-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International Live Updates of 23rd May 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 23 , 2026 | 06:39 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 23, 2026 21:21 IST
ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
25 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణపై ఫోకస్: పొంగులేటి
R&D యూనిట్లకు పరిశ్రమ హోదా: మంత్రి పొంగులేటి
-
May 23, 2026 21:21 IST
అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు నిధులు మంజూరు చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
CURE పరిధి ప్రజలకు 30 శాతం ఇళ్లు కేటాయిస్తాం: పొంగులేటి
హైదరాబాద్‌లో లక్ష LIG ఇళ్ల నిర్మాణం: మంత్రి పొంగులేటి
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.587 కోట్లు: పొంగులేటి
2030 నాటికి టాప్-5 లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ: పొంగులేటి
-
May 23, 2026 21:20 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
జూన్ 1న సీఎం రేవంత్ చేతులమీదుగా ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేలు చొప్పున ఇళ్లు: పొంగులేటి
తెలంగాణలో 14,800 పూరిళ్లు ఉన్నట్లు గుర్తించాం: పొంగులేటి
పూరిళ్లలో ఉన్న అందరికీ రెండోవిడతలో ఇళ్లు: పొంగులేటి
ఇళ్ల స్థలాలు ఉన్న 18,500 మందికి ఈనెలాఖరుకు ప్రొసీడింగ్స్
లక్ష ఇళ్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం: మంత్రి పొంగులేటి
-
May 23, 2026 20:21 IST
బాపట్ల: పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు
అధికారికంగా ప్రకటించిన బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్
సుప్రీంకోర్టు తీర్పుతో పాస్టర్ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు
పాస్టర్ ఆనంద్‌పై న్యాయ పోరాటం చేసిన అక్కల రామిరెడ్డి
-
May 23, 2026 20:14 IST
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ విధివిధానాల విడుదల
సచివాలయంలో HILTP విధివిధానాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసిన మంత్రి శ్రీధర్ బాబు
హాజరైన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఎండీ శశాంక
ORR పరిధిలో 9,292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి గ్రీన్ సిగ్నల్
పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌కు మల్టీ-యూజ్ జోన్ హోదా
-
May 23, 2026 19:19 IST
కర్నూలులో భారీ వర్షం
నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
పలు కాలనీలకు నిలిచిన కరెంట్ సరఫరా
తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగర వాసులు
-
May 23, 2026 18:17 IST
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
కేసముద్రం ఫైర్ స్టేషన్‌కు 18 పోస్టులు మంజూరు
ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం, పాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
2027 గోదావరి పుష్కరాలకు రూ. వెయ్యి కోట్లు
గంగాధరలో నూతన డిగ్రీ కాలేజీకి 29 పోస్టులు
-
May 23, 2026 17:51 IST
అనకాపల్లి జిల్లాలో గాలుల బీభత్సం
సత్యవరంలో కొబ్బరి చెట్టు కూలి ఇద్దరు వ్యవసాయ కూలీల మృతి
మృతులు అరట్లకోట గ్రామానికి చెందిన శంకరయ్య, ఎరకయ్యలుగా గుర్తింపు
-
May 23, 2026 17:50 IST
నాగర్ కర్నూల్: అచ్చంపేటలో వరణుడి బీభత్సం
ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
మార్కెట్ యార్డులో తడిసి ముద్దయిన మొక్కజొన్నలు
వర్షానికి నీటిలో కొట్టుకుపోయిన మొక్కజొన్నలు
భారీగా నష్టపోయామని వాపోతున్న రైతులు
-
May 23, 2026 17:31 IST
విజయవాడ: థార్ జీపులతో హంగామా సృష్టించిన కేసులో అప్‌డేట్
ఈ కేసులో ఏ1 గా బొల్లా ఓం, ఏ2 గా లింగమనేని రోహిత్‌ను చేర్చిన పోలీసులు
లింగమనేని రోహిత్, బొల్లా ఓం ను కోర్టులో హాజరు పరిచిన పటమట పోలీసులు
14 రోజులపాటు రిమాండ్ విధించిన కోర్టు
-
May 23, 2026 17:17 IST
ఆదివారం నాడు రాజమండ్రిలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్
గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించనున్న పవన్
-
May 23, 2026 17:15 IST
చిన్నారుల అక్రమ రవాణాను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు
2011 నుంచి కనిపించకుండాపోయిన తమిళనాడుకు చెందిన చిన్నారి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
పిల్లల మిస్సింగ్ కేసులపై కిడ్నాప్ FIR తప్పనిసరి: సుప్రీంకోర్టు
దేశంలో సుమారు 47 వేల మంది చిన్నారుల ఆచూకీ లేదు: సుప్రీంకోర్టు
ఎవరైనా కనిపించకుండాపోతే వెంటనే కేసు నమోదు చేయాలి: సుప్రీంకోర్టు
ప్రాథమిక విచారణ పేరుతో ఆలస్యం చేయొద్దు: సుప్రీంకోర్టు
సమస్య తీవ్రతను ఎవరూ సరిగా గుర్తించడంలేదు: సుప్రీంకోర్టు
-
May 23, 2026 17:00 IST
రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు బిగ్ రిలీఫ్
ఏషియన్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
-
May 23, 2026 16:56 IST
జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండలం రేపాక గ్రామంలో విషాదం
పంట పొలాల్లో చెలరేగిన మంటలు
మంటలు ఆర్పబోయి ప్రమాదవశాత్తు మంటల్లో పడి చాగర్ల చంద్రమౌళి(62) మృతి
-
May 23, 2026 16:22 IST
బీఆర్‌ఎస్ నేతలు చీప్ పాలిటిక్స్ చేయొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ప్రజలు కోరుకున్నది తప్పకుండా చేసి తీరుతాం: మంత్రి
ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా?: మంత్రి
హరీశ్ రావు పగటి కలలు కంటున్నారు: మంత్రి
-
May 23, 2026 16:00 IST
తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం
పెద్ది చిత్ర ప్రదర్శనకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందే
పెద్ది కాదు ఇక ఏ సినిమా అయినా మాకు పర్సంటేజ్ కావాలి
పర్సంటేజ్ ఇస్తేనే సినిమాను ఆడిస్తాం: ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
నిర్మాతలు కావాలనే జాప్యం చేస్తున్నారు
250 మంది ఎగ్జిబిటర్లందరిదీ ఒకటే మాట
సంతకం చేసి ఇస్తేనే పెద్ది సినిమా ఆడిస్తాం: ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
-
May 23, 2026 15:44 IST
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మండిపడిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
8 రోజుల్లోనే మూడుసార్లు ధరలు పెంచారని ఖర్గే ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారని మండిపాటు
-
May 23, 2026 15:44 IST
10 ఏళ్ల బాలిక హత్య.. స్పందించిన సీఎం విజయ్
తమిళనాడు: కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక హత్య ఘటన పెను దుమారం రేపుతోంది.
తాజాగా ఈ ఘటనపై సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు
ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు
నిందితులను కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు సీఎం విజయ్
-
May 23, 2026 15:37 IST
చిత్తూరు: సోడిగానిపాలెం ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
ఐదుగురికి తీవ్రగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
May 23, 2026 15:07 IST
రాహుల్ ప్రధాని అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది: జగ్గారెడ్డి
రాజ్యాంగం లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది: జగ్గారెడ్డి
ఓటు చోరీతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది: జగ్గారెడ్డి
మోదీకి అహంకారం పెరిగింది, పాలనపై ఆలోచన లేదు: జగ్గారెడ్డి
-
May 23, 2026 15:05 IST
కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ
కొత్త పెన్షన్లు, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా, పెండింగ్ ప్రాజెక్టులపై కీలక నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
-
May 23, 2026 14:53 IST
అమరావతి: ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
రాజీనామా లేఖను డిప్యూటీ సీఎం పవన్‌కు అందజేసిన శ్రీధర్
తనపై వచ్చిన ఆరోపణలపై పవన్‌కు శ్రీధర్ వివరణ
వ్యక్తిగత కారణాలతోనే విప్ పదవికి రాజీనామా: శ్రీధర్
-
May 23, 2026 14:52 IST
తెలంగాణ వ్యాప్తంగా హీట్‌వేవ్‌పై హైఅలర్ట్
వేడి గాలులతో 7 జిల్లాల్లో 16 మంది మృతి
మృతుల కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా
వచ్చే 3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన
ఉ.11నుంచి సా.4గంటల వరకు బయటకు రావొద్దు: మంత్రి పొంగులేటి
-
May 23, 2026 14:46 IST
కాక్రోచ్ ఉద్యమంపై జగ్గారెడ్డి స్పందన
కాక్రోచ్ ఉద్యమం మంచి ఉద్దేశంతోనే వచ్చింది: జగ్గారెడ్డి
కాక్రోచ్ ఉద్యమకారులు దేశ పాలనను బేరీజు వేయాలి: జగ్గారెడ్డి
కాంగ్రెస్ పాలన, బీజేపీ పాలన తేడాలు గమనించాలి: జగ్గారెడ్డి
-
May 23, 2026 13:35 IST
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
శిలాతోరణం సర్కిల్ దాటిన భక్తుల క్యూలు
క్యూలోకి కొత్తగా వచ్చే భక్తులకు అనుమతి నిలిపివేసిన టీటీడీ
క్యూలో ఉన్న భక్తులకు రేపు దర్శనం అయ్యే అవకాశం
రేపు ఉదయం వరకూ క్యూల వద్దకు రావొద్దని టీటీడీ విజ్ఞప్తి
-
May 23, 2026 12:49 IST
అమరావతి: క్లస్టర్ ఇన్‌చార్జ్‌లకు మంత్రి లోకేష్ దిశానిర్దేశం
అంతా కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలి
మహానాడును పండుగ వాతావరణంలో నిర్వహించాలి: లోకేష్
క్లస్టర్ల బలోపేతానికి ఇదో మంచి అవకాశం: మంత్రి లోకేష్
-
May 23, 2026 12:48 IST
జగన్‌రెడ్డి చేసేవే హత్యా రాజకీయాలు: టీడీపీ నేత పార్థసారథిరెడ్డి
పులివెందులలో వైఎస్ కుటుంబ రాజకీయం హత్యలతోనే మొదలైంది
వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న ఎంతోమందిని హత్యచేశారు: పార్థసారథిరెడ్డి
అడ్డుగా ఉన్నవాళ్లనూ చంపేశారు: పార్థసారథిరెడ్డి
-
May 23, 2026 12:47 IST
హైదరాబాద్: కారు ఢీకొట్టిన ఘటనలో గాయపడ్డ అడ్వకేట్ మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్
మాసబ్ ట్యాంక్‌లో ఇంటి బయట అడ్వకేట్‌ను కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు
-
May 23, 2026 11:53 IST
పెద్దపల్లి: కాల్వ శ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో రైతుల నిరసన
BRS నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు
పంట మార్కెట్‌కు వచ్చి నెల దాటినా కొనుగోలు చేయడం లేదని ఆవేదన
తక్షణమే మొక్కజొన్న కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
-
May 23, 2026 11:52 IST
అమరావతి: వివేకా హత్య ఎలా జరిగిందో అందరికీ తెలుసు: సీఎం రమేష్
వివేకాను ఎవరు హత్య చేశారని మీ సోషల్ మీడియాలోనే అడగండి: సీఎం రమేష్
వివేకా హత్య కేసులో జగన్ ప్రమేయంపై ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి: సీఎం రమేష్
మీపైనే 80శాతం ఆరోపణలు రాకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: సీఎం రమేష్
జగన్ శాంతిదూతగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారు: సీఎం రమేష్
-
May 23, 2026 11:51 IST
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఫలితాలను విడుదల చేసిన సాంకేతిక విద్యా కమిషన్ చైర్మన్ దేవసేన
-
May 23, 2026 11:49 IST
ఖైరతాబాద్ జలమండలి కార్యాలయాన్ని ముట్టడించిన BRS
ఖాళీ బిందెలు, కుండలతో BRS శ్రేణుల నిరసన
హైదరాబాద్ ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్
-
May 23, 2026 11:49 IST
ఢిల్లీలో 91వ రోజ్‌గార్ మేళా
వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 51 వేల మందికి ఉద్యోగాలు
ఉద్యోగాలు పొందినవారికి నియామక పత్రాలు
-
May 23, 2026 11:24 IST
హైదరాబాద్: టెక్నో రీచ్ CEO లక్ష్మీకాంత్‌గౌడ్‌పై కేసు
ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు
ట్రైనింగ్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1.5లక్షల వరకు వసూలు
ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపణలు
-
May 23, 2026 11:23 IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో దేవరకద్ర MLAకు సిట్ నోటీసులు
గత ఎన్నికల సమయంలో మధుసూదన్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు గురైనట్టు చెబుతున్న సిట్ అధికారులు
ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్న సిట్
-
May 23, 2026 11:21 IST
చైనా: లీ షెన్‌యూ బొగ్గు గనిలో భారీ పేలుడు
82 మంది మృతి, మరో 9 మంది గల్లంతు
పలువురి పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
-
May 23, 2026 11:03 IST
హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ దగ్గర న్యాయవాదిపై హత్యాయత్నం
న్యాయవాది మొయినుద్దీన్‌ను కారుతో ఢీకొట్టిన ప్రత్యర్థులు
ఇంటి నుంచి బయటకు రాగానే కారుతో ఢీకొట్టిన దుండగులు
మొయినుద్దీన్ పరిస్థితి విషమం.. ఆస్పత్రికి తరలింపు
సీసీ టీవీలో రికార్డైన దాడి దృశ్యాలు
-
May 23, 2026 11:02 IST
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలో మంత్రి తుమ్మల పర్యటన
డ్రోన్ టెక్నాలజీని పరిశీలించిన మంత్రి తుమ్మల
సాంకేతిక వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచన
డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: తుమ్మల
-
May 23, 2026 11:01 IST
రాజ్యసభ సీట్లను అమ్ముకుంటున్న ఆప్: హర్భజన్ ఆరోపణలు
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన మాజీ స్పిన్నర్ హర్భజన్
ఇటీవల కొందరు ఆప్ ఎంపీలతో కలిసి బీజేపీలో చేరిన హర్భజన్
తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ కీలక ఆరోపణలు చేసిన భజ్జీ
-
May 23, 2026 10:21 IST
అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో విషాదం
జీకే వీధి మండలం సీలేరులో ఏపీ జన్‌కో ఉద్యోగి ఆత్మహత్య
ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న దార సింహాచల పాత్రో
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 23, 2026 10:21 IST
హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ కోసం కొత్త కంపెనీలు రావడం శుభసూచకం: కిషన్‌రెడ్డి
కోల్ ద్వారా 73శాతం పవర్ వస్తుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
గ్రీన్ ఎనర్జీ కోసం అందరం బాధ్యత తీసుకోవాలి: కిషన్‌రెడ్డి
-
May 23, 2026 10:12 IST
కర్ణాటక: లాడ్లాపూర్ దగ్గర రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొట్టిన క్రూజర్.. ఐదుగురి మృతి
మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తింపు
మృతులు క్యాష్వార్, హుస్సేన్, అలీ, రసూల్, ఫాతిమాగా గుర్తింపు
-
May 23, 2026 10:09 IST
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
రూ.100కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
టెంపుల్ సిటీలో వేద పాఠశాలకు శంకుస్థాపన
కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి వేదపాఠశాలకు భూమిపూజ చేసిన సీఎం
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, లక్ష్మణ్, కొండా సురేఖ
-
May 23, 2026 09:43 IST
ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’
మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యం
4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ
అన్న క్యాంటీన్‌లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి నారాయణ
ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్‌స్వీప్: మంత్రి నారాయణ
-
May 23, 2026 09:41 IST
భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
భారత్‌లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
శనివారం ఉదయం కోల్‌కతాకు చేరుకున్న రూబియో
-
May 23, 2026 08:48 IST
సత్య సాయి జిల్లా: కదిరిలో ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
మున్సిపల్ కార్మికులతో కలిసి చెత్తను ఊడ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్
-
May 23, 2026 08:46 IST
విశాఖ: కొత్త గాజువాక మసీదు సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో వ్యక్తి ఆత్మహత్య
మృతుడు అదే షాపుల్లో గ్యాస్ స్టవ్ రిపేర్ చేసే సంతోష్‌గా గుర్తింపు
ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సంతోష్
ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
May 23, 2026 08:42 IST
అనకాపల్లి: కసింకోట మండలం ఉగ్గినాపాలెం హైవేపై ప్రమాదం
లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరి మృతి, మరో ఆరుగురికి గాయాలు
మృతులు మునగపాకకు చెందిన ఆడారి కుర్మారావు(42), జ్యోతి(31)గా గుర్తింపు
భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన
-
May 23, 2026 08:20 IST
ఈ నెల 26 నుంచి IPL ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు
26న క్వాలిఫయర్-1లో బెంగళూరు Vs గుజరాత్
-
May 23, 2026 08:20 IST
మేడ్చల్, మల్కాజ్‌గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్
సోదాల తర్వాత రిమాండ్‌కు తరలించిన ACB అధికారులు
ACB తనిఖీల్లో రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తుల గుర్తింపు
19 ఇళ్ల స్థలాలు, ఇబ్రహీంపట్నంలో రెండు ఎకరాల ఫామ్‌హౌస్ గుర్తింపు
-
May 23, 2026 07:01 IST
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు
ఉదయం 6గంటల నుంచే అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు
ఈనెలలో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.112.84, డీజిల్ రూ.100.94
-
May 23, 2026 07:00 IST
నేడు గుంతకల్లులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన
రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోజ్‌గార్ మేళాకు హాజరుకానున్న బండి సంజయ్
-
May 23, 2026 07:00 IST
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై చర్చ
-
May 23, 2026 06:59 IST
IPL: నేడు లఖ్‌నవూ వర్సెస్ పంజాబ్
లఖ్‌నవూలో రాత్రి 7.30గంటలకు మ్యాచ్
-
May 23, 2026 06:51 IST
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం సర్కిల్ వరకూ వేచి వున్న భక్తులు
సర్వదర్శనానికి 15 గంటల సమయం
-
May 23, 2026 06:48 IST
చిత్తూరు: నేడు యాదమరి మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4వరకూ కొనసాగనున్న పర్యటన
రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
May 23, 2026 06:44 IST
సూర్యాపేట: యర్కారంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ దారుణ హత్య
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధు దారుణ హత్య
మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసిన దుండగులు
సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి మృతదేహం తరలింపు, కేసు నమోదు
-
May 23, 2026 06:39 IST
నేడు యాదగిరిగుట్టకు సీఎం రేవంత్ రెడ్డి
వేద పాఠశాలకు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి