-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 15th July 2026 VK
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 15 , 2026 | 06:20 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jul 15, 2026 21:53 IST
యాదాద్రి జిల్లాలో ఢీకొన్న ఆర్టీసీ - ప్రైవేట్ బస్సులు
చౌటుప్పల్ సమీపంలో ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
రోడ్డుకు అడ్డంగా పడిన ప్రైవేట్ బస్సు
పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం
-
Jul 15, 2026 21:51 IST
కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో దారుణ ఘటన..
తండ్రి పక్కన నిద్రిస్తున్న 7 నెలల చిన్నారి అపహరణ
బ్లేడ్‌తో గాయపరిచి పొదల్లో పడేసిన దుండగులు
చిన్నారికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స
ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 15, 2026 21:47 IST
హైదరాబాద్: ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బ్రిక్స్ దేశాల మంత్రులకు విందు
హాజరైన సీఎం రేవంత్, కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ
దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, UAE, బ్రెజిల్ దేశాల మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్
బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు నేపథ్యంలో కేంద్రం విందు
-
Jul 15, 2026 21:42 IST
దేశంలో సెమికండక్టర్ విప్లవానికి కేంద్రం శ్రీకారం
'సెమికాన్ ఇండియా 2.0'కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
రూ.1.27 లక్షల కోట్ల రెండో దశ సెమికండక్టర్ ప్యాకేజీ
రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొత్త ప్యాకేజీ అమలు
సెమికాన్ 2.0తో ఆంధ్రప్రదేశ్‌కు భారీ లబ్ధి చేకూరనుంది
-
Jul 15, 2026 21:40 IST
చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త కోచ్ అవసరమన్న రవిచంద్రన్ అశ్విన్
స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత కొత్త దిశగా వెళ్లాలని సూచన
ఎంఎస్ ధోనీ కోచ్ అయితే సరైన ఎంపిక అని అభిప్రాయం
ధోనీకి జట్టుపై పూర్తి అవగాహన ఉందన్న అశ్విన్
-
Jul 15, 2026 21:28 IST
భద్రాద్రి: కొత్తగూడెం ప్రభుత్వ మాత శిశు కేంద్రంలో దారుణం
కాన్పు కోసం వచ్చిన గర్భిణీని పట్టించుకోని వైద్య సిబ్బంది
ప్రసవ వేదన భరించలేక బెడ్ పక్కన నిల్చోని అక్కడే ప్రసవించిన గర్భిణి
శిశువు కిందపడగా పసికందుకు గాయాలు.. తల్లికి అధిక రక్తస్రావం
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబం
-
Jul 15, 2026 20:52 IST
రేపటి నుంచి తెలంగాణలో ఆషాడ బోనాల వేడుకలు ప్రారంభం
గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ఉత్సవాలకు శ్రీకారం
ఆగస్టు 13 వరకు ఘనంగా బోనాల వేడుకలు
బోనాల కోసం రూ.20 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-
Jul 15, 2026 20:50 IST
తెలంగాణలో 157 మంది మెడికల్ ప్రొఫెసర్లకు శుభవార్త
DME పరిధిలో పనిచేస్తున్న 157 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించిన ప్రభుత్వం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చేందుకు నిర్ణయం
కొత్త కాలేజీలు, MBBS సీట్ల పెంపుతో NMC నిబంధనల మేరకు ఫ్యాకల్టీని పెంచేందుకు ప్రత్యేక సడలింపు
-
Jul 15, 2026 20:47 IST
పల్నాడు: నరసరావుపేటలో కోడెల అభిమానుల ఆందోళన
కోడెల శివప్రసాదరావు స్టేడియం దగ్గర కోడెల పేరిట ఉన్న బోర్డు తొలగింపునకు సిద్ధమైన అధికారులు
ఎల్లుండి స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
స్టేడియంలోకి వెళ్లేందుకు అడ్డుగా ఉందని తొలగించేందుకు యత్నం
బోర్డును తొలగిస్తుండగా అడ్డుకున్న కోడెల అభిమానులు
-
Jul 15, 2026 20:46 IST
హైదరాబాద్: హనీ ట్రాప్, కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
వ్యాపారవేత్తల్ని కిడ్నాప్ చేసి డబ్బు దోచుకుంటున్న ముఠా
సునీల్, రింకూ, రాజేష్‌ను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు
నిందితుల నుంచి రూ.3.8 లక్షలు, 3.5 తులాల బంగారం స్వాధీనం
పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
-
Jul 15, 2026 20:45 IST
అమరావతి: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య
పీవీఎన్ మాధవ్ సమక్షంలో బీజేపీలో చేరిన చిన్నం రామకోటయ్య
బీజేపీ బలోపేతానికి కృషి చేస్తా: రామకోటయ్య
-
Jul 15, 2026 20:39 IST
పల్నాడు: పిడుగురాళ్లలో యువకుడు షేక్ దరియా ఆత్మహత్య
సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్
కోర్టు పరిధిలో ఉన్న ఇంటిని ఖాళీ చేయాలని సీఐ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణ
ఇల్లు ఖాళీ చేయకపోతే గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించినట్లు సూసైడ్ నోట్
-
Jul 15, 2026 20:38 IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మహిళా దొంగ అరెస్ట్
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న మేరీ షీలాను అరెస్ట్ చేసిన పోలీసులు
27 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
బెయిల్‌పై విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడిన నిందితురాలు
అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు
-
Jul 15, 2026 20:00 IST
పార్లమెంట్ ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక సూచనలు
స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌గ్లాసులు ధరించవద్దని సూచన
భద్రత, వ్యక్తిగత గోప్యత దృష్ట్యా ఆదేశాలు
పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నాలు, ప్లకార్డులకు నో
జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు వర్షాకాల సమావేశాలు
-
Jul 15, 2026 20:00 IST
అమరావతి: ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేశ్ కామెంట్స్..
వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు
బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు: లోకేశ్
ఆ సొమ్ముతోనే సాక్షి మీడియా సంస్థలు ఏర్పాటు చేశారు: మంత్రి లోకేశ్
జగన్ పాలనలో కడప జిల్లాకు చేసిందేమీ లేదు: మంత్రి లోకేశ్
ఈనెల 24న ‘తల్లికి వందనం’ నిధులు జమ చేస్తాం: మంత్రి లోకేశ్
-
Jul 15, 2026 19:52 IST
ఢిల్లీ: మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్ ఓటమికి తమ తప్పులు కూడా కారణమని అంగీకరించిన కేటీఆర్
మూడోసారి అధికారంలోకి రాకపోవడం మంచిదైందన్న కేటీఆర్
కళ్ళు నెత్తికెక్కడం వల్లే ఓడిపోయామన్న కేటీఆర్
కొన్ని వర్గాలు, సెక్టార్లను పట్టించుకోలేదని అంగీకరించిన కేటీఆర్
కొందరు ఎమ్మెల్యేలను మార్చి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడిన కేటీఆర్
-
Jul 15, 2026 19:26 IST
విజయనగరం: జగన్ వ్యాఖ్యలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం
కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి
రైతుల సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్న మంత్రి
ఫిష్ ఫీడ్, ఫిష్ ఆయిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ డిమాండ్ కారణమన్న మంత్రి
ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తున్నామని చెప్పిన మంత్రి
జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన మంత్రి కొండపల్లి
-
Jul 15, 2026 19:23 IST
అమరావతి: జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు
జగన్ రాజకీయ మనస్తత్వం ప్రజాస్వామ్యానికి సరిపోదు: వర్ల రామయ్య
గత ప్రభుత్వంలో నేరగాళ్లకు మద్దతు ఇచ్చారు: వర్ల రామయ్య
అమర్నాథ్ గౌడ్ ఘటనను ప్రస్తావించిన వర్ల రామయ్య
సంఘ విద్రోహ శక్తుల వెనుక వైసీపీ హస్తం ఉందన్న వర్ల రామయ్య
-
Jul 15, 2026 18:13 IST
హైదరాబాద్: 2027లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే: కేటీఆర్
కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు: కేటీఆర్
తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు: కేటీఆర్
420 హామీల్లో ఒక్కటీ కాంగ్రెస్ అమలు చేయలేదు: కేటీఆర్
పార్టీ పేరు మారినా మా ఎజెండా మారలేదు: కేటీఆర్
-
Jul 15, 2026 18:11 IST
ఏపీ లిక్కర్ అక్రమ రవాణా కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
నిందితులకు రేపటినుంచి 3 రోజుల ఈడీ కస్టడీ
నిందితులు రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్‌కు కస్టడీ
-
Jul 15, 2026 18:04 IST
హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
రేపు గోల్కొండలో తొలి బోనంతో ఉత్సవాలకు శ్రీకారం
ఈనెల 26న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు
ఆగస్ట్ 2న లాల్‌దర్వాజా సింహవాహిని ఆలయంలో బోనాలు
బోనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ
అన్నిశాఖల సమన్వయంతో బోనాల నిర్వహణకు నిర్ణయం
ఆలయాల పరిసరాల్లో GHMC ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు
ఆలయాల దగ్గర సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
అత్యవసర సేవల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-
Jul 15, 2026 17:40 IST
పెద్దపల్లి జిల్లా రామగుండంలో విషాదం
క్రికెట్ ఆడుతూ బావిలో పడిన 8వ తరగతి విద్యార్థి
బాల్ కోసం వెళ్లి బావిలో పడిన సాత్విక్
గజ ఈతగాళ్లతో విద్యార్థి కోసం గాలింపు
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
-
Jul 15, 2026 17:29 IST
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ లేఖ
పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలుచేయాలి: పవన్
పోక్సో కేసులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి: పవన్
చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత: పవన్ కల్యాణ్
ఆర్టికల్ 21, 39 ప్రకారం పిల్లల హక్కులు కాపాడాలి: పవన్
పోక్సో కేసుల్లో తక్షణ FIR నమోదు చేయాలి: పవన్
ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలి: పవన్
-
Jul 15, 2026 17:25 IST
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో గ్యాస్ సిలిండర్‌లు.. దేశంలో తొలిసారిగా..
హెచ్‌పీసీఎల్‌కు చెందిన 10 కేజీల నవ్య గ్యాస్ సిలిండర్లు ఇంటికి డెలివరీ
త్వరలో బెంగళూరులో ప్రాజెక్టు ప్రారంభం
బరువు తక్కువగా ఉండే కాంపోజిట్ పాలిమర్‌తో తయారైన నవ్య సిలిండర్
సాధారణ గ్యాస్ డిస్ట్రిబ్యూటింగ్ ఏజెన్సీల ద్వారా డెలివరీ
బుక్ చేసిన 10 నిమిషాల్లోనే ఇంటికి సిలిండర్‌లు
-
Jul 15, 2026 17:20 IST
తెలంగాణలో SIR గడువు ఆగస్ట్ 3 వరకు పొడిగింపు
-
Jul 15, 2026 16:45 IST
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం
అధికార లాంఛనాలను అడ్డుకునేందుకు అంబటి యత్నం
పోలీసులు వెళ్లిపోవాలంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు
పోలీసులు, ముద్రగడ అనుచరుల వాగ్వాదం
-
Jul 15, 2026 16:32 IST
హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కుపాదం
గత వారంలో 5 క్రిమినల్ కేసులు నమోదు
ప్రత్యేక తనిఖీల్లో పలు వాహనాల సీజ్
జూబ్లీహిల్స్, మలక్‌పేట్, బేగంబజార్, అబిడ్స్, కాచిగూడలో కేసులు
నకిలీ నంబర్ ప్లేట్లపై జీరో టాలరెన్స్.. ఉల్లంఘిస్తే వాహనం సీజ్, క్రిమినల్ కేసులు
-
Jul 15, 2026 16:28 IST
మహబూబ్‌నగర్: తెలంగాణలో అమరరాజా సంస్థ పెట్టడం గర్వకారణం: సీఎం రేవంత్
చైనాతో పోటీపడుతూ బ్యాటరీలు తయారు చేస్తున్నారు: సీఎం
అమరరాజా లోకల్ టాలెంట్ ఉన్న గ్లోబల్ కంపెనీ: సీఎం
అమరరాజా సంస్థకు పూర్తిగా సహకరిస్తున్నాం: సీఎం
-
Jul 15, 2026 16:26 IST
యూఎస్‌లో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా భారత సంతతి బాలిక
క్వీన్స్ రాష్ట్రంలోని ఎన్‌జేఆర్‌ఓటీసీ కమాండింగ్ ఆఫీసర్‌గా రిద్ధీ చౌహాన్
17 ఏళ్ల వయసులో స్కూల్ స్థాయిలో రిద్ధీకి అత్యున్నత నాయకత్వ బాధ్యతలు
యూఎస్ నేవీ ఆఫీసర్ కావడం తన లక్ష్యమన్న రిద్ధీ
-
Jul 15, 2026 16:12 IST
సంగారెడ్డి జిల్లా కందిలో దారుణ హత్య
కారుకు అడ్డుగా నిలబడ్డాడని రమేశ్ అనే వ్యక్తితో గొడవ పడిన ఆంజనేయులు
ఆగ్రహంలో కారుతో ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే మృతి
నిందితుడు ఆంజనేయులుని అదుపులో తీసుకున్న పోలీసులు
ఆంజనేయులుపై గతంలో హత్యాయత్నం, గంజాయి కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
-
Jul 15, 2026 16:08 IST
కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
వారణాసిలో 2 ఎలివేటెడ్ కారిడార్లకు కేబినెట్ ఆమోదం
కాశీలో వరుణా నదిపై 6 లేన్ల రోడ్డు నిర్మాణం
డాంగోపోసి-రాజ్‌ఖర్సావన్ మధ్య 4లేన్ రోడ్డు నిర్మాణం
యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానానికి ఆమోదం
పారాదీప్-హరిదాస్‌పూర్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్
-
Jul 15, 2026 16:07 IST
జననాయగన్ రిలీజ్ డేట్ ప్రకటించిన యూనిట్
ఈ నెల 23న జననాయగన్ సినిమా విడుదల
-
Jul 15, 2026 16:06 IST
కాకినాడ: కిర్లంపూడిలో ముద్రగడ అంత్యక్రియలు
అధికార లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు
అధికార లాంఛనాలను అడ్డుకునేందుకు అంబటి యత్నం
ముద్రగడ నివాసం ఆవరణలోనే అంత్యక్రియలు
ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న జగన్, బొత్స
-
Jul 15, 2026 16:04 IST
హైదరాబాద్: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భేటీ
పెండింగ్ కేంద్ర నిధులు విడుదల చేయాలని అడ్లూరి విజ్ఞప్తి
ఎస్సీ గురుకులాలకు రూ.300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదన
తక్షణం రూ.150 కోట్ల విడుదలకు కేంద్రం సానుకూల స్పందన
ఎస్సీ విద్య, సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ
-
Jul 15, 2026 15:56 IST
హైదరాబాద్: ప్రదీప్ కన్‌స్ట్రక్షన్‌కు హైకోర్టులో ఊరట
జీహెచ్‌ఎంసీ షోకాజ్ నోటీసులపై యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశం
పూర్తి వివరాలు సమర్పించాలని జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం
హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ పేరుతో జారీ చేసిన నోటీసులను సవాల్ చేసిన ప్రదీప్ కన్‌స్ట్రక్షన్
-
Jul 15, 2026 15:54 IST
అమరావతి: రిజర్వేషన్లపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
మత మార్పిడితో అసలైన దళితులకు అన్యాయం జరుగుతోందని ఆరోపణ
దళితుల హక్కుల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం
నటుడు ప్రకాశ్ రాజ్ చేస్తున్న వ్యాఖ్యలపై పీవీఎన్ మాధవ్ విమర్శలు
-
Jul 15, 2026 15:49 IST
కాకినాడలో ముద్రగడ అంత్యక్రియలు ప్రారంభం
కిర్లంపూడిలో అంతిమ సంస్కారాలు
ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించిన జగన్
-
Jul 15, 2026 15:48 IST
నంద్యాల: ఏబీఎన్ ఎఫెక్ట్‌తో కదిలిన జిల్లా యంత్రాంగం
కొత్తపల్లి కేజీబీవీకి చేరుకున్న అధికారులు
విద్యార్థినుల ఫిర్యాదులపై విచారణ ప్రారంభం
తాత్కాలిక ఉద్యోగిని విధుల నుంచి తొలగింపు
బాలికల సమస్యలపై డీఈఓ ఆరా
-
Jul 15, 2026 15:37 IST
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
130 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
26 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
-
Jul 15, 2026 15:27 IST
అమరావతి: కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ పని: మంత్రి అచ్చెన్నాయుడు
కులాల పేరు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారు: అచ్చెన్న
రెచ్చగొట్టడం గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి అలవాటు: అచ్చెన్న
అభివృద్ధికి సంబంధించి వైసీపీ నేతలు మాట్లాడరు: అచ్చెన్న
-
Jul 15, 2026 15:26 IST
హైదరాబాద్: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు: మంత్రి శ్రీధర్ బాబు
అల్వాల్ జడ్పీ బాలికల పాఠశాలలో ఎఫ్‌డీఆర్ సైన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
ప్రభుత్వ పాఠశాలల్లో శాస్త్రీయ దృక్పథం.. ఆవిష్కరణలకు ప్రోత్సాహం: మంత్రి
డిగ్రీల కంటే నైపుణ్యాలు, సృజనాత్మకతే విజయానికి పునాది: శ్రీధర్ బాబు
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ సెంటర్లు.. ఎఫ్‌డీఆర్‌కు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: మంత్రి
-
Jul 15, 2026 15:22 IST
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రూ.1.27 లక్షల కోట్లతో సెమీకాన్ 2.0
రూ.62,500 కోట్లతో మొబైల్ తయారీ స్కీమ్
రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం
-
Jul 15, 2026 15:14 IST
కాకినాడ: కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి జగన్
ముద్రగడ భౌతికకాయానికి జగన్ నివాళులు
ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించిన జగన్
-
Jul 15, 2026 15:14 IST
భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన థాయ్‌లాండ్
వీసా ఫ్రీ ఎంట్రీ కొనసాగింపు
వీసా లేకుండా ఉండే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గింపు
పర్యాటక ప్రోత్సాహంతో పాటు ఇమ్మిగ్రేషన్ నియంత్రణలకే ఈ నిర్ణయం తీసుకున్నామన్న థాయ్ అధికారులు
వీసా ఫ్రీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసే ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గిన థాయ్‌లాండ్
-
Jul 15, 2026 15:01 IST
కడపలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ: లోకేశ్
సొంత బాబాయ్‌ని చంపించిన వ్యక్తి జగన్: మంత్రి
కడపలో పాదయాత్ర చేసినప్పుడే ఈ విషయం చెప్పా: మంత్రి
-
Jul 15, 2026 15:00 IST
కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం: స్మృతి మంధాన
వైస్ కెప్టెన్‌గా చాలా అనుభవం సంపాదించా: స్మృతి
హర్మన్ ప్రీత్ స్థానంలో కెప్టెన్సీ చేసేందుకు రెడీగా ఉన్నా: స్మృతి
-
Jul 15, 2026 14:52 IST
ఢిల్లీ: ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల కంటెంట్‌ను తొలగించాలని కోరిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
విచారణకు నిరాకరించిన జస్టిస్ పి.ఎస్. నరసింహ ధర్మాసనం.
ప్రతి చిన్న అంశానికి నేరుగా సుప్రీంకోర్టుకు రావొద్దన్న ధర్మాసనం
దేశ న్యాయవ్యవస్థ, పోలీసులపై నమ్మకం ఉంచాలని సూచించిన ధర్మాసనం
ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయన్న జస్టిస్ నరసింహ
-
Jul 15, 2026 14:36 IST
నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి
ఈవీ ఛార్జింగ్ పెట్టిన సమయంలో చెలరేగిన మంటలు
గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ నుంచి భవనమంతా వ్యాపించిన మంటలు
సుమారు 50 కుటుంబాలను కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
మంటలను అదుపులోకి తీసుకున్న ఫైర్ సిబ్బంది
-
Jul 15, 2026 13:44 IST
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్‌కు శంకుస్థాపన
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, పాల్గొన్న పలువురు మంత్రులు
12 ఏళ్లలో రూ.60వేల కోట్లు వెచ్చించనున్న అమెజాన్
ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల్లో అమెజాన్ డేటా సెంటర్ నిర్మాణం
-
Jul 15, 2026 13:43 IST
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్
తొలి రౌండ్‌లోనే లక్ష్యసేన్, ఆయుశ్ శెట్టి ఔట్
జపాన్‌కు చెందిన కోకి వతనాబే చేతిలో ఓడిన లక్ష్యసేన్
థాయ్‌లాండ్‌కు చెందిన కున్లావుట్ విటిడ్సార్న్‌పై పోరాడి ఓడిన ఆయుశ్
-
Jul 15, 2026 13:40 IST
వైసీపీ హయాంలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ చాలా దెబ్బతింది: మంత్రి నారా లోకేశ్
మళ్లీ అభివృద్ధి స్థాయికి తీసుకురావడానికి రెండేళ్లు అహర్నిశలూ కష్టపడ్డాం: లోకేశ్
పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలు తీసుకొస్తున్నాం: లోకేశ్
-
Jul 15, 2026 13:31 IST
అమెరికాలోని నూజెర్సీలో రోడ్డు ప్రమాదం
వినుకొండ మండలం ఉమ్మడివరానికి చెందిన మక్కెన ప్రసన్న మృతి
-
Jul 15, 2026 13:24 IST
అమరావతిని నిర్మిస్తుంటే విమర్శిస్తున్నారు: సీఎం చంద్రబాబు
విజయవాడ, గుంటూరు, మంగళగిరి కలిపితే అమరావతి: చంద్రబాబు
99 శాతానికి పైగా రైతులు అమరావతికి భూములిచ్చారు: చంద్రబాబు
ఆగస్టు 15కు సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తవుతుంది: సీఎం చంద్రబాబు
-
Jul 15, 2026 13:19 IST
కృష్ణా జిల్లా: పవిత్ర నది సంగమం దగ్గర జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఫెర్రీ దగ్గర గంగమ్మకు చీరె, సారె సమర్పించిన సీఎం చంద్రబాబు
దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కె.ఎల్.రావు కీలకపాత్ర పోషించారు: చంద్రబాబు
ముగ్గురు ప్రధానుల దగ్గర మంత్రిగా పనిచేసిన గొప్ప వ్యక్తి కె.ఎల్.రావు: చంద్రబాబు
కె.ఎల్.రావు విజయవాడలో జన్మించడం మన అదృష్టం: చంద్రబాబు
-
Jul 15, 2026 13:15 IST
కడప: సిమెంట్ ఉత్పత్తి రంగంలో దాల్మియా గ్రూప్ బలమైనది: మంత్రి నారా లోకేశ్
దాల్మియా గ్రూప్ ఏపీ అభివృద్ధిలో ఎప్పటి నుంచో భాగమైంది: నారా లోకేశ్
దాల్మియా గ్రూప్ పెట్టుబడుల వల్ల వేలమందికి ఉపాధి లభిస్తోంది: నారా లోకేశ్
అనుమతులు వేగంగా ఇవ్వడం వల్లే ఏపీకి భారీ పెట్టుబడులు: నారా లోకేశ్
త్వరలో దాల్మియా గ్రూప్ మూడో దశ కూడా విస్తరిస్తుంది: మంత్రి లోకేశ్
-
Jul 15, 2026 13:07 IST
హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డితో ముగిసిన జగ్గారెడ్డి భేటీ
తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి ఆసక్తి చూపించడం లేదు: జగ్గారెడ్డి
తుంగతుర్తిలో AICC నిబంధనల ప్రకారం 3, 4 మండలాల్లో మండల అధ్యక్షుల నియామకం జరగలేదు: జగ్గారెడ్డి
మండల అధ్యక్షుడిగా ఐదేళ్లు ఉంటే తొలగించాలి: జగ్గారెడ్డి
తుంగతుర్తి ఇష్యూపై ఈ నెల 20న నివేదిక ఇస్తా: జగ్గారెడ్డి
-
Jul 15, 2026 13:04 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో 'టూ-చైల్డ్ పాలసీ'పై సుప్రీంకోర్టు విచారణ
ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హత వేసే చట్టాలపై విచారం
సంతానోత్పత్తి రేటు పడిపోతుంటే ఇలాంటి చట్టాలు ఎందుకని ప్రశ్నించిన న్యాయస్థానం
2003 నాటి పాత తీర్పును పునఃసమీక్షిస్తామన్న ధర్మాసనం
-
Jul 15, 2026 12:57 IST
తిరుపతి: RAW NTR కార్యక్రమంపై ఏఎస్పీకి NTR ఫ్యాన్స్ ఫిర్యాదు
తాజ్ హోటల్‌లో జరిగే కార్యక్రమంతో సంబంధం లేదని ఫిర్యాదు
ఎన్టీఆర్ పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపణ
కార్యక్రమంపై తాజ్ హోటల్‌ను సంప్రదించిన ASP రవి మనోహర్
-
Jul 15, 2026 12:51 IST
ఢిల్లీ: ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ
మ.3:00 గంటలకు నిర్ణయాలు వెల్లడించనున్న అశ్వినీ వైష్ణవ్
-
Jul 15, 2026 12:49 IST
హైదరాబాద్: HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు రిమాండ్
14 రోజుల రిమాండ్ విధించిన ACB కోర్టు
చంచల్‌గూడ జైలుకు బచ్చు రవీందర్ తరలింపు
రవీందర్ ఇంట్లో రూ.9.24 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ACB
బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్లు ఉంటుందని అంచనా
-
Jul 15, 2026 12:44 IST
ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు
260 మందికి పైగా గాయపడినట్టు ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకటన
ఇరాన్ రేవులు, స్థావరాలే లక్ష్యంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ దాడులు
బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీతో పాటు పలు తీరప్రాంత కేంద్రాలపై దాడులు
-
Jul 15, 2026 12:29 IST
సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన AAIB
అహ్మదాబాద్ విమాన ప్రమాదం కేసులో అఫిడవిట్
కాక్‌పిట్ వాయిస్ రికార్డ్ బహిర్గతం చేయలేమన్న AAIB
చట్టపరమైన నిబంధనలతో CVR ఆడియో విడుదలకు అనుమతి లేదని వెల్లడి
-
Jul 15, 2026 12:14 IST
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై దాఖలైన పిల్‌పై స్పందించిన ఢిల్లీ హైకోర్టు
18 రోజులకు చేరిన సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష
వాంగ్‌చుక్ ఆరోగ్యంపై హైకోర్టు తీవ్ర ఆందోళన, రేపు అత్యవసర విచారణ
కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అత్యవసర నోటీసులు
-
Jul 15, 2026 11:55 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో DCC అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ భేటీ
DCC అధ్యక్షులతో విడివిడిగా మాట్లాడుతున్న మీనాక్షి నటరాజన్
జిల్లాల్లో పార్టీ పరిస్థితి, అంతర్గత కలహాలు, SIR ప్రక్రియపై చర్చ
-
Jul 15, 2026 11:55 IST
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ పిటిషన్‌పై విచారణ వాయిదా
తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ
సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రిప్లయ్ ఇవ్వడానికి ప్రతివాది CI నాగరాజుకు వారం రోజుల గడువు ఇచ్చిన కోర్టు
-
Jul 15, 2026 11:43 IST
నా బ్యాటింగ్‌లో మార్పునకు వారిద్దరే కారణం: వాషింగ్టన్ సుందర్
గంభీర్, ఆశిష్ నెహ్రాలకు క్రెడిట్ ఇచ్చిన సుందర్
విభిన్న స్థానాల్లో ఆడటం సవాలే.. కానీ నాకు ఇష్టం: సుందర్
ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచిన ఆల్‌రౌండర్
-
Jul 15, 2026 11:36 IST
ముద్రగడ నివాసానికి మంత్రులు కందుల దుర్గేశ్, సుభాష్
ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రులు
అన్ని ప్రాంతాల వారికీ ముద్రగడ లేని లోటు తీర్చలేనిది: దుర్గేశ్
ప్రభుత్వం తరఫున నివాళులర్పించేందుకు వచ్చాం: దుర్గేశ్
-
Jul 15, 2026 11:34 IST
హైదరాబాద్: మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష
అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులకు దిశానిర్దేశం
పలు పథకాల కింద బడ్జెట్ విడుదల
వ్యయంపై జిల్లాల వారీగా పనితీరు పరిశీలన
అంగన్‌వాడీ తొలిముద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశం
-
Jul 15, 2026 11:27 IST
అమరావతి: మద్యం రవాణా టెండర్ల కేసులో కీలక పరిణామం
నిందితులపై పీటీ వారెంట్లకు ACB కోర్టు అనుమతి
వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌పై సిట్ పీటీ వారెంట్లు
ఈనెల 20న ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని నిర్ణయం
ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులు
-
Jul 15, 2026 11:25 IST
అమరావతి: వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ కొట్టివేత
అమరావతిలోని అసైన్డ్ భూముల వ్యవహారంలో వైసీపీ హయాంలో CID నమోదు చేసిన కేసును కొట్టివేసిన హైకోర్టు
అప్పట్లో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు
ఇందులో చంద్రబాబు, నారాయణపై పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు
-
Jul 15, 2026 11:19 IST
యూపీ: బరేలీలో ఘరానా మోసం
IAS అధికారినంటూ నమ్మించి పెళ్లాడిన కిలాడీ లేడీ అరెస్ట్
సోషల్ మీడియాలో నకిలీ IAS ప్రొఫైల్ సృష్టించిన సాధన
పెళ్లి తర్వాత భర్తను చంపేందుకు యత్నం
భర్త ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు, సాధన అరెస్ట్
-
Jul 15, 2026 11:11 IST
మహారాష్ట్ర: తాడోబా బఫర్ జోన్‌లో ఆడ పులి మృతి
మత్తుమందు ప్రయోగం విఫలమై పులి మృతి
గత నెలలో మనిషిపై దాడి చేసిన టీ-202 పులి
పోస్టుమార్టం నిమిత్తం చంద్రాపూర్‌కు తరలింపు
పులి మృతిపై విచారణ చేపట్టిన అటవీశాఖ అధికారులు
-
Jul 15, 2026 11:03 IST
టీమ్ఇండియాను వీడనున్న ర్యాన్ టెన్ డస్కాటే.. కారణమిదేనా?
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ అనంతరం సహాయ కోచ్ డస్కాటే జట్టును వీడుతున్నాడంటూ వార్తలు
బీసీసీఐ ఇచ్చిన ఓ హామీ నెరవేరలేదని డస్కాటే అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం
-
Jul 15, 2026 10:48 IST
హైదరాబాద్: ఉప్పల్‌లో ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ దాడి
రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీలో ఆకస్మిక తనిఖీలు
గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్ల స్వాధీనం
భారీగా కల్తీ ముడి పదార్థాలు సీజ్ చేసిన అధికారులు
పోలీసుల అదుపులో యూనిట్ నిర్వాహకుడు రమేశ్
-
Jul 15, 2026 10:47 IST
హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రైతాంగానికి కొంత నష్టం: మంత్రి తుమ్మల
వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు: ABNతో తుమ్మల
ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు వెళ్లాలని సూచిస్తున్నాం: తుమ్మల
రేపటి నుంచి ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తూ ఆయా జిల్లాలవారీగా వివరాలు తీసుకుంటాం: తుమ్మల
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడటమే మా కర్తవ్యం: తుమ్మల
-
Jul 15, 2026 10:37 IST
అమరావతి: జగన్ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాలపై ఈడీ ఫోకస్
3 ప్రముఖ సంస్థలపై ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలపై దర్యాప్తు
అమరావతికి చెందిన దండా నాగేంద్ర కుమార్‌కు ఈడీ సమన్లు
సమన్లు జారీ చేసిన ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం
ఇవాళ వ్యక్తిగతంగా హాజరవ్వనున్న దండా నాగేంద్ర కుమార్
-
Jul 15, 2026 10:27 IST
నేడు ముంబై నుంచి హైదరాబాద్ నివాసానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ముంబైలో కుడి భుజానికి ఆపరేషన్ చేయించుకున్న పవన్
రోజూ పవన్ భుజానికి ఫిజియోథెరపీ చేస్తున్న వైద్యులు
రెండు నెలల తర్వాత పవన్ ఎడమ భుజానికి ఆపరేషన్ చేయనున్న వైద్యులు
-
Jul 15, 2026 10:18 IST
ఇంగ్లండ్‌తో తొలి వన్డే: పలు రికార్డులు బద్దలు కొట్టిన భారత్
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ వరుస విజయాలకు బ్రేక్
ఇంగ్లండ్‌పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం
తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
-
Jul 15, 2026 10:15 IST
రైతు ద్రోహి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి: ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు
కరవు కాటకాలతో రాష్ట్రం అల్లాడిపోవాలనేది ఆయన ఆలోచన: నిమ్మల
రాక్షస మనస్తత్వం జగన్‌ది: నిమ్మల
ఎల్‌నినో కారణంగా ఏపీలో చుక్కనీరు లేదు: నిమ్మల
-
Jul 15, 2026 10:09 IST
హైదరాబాద్: మాదాపూర్ పీఎస్ పరిధిలో దారుణహత్య
ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన దుండగులు
మృతుడు వరంగల్ జిల్లా మాదన్నపేట్ మండలం ఉప్పరపల్లి వాసి భాస్కర్‌గా గుర్తింపు
ఉప్పరపల్లికి చెందిన యువతిని ప్రేమించిన చిన్నపల్లి భాస్కర్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 15, 2026 10:00 IST
బీఆర్ఎస్ నేత ప్రశాంత్‌రెడ్డి హౌస్ అరెస్టును ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రజాసమస్యలపై దీక్షను అడ్డుకుంటారా?: హరీశ్ రావు
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: హరీశ్ రావు
పోలీసుల రాజ్యం నడపడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి అలవాటు: హరీశ్ రావు
హిట్లర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోంది: హరీశ్ రావు
ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు: హరీశ్ రావు
-
Jul 15, 2026 09:50 IST
భారీగా పెరిగిన బంగారం ధరలు
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 770 రూపాయల పెరుగుదల
22 క్యారెట్ల బంగారంపై 700 రూపాయల పెరుగుదల
18 క్యారెట్ల బంగారంపై 570 రూపాయల పెరుగుదల
మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. రూ.1,43,570గా ట్రేడింగ్
-
Jul 15, 2026 09:47 IST
మధ్యప్రదేశ్ యూసీసీ డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం
సహజీవనం చేసే జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
సహజీవాన్ని నమోదు చేసుకోకపోతే 3 నెలల వరకు జైలుశిక్ష
సహజీవనం ముగిసిపోతే అధికారికంగా రద్దు చేసుకోవడం తప్పనిసరి
రిజిస్టర్డ్ సహజీవన జంటల రికార్డులను నిర్వహించనున్న స్థానిక పోలీస్ స్టేషన్లు
-
Jul 15, 2026 09:45 IST
హైదరాబాద్: ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపం తెలిపిన మెగాస్టార్ చిరంజీవి
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన చిరంజీవి
ప్రజా జీవితంలో ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం: మెగాస్టార్
-
Jul 15, 2026 09:40 IST
లాభాల్లో దేశీయ సూచీలు
500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
147 పాయింట్ల పైన లాభంలో నిఫ్టీ
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.11
-
Jul 15, 2026 09:30 IST
ఫిఫా ప్రపంచ కప్.. మాకు ఫైనల్‌కు వెళ్లే అర్హత లేదు: ఎంబాపె
సెమీఫైనల్‌లో స్పెయిన్‌పై 0-2 తేడాతో ఫ్రాన్స్ ఘోర ఓటమి
జట్టు ఆటతీరుపై ఫ్రాన్స్ కెప్టెన్ ఎంబాపె అసంతృప్తి
-
Jul 15, 2026 09:21 IST
హైదరాబాద్: KPHB పీఎస్ పరిధిలో ఏడో తరగతి బాలికపై అత్యాచారం
యూపీకి చెందిన నిందితుడు రెహాన్ అరెస్ట్
బాధితురాలి ఇంటి ముందు పండ్లు అమ్ముతూ ఆమెతో పరిచయం పెంచుకున్న రెహాన్
బాలికపై కన్నేసి.. మే నెలలో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు
-
Jul 15, 2026 08:38 IST
తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్టు ఇరాన్ ప్రకటన
యూఎస్ నౌకాదళ దిగ్బంధనం విధించి ముక్కలు చేసిందని ఇరాన్ ఆరోపణ
ఒప్పందం అవసరం ఇక ఏ మాత్రం లేదని స్పష్టం చేసిన ఇరాన్
ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చల ప్రస్తావన తీసుకురాబోం: ఇరాన్
US తన దుష్టచర్యలను ఇలాగే కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు: ఇరాన్
ప్రపంచానికి గల్ఫ్ నుంచి చుక్క చమురు, గ్యాస్ ఎగుమతి కాకుండా స్తంభింపజేస్తాం: ఇరాన్
-
Jul 15, 2026 08:17 IST
ఇరాన్‌కు మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
వెంటనే చర్చలకు రాకుంటే ఇరాన్‌పై విరుచుకుపడతాం: ట్రంప్
విద్యుత్ కేంద్రాలు, ప్రజా మౌలిక వసతులపై దాడులు చేస్తాం: ట్రంప్
రేపు, ఎల్లుండి ఇరాన్‌ను దెబ్బతీస్తాం: ట్రంప్
వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది: ట్రంప్
ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌లో ఎవరూ మిగలరు: ట్రంప్
-
Jul 15, 2026 08:01 IST
కాకినాడ: కిర్లంపూడికి ముద్రగడ కుమార్తె క్రాంతి
తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడి వచ్చిన క్రాంతి
క్రాంతిని అడ్డుకున్న పోలీసులు
గో బ్యాక్ క్రాంతి అంటూ ముద్రగడ అనుచరుల నినాదాలు
క్రాంతితో చర్చలు జరిపిన డీఎస్పీ తిలక్
ముద్రగడకు నివాళులర్పించి వెళ్లిపోయిన క్రాంతి
-
Jul 15, 2026 07:45 IST
కృష్ణా జిల్లా: జోసెఫ్ రావణ్ కేసులో కొత్త పరిణామం
నిన్న 10 రోజుల కస్టడీ పిటిషన్ ఉపసంహరించుకున్న పోలీసులు
15 రోజుల కస్డడీ కోరుతూ కొత్తగా పోలీసుల పిటిషన్
జోసెఫ్ తరఫు న్యాయవాదులకు కోర్టు నోటీసులు
కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
-
Jul 15, 2026 07:41 IST
అనకాపల్లి: నేడు పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటన
వేంపాడు టోల్‌ప్లాజా దగ్గర భారతి కన్వెన్షన్ హాల్‌లో అభయ కార్యక్రమంలో పాల్గొననున్న హోంమంత్రి
-
Jul 15, 2026 07:28 IST
అస్సాంలో పెరిగిన వరదల తీవ్రత
వరదలతో నీట మునిగిన 6 జిల్లాల్లోని 99 గ్రామాలు
లఖింపూర్ జిల్లాపై తీవ్రంగా వరద ప్రభావం
నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
-
Jul 15, 2026 07:23 IST
కాకినాడ: కిర్లంపూడిలో నేడు అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు
అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు
ముద్రగడ మృతిపట్ల పలువురు ప్రముఖుల సంతాపం
-
Jul 15, 2026 07:15 IST
ఢిల్లీ: నేడు ఉ.11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం
పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
-
Jul 15, 2026 07:11 IST
అమరావతి: నేడు ఇబ్రహీంపట్నంలో చంద్రబాబు పర్యటన
ఉ.10 గంటలకు పవిత్ర సంగమం దగ్గర జలహారతి
జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
-
Jul 15, 2026 07:08 IST
హైదరాబాద్: నేటి నుంచి డీసీసీ చీఫ్‌లతో మీనాక్షి వరుస సమావేశాలు
రెండు రోజులపాటు వన్ టూ వన్ సమావేశాలు
డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి సమీక్ష
డీసీసీ అధ్యక్షులు ప్రోగ్రెస్ కార్డుతో రావాలని ఆదేశం
ఈ నెల 17న మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ
మంత్రులతో విడివిడిగా భేటీకానున్న మీనాక్షి, మహేశ్ గౌడ్
-
Jul 15, 2026 07:04 IST
నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం
కేంద్రమంత్రి కుమారస్వామిని కలవనున్న కేటీఆర్ బృందం
ఆదిలాబాద్ సీసీఐ పునఃప్రారంభంపై కేంద్రానికి వినతి
-
Jul 15, 2026 07:02 IST
సిద్దిపేట: పాతూరు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రమాదం
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, ఒకరి మృతి
మృతుడు ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్‌గా గుర్తింపు
-
Jul 15, 2026 06:56 IST
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం
నందనవనం ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మెట్రో బార్ సమీపంలో ఆగ్నికి ఆహుతైన గోదాం
పక్కనే ఉన్న మరో గోదాంకు, సమీప భవనాలకు వ్యాపించిన మంటలు
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజిన్లు
-
Jul 15, 2026 06:56 IST
నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
మధ్యాహ్నం 1:30 గంటలకు దివిటిపల్లిలోని అమర్‌రాజా గిగా కారిడార్‌లో సెల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం
మధ్యాహ్నం 3:00 గంటలకు కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల భవనం ప్రారంభోత్సవం
అనంతరం విద్యార్థులతో ముఖాముఖి
-
Jul 15, 2026 06:48 IST
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై నేడు విచారణ
CI నాగరాజు కస్టడీపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం
CI నాగరాజు కస్టడీ విచారణకు హైకోర్టు నిబంధనలపై అభ్యంతరం
విచారణను వీడియో రికార్డింగ్ చేయాలన్న షరతును వ్యతిరేకిస్తున్న సిట్
-
Jul 15, 2026 06:41 IST
హోర్ముజ్ దగ్గర నిలిచిపోయిన 7 భారత నౌకలు
నౌకల్లోని 148 మంది భారత నావికులు సురక్షితం
ఉద్రిక్తతలతో హోర్ముజ్ జలసంధి దాటలేని భారత నౌకలు
పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం
-
Jul 15, 2026 06:37 IST
ఫిఫా వరల్డ్ కప్ తుదిదశకు చేరిక
ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న స్పెయిన్
నేడు సెమీస్‌లో తలపడనున్న ఇంగ్లండ్, అర్జెంటీనా
-
Jul 15, 2026 06:36 IST
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
రూ.1,42,790కి చేరిన 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం
రూ.1,30,890కి చేరిన 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి
కిలో వెండి ధర రూ.2,34,900
-
Jul 15, 2026 06:29 IST
కాకినాడ: కిర్లంపూడిలోని ఆయన నివాసానికి చేరిన ముద్రగడ పార్దివదేహం
నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు హెలికాప్టర్‌లో జగ్గంపేటకు వెళ్లనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
జగ్గంపేట నుంచి రోడ్డుమార్గంలో కిర్లంపూడికి వైసీపీ అధినేత
ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించనున్న జగన్
-
Jul 15, 2026 06:27 IST
అనకాపల్లి జిల్లా: పరవాడ సాయిచందన ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ వాటిల్లలేదని అధికారుల వెల్లడి
-
Jul 15, 2026 06:21 IST
కడప: నేడు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
జమ్మలమడుగు నియోజకవర్గంలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్‌కు భూమిపూజ చేసి శంకుస్థాపన చేయనున్న మంత్రి
మైలవరం మం. చిన్న కొమెర్ల గ్రామం వద్ద రూ.3,478 కోట్లతో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ ఏర్పాటు
మధ్యాహ్నం ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్న మంత్రి లోకేశ్