Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 02 , 2026 | 08:04 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 02, 2026 21:47 IST

    పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురి మృతి

    • ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఘటన

    • స్వాత్ జిల్లాలో ర్యాలీ సందర్భంగా జరిగిన దాడి

    • బాధితులను ఆసుపత్రికి తరలింపు

  • Aug 02, 2026 21:34 IST

    ఏలూరు జిల్లా: వేలేరుపాడు మం. ఎద్దువాగు వద్ద గోదావరి వరదలో వ్యక్తి గల్లంతు

    • టేకూరుకు చెందిన నుపా ప్రసాద్ వేలేరుపాడు మం. సంతకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో గల్లంతు

  • Aug 02, 2026 20:49 IST

    కర్నూలు: వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని ఆలూరు కోర్టు న్యాయాధికారి ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు

    • 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయాధికారి

  • Aug 02, 2026 20:48 IST

    బిహార్: స్వతంత్ర ఎంపీ పప్పూయాదవ్‌ ప్రెస్‌మీట్‌లో కలకలం

    • ఎంపీపై కత్తితో దాడికి యువకుడి యత్నం

    • యువకుడికి పప్పూయాదవ్‌ అనుచరుల దేహశుద్ధి

    • యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • Aug 02, 2026 20:11 IST

    హైదరాబాద్‌: బైరామల్‌గూడలో దారుణం

    • 9 నెలల చిన్నారిని చెరువులో ముంచి చంపిన తల్లి రాజేశ్వరి

    • ఘటన సమయంలో తల్లి మద్యంమత్తులో ఉన్నట్లు గుర్తింపు

    • నిందితురాలు రాజేశ్వరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • ఉస్మానియా ఆస్పత్రికి చిన్నారి అనురాధ మృతదేహం తరలింపు

  • Aug 02, 2026 19:29 IST

    అల్లూరి: పాడేరులో ఆదివాసీ ప్రజాసంఘాల మీడియా సమావేశం

    • ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 8న మన్యం బంద్‌కు పిలుపు

  • Aug 02, 2026 19:07 IST

    అనకాపల్లి: పరవాడ మండలం ఊటగడ్డ దగ్గర బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

    • మర్రిపాలెం వాసి దుర్గారావు మృతి

  • Aug 02, 2026 18:59 IST

    అమరావతి: జనసేన న్యాయవాదుల సమీక్షా సమావేశం

    • పాల్గొన్న శాసనమండలి విప్‌ హరిప్రసాద్

    • పవన్‌పై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా, దూషించినా తక్షణమే ఫిర్యాదులు చేయాలి: హరిప్రసాద్‌

  • Aug 02, 2026 18:57 IST

    ఎన్టీఆర్‌: నవజాత శిశువు కొనుగోలు కేసు ఛేదించిన పోలీసులు

    • శిశువును కొనుగోలు చేసిన దంపతులు సహా ముగ్గురి అరెస్ట్

    • ప్రకాశం జిల్లా దంపతులు వెంకటకృష్ణారెడ్డి, శివపార్వతి సహా బిహార్‌కు చెందిన మరో నిందితుడు సయ్యద్‌ అరెస్ట్

    • నిందితుల నుంచి నవజాత శిశువు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం

  • Aug 02, 2026 18:36 IST

    కర్నూలు: ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై 307 సెక్షన్‌ కింద కేసు నమోదు

    • ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు మరో 34 మందిపై కేసు నమోదు

    • కాసేపట్లో విరూపాక్షిని జూ.సివిల్‌ జడ్జి కోర్టుకు తరలించనున్న పోలీసులు

  • Aug 02, 2026 18:05 IST

    భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

    • 43 అడుగుల దిగువకు నీటిమట్టం తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరిక ఎత్తివేత

    • నిన్న 56.1 అడుగుల వద్ద గోదావరి పరవళ్లు

    • ఒక్క రోజు వ్యవధిలో మూడు ప్రమాద హెచ్చరికల ఉప సంహరణ

  • Aug 02, 2026 17:54 IST

    భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ కన్నెరసాని కెనాల్‌లో ఈతకు వెళ్లి యువకుడి మృతి

    • మృతుడు తంగిళ్లపల్లికి చెందిన సంతోష్‌(24)గా గుర్తింపు

  • Aug 02, 2026 17:48 IST

    తమిళనాడు: కోయంబత్తూర్‌లో రోడ్డుప్రమాదం

    • పొల్లాచి-ఉడుమలై హైవేపై లారీని ఢీకొన్న కారు, ఐదుగురి మృతి

  • Aug 02, 2026 17:02 IST

    సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయం ఎదుట జోగినుల నిరసన

    • కనీసం సౌకర్యాలు కల్పించలేదంటూ జోగినుల ఆగ్రహం

    • జోగినులను పోలీసులు అవమానిస్తున్నారంటూ నినాదాలు

  • Aug 02, 2026 16:57 IST

    హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

    • జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్‌లో వర్షం

    • షేక్‌పేట్‌, రాయదుర్గం, హైటెక్‌ సిటీ, కొండాపూర్‌, గచ్చిబౌలిలో వర్షం

    • టోలీచౌకి, మెహదీపట్నం, అత్తాపూర్‌, గోల్కొండలో వర్షం

  • Aug 02, 2026 16:42 IST

    రాహుల్ గాంధీకి BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ లేఖ

    • ఇంజినీర్లను 'క్రిమినల్ వేస్ట్' అని రేవంత్‌ కామెంట్‌ చేశారంటూ లేఖ

    • రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిన బాధ్యత రాహుల్‌పై ఉంది: కేటీఆర్‌

    • క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్‌ను ఆదేశించకపోతే ఆ వ్యాఖ్యలను రాహుల్‌ సమర్థించినట్లే: కేటీఆర్‌

    • యువత, ఇంజినీర్లు, టీచర్లకు రాహుల్‌ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

  • Aug 02, 2026 16:24 IST

    కర్నూలు: ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌

    • విరూపాక్షిని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు తరలించిన పోలీసులు

    • టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో విరూపాక్షితో సహా 15 మంది అరెస్ట్‌

  • Aug 02, 2026 16:16 IST

    విజయవాడ: దేవస్థానంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు

    • దుర్గగుడి ఆచారాలు, సాంప్రదాయాలకు భంగం కలిగించేలా యువతి రీల్‌

    • మహామండపం 7వ అంతస్తు రాజగోపురం వద్ద డ్యాన్స్‌ చేస్తూ యువతి రీల్‌

    • విజయవాడ వన్ టౌన్ పీఎస్‌లో పిర్యాదు చేసిన ఈఓ వీకే శీనా నాయక్‌

  • Aug 02, 2026 16:14 IST

    కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టిన వరద

    • ఠాణేలంక-గురజాపులంక మధ్య రాకపోకల బంద్

    • పడవ, పంటు ప్రయాణాల నిలిపివేత

    • లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు

  • Aug 02, 2026 15:59 IST

    కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

    • తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇస్తాం: డీకే శివకుమార్‌

    • అఖిలపక్షం విలువైన సూచనలు చేసింది: డీకే శివకుమార్‌

    • మాజీ సీఎంల సలహాలు స్వీకరించాం: డీకే శివకుమార్‌

    • మేకదాటుతో కావేరి జల వివాదానికి శాశ్వత పరిష్కారం: డీకే

    • కర్ణాటక, తమిళనాడుకూ ప్రయోజనం కలుగుతుంది: డీకే శివకుమార్‌

  • Aug 02, 2026 15:58 IST

    బెంగాల్‌ STF దర్యాప్తులో బయటపడిన కుట్రకోణం

    • STF కస్టడీలో జైషే ఉగ్రవాది హమీమ్‌

    • ఢిల్లీలో విద్యార్థుల నిరసనల్లో ఉద్రిక్తతలకు ప్లాన్‌

    • పోలీస్‌ యూనిఫాంలో స్టూడెంట్స్‌పై దాడికి కుట్ర

    • పాక్‌ హ్యాండ్లర్స్‌ ఆదేశాలతో కుట్ర చేసిన హమీమ్‌

    • ఇప్పటికే హమీమ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అర్పిత అరెస్ట్‌

  • Aug 02, 2026 15:51 IST

    నషా ముక్త్ యువ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని

    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ

    • వికసిత్ భారత్ లక్ష్యం కోసం యువతకు డ్రగ్స్ పీడ వదలాలన్న ప్రధాని

    • డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా యువతలో స్ఫూర్తి నింపేలా కార్యక్రమం

  • Aug 02, 2026 15:48 IST

    ఇండోనేషియా: మదురా ద్వీప సమీపంలో ఘోర ప్రమాదం

    • సముద్రంలో ప్రయాణిస్తున్న ఫెర్రీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

    • ఈ ప్రమాదంలో ఐదుగురి మృతి, 41 మంది ప్రయాణికుల గల్లంతు

    • ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ఉన్నట్లు సమాచారం

  • Aug 02, 2026 15:33 IST

    తైపీ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన భారత షట్లర్‌ తన్వి శర్మ

    • ఫైనల్‌లో వియత్నాం షట్లర్‌ లిన్‌ ఎంగుయెన్‌పై 21-16, 21-16 సెట్ల తేడాతో తన్వి శర్మ విజయం

  • Aug 02, 2026 15:16 IST

    హైదరాబాద్: బోరబండ కార్మికనగర్‌లో రోడ్డుప్రమాదం

    • అదుపుతప్పి పార్క్ చేసిన బైక్‌లను ఢీకొన్న కారు

    • 7 బైక్‌ల ధ్వంసం, ఇద్దరికి తీవ్రగాయాలు

  • Aug 02, 2026 15:09 IST

    విశాఖ: స్నేహితుల దినోత్సవం రోజు విషాదం

    • పాతగంగవరం బీచ్‌లో ఇద్దరి గల్లంతు

    • ఫొటోలు దిగుతుండగా అలల ఉధృతికి గల్లంతు

    • గల్లంతైన దామోదర్‌(పెందుర్తి), నీతూ(పెదజాలరిపేట)

  • Aug 02, 2026 15:07 IST

    మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించిన బీఎస్పీ చీఫ్ మాయావతి

    • మాజీ ఎంపీ అశోక్ సిద్ధార్థ్‌ బహిష్కరణ

    • పార్టీ కో-ఆర్డినేటర్‌ రణధీర్ సింగ్ బేనీవాల్‌పై కూడా వేటు

    • పార్టీ నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ పాటించనందుకు చర్యలు

  • Aug 02, 2026 14:56 IST

    తెలంగాణకు మరో 3 రోజులపాటు వర్ష సూచన

    • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

  • Aug 02, 2026 14:47 IST

    కర్ణాటక: శివమొగ్గ జిల్లాలో విషాదం

    • భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి మూడేళ్ల బాలుడు సహా దంపతుల మృతి

    • తీర్థహళ్లి తాలూకా ఇందిరానగర్‌లో ఘటన

  • Aug 02, 2026 14:27 IST

    తిరుమల: జులైలో రికార్డుస్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

    • జులైలో వెంకన్నను దర్శించుకున్న 24.52 లక్షల మంది భక్తులు

    • జులై నెల హుండీ ఆదాయం రూ.140.29 కోట్లు

    • జులైలో తలనీలాలు సమర్పించిన 10.58 లక్షల మంది భక్తులు

  • Aug 02, 2026 14:20 IST

    భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

    • 44.5 అడుగుల వద్ద 9,96,796 క్యూసెక్కుల వరద

    • కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

  • Aug 02, 2026 14:16 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌ డెత్‌ కేసు దర్యాప్తు

    • సురేశ్(A4) ఆచూకీ తెలపాలంటూ సిట్‌ ప్రకటన

    • విచారణకు హాజరైన తర్వాత కేసు నమోదు కాగానే సురేశ్ పరారయ్యాడు: సిట్‌

    • ఆచూకీ తెలిపినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం: సిట్‌

  • Aug 02, 2026 13:46 IST

    త్రిపురాంతకం: రామసముద్రం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడిన ఆటో

    • రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది వ్యవసాయ కూలీలకు గాయాలు

    • కుక్క అడ్డురావడంతో తప్పించే క్రమంలో అదుపుతప్పిన ఆటో

    • డ్రైవర్‌తో పాటు మరో ఏడుగురికి గాయాలు

    • క్షతగాత్రులను యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

  • Aug 02, 2026 13:37 IST

    కర్ణాటకలోని మైసూరులో విషాదం..

    • కుర్‌కురే ప్యాకెట్‌లోని ప్లాస్టిక్ బొమ్మను మింగిన బాలుడు(5)

    • గొంతులో బొమ్మ ఇరుక్కుని ఊపిరాడక మృతి చెందిన బాలుడు

    • ఘటనపై హున్సూర్ రూరల్ పీఎస్‌లో కేసు నమోదు

  • Aug 02, 2026 12:56 IST

    శంషాబాద్: బహదూర్‌గూడలో మరోసారి అలజడి

    • ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని రైతులు రిలే దీక్షలు

    • అనుమతి లేదని రిలే దీక్షలను భగ్నం చేసిన పోలీసులు

    • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

  • Aug 02, 2026 12:56 IST

    సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి సీఎం రేవంత్‌రెడ్డి

    • అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

  • Aug 02, 2026 12:42 IST

    కాసేపట్లో సికింద్రాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

    • ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోనున్న సీఎం రేవంత్

  • Aug 02, 2026 12:42 IST

    పొగాకు రైతులకు కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు గుడ్‌న్యూస్

    • రెండేళ్ల పాటు రూ.50వేల వడ్డీ లేని రుణాలు

    • పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రం, ఏపీ చర్యలు

    • రూ.100కోట్ల నిధులు కేటాయించిన ఏపీ ప్రభుత్వం

    • 2 నెలల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తయ్యేలా చర్యలు

    • సహాయకచర్యలు రేపటి నుంచే అమల్లోకి: పెమ్మసాని

  • Aug 02, 2026 12:34 IST

    బెంగళూరు: డీకే శివకుమార్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం

    • కావేరి నదీ జలాల అంశంపై చర్చ

    • హాజరైన సిద్ధరామయ్య, కుమారస్వామి, బొమ్మై

  • Aug 02, 2026 12:30 IST

    జమ్మూకశ్మీర్: బందిపోరాలో ఆకస్మిక వరదలు

    • బందిపోరా-శ్రీనగర్ రహదారిపై వరద ప్రవాహం

    • రాకపోకలకు అంతరాయం, జనజీవనం అస్తవ్యస్తం

    • మల్పోరా, సదర్‌కూట్‌లో ఇళ్లలోకి చేరిన నీరు

    • సహాయక చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ బృందాలు

  • Aug 02, 2026 12:30 IST

    అమరావతి: ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

    • అదనపు పన్నుల వాటా కేటాయింపుపై కృతజ్ఞతలు తెలిపిన సీఎం

    • ప్రతి నెలా 10న విడుదలయ్యే పన్ను వాటాతో పాటు అదనంగా రూ.4,597కోట్ల పన్నుల వాటా కేటాయించిన కేంద్రం

    • పన్నుల వాటా కేటాయింపుతో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం

  • Aug 02, 2026 11:14 IST

    నల్లగొండ: కంచనపల్లిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన

    • నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

    • SLBC సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం: కోమటిరెడ్డి

    • బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు: మంత్రి కోమటిరెడ్డి

    • కంచనపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

  • Aug 02, 2026 11:14 IST

    పెద్దపల్లి: పోతనకాలనీలోని సింగరేణి క్వార్టర్స్‌లో గ్యాస్ లీక్

    • మంటలు చెలరేగి దంపతులకు తీవ్రగాయాలు, పరిస్థితి విషమం

    • హైదరాబాద్‌కు తరలింపు

  • Aug 02, 2026 11:13 IST

    పల్నాడు: నరసరావుపేటలోని ప్రకాష్‌నగర్‌లో ఓ ఇంట్లో భారీ చోరీ

    • 340 గ్రాముల బంగారం, రూ.25లక్షలు అపహరణ

    • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, కేసు నమోదు

  • Aug 02, 2026 11:12 IST

    ఏలూరు: కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో తగ్గుతున్న గోదావరి వరద

    • ప్రస్తుతం 48.50 అడుగుల నీటి మట్టం

    • సాయంత్రానికి 45 అడుగులకు నీటి మట్టం తగ్గవచ్చని అంచనా

    • ఎద్దువాగు, పెదవాగు వంతెనలపై నుంచి ఇంకా ప్రవహిస్తున్న వరద నీరు

  • Aug 02, 2026 10:52 IST

    సికింద్రాబాద్: అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    • అమ్మవారికి బోనం సమర్పించిన సీపీ సజ్జనార్ దంపతులు

  • Aug 02, 2026 10:51 IST

    సికింద్రాబాద్: రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాలు ప్రత్యేకం: మంత్రి పొన్నం ప్రభాకర్

    • రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలి: పొన్నం

    • సమృద్ధిగా వర్షాలు పడాలని వేడుకున్నా: పొన్నం

  • Aug 02, 2026 10:50 IST

    ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన

    • ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్‌

    • ఇరాన్‌పై కొత్త దాడులు వాయిదా వేస్తామని ప్రకటన

    • హోర్ముజ్‌ జలసంధిని పూర్తిగా తెరవడంపై ఒప్పందం కుదిరిందన్న ట్రంప్

  • Aug 02, 2026 10:42 IST

    మాస్కోలో రెస్టారెంట్‌ వద్ద భారీ పేలుడు.. ముగ్గురి మృతి

    • పేలుడు ఘటనలో మరో 21 మందికి గాయాలు

    • కుద్రిన్స్కాయా స్క్వేర్‌లోని రెస్టారెంట్‌ వద్ద పేలుడు

    • ఘటనపై దర్యాప్తు చేపట్టిన రష్యా అధికారులు

  • Aug 02, 2026 10:25 IST

    అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

    • ట్విన్ ఫాల్స్‌లోని రెస్టారెంట్‌లో దుండగుడి కాల్పులు

    • ముగ్గురు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు

    • నిందితుడు కూడా మృతిచెందినట్టు పోలీసులు వెల్లడి

  • Aug 02, 2026 09:55 IST

    కర్నూలు: చిప్పగిరి పోలీసుల అదుపులో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి

    • ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్టు సమాచారం

    • రాత్రి చిప్పగిరి మండల టీడీపీ కన్వీనర్ పురుషోత్తంపై దాడి

    • కారు, ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు

    • రాత్రి అనుచరులతో నేమకల్లుకు వెళ్లి ఎమ్మెల్యే విరూపాక్షి హల్‌చల్

    • వైసీపీ మూకల దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు

    • నేమకల్లులో భారీగా మోహరించిన పోలీస్ బలగాలు

  • Aug 02, 2026 09:54 IST

    విజయవాడ: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు

    • 4వ రోజు సిట్ కస్టడీకి మాజీ సీఐ నాగరాజు

    • 3 రోజులుగా సిట్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని నాగరాజు

    • లాకప్‌డెత్ పరిణామాలపై సిట్ అధికారుల ఆరా

    • లాకప్‌లో DVR డేటా మిస్సింగ్‌పై సిట్ ప్రశ్నలు

    • విచారణను వీడియో, ఆడియో రికార్డ్ చేస్తున్న సిట్

  • Aug 02, 2026 09:53 IST

    నెల్లూరులో కొనసాగుతున్న పార్కుల జాతర

    • రూ.39లక్షలతో బంగ్లాతోట పార్క్ ఆధునీకరణ

    • ఏసీ కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన మంత్రి నారాయణ

    • ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి

    • 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం: మంత్రి నారాయణ

    • ఇప్పటికే 40 పార్కులు ప్రారంభించాం: మంత్రి నారాయణ

  • Aug 02, 2026 09:22 IST

    హైదరాబాద్: మ.12గంటలకు సికింద్రాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

    • ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న రేవంత్

    • మ.ఒంటిగంటకు పొన్నం నివాసంలో బోనాల విందుకు హాజరు

  • Aug 02, 2026 09:15 IST

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్‌ పాండ్య

    • స్నేహితురాలు మహికా శర్మతో కలిసి తిరుమలకు వచ్చిన హార్దిక్‌

    • ఆదివారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న క్రికెటర్‌

    • దర్శనం అనంతరం హార్దిక్‌కు పండితుల ఆశీర్వచనం

    • స్వామివారి తీర్థప్రసాదాలు అందుకున్న హార్దిక్‌ పాండ్య

  • Aug 02, 2026 08:30 IST

    పెరూలో ఘోర విమాన ప్రమాదం

    • ఇద్దరు సిబ్బంది సహా 13 మంది మృతి

    • కుప్పకూలిన 'నాజ్కాలైన్స్' వీక్షణకు వెళ్లిన పర్యాటక విమానం

    • టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన విమానం

    • ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

  • Aug 02, 2026 08:11 IST

    నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు వరద

    • ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో వెయ్యి క్యూసెక్కులు

  • Aug 02, 2026 08:10 IST

    గుజరాత్‌ను ముంచెత్తుతున్న వర్షాలు

    • మోర్బీ జిల్లా హల్వద్‌లో వరదల్లో చిక్కుకున్న 24 మంది

    • NDRF, SDRF బృందాల రెస్క్యూ ఆపరేషన్

    • సురేంద్రనగర్ రైల్వే కెనాల్ దగ్గర ఆకస్మిక వరద

    • 50 మందిని కాపాడిన స్థానికులు

    • మోర్బీ, సురేంద్రనగర్‌లో వేలాది ఇళ్లు నీటమునక

    • ట్రాక్టర్లపై కొనసాగుతున్న రాకపోకలు

  • Aug 02, 2026 08:10 IST

    భూపాలపల్లి: తగ్గుముఖం పట్టిన గోదావరి వరద

    • త్రివేణి సంగమం దగ్గర నిలకడగా గోదావరి ప్రవాహం

    • మేడిగడ్డ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.52లక్షల క్యూసెక్కులు

  • Aug 02, 2026 08:09 IST

    పశ్చిమాసియా దేశాలను వెంటనే వీడాలని అమెరికన్లకు శ్వేతసౌధం సూచన

    • జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్‌లో US కార్యాలయాలకు అడ్వైజరీ జారీ

  • Aug 02, 2026 08:09 IST

    ఇరాన్‌పై తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేస్తాం: ట్రంప్

    • ఇరాన్‌పై గెలుపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం: ట్రంప్

    • టెహ్రాన్‌పై US మిలిటరీ చర్యలు కొనసాగుతాయి: ట్రంప్

    • హోర్ముజ్‌ను తక్షణమే పునఃప్రారంభించాలి: ట్రంప్

  • Aug 02, 2026 08:08 IST

    సికింద్రాబాద్‌లో ఘనంగా లష్కర్ బోనాలు

    • తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్

    • సికింద్రాబాద్ మహంకాళి ఆలయం దగ్గర భారీ ఏర్పాట్లు

  • Aug 02, 2026 08:07 IST

    పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

    • నేడు ముజఫరాబాద్‌లో ఎన్నికలు

    • నిరసనకారులపై పాక్ బలగాల కాల్పులు

    • టియర్ గ్యాస్ ప్రయోగించిన పాక్ బలగాలు

    • భారీగా పాక్ బలగాల మోహరింపు

  • Aug 02, 2026 08:07 IST

    నేటి నుంచి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్

    • ఉ.11గంటలకు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

    • మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా 100 వారాల ప్రచారం

    • మత్తు రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ ఉద్యమం

    • యువత భాగస్వామ్యంతో భారీ అవగాహన కార్యక్రమాలు

    • ప్రతి ఆదివారం క్రీడలు, వాకథాన్‌ల నిర్వహణ

  • Aug 02, 2026 08:07 IST

    పోలవరం: విలీన మండలాల్లో వరద ప్రభావం

    • 44 రహదారులపై నిలిచిన రాకపోకలు

    • వరద ప్రభావంతో ముంపునకు గురైన 9 గ్రామాలు

    • చింతూరు, కూనవరం, VR పురం, ఎటపాక గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు

  • Aug 02, 2026 08:06 IST

    భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

    • భద్రాచలం దగ్గర 49 అడుగులకు చేరిన నీటి ప్రవాహం

    • కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

  • Aug 02, 2026 08:05 IST

    మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌ 29 గేట్ల ఎత్తివేత

  • Aug 02, 2026 08:04 IST

    గ్లాస్గో: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

    • బాక్సింగ్‌లో ఏడుకు చేరిన గోల్డ్ మెడల్స్

    • ఇప్పటివరకు భారత్‌కు మొత్తం 37 పతకాలు

    • గోల్డ్-13, సిల్వర్-16, కాంస్యం-8 మెడల్స్