Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 12 , 2026 | 05:46 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 12, 2026 21:36 IST

    హైదరాబాద్ నగరంలో భారీ వర్షం

    • నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది.

    • ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడుతోంది.

  • Jun 12, 2026 21:16 IST

    నంద్యాల: కొలిమిగుండ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం

    • జమ్మలమడుగు సర్కిల్ వద్ద టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

    • ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు

    • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు, పోలీసులు

    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసు

  • Jun 12, 2026 21:13 IST

    హైదరాబాద్: మియాపూర్‌ మయూరి నగర్‌లో విషాదం

    • 6 నెలల కుమార్తెతోపాటు ఆరంతస్తుల భవనం పైనుంచి దూకిన తల్లి ఈషా

    • తల్లి ఈషా సాహు మృతి, చిన్నారికి గాయాలు

  • Jun 12, 2026 21:10 IST

    విశాఖ: డీజీ 100X ఏపీ సదస్సులో మంత్రి నారా లోకేష్‌

    • వికసిత్ భారత్ నిర్మాణమే మన లక్ష్యం: మంత్రి లోకేష్

    • ఏపీలో నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం: లోకేష్‌

    • నైపుణ్యం కలిగిన మానవ వనరులతోనే పోటీ సామర్థ్యం పెరుగుతుంది: మంత్రి నారా లోకేష్‌

  • Jun 12, 2026 20:45 IST

    యువతను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ట్వీట్

    • యువత కలలు సాకారం చేసేందుకే మా ప్రయత్నం, సంకల్పం: చంద్రబాబు

  • Jun 12, 2026 20:33 IST

    హోర్ముజ్‌లో భారత నౌకలపై దాడిని ఖండించిన ట్రంప్‌

    • భారత నౌకలపై దాడులను సహించబోం: ట్రంప్‌

    • భారత నౌకలపై డ్రోన్లతో ఇరాన్‌ దాడి చేసింది: ట్రంప్‌

    • ఇరాన్‌ దాడులను మా బలగాలు అడ్డుకున్నాయి: ట్రంప్‌

  • Jun 12, 2026 20:33 IST

    విశాఖ: డీజీ 100X ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్

    • సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్‌, ఎంపీ భరత్‌

    • రాష్ట్ర ఉన్నతవిద్యారంగ భవిష్యత్తు, Ai, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చ

  • Jun 12, 2026 20:32 IST

    తెలంగాణలో ఈనెల 25 నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ

    • రాజకీయ పార్టీలతో ఎన్నికల ప్రధానాధికారి సమీక్ష

    • అర్హత ఉన్న ఓటర్ల పేర్లన్నీ జాబితాలో చేర్పిస్తాం: CEO

    • జులై 31న ముసాయిదా ఓటరు జాబితా విడుదల

    • ఆన్‌లైన్‌లోనూ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ

  • Jun 12, 2026 20:30 IST

    నల్లగొండ: ముదిమాణిక్యం దగ్గర రోడ్డుప్రమాదం

    • రెండు బైకులు ఢీకొని సైదులు (54), నరసయ్య (45) మృతి

    • మృతులు అడవిదేవులపల్లి వాసులుగా గుర్తింపు

  • Jun 12, 2026 20:26 IST

    హైదరాబాద్: నగర సీపీకి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ

    • జిమ్‌లలో స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖ

    • యువతను కొందరు జమ్‌ ట్రైనర్లు ప్రోత్సహిస్తున్నారంటూ ఆందోళన

    • అలాంటి జిమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన రాజాసింగ్

  • Jun 12, 2026 20:20 IST

    హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

    • అన్ని శాఖల సమన్వయంతో ఆదాయ లక్ష్యాలు సాధించాలి: భట్టి

    • రాష్ట్రానికి రావాల్సిన పన్ను ఆదాయాన్ని గష్ఠంగా రాబట్టాలి: భట్టి

    • ఎక్సైజ్ శాఖ లక్ష్యాల సాధనకు కార్యాచరణ రూపొందించాలి: భట్టి

    • అసైన్డ్ భూములపై రెవెన్యూ శాఖతో సమావేశం నిర్వహించాలి: భట్టి

    • HILT ప్రాజెక్టును వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

  • Jun 12, 2026 20:18 IST

    బంజారాహిల్స్: నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ NOC సస్పెండ్

    • నిలోఫర్ బిల్డింగ్‌ను తనిఖీ చేసిన ఫైర్ అధికారులు

    • అనుమతులు లేకుండా భవనం పైభాగంలో రెస్టారెంట్ నిర్వహణ

    • నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు గుర్తించిన అధికారులు

    • తక్షణమే ఫైర్ NOC రద్దు చేసిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్

    • భద్రతా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు చేపట్టిన ఫైర్ శాఖ

  • Jun 12, 2026 19:52 IST

    ఢిల్లీ: ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

    • ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

  • Jun 12, 2026 19:00 IST

    హైదరాబాద్‌: డ్రగ్స్‌ తయారుచేస్తున్న ఇద్దరి అరెస్టు

    • 750 గ్రా. మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్న ఈగల్‌ ఫోర్స్‌

    • పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసుల గాలింపు

  • Jun 12, 2026 18:48 IST

    మే నెలలో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం

    • 3.93 శాతానికి చేరిన దేశ ద్రవ్యోల్బణం

    • దేశంలో అత్యధికంగా తెలంగాణలో నమోదు

    • మే నెలలో తెలంగాణ ద్రవ్యోల్బణం 6.1 శాతం

  • Jun 12, 2026 18:21 IST

    నెల్లూరు జిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

    • ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షం

    • నెల్లూరు నగరంలో జలమయమైన రహదారులు

    • పలుచోట్ల తెగిపడిన విద్యుత్ తీగలు, విద్యుత్ సరఫరాకు అంతరాయం

    • గాలుల ధాటికి నేలకొరిగిన చెట్లు, ఇబ్బందులు పడుతున్న ప్రజలు

  • Jun 12, 2026 18:15 IST

    అమరావతి: ఒమన్ తీరంలో క్షిపణి దాడిలో విశాఖవాసి పట్నాల సురేశ్ మృతి

    • సురేశ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

    • సురేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం

    • సురేశ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ

  • Jun 12, 2026 18:11 IST

    ఢిల్లీ: మోదీయే నన్ను కౌగిలించుకున్నారు.. నేను కౌగిలించుకోలేదు: సీఎం రేవంత్

    • తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది: సీఎం

    • కేటీఆర్‌ ఆదేశాలను ఢిల్లీలో కిషన్‌రెడ్డి పాటిస్తున్నారు: సీఎం

    • పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల కాకపోవడానికి కారణం కిషన్‌రెడ్డే: సీఎం

    • రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు కూడా కిషన్‌రెడ్డి అడ్డుపడ్డారు: సీఎం

    • తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్ర సీఎంతో కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లాడలేదు?: సీఎం

    • తెలంగాణ కోసం ప్రధానితో కిషన్‌రెడ్డి ఒక్కసారైనా మాట్లాడారా?: సీఎం

  • Jun 12, 2026 18:09 IST

    ఢిల్లీ: నాకు హిట్లర్‌ ఆదర్శం అని నేనెప్పుడూ చెప్పలేదు: సీఎం రేవంత్‌

    • ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా హిట్లర్‌ తమకు ఆదర్శం అని చెబుతారా?: సీఎం రేవంత్‌

  • Jun 12, 2026 18:09 IST

    ఢిల్లీ: పవన్ కల్యాణ్ అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

    • తెలంగాణకు వచ్చేందుకు, వెళ్లేందుకు, పోటీ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది: సీఎం రేవంత్‌

    • ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే పవన్‌ కల్యాణ్‌పై మా మంత్రులు మాట్లాడారు: సీఎం రేవంత్‌

  • Jun 12, 2026 18:06 IST

    మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ అత్యంత బాధాకరం: రేవంత్‌

    • మీనాక్షి నటరాజన్‌పై అసలు కేసే లేదు: సీఎం రేవంత్‌

    • గాడ్సేనే కాదు కిమ్‌ను కూడా బీజేపీ ఆదర్శంగా తీసుకుంది: రేవంత్‌

    • బీజేపీకి తెలిసింది ఓట్‌ చోరీ.. లేకపోతే సీట్‌ చోరీ: సీఎం రేవంత్‌

    • మధ్యప్రదేశ్‌లో సంఖ్యాబలం లేకపోయినా మూడో అభ్యర్థిని నిలబెట్టినప్పుడే బీజేపీ దుర్బుద్ధి బయటపడింది: సీఎం రేవంత్

    • మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణ అప్రజాస్వామిక చర్య: రేవంత్

    • మహిళా వ్యతిరేకి బీజేపీ: సీఎం రేవంత్

  • Jun 12, 2026 18:05 IST

    అమరావతి: కార్మికుల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి సుభాష్‌

    • ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టారు: సుభాష్

    • కార్మికుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: సుభాష్‌

    • అత్యాధునిక వసతులతో కార్మికులకు లేబర్ అడ్డాలు: సుభాష్‌

    • బాల కార్మిక, వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రత్యేక డ్రైవ్స్‌: సుభాష్‌

    • 1,399 మంది బాల కార్మికులను రెస్క్యూ చేశాం: సుభాష్‌

  • Jun 12, 2026 17:36 IST

    తాడిపత్రి పీఎస్‌ ఎదుట నిరసన దీక్ష విరమించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

    • వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

    • 196(1)BNS సెక్షన్ కింద కేసు నమోదు

    • రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు

  • Jun 12, 2026 17:36 IST

    తిరుపతి: మటన్‌ మార్కెట్లలో అధికారుల తనిఖీలు

    • కుళ్లిన మాంసాన్ని హోటళ్లకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులు

    • పెద్దపీర్ల చావడి మార్కెట్‌లో 500 కేజీల మాంసం సీజ్

  • Jun 12, 2026 17:34 IST

    మమతా బెనర్జీ నాయకత్వానికే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ఎంపీ శత్రుఘ్న సిన్హా

    • ఇతర మార్గాలవైపు వెళ్లే ఉద్దేశం లేదన్న శత్రుఘ్న సిన్హా

    • ఎలాంటి రాజకీయ కూటముల ఏర్పాటు ఆలోచన లేదన్న సిన్హా

    • పార్టీ అధినేత్రి మమతా బెనర్జీతోనే తమ ప్రయాణమని స్పష్టం చేసిన ఎంపీ శత్రుఘ్న సిన్హా

  • Jun 12, 2026 17:25 IST

    ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై దాడి

    • కాన్పూర్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన ఆగంతకులు

    • మోహన్ భాగవత్ సహా ఎవరికీ గాయాలు కాలేదని ధ్రువీకరించిన పోలీసులు

    • దాడికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరి అరెస్టు

  • Jun 12, 2026 17:24 IST

    కర్నూలు: మంత్రాలయం మండలం మాధవరంలో ఉద్రిక్తత

    • మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్‌ రాఘవేంద్రరెడ్డి క్యాంప్ కార్యాలయం ఎదుట వైసీపీ మూకల ఓవరాక్షన్‌

    • బాణాసంచా కాల్చి తొడలుకొడుతూ రెచ్చగొట్టిన వైసీపీ శ్రేణులు

    • వైసీపీ మూకలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, పరస్పర ఘర్షణ

    • రెండు వాహనాలకు నిప్పుపెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

    • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

  • Jun 12, 2026 17:19 IST

    హైదరాబాద్: కూకట్‌పల్లి ఎల్లమ్మ చెరువు FTL, బఫర్ జోన్ బాధితులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

    • ఎల్లమ్మ చెరువు బాధిత ఫ్లాట్ యజమానులకు 400% TDR పరిహారం

    • LP No.43/1980 లేఅవుట్ ఫ్లాట్ యజమానులకు ప్రత్యేక పరిహారం

    • 400% TDR మంజూరు చేస్తూ జీఓ ఎంఎస్ నం.163 జారీ

    • మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సర్వే నం.140లోని ప్రభావిత ఫ్లాట్లకు వర్తింపు

    • అవసరమైన చర్యలు చేపట్టాలని GHMC కమిషనర్‌కు ఆదేశాలు

    • ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వివరణ

    • ఈ ఉత్తర్వులను ఇతర కేసులకు వర్తింపజేయరాదని స్పష్టీకరణ

  • Jun 12, 2026 17:15 IST

    కోల్‌కతా: టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ నివాసానికి చేరుకున్న CID అధికారులు

    • దర్యాప్తులో భాగంగా అభిషేక్ బెనర్జీ ఇంటికి వెళ్లిన CID బృందం

    • అభిషేక్ బెనర్జీ నివాసం వద్దకు భారీగా తరలివచ్చిన టీఎంపీ శ్రేణులు, తీవ్ర ఉద్రిక్తత

  • Jun 12, 2026 17:14 IST

    అనంతపురం: తాడిపత్రి పీఎస్‌ ఎదుట జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన

    • స్టేషన్ ఎదుట అనుచరులతో కలసి ప్రభాకర్‌రెడ్డి బైఠాయింపు

    • పోలీసులకు వ్యతిరేకంగా జేసీ అనుచరుల నినాదాలు

    • పోలీస్‌ స్టేషన్ ఎదుట స్నానం చేసి జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన

    • వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసే వరకు నిరసన తెలుపుతానంటున్న జేసీ

  • Jun 12, 2026 16:55 IST

    బేబీ ఆర్యాంశ్‌కు అండగా సీఎం రేవంత్‌రెడ్డి

    • ఉత్తమ వైద్యం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ

    • తల్లిదండ్రులను సంప్రదించనున్న CMRF అధికారులు

    • SMA టైప్-2తో బాధపడుతున్న ఏడాది చిన్నారి

    • ప్రాణాలను కాపాడే ఇంజెక్షన్‌కు రూ.1.5 కోట్లు అవసరం

    • ప్రజల సహకారంతో ఇప్పటికే రూ.75 లక్షల సేకరణ

    • మిగిలిన నిధుల సమీకరణకు ప్రభుత్వ సహాయంపై ఆశలు

  • Jun 12, 2026 16:51 IST

    యూపీ: పంచాయతీ ఓటర్ల జాబితా నుండి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు గల్లంతు

    • 2024 లోక్‌సభ, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అమేథీ నుంచే స్మృతి ఇరానీ పోటీ

    • పేరు గల్లంతుపై విచారణకు ఆదేశించిన అమేథీ జిల్లా మెజిస్ట్రేట్ సంజయ్ చౌహాన్

  • Jun 12, 2026 16:13 IST

    హైదరాబాద్: హరీష్‌రావు ఆరోపణలను ఖండించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్

    • గురుకుల విద్యార్థుల షూస్, యూనిఫాం, బుక్స్ టెండర్లలో అవినీతి జరగలేదు: మంత్రి

    • రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలను ఖండిస్తున్నా: మంత్రి అడ్లూరి

    • హరీష్‌రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు: మంత్రి అడ్లూరి

    • హరీష్‌రావు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: మంత్రి అడ్లూరి

  • Jun 12, 2026 16:12 IST

    హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ

    • హాజరైన మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌

    • తెలంగాణ ఆదాయ వనరుల సమీకరణపై చర్చ

  • Jun 12, 2026 16:11 IST

    సిద్దిపేట: హరీష్‌రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్

    • సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి

    • హరీష్‌రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి

  • Jun 12, 2026 16:10 IST

    హైదరాబాద్‌: నగరంలో లాజిస్టిక్స్ రంగంపై అంతర్జాతీయ సదస్సు

    • సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు

    • లాజిస్టిక్స్ రంగ భవిష్యత్ అవకాశాలపై సదస్సులో చర్చ

    • గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: శ్రీధర్‌బాబు

    • లాజిస్టిక్స్ పాలసీ 2.0తో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట: శ్రీధర్‌బాబు

    • తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో కీలక రంగంగా లాజిస్టిక్స్: శ్రీధర్‌బాబు

    • పెట్టుబడిదారులకు అన్నివిధాలా సహకారం: మంత్రి శ్రీధర్‌బాబు

  • Jun 12, 2026 16:09 IST

    నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుపై విచారణ

    • శ్రీలత వేసిన పిటిషన్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

    • పిటిషన్ విచారణ తమ పరిధిలోకి రాదన్న న్యాయస్థానం

    • ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చని సూచన

  • Jun 12, 2026 15:48 IST

    అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు

    • సోషల్ మీడియా వేదికగా రిటైర్‌మెంట్ పోస్ట్

    • ఆటను వీడటానికి ఇదే సరైన సమయమంటూ వెల్లడి

  • Jun 12, 2026 15:47 IST

    జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య లోకేశ్‌కు న్యూజెర్సీలో ప్రత్యేక పౌర సత్కారం

  • Jun 12, 2026 15:45 IST

    CBSE Class XII OSM మార్కింగ్ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

    • రీవాల్యుయేషన్ పోర్టల్‌ను తిరిగి తెరవాలని కోరిన పిటిషన్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ

    • జూలైలో రోస్టర్ బెంచ్ ముందు విచారణకు కేసు జాబితా

    • 1.27 లక్షల మంది విద్యార్థులు ఇప్పటికే CBSE పోర్టల్ ద్వారా ఫిర్యాదులు చేశారని SG తుషార్ మెహతా వాదన

  • Jun 12, 2026 15:36 IST

    భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 1,695 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

    • 461 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 12, 2026 15:18 IST

    బాపట్ల: చీరాల మండలం ఈపురుపాలెంలోని ఐటీఐ కళాశాలలో ఘర్షణ

    • కళాశాల సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కుమారుడు జిలానీ కత్తులతో దాడి

    • దాడిలో గాయపడి చికిత్స పొందుతూ కమిటీ సభ్యుడు హుస్సేన్ (60) మృతి

    • కళాశాల ప్రిన్సిపాల్ శేషయ్యకు తీవ్ర గాయాలు

    • ఆర్థిక లావాదేవీల అంశంపై కొంతకాలంగా వివాదం

    • అబ్దుల్ సత్తార్, కమిటీ సభ్యుల మధ్య విభేదాల నేపథ్యంలో ఘటన

    • కళాశాల కమిటీ సమావేశం జరుగుతుండగా దాడి

    • ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 12, 2026 15:14 IST

    ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్

    • కూతురు-కోడలితో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్

    • ‘ఎంత ఎత్తులో ఉన్నా.. నా ఆటిట్యూడ్ మారదు’ అంటూ వీడియోకు క్యాప్షన్

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

    పూర్తికథనం

  • Jun 12, 2026 14:59 IST

    భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

    • దేశానికి గర్వకారణమైన క్రీడాకారుడిని కోల్పోయాం: సీఎం రేవంత్ రెడ్డి

    • ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో జస్పాల్ రాణా విజయాలు చిరస్మరణీయం: సీఎం

    • 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన జస్పాల్ రాణా

    • యువ షూటర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కోచ్

  • Jun 12, 2026 14:50 IST

    ఏదులాపురంలో బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కామెంట్స్

    • సర్ (SIR) ఆనేది భయంకరమైన భూతం: పొంగులేటి

    • చట్టం అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దొంగదారి సర్ (SIR): పొంగులేటి

    • అధికారులు ముందు ఓటు మ్యాపింగ్ చేస్తారు: పొంగులేటి

    • గ్రామంలో ఓట్లు తొలగించేటప్పుడు బూత్ లెవల్ ఏజంట్లు జాగ్రత్తగా ఉండాలి: పొంగులేటి

  • Jun 12, 2026 14:30 IST

    రాజ్యసభకు ఖర్గే సహా 24 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నిక

    • ఎన్డీయేకు రాజ్యసభలో పెరిగిన మరో మూడు సీట్లు, కాంగ్రెస్‌కు ఒక సీటు

    • ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లో చెరో నాలుగు సీట్లు దక్కించుకున్న ఎన్డీయే

    • కర్ణాటకలో మూడు సీట్లు కాంగ్రెస్ కైవసం, ఒక సీటు బీజేపీకి

    • జార్ఖండ్, మిజోరంలో 3 సీట్లకు ఈనెల 18న ఎన్నిక

  • Jun 12, 2026 14:15 IST

    నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట

    • ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టీకరణ

    • ఎన్నికల కమిషన్‌నే ఆశ్రయించాలని సూచన

    • నామినేషన్ తిరస్కరణపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం

  • Jun 12, 2026 14:00 IST

    వన్డే ప్రపంచ కప్ 2027: షెడ్యూల్ ఖరారు?

    • నెట్టింట చక్కర్లు కొడుతున్న వన్డే వరల్డ్ కప్ తేదీలు

    • దీంతో రో-కో క్రికెట్ కెరీర్ టైమ్‌లైన్ ఫిక్స్ అయిందని చర్చ

    • టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

  • Jun 12, 2026 13:55 IST

    నాంపల్లి కోర్టులో మీనాక్షి నటరాజన్ కేసుపై విచారణ

    • జురిస్డిక్షన్ పై మధ్యాహ్నం తీర్పు చెబుతామన్న నాంపల్లి కోర్టు

    • మీనాక్షి నటరాజన్ తరుపున హాజరైన సీనియర్ కౌన్సిల్ జంధ్యాల రవిశంకర్

    • ప్రతివాదులుగా ప్రజా ప్రతినిధులు ఉండటంతో ఈ కోర్టు పరిధిలోకి రాదన్న మీనాక్షి నటరాజన్ న్యాయవాది

    • ప్రతివాదులుగా ఉన్న వారి వివరాలను పరిశీలించి కోర్టుకు తెలపాలని సిబ్బందికి ఆదేశం

    • ప్రతివాదుల్లో ఉన్న మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, వాకిటి శ్రీహరి తదితరులు

    • వీరిలో ఒక్కరు ప్రజాప్రతినిధిగా ఉన్నా.. కోర్టు జురిస్డిక్షన్ కాదని తిరస్కరించే అవకాశం

    • తదుపరి విచారణ మధ్యాహ్నానికి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు

  • Jun 12, 2026 13:47 IST

    వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీశారు: సీఎం చంద్రబాబు

    • తిరుమల శ్రీనివాసుడికి అపచారం జరిగింది: సీఎం చంద్రబాబు

    • ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కలిపారు: సీఎం చంద్రబాబు

    • బ్రిటిష్‌వారు కూడా తిరుమల వెంకన్న జోలికి వెళ్లలేదు: చంద్రబాబు

    • వెంకన్న జోలికి వెళ్తే.. ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు: చంద్రబాబు

    • భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: సీఎం చంద్రబాబు

    • అన్ని ఆలయాలపై దాడులు చేశారు: సీఎం చంద్రబాబు

  • Jun 12, 2026 13:44 IST

    మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంలో దక్కని ఊరట

    • ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం కోర్టు

    • ఎన్నికల కమిషన్‌నే ఆశ్రయించాలని సూచన

    • నామినేషన్ తిరస్కరణపై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం

  • Jun 12, 2026 13:30 IST

    జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌పై జీహెచ్ఎంసీ ఉద్యోగుల దాడి

    • బంజారాహిల్స్‌లో రాంగ్ రూట్‌లో వస్తున్న జీహెచ్ఎంసీ ఉద్యోగుల కారు

    • కారులో జీహెచ్ఎంసీ ఏఈతో పాటూ ఏఎంఓహెచ్ అసిస్టెంట్

    • రాంగ్ రూట్‌లో వస్తున్న కారును అడ్డుకున్న విధుల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీశైలం

    • కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ దాడి చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 12, 2026 13:27 IST

    కృషి, సేవ, అభివృద్ధి లక్ష్యంగా రెండేళ్ల పాలన: మంత్రి నాదెండ్ల మనోహర్

    • మోదీ నాయకత్వం స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్

    • సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో రాష్ట్రాభివృద్ధికి చర్యలు: నాదెండ్ల

    • ప్రజాసేవే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన: నాదెండ్ల

    • ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన: మంత్రి నాదెండ్ల మనోహర్

  • Jun 12, 2026 13:25 IST

    21వ శతాబ్దం ప్రధాని మోదీదే: సీఎం చంద్రబాబు

    • ఆపరేషన్‌ సిందూర్‌తో దేశానికి మోదీ ఆత్మస్థైర్యం ఇచ్చారు: చంద్రబాబు

    • 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా మారుతుంది: చంద్రబాబు

    • మోదీ పాలనలో భారత్‌ ప్రతిష్ట పెరిగింది: సీఎం చంద్రబాబు

  • Jun 12, 2026 13:02 IST

    కర్నూలు: హాలహర్వి మండలం గూళ్యంలో విషాదం

    • పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం

    • తల్లి, కుమార్తె మృతి.. తండ్రి మహేష్‌ పరిస్థితి విషమం

  • Jun 12, 2026 13:01 IST

    ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే: డిప్యూటీ సీఎం పవన్‌

    • NDA సమిష్టి కృషితో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అడ్డుకోగలిగాం: పవన్‌కల్యాణ్‌

    • 2024 ప్రజా తీర్పుతో రాష్ట్రానికి మళ్లీ కొత్త ఆశలు వచ్చాయి: పవన్‌

    • ప్రజా తీర్పు ఒక తరం భవిష్యత్‌కు నమ్మకం కలిగించింది: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

  • Jun 12, 2026 12:58 IST

    హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

    • ఛత్తీస్‌గఢ్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న సీఎం విష్ణుదేవ్

    • ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ మధ్య ప్రాజెక్టులపై చర్చలు

    • సమ్మక్క–సారక్క ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష

    • ప్రాజెక్టుకు NOC మంజూరు చేయాలని ఛత్తీస్‌గఢ్ సీఎంకు ఉత్తమ్‌ విజ్ఞప్తి

  • Jun 12, 2026 12:57 IST

    కూటమి పాలనలో JCBలు, దాడులు, హత్యలు, బూతులు లేవు: మంత్రి లోకేష్‌

    • వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దని నాటి సీఎంను హెచ్చరించా: మంత్రి లోకేష్‌

    • దేవుడితో పెట్టుకుంటే పరిస్థితి ఏంటో ఇవాళ అనుభవిస్తున్నారు: లోకేష్‌

    • రాయలసీమ అంటే NTRకు చాలా ప్రేమ: మంత్రి లోకేష్‌

    • నాడు కరువు వస్తే.. జోలె పట్టుకుని సీమ ప్రజలను ఆదుకున్నారు: మంత్రి లోకేష్‌

  • Jun 12, 2026 12:56 IST

    డబ్బుకు భవిష్యత్‌లో విలువ ఉండదు: ఎలాన్ మస్క్‌

    • భవిష్యత్‌లో Ai, రోబోలే సరుకులు ఉత్పత్తి చేస్తాయి: ఎలాన్ మస్క్‌

    • భిన్నమైన ఆర్థిక వ్యవస్థల్లో జీవిస్తాం: ఎలాన్ మస్క్‌

  • Jun 12, 2026 12:56 IST

    మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంలో విచారణ ప్రారంభం

    • మీనాక్షి తరఫున కౌన్సిల్‌ అభిషేక్ మనుసింఘ్వి వాదనలు

  • Jun 12, 2026 12:55 IST

    నాటోకు అధికారం తగ్గించేందుకు అమెరికా యత్నాలు

    • యుద్ధ విమానాల సంఖ్యలో మూడో వంతు కోతకు ప్రతిపాదనలు

    • నిఘా పరికరాల్లో భారీగా కోత విధించనున్న అమెరికా

  • Jun 12, 2026 12:55 IST

    లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

    • లక్నో ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా దళాల తనిఖీలు

  • Jun 12, 2026 12:54 IST

    ఢిల్లీ: RSS చీఫ్‌ మోహన్ భగవత్‌ ప్రయాణించిన రైలు బోగీపై రాళ్లు విసిరిన ఇద్దరి అరెస్ట్‌

    • లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఫిరోజాబాద్‌ దగ్గర ఘటన

    • సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల గుర్తింపు

  • Jun 12, 2026 11:41 IST

    అనంతపురం: మాజీ MLA కేతిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకరరెడ్డి ఆగ్రహం

    • పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు సిద్ధమైన జేసీ ప్రభాకరరెడ్డి

    • అనుచరులతో వెళ్తున్న జేసీ ప్రభాకరరెడ్డిని అడ్డుకున్న పోలీసులు

    • అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి జేసీ ప్రభాకరరెడ్డి నిరసన

    • కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చేది లేదన్న జేసీ ప్రభాకరరెడ్డి

    • పెద్దారెడ్డికి పోలీసులు భద్రత కల్పించడంపై జేసీ ప్రభాకరరెడ్డి మండిపాటు

  • Jun 12, 2026 11:36 IST

    నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద విషాద ఘటన

    • ఇద్దరు పిల్లలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌లో దూకిన కృష్ణ

    • భార్య సవితతో గొడవపడి కృష్ణ ఆత్మహత్య

    • మృతులు సంగారెడ్డి జిల్లాకు చెందినవారిగా గుర్తింపు

    • కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 12, 2026 11:23 IST

    పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్‌ క్లారిటీ..

    • ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా: లారెన్స్‌

    • ప్రజలు కాదంటే దూరంగా ఉంటా: లారెన్స్‌

    • పొలిటికల్ ఎంట్రీపై త్వరలో ప్రకటిస్తా: లారెన్స్‌

    పూర్తి కథనం..

  • Jun 12, 2026 10:55 IST

    తిరుపతి బయల్దేరిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌

    • రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో తిరుపతిలో సభ

    • ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనపై తిరుపతిలో బహిరంగ సభ

    • పాల్గొననున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, మాధవ్‌, లోకేష్‌

  • Jun 12, 2026 10:54 IST

    ఫిఫా వరల్డ్ కప్ 2026: బోణీ కొట్టిన దక్షిణ కొరియా

    • చెకియాపై సూపర్ విక్టరీ

    • 2-1 తేడాతో చెకియాపై దక్షిణ కొరియా విజయం

  • Jun 12, 2026 10:53 IST

    ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో సెమీస్‌కు చేరిన పీవీ సింధు

    • క్వార్టర్‌ ఫైనల్లో చాన్‌ సు యుపై సునాయాస విజయం

    • 21-6, 21-9 తేడాతో ప్రత్యర్థిని ఓడించిన సింధు

    • అద్భుత ప్రదర్శనతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత స్టార్‌

    • సెమీస్‌లో జపాన్‌ స్టార్‌ అకానే యమగుచితో తలపడనున్న సింధు

    • టైటిల్‌ వేటలో మరో అడుగు ముందుకేసిన పీవీ సింధు

  • Jun 12, 2026 09:58 IST

    తిరుపతి: SV యూనివర్సిటీలో చిరుత సంచారం

    • ఐ, జీ బ్లాక్ మధ్యలో చిరుతను గుర్తించిన విద్యార్థులు

    • ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన విద్యార్థులు

    • అటవీ అధికారులు వచ్చేలోపు అడవిలోకి వెళ్లిన చిరుత

    • ఇటీవల 3 చిరుతలను బంధించి, అడవిలో వదలిన అధికారులు

    • మళ్లీ చిరుత జాడ కనపడటంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు

  • Jun 12, 2026 09:45 IST

    ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా కన్నుమూత

    • మ్యూనిచ్ ప్రపంచకప్ నుంచి తిరుగు పయనంలో అస్వస్థతకు గురైన రాణా

    • చికిత్స పొందుతూ 49 ఏళ్లలో తుదిశ్వాస

    • 2024 ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్‌కు మార్గదర్శిగా నిలిచిన రాణా

  • Jun 12, 2026 09:24 IST

    విశాఖ: మల్కాపురం పరిధిలో కార్డన్ సెర్చ్

    • తెల్లవారుజామున ఇళ్లలో పోలీసుల తనిఖీలు

    • ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రికార్డుల తనిఖీ

    • అనుమానం వున్న వారిని, రికార్డులు సరిగ్గా లేని వాహనాల స్వాధీనం

  • Jun 12, 2026 09:23 IST

    అనంతపురం: మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    • అనుమతి లేకుండా నిర్వహిస్తున్న వైసీపీ వెన్నుపోటు కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు

    • కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

    • పోలీసులు, పెద్దారెడ్డి మధ్య వాగ్వాదం

    • పోలీసులపైకి దూసుకెళ్లిన వైసీపీ శ్రేణులు

    • పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలింపు

  • Jun 12, 2026 08:46 IST

    అడ్వకేట్ ఖాజా మోహిజుద్దీన్ హత్య కేసులో నిందితుల కస్టడీ

    • నిందితులను రెండు రోజుల పాటు విచారించనున్న నాంపల్లి పోలీసులు

    • మహ్మద్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌ను రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు

    • చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు

    • సుపారీ ఇచ్చి న్యాయవాది ఖాజాను హత్య చేయించిన తండ్రీకొడుకులు

    • ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మెహబూబ్ ఆలం ఖాన్

  • Jun 12, 2026 08:44 IST

    జనగామ: లింగాలగణపురం మండలం నవాబ్ పేట దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

    • అర్ధరాత్రి కారు-లారీ ఢీ.. ఇద్దరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

    • మృతులు హనుమకొండకు చెందిన ఇమ్రాన్, సుభాన్‌గా గుర్తింపు

    • క్షతగాత్రులను జనగామ ఆస్పత్రికి తరలింపు

  • Jun 12, 2026 08:30 IST

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్

    • కార్యకర్తే అధినేత అన్న మాటను నిజం చేసిన మంత్రి నారా లోకేష్

    • వైసీపీ నేతల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం

    • మండలిలో వైసీపీ అడ్డుపడినా చేసి చూపించిన లోకేష్

    • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కి ధన్యవాదాలు తెలియజేసిన తోట వీరాంజనేయులు

  • Jun 12, 2026 08:23 IST

    రేపటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన

    • ఫ్రాన్స్‌, స్లొవేకియాలో వారం రోజుల పాటు ప్రధాని పర్యటన

    • రక్షణ, పౌర అణు ఇంధనం రంగాల్లో ద్వైపాక్షిక సహకారం దిశగా ప్రధాని టూర్‌

    • ఫ్రాన్స్‌లో జీ-7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ

    • గ్లోబల్‌ దక్షిణ దేశాల ప్రాధాన్యాలను ప్రస్తావించనున్న ప్రధాని

    • జీ-7 సదస్సులో ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశం

  • Jun 12, 2026 07:21 IST

    నేడు తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

    • మధ్యాహ్నం 12:30కు మండవ ప్రభాకర్‌రావు ఇంటికి రాజ్‌నాథ్‌

    • DRDLలో పలు ప్రారంభోత్సవాలు చేయనున్న రాజ్‌నాథ్‌

    • సాయంత్రం 4 గంటలకు మేధావులతో సమావేశం

    • 6:30కు ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అధికారులతో భేటీ

  • Jun 12, 2026 06:18 IST

    నేడు విశాఖలో మంత్రి నారా లోకేష్‌ పర్యటన

    • ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశానికి హాజరుకానున్న లోకేష్‌

  • Jun 12, 2026 06:18 IST

    నేడు తిరుపతి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

    • దామినీడులో కూటమి రెండేళ్ల పాలనపై బహిరంగ సభ

  • Jun 12, 2026 06:17 IST

    హైదరాబాద్‌లో నేడు ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయి పర్యటన

    • ఇన్వెస్టర్‌ ఇన్వెస్ట్‌‌మెంట్ కార్యక్రమానికి హాజరు

    • సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్‌లో మేధావులతో సమావేశం

    • 6:30కు ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అధికారులతో భేటీ

  • Jun 12, 2026 06:16 IST

    అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో అలజడి

    • ప్రమాదకర పదార్థాలు ఉన్నట్లు అలారం మోగడంతో అప్రమత్తం

    • పలు అంతస్తులు, కారిడార్లలో లాక్‌డౌన్‌ విధింపు

    • మరికొన్నిచోట్ల నుంచి సిబ్బందిని ఖాళీ చేయించిన అధికారులు

    • గాలి నాణ్యత సంబంధిత సమస్యను గుర్తించాం: పెంటగాన్‌ ప్రతినిధి

    • తనిఖీల తర్వాత ఆఫీసును తిరిగి తెరిచిన అధికారులు

  • Jun 12, 2026 05:53 IST

    ఇరాన్‌తో డీల్‌ కుదిరింది: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

    • ఇరాన్‌కు ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదనేదే డీల్‌

    • డాక్యుమెంట్లు ఫైనలైజ్‌ చేసే ప్రక్రియలో ఉన్నాం: ట్రంప్‌

    • త్వరలోనే సంతకాల కార్యక్రమం: ట్రంప్‌

    • ఒప్పందంపై సంతకాలు కాగానే హోర్ముజ్‌ ఓపెన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌

  • Jun 12, 2026 05:53 IST

    హైదరాబాద్‌: నేడు గాంధీభవన్‌లో నిరసన కార్యక్రమం

    • TPCC చీఫ్‌ మహేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నేతల నిరసన

    • మీనాక్షి నామినేషన్‌ తిరస్కరణకు వ్యతిరేకంగా నిరసన

  • Jun 12, 2026 05:53 IST

    ఇంగ్లండ్‌: నేటి నుంచి మహిళల T20 వరల్డ్‌ కప్‌

    • మొత్తం 33 మ్యాచ్‌లు ఆడనున్న 12 జట్లు

    • తొలిపోరులో ఇంగ్లండ్‌ Vs శ్రీలంక.. రాత్రి 11 గంటలకు మ్యాచ్‌

    • ఈ నెల 14న భారత్ Vs పాకిస్థాన్‌ మహిళల జట్ల మ్యాచ్‌

  • Jun 12, 2026 05:46 IST

    ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూళ్ల ఓపెన్‌

    • వేసవి సెలవుల తర్వాత స్కూళ్ల పునఃప్రారంభం

    • విద్యార్థులకు ఈ రోజు నుంచే పాఠ్య పుస్తకాల పంపిణీ

    • యథావిధిగా మధ్యాహ్నభోజనం పథకం అమలు