Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 10 , 2026 | 05:46 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 10, 2026 08:30 IST

    హైదరాబాద్‌: శంషాబాద్‌లో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

    • నర్కుడలోని రీహేబిటేషన్‌ సెంటర్‌ బాలికల మిస్సింగ్‌

    • ఈ నెల 8న అదృశ్యమైన బాలికలు, కేసు నమోదు

  • Oct 10, 2026 08:15 IST

    తూ గో జిల్లా చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం

    • చిక్కాలపాలెం, అమ్మిగుంట ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి

    • చిక్కాలపాలెం వద్ద పెద్దపులిని వెంబడించిన స్థానికులు

    • పులి ఆకలితో ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు

    • ఐదు రోజులుగా వేటాడని పెద్దపులి

    • పులిని బంధించడానికి విస్తృత ఏర్పాట్లు

  • Oct 10, 2026 08:00 IST

    ఢిల్లీ: CJP ఆందోళనతో భారీ బందోబస్తు ఏర్పాటు

    • డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు

    • ఢిల్లీ సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు

    • జంతర్ మంతర్, పార్లమెంట్, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు

  • Oct 10, 2026 07:45 IST

    ఢిల్లీ: సీజేపీ ఫౌండర్‌ అభిజిత్‌ దీప్కే కీలక వ్యాఖ్యలు

    • దేశ యువత, ప్రజలకు ప్రధాని మోదీ ఎందుకంత భయపడుతున్నారు?: అభిజిత్‌ దిప్కే

    • ఆందోళన తర్వాత దేశ ప్రజలు తనకు ఓటు వేయరని మోదీ భయపడుతున్నట్లుంది: దీప్కే

  • Oct 10, 2026 07:30 IST

    రంగారెడ్డి DMHO స్వర్ణకుమారి సస్పెన్షన్‌

    • రూ.లక్ష లంచం కేసులో ఉన్నతాధికారుల చర్యలు

  • Oct 10, 2026 07:15 IST

    వరంగల్: నేటి నుంచి పూల జాతర బతుకమ్మ పండుగ ప్రారంభం

    • తొమ్మిది రోజులపాటు సాగనున్న బతుకమ్మ వేడుకలు

    • ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ నిర్వాహణకు ఏర్పాట్లు

    • చెరువులు, కుంటల దగ్గర ఏర్పాట్లు చేసిన పంచాయతీ అధికారులు

  • Oct 10, 2026 07:10 IST

    హైదరాబాద్‌: కాసేపట్లో LBనగర్‌ చౌరస్తాలో BRS నిరసన

    • SIR పేరుతో ఓట్లు గల్లంతవుతున్నాయంటూ ఆరోపణ

  • Oct 10, 2026 07:05 IST

    యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

    • ట్యాంకర్‌లోని 22 మంది భారతీయులు క్షేమం

  • Oct 10, 2026 07:00 IST

    ఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే

    • ఢిల్లీలో నేడు ఆందోళన పిలుపు నిచ్చిన CJP

    • సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేపడుతున్న సీజేపీ

  • Oct 10, 2026 06:55 IST

    ప్రధాని ముఖేష్ అంబానీ అంటూ ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు

    • భారత్‌కు అసలైన బాస్ అంబానీనే అంటూ మస్క్ ఎద్దేవా

    • స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని మస్క్ ఆరోపణలు

    • భారత్‌లో గుత్తాధిపత్యం అంతా అంబానీదేనన్న మస్క్

    • స్టార్‌లింక్ అనుమతిని పరిశీలిస్తారా అంటూ ఎక్స్‌లో పోస్ట్

    • మస్క్ గుత్తాధిపత్య ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్రం

  • Oct 10, 2026 06:45 IST

    ఏపీ లిక్కర్‌ రవాణా స్కాం కేసులో కారుమూరిని ప్రశ్నించిన సిట్‌

    • 5 రోజుల కస్టడీలో కారుమూరి నాగేశ్వరరావుపై 350కి పైగా ప్రశ్నలు

    • సబ్‌ కాంట్రాక్టర్ల నుంచి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నిధులపై ఆరా

    • మద్యం రవాణా లావాదేవీలపై ఆధారాలతో ప్రశ్నించిన సిట్‌

    • సిట్ ప్రశ్నలకు కారుమూరి మౌనంగా ఉన్నట్లు సమాచారం

  • Oct 10, 2026 06:40 IST

    తిరుపతి: చిన్నసింగమాల దగ్గర ప్రమాదం

    • రెండు వాహనాల ఢీ.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ మంజునాథ్‌ మృతి

    • 10 మంది ప్రయాణికులకు గాయాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Oct 10, 2026 06:35 IST

    మేడ్చల్‌: మల్కారం క్వారీ దగ్గర ప్రమాదం

    • నీటికుంటలో ఈదకు దిగి యువకుడు పవన్‌సాయి మృతి

  • Oct 10, 2026 06:30 IST

    బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం

    • ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం

    • ఈనెల 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

    • ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనం

    • ఈనెల 14 నాటికి వాయుగుండంగా మారే అవకాశం

  • Oct 10, 2026 06:20 IST

    విజయవాడ: నేడు ఇండియా బ్లాక్ పార్టీల చలో రాజ్ భవన్

    • లెనిన్ సెంటర్ నుంచి ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ కి మార్చ్

    • చలో రాజ్ భవన్‌కి అనుమతి లేదన్న పోలీసులు

    • గన్నవరం, కేసరపల్లిలోని APCC చీఫ్ వైఎస్ షర్మిల నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు

    • షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన గన్నవరం పోలీసులు

  • Oct 10, 2026 06:17 IST

    నేడు ఖమ్మంలో ముగ్గురు మంత్రుల పర్యటన

    • MLC ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి, తుమ్మల

  • Oct 10, 2026 06:15 IST

    తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నేటితో పదేళ్లు

    • దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపు

    • 2 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలన్న కేటీఆర్

  • Oct 10, 2026 06:12 IST

    నేడు తెలంగాణలో ఎంగిలిపూల బతుకమ్మ

    • అన్ని జిల్లాల్లో బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు

  • Oct 10, 2026 06:10 IST

    విజయవాడ: నేడు చలో లోక్‌భవన్‌కు కాంగ్రెస్ పిలుపు

    • CECకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

  • Oct 10, 2026 06:09 IST

    చమురు ఒప్పందంతో USకు పెద్దమొత్తంలో చమురు వస్తోంది: ట్రూత్‌లో ట్రంప్

    • అమెరికాకు కావాల్సిన డీజిల్ కూడా రష్యా నుంచి వస్తోంది

    • చమురు ఒప్పందం విషయంలో పుతిన్‌కు కృతజ్ఞతలు: ట్రూత్‌లో ట్రంప్

  • Oct 10, 2026 06:08 IST

    రష్యాతో అమెరికా బిగ్ డీల్

    • పుతిన్‌తో భారీ చమురు ఒప్పందం ప్రకటించిన ట్రంప్

    • రష్యా డీజిల్‌పై ఆంక్షలను 2027 ఏప్రిల్ వరకూ ఎత్తివేత

    • రష్యా నుంచి 4.8 మిలియన్ టన్నుల డీజిల్ సరఫరా

  • Oct 10, 2026 06:07 IST

    TGRTC కార్మిక సంఘం ఎన్నికల్లో ఎంప్లాయిస్ యూనియన్ విజయం

    • మొత్తం 97 డిపోల్లో 80 ఎంప్లాయిస్ యూనియన్ కూటమి గెలుపు

    • కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం TWU కూటమి ఓటమి

    • ఈనెల 17న ఫలితాలను అధికారికంగా వెల్లడించనున్న కార్మికశాఖ

  • Oct 10, 2026 06:05 IST

    రైల్వే శాఖ కీలక నిర్ణయం

    • నేడు ఢిల్లీలో CJP ఆందోళన నేపథ్యంలో దేశవ్యాప్తంగా 75 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు

  • Oct 10, 2026 06:02 IST

    భారత్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

    • 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం' పురస్కారాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్

  • Oct 10, 2026 06:00 IST

    నేడు ఢిల్లీలో ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

    • CEC రాజీనామా, SIR ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్