Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 11 , 2026 | 07:12 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 11, 2026 08:49 IST

    ఢిల్లీ: పోలీసుల అదుపులోనే సీజేపీ ముఖ్య నేతలు

    • అభిజీత్‌ దీప్కే, సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాలను అరెస్ట్‌ చేసిన పోలీసులు

    • నేడు కూడా జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ

    • సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా రెండో రోజూ నిరసనలు

  • Oct 11, 2026 08:46 IST

    ప్రతిపక్ష నేతల నిర్బంధంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన TMC

    • నేడు ప్రత్యేకంగా విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం

    • ఢిల్లీ పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్

    • మాజీ సీఎంలు సహా ప్రతిపక్ష నేతల నిర్బంధంపై అభ్యంతరం

  • Oct 11, 2026 08:45 IST

    హైదరాబాద్‌: పల్లె బాట పట్టిన నగర వాసులు

    • దసరా సెలవులతో ఊళ్లకు పయనమైన జనం

    • ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు

  • Oct 11, 2026 08:45 IST

    ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్‌

    • ఏపీలో మిగిలిపోయిన 271 మద్యం షాపులకు నోటిఫికేషన్‌

    • ఈ నెల 19 అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ

    • ఈ నెల 21న ఉ.8 గంటలకు మద్యం షాపులకు లాటరీ

  • Oct 11, 2026 08:44 IST

    తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు హైకమాండ్‌ పిలుపు

    • నేడు ఢిల్లీకి రేవంత్‌, మంత్రులు, మహేష్‌గౌడ్‌, నేతలు

    • రేపు ఇండియా కూటమి ధర్నాలో పాల్గొననున్న రేవంత్‌, నేతలు

    • రేపటి తెలంగాణ మంత్రుల సమావేశం వాయిదా

  • Oct 11, 2026 08:44 IST

    నేడు తెలంగాణ బీజేపీ నేతల కీలక సమావేశం

    • ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనపై భేటీకానున్న నేతలు

    • హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

  • Oct 11, 2026 08:13 IST

    ఉక్రెయిన్‌ ఇక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి: ట్రంప్

    • రష్యా ఆయిల్ రిఫైనరీలపై దాడులు చేస్తున్న ఉక్రెయిన్‌పై ట్రంప్ ఆగ్రహం

    • తక్షణం దాడులు ఆపాలని డిమాండ్

    • రష్యాతో డీల్‌ కుదుర్చుకునే కొత్త అధ్యక్షుడు అవసరమని వ్యాఖ్య

  • Oct 11, 2026 07:19 IST

    అమెరికా: పెన్సిల్వేనియాలో కాల్పుల కలకలం

    • ఈరీ నగరంలోని ఓ ఇంట్లో దుండగుడి కాల్పులు, 9 మంది మృతి

    • మృతుల్లో గర్భిణి సహా ఇద్దరు చిన్నారులు

    • తర్వాత తుపాకీతో కాల్చుకుని నిందితుడు ఆత్మహత్య

  • Oct 11, 2026 07:18 IST

    నంద్యాల: నేటి నుంచి శ్రీశైలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

    • క్షేత్రంలో 10 రోజుల పాటు ఘనంగా దసరా ఉత్సవాలు

    • అమ్మవారి యాగశాల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం

    • సాయంత్రం శైలపుత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారి దర్శనం

    • రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం

  • Oct 11, 2026 07:18 IST

    సౌదీ రాజధాని రియాద్‌లో క్షిపణి దాడులు

    • దాడుల్లో 12 మంది మృతి, 300 మందికి పైగా గాయాలు

    • హౌతీ తిరుగుబాటుదారులే దాడి చేసినట్టు సౌదీ సంకీర్ణ దళాల ఆరోపణ

    • ప్రతీకారం తప్పదని హెచ్చరిక

  • Oct 11, 2026 07:17 IST

    ఢిల్లీలో నేడు మరోసారి నిరసనలకు CJP పిలుపు..

    • ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద ఆందోళన

    • CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ CJP డిమాండ్..

    • అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

    • ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు..

    • కనాట్ ప్లేస్, మండి హౌస్, పటేల్ చౌక్ పరిసరాల్లో వాహనదారులకు అలర్ట్

  • Oct 11, 2026 07:16 IST

    మేడ్చల్ జిల్లా బొల్లారం పాప కిడ్నాప్ కేసు విషాదాంతం

    • చిన్నారిని చంపేసి క్లబ్ హౌస్ సెల్లార్‌లో పడేసిన సెక్యూరిటీ విక్రమ్

    • పాపను చంపేసిన తర్వాత సికింద్రాబాద్ వచ్చినట్లుగా గుర్తింపు

    • నిందితుడు మొబైల్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్న పోలీసులు

    • సీసీటీవీలో పాప వెనకాలే సెక్యూరిటీ వెళ్తున్న వీడియోలు రికార్డు

    • గత రెండు రోజులుగా సెక్యూరిటీ విక్రమ్ అనుమానాస్పదంగా పాప ఇంటి చుట్టే తిరిగినట్లుగా గుర్తింపు

  • Oct 11, 2026 07:15 IST

    మా విషయాల్లో జోక్యం వద్దు: ఐరాస మానవహక్కుల సంఘంపై భారత్ ఫైర్

    • ఢిల్లీ నిరసనకారుల నిర్బంధం ఆందోళనకరమన్న ఐరాస

    • ఐరాస వ్యాఖ్యలపై భారత్ సీరియస్

    • భారతీయ అధికారులు చట్ట ప్రకారం నడుచుకున్నారని స్పష్టీకరణ

    • నిరసన కార్యక్రమాలతో ప్రజాజీవితానికి ఇబ్బంది కలగకూడదని వ్యాఖ్య

  • Oct 11, 2026 07:15 IST

    స్థిరంగా బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,51,420

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,38,800

    • కిలో వెండి ధర రూ.2,40,000

  • Oct 11, 2026 07:14 IST

    మైసూరు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్ షో, ఎయిర్‌ షో

    • పర్యాటకులను ఆకట్టుకునేలా కంబళి పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు

    • అక్టోబర్ 20న జంబూ సవారీ

    • అంబారీపై చాముండేశ్వరి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో జంబూ సవారీ

  • Oct 11, 2026 07:14 IST

    బెంగళూరు: నేటి నుంచి ఈ నెల 20 వరకు మైసూరు దసరా ఉత్సవాలు

    • దసరా వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన మైసూరు నగరం

    • చాముండేశ్వరి అమ్మవారికి పుష్పార్చనతో దసరా వేడుకలకు శ్రీకారం

    • సంప్రదాయం, సంస్కృతి, సాంకేతికతల కలయికగా వేడుకలు

  • Oct 11, 2026 07:12 IST

    నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

    • ఉదయం 8 గంటల నుంచి అమ్మవారి సర్వదర్శనాలు