Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 07 , 2026 | 05:51 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 07, 2026 21:51 IST

    తెలంగాణలో మెడికల్ టూరిజంపై సర్కార్ ఫోకస్

    • ప్రభుత్వాస్పత్రుల్లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కోసం కమిటీ ఏర్పాటు

    • ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

    • టిమ్స్ సనత్‌నగర్‌లో ప్రత్యేక మెడికల్ టూరిజం బ్లాక్ ప్రతిపాదన

    • విదేశీ రోగులకు ప్రత్యేక సేవలపై అధ్యయనం

    • వైద్య సేవలకు ప్యాకేజీ ధరల ఖరారుపై కమిటీ సిఫారసులు

    • నెల రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక సమర్పించనున్న కమిటీ

  • Jun 07, 2026 21:49 IST

    ఎరువుల పంపిణీలో పారదర్శకతకు APAIMS 2.0 అమలు

    • రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువుల పంపిణీ: మంత్రి అచ్చెన్న

    • కౌలు రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం

    • ఎరువుల మళ్లింపులు అరికట్టేందుకు విజిలెన్స్ బృందాల ఏర్పాటు

    • జిల్లా కలెక్టర్లు, జేసీలు, వ్యవసాయ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్

  • Jun 07, 2026 20:51 IST

    సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు కౌంటర్

    • కిషన్‌రెడ్డి వ్యవహారం నీకు తెలిస్తే నీ సంగతంతా మాకు తెలుసు

    • కిషన్‌రెడ్డి రాజకీయ జీవితం ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు

    • మాకు అధికారం ఉందని ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం లేదు

    • చట్టం తన పని తాను చేసుకుపోతుంది: రాంచందర్‌రావు

  • Jun 07, 2026 20:51 IST

    ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు

    • పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని రద్దు చేసిన పవన్

  • Jun 07, 2026 20:01 IST

    కడప: మైలవరం మండలం వేపరాల దగ్గర పెన్నానదిలో ఇద్దరు గల్లంతు

    • కల్యాణ్‌కుమార్ అనే వ్యక్తి మృతదేహం లభ్యం

    • మృతుడు నంద్యాల జిల్లా కొలిమిగండ్ల మం రామాపురం వాసి

  • Jun 07, 2026 19:00 IST

    హైదరాబాద్‌: పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

    • మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన

    • రూ.960కోట్లతో AOC ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం

    • రూ.416 కోట్లతో TKR కాలేజీ జంక్షన్‌లో 6 లేన్ల ఫ్లైఓవర్ పనులు

    • 100 పడకల మల్కాజ్‌గిరి ఆస్పత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన

    • క్యూర్-1 యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • Jun 07, 2026 18:21 IST

    నంద్యాల: శ్రీశైలం దగ్గర సుండిపెంటలో కారు దగ్ధం, తప్పినముప్పు

    • కారులో మంటలు రావడంతో దిగిపోయిన ప్రయాణికులు

    • హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న కారు

  • Jun 07, 2026 18:20 IST

    ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

    • ముగ్గురు విదేశీయులు సహా ఆరుగురు అరెస్ట్‌

    • రూ.5 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

  • Jun 07, 2026 18:10 IST

    మెదక్: మిలిటరీ కాలనీలో ఆర్మీ ఉద్యోగి దారుణ హత్య

    • వివాహేతర సంబంధం కారణంగా పొన్నం కుమార్‌ని హత్య చేసిన భార్య పద్మ, అత్తమామ, బావమరిది

    • ఇంట్లో ఇద్దరు మహిళలతో ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

  • Jun 07, 2026 18:10 IST

    జగిత్యాల: పట్టణంలో ఒక్కసారిగా మారిన వాతావరణం

    • ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

  • Jun 07, 2026 17:42 IST

    లార్డ్స్ టెస్ట్‌లో న్యూజిలాండ్‌పై 115 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం

    • స్కోర్లు: ఇంగ్లండ్‌ 140, 226, న్యూజిలాండ్‌ 113, 138,

    • 3 టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యం

    • ఈ నెల 17 నుంచి ఓవల్‌లో రెండో టెస్ట్‌

  • Jun 07, 2026 17:30 IST

    కరీంనగర్‌: పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో దుర్యాప్తు ముమ్మరం

    • ముగ్గురు నిందితుల కస్టడీ విచారణలో వెలుగులోకి కీలక విషయాలు

    • ఆయుధాలు, మొబైల్‌ ఫోన్‌ రికవరీ

    • వెలిచాల బైపాస్‌ రోడ్డు దగ్గర చెట్లపొదల్లో దాచిన రెండు పిస్టల్స్‌ స్వాధీనం

    • బీహార్‌లో మరో కీలక నిందితుడు అరెస్ట్‌

  • Jun 07, 2026 17:18 IST

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌, బకాయిల విడుదలపై టీ బీజేపీ పోరుబాట

    • ప్రజాప్రతినిధులతో టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు భేటీ

    • విద్యార్థుల సమస్యల అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం

    • 'విద్యార్థి భరోసా' పేరుతో పోరుబాట కార్యాచరణపై చర్చ

  • Jun 07, 2026 17:13 IST

    హిట్లర్ గతే సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుంది: హరీశ్‌రావు

    • హిట్లర్‌ను చూసి హైడ్రా పెట్టానంటావా?: హరీశ్‌రావు

    • ప్రజలు రేవంత్‌ను తరిమికొడతారు: హరీశ్‌రావు

  • Jun 07, 2026 17:08 IST

    అఫ్గాన్‌-భారత్ ఏకైక టెస్టు: రెండో రోజు ముగిసిన ఆట

    • 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా

    • రెండో రోజు ఆట ముగిసే సమయానికి అఫ్గాన్ స్కోర్ 113/5

    • క్రీజులో రెహమత్ షా(43*)

    • మానవ్ సుతార్ 3, ప్రసిద్ధ్ కృష్ణకు 2 వికెట్లు

  • Jun 07, 2026 16:47 IST

    హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్‌

    • అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం: కిషన్‌రెడ్డి

    • తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరు: కిషన్‌రెడ్డి

    • పొలిమేరకు రాకుండా ఆపేవాడు ఇంకా పుట్టలేదు: కిషన్‌రెడ్డి

    • అన్నింటికి సమయం సమాధానం చెప్తుంది : కిషన్‌రెడ్డి

    • నేను ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు: కిషన్‌రెడ్డి

    • తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: కిషన్‌రెడ్డి

  • Jun 07, 2026 16:45 IST

    2-3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు

    • మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

    • గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు

  • Jun 07, 2026 16:30 IST

    ఇండియా కూటమికి మరో షాక్‌

    • ఇండియా కూటమిలో తాము లేమని ప్రకటించిన ఆమ్‌ ఆద్మీ

  • Jun 07, 2026 16:15 IST

    నంద్యాల: శ్రీశైలం డ్యామ్‌ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

    • ఎడమగట్టు జలాశయం మలుపు దగ్గర మట్టిలో కూరుకుపోయిన టూరిస్ట్ బస్సు

    • రోడ్డుపై బస్సు ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్

    • డ్యామ్‌ నుంచి దోమలపెంట వరకు ట్రాఫిక్ జామ్‌

    • హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఘటన

  • Jun 07, 2026 15:46 IST

    ప్రధాని నరేంద్ర మోదీకి కేరళ సీఎం వీడీ సతీశన్ లేఖ

    • దుబాయ్‌లో మళయాళీ నర్సులు ఉద్యోగం కోల్పోవడంపై ఆందోళన

    • వీసా కష్టాలు ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి

    • యూఏఈ ఎంబసీతో సంప్రదించి సమస్యను పరిష్కరించాలని అభ్యర్థన

  • Jun 07, 2026 15:39 IST

    కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ పెరుగుతున్నాయి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

    • యువతను డ్రగ్స్ నుంచి కాపాడాలి: కిషన్‌రెడ్డి

    • డ్రగ్స్ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయి: కిషన్‌రెడ్డి

    • గ్రామాలు, పట్టణాల్లో డ్రగ్స్ ముప్పు పెరిగింది: కిషన్‌రెడ్డి

    • డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండండి.. యువతను రక్షించండి: కిషన్‌రెడ్డి

  • Jun 07, 2026 15:39 IST

    భారత పర్యటనలో నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్‌ ఖనాల్‌

    • భారత్‌తో సరిహద్దు సమస్యలను దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి సిద్ధం: శిశిర్‌ ఖనాల్‌

    • పరస్పర గౌరవంతో మాట్లాడుకుంటే పరిష్కరించలేని సమస్య అంటూ ఏదీ ఉండదు: శిశిర్‌ ఖనాల్‌

  • Jun 07, 2026 15:30 IST

    జమ్మూకశ్మీర్: పూంచ్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

    • 8 షాపులు దగ్ధం

  • Jun 07, 2026 14:55 IST

    హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి కొత్త డైరెక్టర్‌గా రాహుల్ దేవ్‌రాజ్ నియామకం

    • ప్రస్తుతం నిమ్స్ యూరాలజీ డిపార్టుమెంట్ హెడ్‌గా ఉన్న రాహుల్ దేవ్‌రాజ్

  • Jun 07, 2026 14:36 IST

    నెల్లూరు: వెంకటాచలం మండలం చెముడుగుంటలో వ్యాపారి ఇంట్లో చోరీ

    • బీరువా తాళాలు పగులకొట్టి 30 సవర్ల బంగారు ఆభరణాలు, 40 వేల నగదు అపహరణ

    • ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో చోరీ

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 07, 2026 14:34 IST

    హైదరాబాద్: తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోసం క్రికెట్ క్రీడాకారుల దర్నా

    • తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతి చేసుకోవటానికి సిద్ధం: అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి

    • ఢిల్లీలో అమిత్ షా, జైషా ఇంటి ముందు మౌనదీక్షకు దిగుదాం: వెంకటేశ్వరరెడ్డి

    • కిషన్ రెడ్డి, డీకే అరుణ తలుచుకుంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వస్తుంది: వెంకటేశ్వరరెడ్డి

    • రాదు అనుకున్న తెలంగాణ వచ్చింది.. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు రాదు?: వెంకటేశ్వరరెడ్డి

    • HCA తీరుతో గ్రామీణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది: వెంకటేశ్వరరెడ్డి

    • తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) ఏర్పాటయితేనే గ్రామీణ ప్లేయర్లకు న్యాయం జరుగుతుంది: వెంకటేశ్వరరెడ్డి

  • Jun 07, 2026 13:35 IST

    హరీష్‌రావు ఏదో ఊహించుకుని మాట్లాడుతున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

    • కృష్ణా జలాల గురించి మీకు మాట్లాడే హక్కు లేదు: ఆది శ్రీనివాస్

    • కాళేశ్వరం కూలినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు?: ఆది శ్రీనివాస్‌

    • రాయలసీమకు నీళ్లు ఇస్తామని కేసీఆర్‌ చెప్పలేదా?: ఆది శ్రీనివాస్‌

    • ప్రగతిభవన్‌లో జగన్‌కు ఏం చెప్పారో గుర్తులేదా?: ఆది శ్రీనివాస్‌

    • పొలిటికల్‌ డైవర్షన్‌ కోసం, ఫ్రస్ట్రేషన్‌లో హరీష్‌ మాట్లాడుతున్నారు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌

  • Jun 07, 2026 13:30 IST

    తెలంగాణలో జూన్ 15న పాఠశాలలు పునఃప్రారంభం

    • 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో షెడ్యూల్ మార్పు

  • Jun 07, 2026 13:11 IST

    వృద్ధుడి వీడియోపై స్పందించిన సీఎం చంద్రబాబు

    • సీఎం చంద్రబాబును కలవాలన్న వృద్ధుడి వీడియో వైరల్

    • వీడియోలు పోస్ట్ చేసిన కామధేనువులంకకు చెందిన వృద్ధుడు

    • వృద్ధుడి వీడియోలపై స్పందించిన సీఎం చంద్రబాబు

    • 'సత్యనారాయణ గారు.. రేపు సిద్ధాంతంలో కలుద్దాం' అంటూ.. ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన సీఎం

    • సీఎం స్పందనతో ఆనందంలో సత్యానారాయణ కుటుంబం

  • Jun 07, 2026 12:48 IST

    సీఎం రేవంత్‌రెడ్డికి టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కౌంటర్

    • కిషన్‌రెడ్డిని పొలిమేర దాటనివ్వమని రేవంత్ అంటున్నారు..

    • మమ్మల్ని ఆపడానికి మీరెవరు?: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • మేం తలుచుకుంటే మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తాం..

    • మా నాయకుల జోలికి వస్తే మేమేంటో చూపిస్తాం: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

  • Jun 07, 2026 12:44 IST

    పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన రాఘవ లారెన్స్.!

    • తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం

    • రాజకీయాల్లోకి రావడంపై ఎక్స్‌లో రాఘవ లారెన్స్ పోస్ట్

    • ఈనెల 11న కీలక ప్రకటన చేస్తానన్న లారెన్స్

    • తిరుచ్చి ఈస్ట్ సీటును వదులుకున్న సీఎం విజయ్

  • Jun 07, 2026 12:00 IST

    కాకినాడ: తుని దొండవాక పంచాయతీ అగ్రహారంలో మూడేళ్ల చిన్నారి అదృశ్యం

    • ఆడుకుంటూ వెళ్లి కనిపించకుండాపోయిన చిన్నారి జాను

    • గ్రామస్థులతో కలిసి రాత్రంతా గాలించిన కుటుంబ సభ్యులు

    • కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

    • సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు

    • డ్రోన్ కెమెరాలతో కొండ ప్రాంతంలో జల్లెడ

  • Jun 07, 2026 11:58 IST

    పటాన్‌చెరులో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి: కవిత

    • MLA మహిపాల్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు: కవిత

    • ఇక్కడి MLA అభివృద్ధి చెందారు తప్ప.. ప్రజలు అభివృద్ధి చెందలేదు: కవిత

    • అన్ని పార్టీలూ కలిసి పటాన్‌చెరును దోపిడీ చేస్తున్నాయి: కవిత

  • Jun 07, 2026 11:42 IST

    పోలవరం: దేవీపట్నం సమీపంలో పెద్దపులి కలకలం

    • నిన్న పోలవరం ప్రాజెక్ట్ టన్నెల్ దగ్గర కనిపించిన పులి

    • నేలకోట దగ్గర థర్మల్ డ్రోన్ కెమెరాలో పులి గుర్తింపు

    • పులిని బంధించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్

  • Jun 07, 2026 11:40 IST

    అఫ్గాన్‌తో టెస్టు: లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ 475/6

    • అఫ్గానిస్థాన్‌తో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్

    • రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో భారత్ స్కోర్ 475/6

    • క్రీజులో వాషింగ్టన్ సుందర్(14*), మానవ్ సుతార్(9*)

    పూర్తి కథనం..

  • Jun 07, 2026 11:19 IST

    అఫ్గాన్‌తో టెస్ట్.. రెండో రోజు తొలిసెషన్ చివర్లో పట్టుసడలిన టీమ్ఇండియా

    • వరుస ఓవర్లలో ధ్రువ్ జురెల్(19), పంత్ (81) ఔట్

    • ప్రస్తుతం భారత్ స్కోర్: 104 ఓవర్లకు 456-6

    • క్రీజులో వాషింగ్టన్ సుందర్ - 4, మానవ్ సుతార్ - 0

  • Jun 07, 2026 11:19 IST

    బెంగళూరు: మెట్రో ట్రైన్‌లో ప్రయాణించిన సీఎం డీకే శివకుమార్

    • కనకపురాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం

    • జీరో ట్రాఫిక్ విధానం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా మెట్రోలో ప్రయాణం

    • విధానసౌధ నుంచి కనకపుర రోడ్డు వరకూ మెట్రోలో ప్రయాణం

    • ఆఖరి మెట్రో స్టేషన్లో దిగి రోడ్డు మార్గంలో కనకపుర వెళ్లిన సీఎం

  • Jun 07, 2026 10:57 IST

    అఫ్గాన్‌తో టెస్ట్.. రెండో రోజూ కొనసాగుతున్న భారత్ ఆధిపత్యం

    • నిలకడగా భారత్ బ్యాటింగ్

    • సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రిషభ్ పంత్

    • 126 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ ఔట్

  • Jun 07, 2026 10:56 IST

    సాయంత్రం ఉప్పల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం

  • Jun 07, 2026 10:39 IST

    ఉప్పల్ 100 పడకల ఆస్పత్రికి గ్రీన్‌సిగ్నల్

    • క్యూర్-1 యాప్‌ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

    • రేపు CMC ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం

    • రేపు బాచుపల్లి ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం

  • Jun 07, 2026 10:33 IST

    హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి పట్టివేత

    • 2.5 కిలోల గంజాయి స్వాధీనం, ఒకరి అరెస్ట్

  • Jun 07, 2026 10:31 IST

    సంగారెడ్డి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

    • నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లకు జరిమానా

    • 18 హోటళ్లకు రూ.63.2లక్షల జరిమానా విధింపు

  • Jun 07, 2026 10:31 IST

    హైదరాబాద్: సనత్‌నగర్ జెడ్ కాలనీలో భారీ చోరీ

    • BRS నేత సురేష్‌రెడ్డి ఇంట్లో రూ.కోటిన్నర అపహరణ

    • పోలీసులకు సురేష్‌రెడ్డి ఫిర్యాదు, కేసు నమోదు

  • Jun 07, 2026 10:07 IST

    తిరుమల రెండో కనుమ దారిలో ఎలుగుబంటి సంచారం

    • నిన్న రాత్రి వినాయక ఆలయం దగ్గర సంచరించిన ఎలుగుబంటి

    • ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన భక్తులు

  • Jun 07, 2026 10:06 IST

    విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీస్ యోగాంధ్ర కార్యక్రమం

    • ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం

    • హాజరైన హోంమంత్రి అనిత, వైద్యారోగ్యశాఖ, మున్సిపల్ కమిషనర్లు

    • ఈనెల 21 వరకు అన్ని జిల్లాల్లో యోగాంధ్ర కార్యక్రమం

  • Jun 07, 2026 09:38 IST

    నీట్‌ రీఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ వదంతులపై NTA సీరియస్‌

    • సోషల్‌ మీడియాలో జరగుతున్న ప్రచారం అవాస్తవం

    • రీఎగ్జామ్‌ పేపర్‌ లీక్‌ కాలేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు

    • ఈ నెల 21న నీట్‌ రీఎగ్జామ్‌ నిర్వహించనున్న NTA

  • Jun 07, 2026 09:36 IST

    నిర్మల్: తానూరు మండలం మొగిలి శివారులో చిరుత సంచారం

    • చిరుత దాడిలో ఆవు దూడ మృతి.. భయాందోళనలో స్థానికులు

  • Jun 07, 2026 09:32 IST

    యాదగిరిగుట్టలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

    • లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి

    • ఆలయంలో అభిషేక పూజల్లో పాల్గొన్న కిషన్‌రెడ్డి

  • Jun 07, 2026 08:08 IST

    నేడు తెలంగాణ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశం

    • బీజేపీ అనుబంధ విభాగాలతో భేటీకానున్న టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • సాయంత్రం బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశం

  • Jun 07, 2026 07:49 IST

    నేటి నుంచి ఏపీలో యోగా కార్యక్రమాలు

    • ఈనెల 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు

  • Jun 07, 2026 07:43 IST

    నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి మల్లు విక్రమార్క

  • Jun 07, 2026 06:40 IST

    రేపు ఇండియా కూటమి సమావేశం

    • ఇండి కూటమి భేటీకి DMK దూరం

    • వర్చువల్‌గా హాజరుకానున్న UTB

  • Jun 07, 2026 06:39 IST

    రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ

    • నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ

    • ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు

  • Jun 07, 2026 06:39 IST

    నేడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌

    • ఫైనల్‌లో తలపడనున్న జ్వెరెవ్‌, కొబోలి

    • సాయంత్రం 6:30కు మ్యాచ్‌

  • Jun 07, 2026 06:38 IST

    రెండ్రోజుల్లో తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

    • తేలికపాటి వర్షాలతో చల్లబడిన వాతావరణం

    • ఏపీలో ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు

    • నేడు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

    • ఉత్తరాంధ్రలో మండుతున్న ఎండలు

  • Jun 07, 2026 06:38 IST

    రేపు రాజ్యసభ నామినేషన్లకు చివరి గడువు

    • ఎల్లుండి రాజ్యసభ నామినేషన్ల పరిశీలన

    • ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌

    • 18న సాయంత్రం వెలువడనున్న ఫలితాలు

  • Jun 07, 2026 06:23 IST

    మంచిర్యాల : మందమర్రి టోల్ గేట్ వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా

    • తెల్లవారుజాము 4 గంటల సమయంలో ప్రమాదం

    • డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం

    • ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. బస్సులో ఉన్న ఒక్క ప్రయాణికుడు సురక్షితం

    • కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు

  • Jun 07, 2026 06:09 IST

    సంగారెడ్డి జిల్లాలో నేడు TRS చీఫ్‌ కవిత పర్యటన

    • సంగారెడ్డి చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకూ ర్యాలీ

  • Jun 07, 2026 05:52 IST

    టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన ముగ్గురు అభ్యర్థులు

    • సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ ఎంపిక

    • అభ్యర్థులకు బీ-ఫారమ్స్‌ అందజేసిన సీఎం చంద్రబాబు

    • క్యాంపు ఆఫీసులో ముగ్గురు అభ్యర్థులతో సీఎం చంద్రబాబు భేటీ

    • ప్రజా సమస్యలపై ఏపీ గళం వినిపించాలని చంద్రబాబు సూచన

    • సోమవారం నామినేషన్లు వేయనున్న ముగ్గురు అభ్యర్థులు

  • Jun 07, 2026 05:51 IST

    దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు

    • 14.2 కేజీల డొమెస్టిక్‌ LPG సిలిండర్‌పై రూ.29 మేర పెంపు

    • నేటి నుంచే అమల్లోకి రానున్న పెంచిన ధరలు

    • ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు చేరిక

    • హైదరాబాద్‌లో రూ.965 నుంచి రూ.994కు చేరిక

    • డొమెస్టిక్‌ సిలిండర్‌ రేట్లు పెరగడం 3 నెలల గ్యాప్‌లో ఇది రెండోసారి

  • Jun 07, 2026 05:51 IST

    కడప జిల్లాలో నేడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ పర్యటన

    • పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌ను పరిశీలించనున్న పవన్‌