

    • విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక

    • డిప్యూటీ సీఎం పవన్‌ చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు

  • May 13, 2026 18:44 IST

    బండి భగీరథ్‌ మధ్యంతర బెయిల్‌పై రేపు తెలంగాణ హైకోర్టులో విచారణ

    • జస్టిస్ మాధవి బెంచ్‌లో బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

    • రేపు హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో లిస్ట్ అయిన బండి భగీరథ్‌ బెయిల్ పిటిషన్‌

  • May 13, 2026 18:42 IST

    అమరావతి: LPG బ్యాక్‌లాగ్‌లు, రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల వీడియో కాన్ఫరెన్స్‌

    • ఈ నెల 16లోగా గ్యాస్ బ్యాక్‌లాగ్‌లు తగ్గేలా ప్రణాళిక

    • అక్రమాలకు పాల్పడే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు: నాదెండ్ల

  • May 13, 2026 18:38 IST

    నీట్ పేపర్ లీక్‌ కేసులో CBI దూకుడు

    • ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేసిన CBI

    • దేశవ్యాప్తంగా పలు నగరాల్లో CBI సోదాలు

    • CBI అదుపులో పలువురు అనుమానితులు

    • సోదాల్లో సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాల స్వాధీనం

  • May 13, 2026 18:32 IST

    భారత్‌కు చమురు సరఫరాలో ఆటంకం రానివ్వం: రష్యా

  • May 13, 2026 18:29 IST

    చైనాలో అడుగుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

    • బీజింగ్ ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్

    • 8 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు

    • ట్రంప్‌ వెంట కుమారుడు ఎరిక్, కోడలు లారా ట్రంప్

    • ట్రంప్‌తో పాటు ఎలాన్ మస్క్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, బోయింగ్ సీఈఓ సహా 17 మంది ప్రముఖ అమెరికన్ వ్యాపారులు

    • ఇరాన్ యుద్ధం విషయంలో చైనా సహాయం అవసరం లేదన్న ట్రంప్‌

  • May 13, 2026 18:09 IST

    సైబర్ నేరాల్లో తక్షణ స్పందన-ఏపీలో నియంత్రణా వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష

    • సైబర్, ఆర్ధిక నేరాల నియంత్రణకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై చర్చ

    • ఇతరుల బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు వినియోగించకుండా చేపట్టాల్సిన చర్యలు

    • గోల్డెన్ అవర్, ఏపీ సైబర్ పాలసీ తదితర అంశాలపై సమాలోచనలు

  • May 13, 2026 18:07 IST

    అమరావతి: కేంద్రమంత్రి పీయూశ్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ

    • రొయ్యల ఫీడ్ ధరల భారం తగ్గించాలంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ

    • రొయ్యల ఫీడ్ ముడి పదార్థాల ధరల నియంత్రణకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి

    • ఆక్వా రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

    • సోయాబీన్ మీల్, సోయా ఆయిల్ దిగుమతులకు సడలింపులు ఇవ్వాలి: చంద్రబాబు

    • ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి: సీఎం చంద్రబాబు

  • May 13, 2026 17:58 IST

    ఖరీఫ్ పంటలకు కేంద్రం మద్దతు ధరపై స్పందించిన మంత్రి తుమ్మల

    • కేంద్రం ప్రకటనలకే పరిమితమవుతోందని తుమ్మల విమర్శ

    • స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారమే MSP ఉండాలి: తుమ్మల

    • మార్కెట్‌లో ధర రాకపోతే కేంద్రం పంట కొనాలి: మంత్రి తుమ్మల

    • ధరలు ప్రకటించి.. కొనకపోతే ఎలా?: మంత్రి తుమ్మల

  • May 13, 2026 17:47 IST

    ఢిల్లీ: ఖర్గే నివాసంలో కీలక సమావేశం

    • కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న అధిష్టానం

    • కేరళం సీఎం రేసులో ముగ్గురు కీలక నేతలు

    • పోటీలో సతీషన్‌, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌

    • MLAల అభిప్రాయాల ఆధారంగా సీఎం ఎంపిక

    • తుది నిర్ణయం తీసుకోనున్న ఖర్గే, రాహుల్‌గాంధీ

  • May 13, 2026 17:26 IST

    సిట్‌ నోటీసులపై స్పందించిన బండి భగీరథ్‌

    • ఎల్లుండి విచారణకు హాజరువుతానని సిట్‌కు లేఖ

    • సిట్‌ విచారణకు సహకరిస్తానంటూ సిట్‌లకు భగీరథ్‌ లేఖ

    • ఎల్లుండి కీలక ఆధారాలతో విచారణకు వస్తానన్న బండి భగీరథ్‌

  • May 13, 2026 17:22 IST

    రేపు జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా

    • ఏపీ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేసిన KRMB

  • May 13, 2026 17:15 IST

    ఢిల్లీ: కేరళం సీఎం అభ్యర్ధి ఎంపిక పై తుది దశకు చేరుకున్న కసరత్తు

    • కేరళ సీఎంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం

    • 5:30 ఏఐసిసి అధ్యక్షుడుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటి కానున్న రాహుల్

    • తుది నిర్ణయం తీసుకోనున్న మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ

    • కేరళం సీఎం రేసులో వీడి సతీశన్, కేసీ.వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల

  • May 13, 2026 17:01 IST

    హైదరాబాద్‌: గౌలిదొడ్డిలోని పీజీ హాస్టల్‌ లిఫ్ట్‌లో చిక్కుకుని బాలిక మృతి

    • గ్రౌండ్‌ ఫోర్‌ నుంచి ఐదో ఫ్లోర్‌ వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కిన బాలిక

    • పీజీ హాస్టల్‌లో వంట మనుషులుగా పనిచేస్తున్న బాలిక తల్లిదండ్రులు

  • May 13, 2026 16:48 IST

    హిందూమతంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో మహిళల ప్రవేశాల పిటిషన్‌పై విచారణ

    • హిందూమతం ఓ జీవన విధానం: సుప్రీంకోర్టు

    • మత విశ్వాసాన్ని నిరూపించకోవడానికి ఆలయాలకు వెళ్లడం, పాటించడం తప్పనిసరేం కాదు: సుప్రీంకోర్టు

  • May 13, 2026 16:41 IST

    ఇంధన సంక్షోభంతో ఎయిరిండియా కీలక నిర్ణయం

    • అంతర్జాతీయ సర్వీసులను కుదించిన ఎయిరిండియా

    • జూన్ నుంచి ఆగస్టు వరకు అమలు

    • ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్ రూట్లలో నిలిచిపోనున్న సర్వీసులు

  • May 13, 2026 16:36 IST

    సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్‌ బృందం భేటీ

    • ఏపీలో పెట్టుబడుల సహకారం, అవకాశాలపై చర్చ

    • విదేశీ పెట్టుబడుల ఆకర్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

    • పెట్టుబడుల ప్రోత్సాహకానికి గ్లోబల్ భాగస్వామ్యాలపై సీఎం ఫోకస్‌

  • May 13, 2026 16:32 IST

    సైబర్ క్రైమ్ నియంత్రణపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష

    • హాజరైన డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, ఉన్నతాధికారులు

    • బ్యాంకింగ్, ఆన్‌లైన్ మోసాల నియంత్రణపై చర్చ

    • సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు, నియంత్రణ చర్యలపై అధికారుల ప్రెజెెంటేషన్

  • May 13, 2026 16:29 IST

    కొమురం భీం: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో విషాదం

    • రెండు బస్సులు డీకొన్న ఘటనలో ఏడాదిన్నర వయసు గల తరుణ్ మృతి

    • మృతుడు చింతలమానేపల్లి (మం) కొండపల్లి వాసిగా గుర్తింపు

    • బాబును ఎత్తుకుని నానమ్మ బస్సు ఎక్కుతుండగా ప్రమాదం

  • May 13, 2026 16:19 IST

    అమరావతి: రేపు ఏపీ మంత్రివర్గ సమావేశంపై కేబినెట్ భేటీ

    • ఉద‌యం 10:30 గంట‌ల‌కు సచివాల‌యంలో సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న మంత్రిమండలి భేటీ

    • ప్ర‌ధాని పొదుపు పిలుపు చ‌ర్య‌ల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించ‌నున్న కేబినెట్

    • రాష్ట్రంలో ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోంపై చ‌ర్చించే అవకాశం

  • May 13, 2026 16:11 IST

    సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఉబర్ సంస్థ CEO దారా ఖోస్రోషాహి

    • ఉబర్ విస్తర‌ణ‌కు ప్రభుత్వంతో క‌లిసి ముందుకు సాగుతాం: సీఈవో ఖోస్రోషాహి

    • అమెరికా వెలుప‌ల హైద‌రాబాద్‌లో ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

    • భార‌త్ ఫ్యూచ‌ర్ సీటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆస‌క్తి

    • పార్కింగ్ వ్యాపారంలోకి వ‌చ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని సూచించిన సీఎం రేవంత్‌

    • భ‌విష్యత్తు అవ‌స‌రాల దృష్ట్యా మ‌ల్టీ లెవ‌ల్ పార్కింగ్ సెంట‌ర్లు: సీఎం రేవంత్‌రెడ్డి

    • సీఎం సూచ‌నపైన అధ్యయ‌నం చేస్తామ‌న్న ఉబర్ సంస్థ ప్రతినిధులు

  • May 13, 2026 16:08 IST

    పుణె ఇండిగో విమానం గన్నవరం విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

    • పుణె నుంచి హైదరాబాద్‌కు 187 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం

    • హైదరాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో చక్కెర్లు కొట్టిన విమానం

    • అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • May 13, 2026 15:57 IST

    కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి రూ. 37,500 కోట్లు: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

    • ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడకుండా కోల్‌ గ్యాసిఫికేషన్‌: అశ్వినీ

    • భారత్‌లో 401 బిలియన్‌ టన్నుల బొగ్గునిల్వలు: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌

    • కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్లాంట్లు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు: అశ్వినీ

  • May 13, 2026 15:51 IST

    నష్టాల నుంచి కోలుకున్న దేశీయ సూచీలు

    • 49 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

    • 33 పాయింట్లు ఆర్జించిన నిఫ్టీ

    • డాలర్‌తో పోల్చితే 95.70గా రూపాయి మారకం విలువ

  • May 13, 2026 15:44 IST

    హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో కీచక ఎస్‌ఐ

    • మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ సురేశ్ లైంగిక దాడి

    • ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు

    • ఎస్‌ఐపై కేసు నమోదు, పరారీలో ఎస్‌ఐ సురేశ్

  • May 13, 2026 15:40 IST

    విజయవాడకు డిప్యూటీ సీఎం పవన్‌

    • మంగళగిరిలో క్యాంప్‌ ఆఫీస్‌కు పవన్‌ కల్యాణ్‌

    • రేపు కేబినెట్‌ సమావేశానికి హాజరుకానున్న పవన్‌

  • May 13, 2026 15:33 IST

    అమరావతి: ఏపీలో IAS అధికారుల బదిలీలు

    • నంద్యాల జాయింట్ కలెక్టర్‌గా గణోర్ సూరజ్ ధనంజయ్‌ నియామకం

  • May 13, 2026 15:26 IST

    కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

    • ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధర పెంపు

    • పెట్టుబడి ఖర్చుకు 50 శాతం కలిపి రేటు నిర్ణయం

    • వరి కనీస మద్దతు ధర రూ.2,441

  • May 13, 2026 15:19 IST

    విశాఖ: ఆన్‌లైన్‌లో క్రికెట్ అక్రమ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

    • ఆన్‌లైన్‌లో క్రికెట్ అక్రమ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు

    • ప్రధాన నిందితుడు కరణ్‌తో పాటు 8 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సైబర్ క్రైమ్‌ పోలీసులు

    • రూ.2 కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, బ్యాంక్ పాస్‌బుక్‌ల స్వాధీనం

  • May 13, 2026 15:13 IST

    బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం!

    • త్వరలో కొత్త 'గోల్డ్ మానిటైజేషన్' పాలసీ!

    • ఇంట్లో ఉన్న బంగారంతో ప్రజలు వడ్డీ పొందే అవకాశం!

    • 10 గ్రాముల బంగారం ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేయవచ్చు: కేంద్రం ప్రతిపాదన

    • దేశ ఆర్థిక వ్యవస్థను మార్చనున్న 'గోల్డ్ మానిటైజేషన్'

  • May 13, 2026 15:07 IST

    ఇరాన్‌పై అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన

    • IRGC ఆర్థిక మూలాలు చెప్పినవారికి రూ.145 కోట్ల ఆఫర్ ప్రకటించిన అమెరికా

  • May 13, 2026 15:02 IST

    మహారాష్ట్ర: నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో మరొకరి అరెస్ట్

    • శుభం ఖైర్నార్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ

    • రాజస్థాన్‌లో మంగీలాల్‌, దినేశ్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ

    • ముంబైలోని సీబీఐ కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు

  • May 13, 2026 14:57 IST

    నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు

    • నా కేసులో న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది: రఘురామ

    • జగన్‌పై మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది?: రఘురామ

    • నా కేసులో మూడో ముద్దాయి జగన్‌: రఘురామ

    • ఈ కేసులో రెండు, మూడో ముద్దాయిలను ఇంకా విచారణకు పిలవలేదు: రఘురామ

    • రేపటితో నా కస్టోడియల్ టార్చర్ కేసుకు ఐదేళ్లు: రఘురామ

  • May 13, 2026 14:33 IST

    పోక్సో కేసులో పోలీసుల విచారణకు హాజరుకాని బండి భగీరథ్‌

    • విచారణకు హాజరుకావాలని బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు

    • పేట్‌ బషీర్‌బాద్‌ పీఎస్‌లో విచారణకు హాజరుకాని బండి భగీరథ్‌

    • బండి భగీరథ్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌లో విచారణ

    • బండి భగీరథ్‌ పరారీలో ఉన్నారంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు

    • ఆచూకీ తెలిస్తే సమీప పీఎస్‌లో తెలియజేయాలంటూ పోస్టర్లు

  • May 13, 2026 14:23 IST

    ప్రధాని మోదీ పొదుపు చర్యలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

    • ప్రధాని ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ప్రజలకు చంద్రబాబు పిలుపు

    • ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం పరంగా కార్యాచరణ ప్రకటన

    • ఇరాన్ యుద్ధంతో దేశంపై భారం పడుతోంది: చంద్రబాబు

  • May 13, 2026 14:21 IST

    CBSE 12వ తరగతి ఫలితాలు విడుదల

    • www.cbse.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలు

    • CBSE 12వ తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి

    • 88 శాతం బాలికలు, 82 శాతం బాలురు ఉత్తీర్ణత

  • May 13, 2026 14:04 IST

    ప్రధాని పిలుపుతో కాన్వాయ్ తగ్గించుకుంటున్న కేంద్రమంత్రులు

    • భద్రత, పైలెట్ వాహనాల సంఖ్య తగ్గించుకున్న కేంద్రమంత్రులు

    • కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కాన్వాయ్ సగానికిపైగా కుదింపు

    • కాన్వాయ్ తగ్గించుకున్న జేపీ నడ్డా, రామ్మోహన్‌నాయుడు, సీఆర్ పాటిల్

  • May 13, 2026 13:44 IST

    సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి: సీఎం చంద్రబాబు

    • ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు P4 కార్యక్రమం ఒక ఆయుధం: సీఎం

    • 23 నెలల్లో రూ.23లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: సీఎం

    • ఈ కంపెనీలన్నీ వస్తే 23లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి: సీఎం

  • May 13, 2026 13:30 IST

    ఢిల్లీ: మరోసారి నీట్ యూజీ పేపర్ లీకైంది: కేజ్రీవాల్

    • బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక పేపర్ లీక్‌లు: కేజ్రీవాల్

    • ఇటీవలి నీట్ పేపర్ లీక్‌కు రాజస్థాన్ కేంద్ర బిందువుగా ఉంది: కేజ్రీవాల్

  • May 13, 2026 13:06 IST

    తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం

    • OSDగా రాధన్‌ పండిట్ నియామకాన్ని రద్దు చేసిన విజయ్

    • జ్యోతిష్కుడైన రాథన్ పండిట్‌ను OSDగా నియమించిన విజయ్

    • OSD నియామకంపై ఆరోపణలు రావడంతో నియామకం రద్దు

    CM-Vijay.jpg

  • May 13, 2026 12:51 IST

    అమరావతి: సంపద సృష్టించడం చాలా సులభం: సీఎం చంద్రబాబు

    • దేశానికే మెడికల్ హబ్‌గా హైదరాబాద్ తయారైంది: సీఎం

    • లక్ష మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తాం: సీఎం

    • వైద్యులు కూడా AIని నేర్చుకుంటున్నారు: సీఎం

    • లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచన: సీఎం

    • 2027 మే 13న కిమ్స్ ఆస్పత్రిని ప్రారంభిస్తాం: సీఎం

    • 2028 ఆగస్టు 15 కంటే ముందే విశాఖలో గూగుల్ ఆపరేషన్లు: సీఎం

  • May 13, 2026 12:50 IST

    గుంటూరు: నిడమర్రులో సీఎం చంద్రబాబు పర్యటన

    • కిమ్స్ ఆస్పత్రికి భూమి పూజ చేసిన సీఎం చంద్రబాబు

    • బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

    • కిమ్స్ ఆస్పత్రి, స్కిల్ వర్సిటీకి 23 ఎకరాలు కేటాయించిన CRDA

    • ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ హరీష్, మంత్రి పయ్యావుల కేశవ్

  • May 13, 2026 12:48 IST

    ఢిల్లీ: సుప్రీంకోర్టులో టీవీకే ఎమ్మెల్యే సేతుపతికి ఊరట

    • మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే

    • ఫ్లోర్ టెస్ట్‌లో ఓటేయకుండా మద్రాస్ హైకోర్టు ఆంక్షలు

    • హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన సేతుపతి

    • తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా

  • May 13, 2026 12:47 IST

    కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కాన్వాయ్ సగానికిపైగా కుదింపు

    • ఇంధన పొదుపుపై ప్రధాని పిలుపుతో అమిత్‌షా నిర్ణయం

  • May 13, 2026 12:04 IST

    తమిళనాడు: విజయ్ చరిత్ర సృష్టించారు: స్పీకర్

    • విజయ్‌పై అందరికీ విశ్వాసం ఉంది: స్పీకర్

    • విజయ్ అంటేనే విక్టరీ: స్పీకర్

  • May 13, 2026 12:01 IST

    చెన్నై: విజయ్‌కి అదనంగా 39 మంది ఎమ్మెల్యేల మద్దతు

    • విజయ్‌కి మద్దతిచ్చిన కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, IUML, DMDK

    • ఓటింగ్‌లో పాల్గొనని డీఎంకే ఎమ్మెల్యేలు

    • ఓటింగ్‌కు దూరంగా ఐదుగురు ఎమ్మెల్యేలు

  • May 13, 2026 11:50 IST

    తమిళనాడు: బల నిరూపణలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

    • విజయ్‌కి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు

    • వ్యతిరేకంగా ఓటు వేసిన 22 మంది ఎమ్మెల్యేలు

    • అసెంబ్లీ నుంచి డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్

    Vijay-Victory.jpg

  • May 13, 2026 11:44 IST

    తమిళనాడు: బలపరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

  • May 13, 2026 11:33 IST

    తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష

    • కొనసాగుతోన్న ఓటింగ్

  • May 13, 2026 11:33 IST

    చెన్నై: నాకు మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు: సీఎం విజయ్

    • మాది సెక్యులర్ ప్రభుత్వం: సీఎం విజయ్

    • మా ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుంది: విజయ్

    • గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తాం: విజయ్

    • మమ్మల్ని వ్యతిరేకించిన వారి కోసం కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది: విజయ్

    • మా ప్రభుత్వం హార్స్ ట్రేడింగ్ చేయలేదు: విజయ్

    • హార్స్ స్పీడ్‌లో మా ప్రభుత్వం పనిచేస్తుంది: విజయ్

    • అందరికీ సామాజిక న్యాయం మా ధ్యేయం: విజయ్

  • May 13, 2026 11:32 IST

    తమిళనాడు అసెంబ్లీ నుంచి డీఎంకే, అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వాకౌట్

  • May 13, 2026 11:30 IST

    చెన్నై: సీఎం విజయ్‌పై ఉదయనిధి స్టాలిన్ విమర్శలు

    • టీవీకే పార్టీకి మెజారిటీ రాలేదు: ఉదయనిధి

    • ప్రజామోదం పొందడంలో విజయ్ పార్టీ విఫలమైంది: ఉదయనిధి

    • టీవీకేకు బయట నుంచి మాత్రమే మద్దతు ఉంది: ఉదయనిధి

    • 65శాతం ప్రజలు విజయ్‌ని తిరస్కరించారు: ఉదయనిధి

    • అవినీతి పార్టీలతో విజయ్ పార్టీ కలిసిపోయింది: ఉదయనిధి

    • ఇప్పటికే ప్రజల నమ్మకాన్ని విజయ్ కోల్పోయారు: ఉదయనిధి

    • టీవీకేకు ఓటేసిన ప్రజలు బాధపడుతున్నారు: ఉదయనిధి

  • May 13, 2026 11:29 IST

    చెన్నై: పళనిస్వామి వ్యాఖ్యలకు వేలుమణి కౌంటర్

    • మాకు ఎవరూ డబ్బుల ఆశ చూపలేదు: వేలుమణి

    • విజయ్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది: వేలుమణి

  • May 13, 2026 11:28 IST

    చెన్నై: సీఎం విజయ్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం: అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి

    • మా ఎమ్మెల్యేలను సీఎం విజయ్ కలవడం సరికాదు: పళనిస్వామి

    • మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు: పళనిస్వామి

    • మా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆఫర్ చేశారు: పళనిస్వామి

    • సీఎం విజయ్ చెప్పిన పారదర్శకత ఇదేనా?: పళనిస్వామి

  • May 13, 2026 11:26 IST

    హైదరాబాద్: అన్ని విషయాల్లో ఏకరూపత ఉండాలని బీజేపీ కోరుకుంటోంది: కేటీఆర్

    • కానీ వారి బంధువులను రక్షించే విషయంలో ఆ విధానం లేదు: కేటీఆర్

    • ఒక పోక్సో చట్టం.. రెండు ప్రమాణాలు: కేటీఆర్

    • ఒకటి కేంద్రమంత్రి కుమారుడి కోసం.. మరొకటి సామాన్యుల కోసం: కేటీఆర్

  • May 13, 2026 11:24 IST

    పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణస్వీకారం

    • రంగస్వామితో ప్రమాణం చేయించిన గవర్నర్

    • హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

    • మంత్రిగా ప్రమాణం చేసిన మల్లాడి కృష్ణారావు

    • యానాం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా మల్లాడి గెలుపు

  • May 13, 2026 11:23 IST

    ఢిల్లీ: సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత

    • గుర్గావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చేరిన సోనియా

    • సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు

  • May 13, 2026 11:23 IST

    తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం

    • AIADMK ఎమ్మెల్యేల మధ్య వివాదం

    • సభలో మాట్లాడేందుకు రెబల్ ఎమ్మెల్యే వేలుమణికి అవకాశం ఇవ్వడంపై పళనిస్వామి వర్గం అభ్యంతరం

    • వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకున్న పళనిస్వామి వర్గం

    • సభ నుంచి AIADMK పళనిస్వామి వర్గం వాకౌట్

    • విజయ్‌కి మద్దతు తెలిపిన AIADMK రెబల్ ఎమ్మెల్యేలు

  • May 13, 2026 11:20 IST

    తమిళనాడు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు..

  • May 13, 2026 10:39 IST

    విజయ్‌ ప్రభుత్వానికి మద్దతిస్తూనే వీసీకే, డీఎండీకే చురకలు

    • జ్యోతిష్కుడిని విజయ్ OSDగా పెట్టుకోవడంపై అభ్యంతరం

    • శాస్త్రీయమైన ఆలోచన విధానంపై దృష్టి పెట్టాలని సూచన

  • May 13, 2026 10:25 IST

    తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష

    • విజయ్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎన్నుకున్నారు: కాంగ్రెస్

    • టీవీకే ప్రభుత్వం మహిళలకు భద్రత, భరోసా కల్పించాలి: కాంగ్రెస్

    • అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు: వామపక్షాలు

    • రాష్ట్రంలో గవర్నర్ పాలన రావొద్దనే విజయ్‌కి మద్దతు: వామపక్షాలు

    • రాష్ట్ర హక్కుల విషయంలో విజయ్ రాజీపడకూడదు: వీసీకే

    • డీలిమిటేషన్‌పై కేంద్రంతో విజయ్ పోరాడాలి: వీసీకే

  • May 13, 2026 10:04 IST

    ఢిల్లీ: నీట్ పరీక్ష పత్రాల లీకేజీపై సుప్రీంకోర్టులో పిటిషన్

    • నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 పరీక్షల నిర్వహణలో జరిగిన వ్యవస్థాగత వైఫల్యాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు

    • సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ల ఫెడరేషన్ (FAIMA)

  • May 13, 2026 10:02 IST

    సినీ ఇండస్ట్రీకి షాక్

    • ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ(బప్పం)

    • కొత్త సినిమాలు కనిపించడంతో కలకలం

    • సైట్ అందుబాటులో లేకుండా చేసినా మళ్లీ ప్రత్యక్షం

  • May 13, 2026 09:45 IST

    చెన్నై: తిరుచ్చి ఈస్ట్‌ ఎమ్మెల్యేగా విజయ్ రాజీనామా

    • 232కు చేరిన తమిళనాడు అసెంబ్లీ సభ్యుల సంఖ్య

    • బలనిరూపణకు విజయ్‌కి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 117

  • May 13, 2026 09:44 IST

    స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు

    • సెన్సెక్స్ 110, నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభం

  • May 13, 2026 09:42 IST

    తమిళనాడు అసెంబ్లీలో విజయ్ బలపరీక్ష ప్రారంభం

    • తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం విజయ్

    • విజయ్ తీర్మానానికి మద్దతిచ్చిన కాంగ్రెస్

    • విజయ్‌కి మద్దతుగా AIADMK షణ్ముగం వర్గం

    • విజయ్‌కి వ్యతిరేకంగా ఓటేయాలని EPS వర్గం నిర్ణయం

  • May 13, 2026 09:30 IST

    తిరుమల: ఉదయనిధి స్టాలిన్‌పై ఎంపీ రఘునందన్‌రావు ఫైర్

    • సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలను ఖండిస్తున్నా: రఘునందన్

    • ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా ఉదయనిధికి బుద్ధి రాలేదు: రఘునందన్

    • ఉదయనిధి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి: రఘునందన్

  • May 13, 2026 09:23 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్

    • తిరుపతిని ఆధ్యాత్మిక, పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి దుర్గేష్

    • విశాఖ, తిరుపతిని ఐకానిక్ హబ్స్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి

    • తిరుపతి, విశాఖలో కేంద్రం రెండు ప్రధాన ప్రాజెక్టులను మంజూరు చేయనుంది: మంత్రి

  • May 13, 2026 09:22 IST

    హైదరాబాద్: బండి భగీరథ పరారీ అంటూ నగర వ్యాప్తంగా పోస్టర్లు

    • ఆచూకీ తెలిస్తే సమీపంలోని పీఎస్‌లో తెలియజేయాలని పలు ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు

  • May 13, 2026 09:16 IST

    యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు హఠాన్మరణం

    • లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రతీక్ యాదవ్(38) మృతి

    • ములాయం సింగ్ రెండో భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్

  • May 13, 2026 07:51 IST

    మేడ్చల్: జవహర్‌నగర్‌లో నేపాల్ గ్యాంగ్ హల్‌చల్

    • గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో డాక్టర్ విజయలక్ష్మి దంపతులను కట్టేసి, మత్తుమందు ఇచ్చి దోపిడీ చేసిన నేపాలీ గ్యాంగ్

    • 60 తులాల బంగారం, వెండి, రూ.30వేలు దోపిడీ

    • 13 రోజుల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరిన ముఠా

    • సీసీ కెమెరాలు ధ్వంసం చేసి పరారైన నేపాలీ గ్యాంగ్

    • కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో ఘటన

  • May 13, 2026 07:45 IST

    మరో 10 రోజుల్లో కేరళంకు నైరుతి రుతుపవనాలు

    • వారాంతంలోగా అండమాన్‌ తీరానికి నైరుతి రుతుపవనాలు

    • రుతుపవనాల ఆగమనానికి బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం

  • May 13, 2026 07:44 IST

    నేడు కేంద్ర కేబినెట్‌ కీలక భేటీ

    • ఇప్పటికే ప్రధాని మోదీ, నీతిఆయోగ్‌ సూచనలు

    • కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం

  • May 13, 2026 07:44 IST

    నేడు ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన

    • పలు జిల్లాలపై అల్పపీడన ప్రభావం: APSDMA

  • May 13, 2026 07:37 IST

    తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

    • పలుచోట్ల 45 డిగ్రీలకుపైగా నమోదుకానున్న ఉష్ణోగ్రతలు

    • నేడు ఉత్తర తెలంగాణలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసే అవకాశం

  • May 13, 2026 07:37 IST

    నేడు సిట్‌ విచారణకు బండి భగీరథ్‌

    • పోక్సో కేసులో బండి భగీరథ్‌ను విచారించనున్న సిట్‌

    • మధ్యాహ్నం 2 గంటలకు పేట్‌బషీర్‌బాద్‌ పీఎస్‌లో విచారణ

  • May 13, 2026 07:04 IST

    నేడు తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష

    • ఇప్పటికే కాంగ్రెస్‌, లెఫ్ట్‌, వీసీకే, ఐయుఎంఎల్‌ మద్దతు

    • అన్నాడీఎంకే చీలికవర్గం మద్దతు కూడా లభించే అవకాశం

    • తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సంఖ్య 234

    • అసెంబ్లీకి రానున్న 232 మంది ఎమ్మెల్యేలు

    • టీవీకే బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 117

    • టీవీకే 106, కాంగ్రెస్‌ 5, లెఫ్ట్‌ 5, ఐయూఎంఎల్ 2, వీసీకే 2