Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Aug 25 , 2026 | 07:59 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Aug 25, 2026 08:41 IST

    ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

    • 15 విమానాల దారి మళ్లింపు

    • జనక్‌పురిలో అత్యధికంగా 70మి.మి. వర్షపాతం

    • వర్షాలతో నీట మునిగిన రహదారులు

    • పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్

  • Aug 25, 2026 08:40 IST

    నేడు మూసీ ప్రాజెక్ట్‌పై MCRHRDలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

    • కన్సల్టెన్సీ ఏజెన్సీ, సివిల్ కాంట్రాక్ట్, టెండర్లపై ప్రక్రియపై చర్చ

  • Aug 25, 2026 08:36 IST

    నేడు దేవాదుల ఎత్తిపోతల పథకంపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

    • ప్యాకేజీల వారీగా భౌతిక, ఆర్థిక పురోగతిపై చర్చ

    • పెండింగ్ పనుల భూసేకరణ సమస్యల పరిష్కారంపై ఫోకస్

    • సాంకేతిక, పరిపాలన సమస్యలపై అధికారులతో మంత్రి చర్చ

  • Aug 25, 2026 08:06 IST

    ఇంజినీర్ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు

    • నిందితుడు సాదిక్‌ను కస్టడీకి కోరనున్న పోలీసులు

    • సాదిక్‌ను వారం రోజులు కస్టడీకి కోరే అవకాశం

  • Aug 25, 2026 08:06 IST

    ఏపీలో ప్రత్యేక టెట్‌కు నేటినుంచి దరఖాస్తుల స్వీకరణ

    • సెప్టెంబర్‌ 24 వరకు కొనసాగనున్న దరఖాస్తుల స్వీకరణ

    • ఇన్‌ సర్వీస్‌ టీచర్ల కోసం ప్రత్యేక టెట్‌

    • అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు ప్రత్యేక టెట్‌ ఎగ్జామ్స్‌

  • Aug 25, 2026 08:05 IST

    నేడు నిజామాబాద్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా పర్యటన

    • యాంటీ డ్రగ్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్‌

    • పసుపు బోర్డు ఆఫీస్‌లో రైతులతో గవర్నర్ సమావేశం

    • డిచ్‌పల్లి మ. ధర్మారంలో చెక్కులు పంపిణీ చేయనున్న గవర్నర్‌

  • Aug 25, 2026 08:05 IST

    నేడు అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి లోకేశ్ పర్యటన

    • 1,325 మెగావాట్లతో కొత్త విండ్‌ పవర్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

    • హులికెరలో సుజ్లాన్‌ ఎస్‌144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లు ప్రారంభం

  • Aug 25, 2026 08:04 IST

    ఉమెన్ ఏపీఎల్ వేలానికి సర్వం సిద్ధం..

    • నేడు విజయవాడలో ఉమెన్ APL వేలం

    • WAPLలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 191 మంది ప్లేయర్లు

    • క్రీడాకారులను కొనుగోలు చేయనున్న నాలుగు ఫ్రాంచైజీలు

  • Aug 25, 2026 08:03 IST

    స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ జీఓపై ఏపీ హైకోర్టులో పిల్‌

    • సంబంధిత జీఓలను రద్దుచేయాలని కోరుతూ పిటిషన్‌

    • పిల్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ

  • Aug 25, 2026 08:02 IST

    కర్నూలు: నేడు మంత్రాలయంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ పర్యటన

    • మినిస్టర్స్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు

  • Aug 25, 2026 08:01 IST

    కర్నూలు: శ్రీనివాసనగర్‌లో దొంగల బీభత్సం

    • హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో 23 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాల అపహరణ

    • రిటైర్డ్ ఆర్ఎస్ఐ ఇంట్లో 5 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు, రూ.30వేలు చోరీ

    • పోలీసులకు బాధితుల ఫిర్యాదు, కేసు నమోదు

  • Aug 25, 2026 07:59 IST

    అల్పపీడనం ప్రభావంతో ఏపీకి వర్ష సూచన

    • తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

    • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన

    • తెలంగాణలోనూ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం