Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 12 , 2026 | 07:18 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 12, 2026 08:48 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ భరత్

    • దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: ఎంపీ భరత్

  • Oct 12, 2026 08:44 IST

    ఆదిలాబాద్: క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10కోట్ల టోకరా

    • ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్

    • తెలంగాణ, ఏపీలో 500 మంది బాధితులు

  • Oct 12, 2026 08:44 IST

    ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

    • ప్రమాదంలో 139కి చేరిన మృతుల సంఖ్య

    • 82 మందిని రక్షించినట్టు UN అధికారుల వెల్లడి

  • Oct 12, 2026 08:43 IST

    ఢిల్లీకి భారీ వర్ష సూచన

    • ఢిల్లీలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్

    • భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ

    • హర్యానా, యూపీలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్

  • Oct 12, 2026 08:42 IST

    ఢిల్లీ: దేశ ప్రజల తరఫున CJIకి వినతిపత్రం సమర్పిస్తాం: రాహుల్‌

    • ఓట్ చోరీకి ముగింపు పలకాలి.. SIR ప్రక్రియను నిలిపివేయాలి

    • CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేయాలి: రాహుల్‌గాంధీ

  • Oct 12, 2026 08:42 IST

    హైదరాబాద్: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

    • హీలియం గ్యాస్ పీల్చుకుని సౌరభ్ శేఖర్(36) బలవన్మరణం

    • కొండాపూర్‌లోని వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఘటన

    • ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

    • పదేళ్లుగా భోజనం తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్న సౌరభ్

  • Oct 12, 2026 08:41 IST

    హైదరాబాద్: చిక్కడపల్లి వ్యాపారి కిడ్నాప్ కేసులో ట్విస్ట్

    • కిడ్నాపర్లకు డబ్బులిచ్చి శ్రీనివాసరావును విడిపించిన కుటుంబీకులు

    • కిడ్నాపర్లకు వ్యాపారి కుటుంబీకులు రూ.1.5కోట్లు ఇచ్చినట్టు సమాచారం

    • కిడ్నాపర్ల నుంచి తానే తప్పించుకున్నట్టు పోలీసులకు చెప్పిన వ్యాపారి

    • ఇప్పటికే ఏడుగురు కిడ్నాపర్లలో ఆరుగురిని పట్టుకున్న పోలీసులు

  • Oct 12, 2026 08:18 IST

    అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

    • ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్తారు

    • మధ్యాహ్నం 12.00 గంటలకు తుడా పరిధిలో రూ.3 వేలకోట్ల విలువైన పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు

    • మధ్యాహ్నం 02.00 గంటలకు ఆర్టీజీఎస్‌పై సమీక్షిస్తారు

    • సాయంత్రం 04.00 గంటలకు నివాసానికి చేరుకుంటారు

  • Oct 12, 2026 07:43 IST

    నేడు పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌కు CJP నేతలు

    • నిరసన ర్యాలీకి తేదీ కేటాయించాలని కోరనున్న CJP

    • పోలీసులు అనుమతి ఇచ్చిన తేదీన CJP నిరసన ర్యాలీ

    • CEC జ్ఞానేష్‌కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఇప్పటికే CJP ప్రకటన

  • Oct 12, 2026 07:43 IST

    ఏపీలో స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న SEC

    • నేడు వార్డులవారీగా రిజర్వేషన్ల ఖరారు

    • మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లు

    • రేపు రాజకీయ పార్టీలతో SEC సమావేశం

    • పార్టీలతో భేటీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Oct 12, 2026 07:43 IST

    నేటి నుంచి తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు

    • ఉదయం తిరుచ్చి వాహన సేవ

    • రా.7గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీవారి దర్శనం

  • Oct 12, 2026 07:28 IST

    నంద్యాల: శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు

    • రెండవరోజు శ్రీశైలం భ్రమరాంబాదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం

    • రాత్రికి మయూర వాహనంలో స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం

  • Oct 12, 2026 07:26 IST

    ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సహా టీకాంగ్రెస్ నేతలు

    • నేటి ఇండి కూటమి నిరసనల్లో పాల్గొననున్న రేవంత్‌రెడ్డి, మహేష్‌గౌడ్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, నేతలు

  • Oct 12, 2026 07:22 IST

    ఢిల్లీలో మెట్రోపై మళ్లీ ఆంక్షలు

    • సెంట్రల్ ఢిల్లీలోని 6 మెట్రో స్టేషన్ల మూసివేత

    • సాయంత్రం 4గంటల వరకు ఆంక్షలు

  • Oct 12, 2026 07:22 IST

    నేడు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ధర్నా

    • మందకృష్ణ ఆధ్వర్యంలో మహాధర్నాకు పిలుపు

    • తల్లి, కుమారుడి మృతి కేసులో న్యాయం కోసం డిమాండ్

    • ధర్నాకు అనుమతి లేదని ఎస్పీ హర్షవర్ధన్ ప్రకటన

    • ఒంగోలులో భారీగా పోలీసుల మోహరింపు

  • Oct 12, 2026 07:22 IST

    నేడు కాకినాడ CII ప్రాంతీయ పెట్టుబడుల సదస్సు

    • హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్, పలువురు మంత్రులు

  • Oct 12, 2026 07:21 IST

    నంద్యాల: శ్రీశైలం డ్యామ్‌కు ప్రపంచ గుర్తింపు

    • వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు

    • దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి ప్రాజెక్ట్‌గా శ్రీశైలం డ్యామ్

  • Oct 12, 2026 07:21 IST

    అమరావతి: స్థానిక ఎన్నికలపై నేడు కూటమి నేతల భేటీ

    • సా.4గంటలకు చంద్రబాబు, పవన్, మాధవ్ సమావేశం

    • సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం

    • ఈ నెల 14న విడుదల కానున్న స్థానిక ఎన్నికల షెడ్యూల్‌

    • నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి రానున్న నేతలు

  • Oct 12, 2026 07:20 IST

    ఖమ్మంలో శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం

    • టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

    • చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో శంకుస్థాపన మహోత్సవం శిలాన్యాస పూజ

    • మంత్రి తుమ్మల నాగేశ్వర ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు

  • Oct 12, 2026 07:18 IST

    తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

    • ఇవాళ మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ