-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 12th July 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 12 , 2026 | 06:01 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jul 12, 2026 21:26 IST
చైనా ఎడారిలో అమెరికా యుద్ధనౌక ప్రతిరూపం నిర్మాణం
షింజియాంగ్‌లో అర్లీ బర్క్ డిస్ట్రాయర్ పూర్తి స్థాయి మోడల్ ఏర్పాటు
క్షిపణి పరీక్షలు, లక్ష్య సాధన కోసమే నిర్మాణమని అంచనా
కదిలే నౌక నమూనా గుర్తించిన ఉపగ్రహ చిత్రాలు
అమెరికా యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుని పరీక్షలు చేస్తున్న చైనా
యాంటీ-షిప్ క్షిపణి సామర్థ్యాల పెంపుపై బీజింగ్ దృష్టి
అమెరికా-చైనా సైనిక పోటీ మరింత తీవ్రం అవుతున్న సంకేతాలు
-
Jul 12, 2026 21:12 IST
నల్లగొండలో చైన్ స్నాచింగ్ కలకలం
మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఘటన
వృద్ధురాలి మెడలో నుంచి 9 తులాల బంగారం అపహరణ
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
దర్యాప్తు చేపట్టిన వన్‌టౌన్ పోలీసులు
-
Jul 12, 2026 21:08 IST
నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారీ నిరసనలు
పునరావాసం కల్పించకుండా ఆక్రమణదారులను ఖాళీ చేయించడంపై ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చిన వందలాది మంది
ప్రధాని బలేన్ షా ప్రభుత్వానికి తొలి పెద్ద సవాల్
జెన్-జీ యువత ఆధ్వర్యంలో ఉధృతమైన నిరసనలు
పునరావాస కేంద్రాల్లో అమానుష పరిస్థితులపై ఆందోళన
ఆందోళనకారులు, విద్యార్థులు, జర్నలిస్టుల అరెస్ట్‌లపై విమర్శలు
-
Jul 12, 2026 20:39 IST
విశాఖకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
విశాఖ నాకు మంచిస్నేహితులను ఇచ్చింది. ఇక్కడ నేను చదువుకున్నాను: వెంకయ్య
విశాఖలో విద్యార్థి నాయకుడిగా ఎదిగాను: వెంకయ్య
నేను జనాన్ని చదివాను.. పార్టీ కోసం గోడల మీద రాసే వాడిని: వెంకయ్య
-
Jul 12, 2026 20:25 IST
హైదరాబాద్‌లో అడవి జంతువుల వేట ముఠా అరెస్ట్
నీల్గాయి మాంసం తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్
బొలెరోలో 70 కిలోల నీల్గాయి మాంసం స్వాధీనం
లైసెన్స్డ్ గన్, ఎయిర్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లు సీజ్
ఆదిలాబాద్ అడవుల్లో నీల్గాయిని వేటాడినట్లు పోలీసుల గుర్తింపు
నగరంలో మాంసం విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడి
-
Jul 12, 2026 20:03 IST
విశాఖ: ‘వెంకయ్య నాయకుడు’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో హోం మంత్రి అనిత కామెంట్స్
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీకి వరం: అనిత
రైతు కుటుంబం నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు: అనిత
విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారు: అనిత
వెంకయ్య ప్రసంగాలు మాకు స్ఫూర్తినిచ్చాయి: అనిత
రాజకీయాల్లో వెంకయ్యనాయుడు ఆదర్శం: అనిత
'ఇది పుస్తకం కాదు.. ఒక చరిత్ర': అనిత
-
Jul 12, 2026 19:36 IST
విశాఖలో ‘వెంకయ్య నాయకుడు’ పుస్తక పరిచయ కార్యక్రమం
ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత
హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు కూటమి ఎమ్మెల్యేల హాజరు
'వెంకయ్య నాయకుడు' పుస్తక రచయిత మా శర్మ
-
Jul 12, 2026 19:34 IST
హైదరాబాద్: రేపు మధ్యాహ్నం విడుదల కానున్న TG-TET ఫలితాలు
అభ్యర్థులు https://tgtet.aptonline.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
రాష్ట్రవ్యాప్తంగా 1,15,028 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు
-
Jul 12, 2026 18:49 IST
హైదరాబాద్: పవన్‌కు మూడున్నర గంటలపాటు ఆపరేషన్ చేశారు: సీఎం చంద్రబాబు
ఆపరేషన్ విజయవంతం అయింది: సీఎం చంద్రబాబు
3 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు: సీఎం చంద్రబాబు
మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాం: చంద్రబాబు
2, 3 రోజుల్లో పవన్ డిశ్చార్జ్ అవుతారు: సీఎం చంద్రబాబు
-
Jul 12, 2026 18:48 IST
హైదరాబాద్: తుంగతుర్తి వివాదంపై స్పందించిన ఎమ్మెల్యే మందుల సామేల్
కాంగ్రెస్‌లో సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి: సామేల్
పీసీసీ చీఫ్, ఇన్‌చార్జ్, పార్టీపై గౌరవం తగ్గదు: సామేల్
నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తా: సామేల్
నా నియోజకవర్గంలో పరిణామాలను పెద్దలు పరిశీలించారు: సామేల్
ఎంపీతో నాకు ఎలాంటి విభేదాలు లేవు: సామేల్
-
Jul 12, 2026 18:47 IST
మార్కాపురం-మాచర్ల బస్సుకు తప్పిన ప్రమాదం
రన్నింగ్‌లో ఊడిపోయిన బస్సు ముందు టైరు
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం
-
Jul 12, 2026 18:07 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.1,122.86 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
మున్సిపల్ బాండ్ల ద్వారా రూ.1,010.58 కోట్లు సమీకరించనున్న కూటమి ప్రభుత్వం
ప్రభుత్వ గ్యారంటీ లేకుండానే బాండ్ జారీ ప్రక్రియ
-
Jul 12, 2026 18:07 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ల్యాండ్ పూలింగ్ రైతులకు వ్యవసాయ రుణాల మాఫీ అమలు
గుంటూరు, పల్నాడు జిల్లాల 7 గ్రామాల్లో డెట్ వేవర్ స్కీమ్‌కు ఆమోదం
AP CRDA కమిషనర్‌కు రుణమాఫీ అమలు అధికారాలు
2026 జనవరి 6 నాటికి ఉన్న వ్యవసాయ రుణాలకు వర్తింపు
-
Jul 12, 2026 18:06 IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి రైతులకు మరింత ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వం
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్ రైతులకు యాన్యుటీ పెంపు
మెట్ట, జరీబు భూములకు రూ.10 వేలు చొప్పున యాన్యుటీ పెంపు
మెట్ట భూములు ఎకరాకు రూ.30 వేలు నుంచి రూ.40 వేలకు పెంపు
జరీబు భూములు ఎకరాకు రూ.50 వేలు నుంచి రూ.60 వేలకు పెంపు
2024 జూన్ 12 తర్వాత ఒప్పందం చేసుకున్న రైతులకు వర్తింపు
పదేళ్లపాటు యాన్యుటీ చెల్లింపులు
CRDA ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణ
-
Jul 12, 2026 18:00 IST
ఏపీ సీఆర్‌డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం ఊరట
ట్రంక్ రోడ్ల నిర్మాణంలో నివాసాలు కోల్పోయిన వారికి జీవన భృతి రూ.5 వేలు నుంచి రూ.10 వేలకు పెంపు
12 నెలలపాటు నెలకు రూ.10 వేలు చొప్పున జీవన భృతి
ఇంటి అద్దెతో కలిపి జీవన భృతి చెల్లింపునకు ఆమోదం
-
Jul 12, 2026 17:24 IST
హైదరాబాద్: కేసీఆర్‌తో ఈటల రాజేందర్‌కు ఇంకా అనుబంధం ఉంది: జగ్గారెడ్డి
అందుకే ఈటల అలా మాట్లాడుతున్నారు: జగ్గారెడ్డి
కేసీఆర్, హరీశ్‌ను ఈటల ఢిల్లీ తీసుకెళ్లి NDSAతో మాట్లాడాలి: జగ్గారెడ్డి
కాళేశ్వరం కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసిన కేసీఆర్, హరీశ్ రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి
-
Jul 12, 2026 17:23 IST
హైదరాబాద్: తుంగతుర్తి సమస్యపై రేపు పీసీసీ చీఫ్‌కు నివేదిక: జగ్గారెడ్డి
అందరి అభిప్రాయాలు తీసుకున్నాం.. స్క్రూటినీ జరుగుతోంది: జగ్గారెడ్డి
పాత, కొత్త నేతల పంచాయితీ అనేది సహజం: జగ్గారెడ్డి
తుంగతుర్తి సమస్య అన్నదమ్ముల పంచాయితీ లాంటిదే: జగ్గారెడ్డి
కాంగ్రెస్‌లో ఉన్న స్వేచ్ఛ.. ఏ పార్టీలోనూ ఉండదు: జగ్గారెడ్డి
-
Jul 12, 2026 17:22 IST
హైదరాబాద్: డ్యాన్స్ మాస్టర్లు శేఖర్, జానీ టీమ్స్ ఘర్షణ
అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల అంశంలో విభేదాలు
సభ్యుల సంక్షేమం, అంతర్గత నిర్ణయాలపై పరస్పర ఆరోపణలు
యూనియన్ పెద్దలు వివాదం సద్దుమణిగేలా చేయాలని సభ్యుల వినతి
-
Jul 12, 2026 17:20 IST
హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ చీఫ్ కవిత లేఖ
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి
EC ఆమోదించిన అనేక పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయి: కవిత
తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పార్టీలకు గుర్తింపు ఇచ్చారు: కవిత
ఇప్పుడు తెలంగాణ రక్షణ సేనపై అభ్యంతరాలు ఎందుకు?: కవిత
-
Jul 12, 2026 17:19 IST
మైసూర్: గాయని ఎస్.జానకి అంత్యక్రియలు
కనియనహుండి ఫాంహౌస్‌లో అంత్యక్రియలు
కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
S.జానకి అంత్యక్రియలకు హాజరైన పలువురు దక్షిణాది సినీరంగ ప్రముఖులు
కడసారి చూసేందుకు తరలివచ్చిన అభిమానులు
-
Jul 12, 2026 16:26 IST
రష్యా రిఫైనరీ, ఆయిల్ ట్యాంకర్‌పై దాడి
ఆదివారం రష్యాను మరోసారి టార్గెట్ చేసిన ఉక్రెయిన్
సమారా ప్రాంతం, అజోవ్-బ్లాక్ సీ కెనాల్‌పై దాడులు
దాడిలో ఒకరి మృతి, చిన్నారి సహా ముగ్గురికి గాయాలు
రష్యా ఇంధన రంగాన్ని దెబ్బతీయడమే లక్ష్యమన్న ఉక్రెయిన్
-
Jul 12, 2026 16:18 IST
ముంబైలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
నిన్న కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్
పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు
-
Jul 12, 2026 16:08 IST
శ్రీశైలంలో స్పర్శ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత
భక్తుల రద్దీతో నేడు, రేపు బ్రేక్ దర్శనాల రద్దు
వీఐపీ సిఫారసు లేఖల వారికి అలంకార దర్శనానికే అనుమతి
ఆన్‌లైన్, మనమిత్ర టికెట్లు పొందిన వారికి స్పర్శ దర్శనం యథావిధి
సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఈవో నిర్ణయం
-
Jul 12, 2026 15:52 IST
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
రైతన్నల కోసం ఎంత రక్తమైనా ధారపోయడానికి సిద్ధమే: కేటీఆర్
తెలంగాణ కోసం కొట్లాడిన పిల్లలను ఎన్‌కౌంటర్లు చేశారు: కేటీఆర్
తెలంగాణలో ఎండుతున్న పొలాలకు వెంటనే నీరు విడుదల చేయాలి: కేటీఆర్
రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు: కేటీఆర్
-
Jul 12, 2026 15:14 IST
మిసైల్ తయారీ.. ప్రైవేటు సంస్థలకూ అనుమతి!
రక్షణ రంగంలో భారీ సంస్కరణకు కేంద్రం సిద్ధం
ప్రైవేటు సంస్థల నుంచి త్వరలో ప్రతిపాదనలు స్వీకరించే ఛాన్స్
అస్త్ర-2 మిసైల్ తయారీ ప్రైవేటు సంస్థలకు దక్కే ఛాన్స్
-
Jul 12, 2026 14:47 IST
కర్నూలు: దేవనకొండ మండలం నెల్లిబండలో క్షుద్రపూజల కలకలం
పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు
తాంత్రికులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Jul 12, 2026 14:23 IST
ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ వెన్నంపై ఎక్స్‌లో సీఎం చంద్రబాబు ప్రశంసలు
అంతర్జాతీయ వేదికపై జ్యోతి సురేఖ ప్రతిభ యువతకు స్ఫూర్తి: చంద్రబాబు
ఏపెక్స్-2036 ద్వారా మరెందరో ఛాంపియన్లను తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
టోర్నమెంట్‌లో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలి: చంద్రబాబు
-
Jul 12, 2026 13:43 IST
రంగారెడ్డి: షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ కోసం విస్తృత గాలింపు
రాజ్‌కుమార్ ఉనికిపై రకరకాల వదంతులు ప్రచారం
పోలీసుల అదుపులో ఉన్నాడని ఒకవైపు.. ఆత్మహత్య చేసుకున్నట్లు మరోవైపు ప్రచారం
తిమ్మాపూర్ సమీపంలోని అక్వేనిగూడ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం
రాజ్‌కుమార్ తమ అదుపులో లేడంటున్న పోలీసులు
-
Jul 12, 2026 13:41 IST
సీఎం రేవంత్‌కు టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు లేఖ
కాళేశ్వరం పునరుద్ధరణలో ప్రభుత్వం విఫలం: రాంచందర్‌రావు
బ్యారేజీల పునరుద్ధరణను గాలికొదిలేశారు: రాంచందర్‌రావు
NDSA సిఫారసులను సకాలంలో అమలు చేయనందునే రైతులకు ఇక్కట్లు: రాంచందర్‌రావు
-
Jul 12, 2026 13:30 IST
సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్
కేసీఆర్ కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుతున్నదే రేవంత్‌రెడ్డి: కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష కోట్లు కక్కిస్తా అన్నావ్?: కిషన్‌రెడ్డి
కేసీఆర్ కుటుంబంతో రేవంత్‌కు రహస్య సంబంధాలు: కిషన్‌రెడ్డి
మమ్మల్ని విమర్శించే ముందు రేవంత్ ఆత్మవిమర్శ చేసుకోవాలి: కిషన్‌రెడ్డి
కాళేశ్వరం దోషులను ఎందుకు అరెస్ట్ చేయలేదు?: కిషన్‌రెడ్డి
-
Jul 12, 2026 13:08 IST
విజయవాడ ఆటోనగర్‌లో అగ్నిప్రమాదం
మెకానిక్ షెడ్‌లో 7 ప్రైవేట్ బస్సుల దగ్ధం
భారీగా ఎగిసిపడుతున్న మంటలు
మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది
-
Jul 12, 2026 13:03 IST
నల్లగొండ: తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి: మంత్రి కోమటిరెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 6 స్థానాలు పెరుగుతాయి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
BRS పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: మంత్రి కోమటిరెడ్డి
మేం అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులు: మంత్రి కోమటిరెడ్డి
-
Jul 12, 2026 12:36 IST
విశాఖ: మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి ఫ్లెక్సీలకు పాలాభిషేకం
దక్షిణ కొరియా పెట్టుబడుల తెచ్చినందుకు లోకేశ్‌కు పాలాభిషేకం
మోస్ట్ పవర్‌పుల్ ఉమెన్-2026 అవార్డు సాధించినందుకు బ్రాహ్మణి ఫొటోలకు పాలాభిషేకం
ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
-
Jul 12, 2026 12:24 IST
హైదరాబాద్: అంబర్‌పేట్ నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి పాదయాత్ర
కాచిగూడ డివిజన్‌లో కొనసాగుతున్న కిషన్‌రెడ్డి పాదయాత్ర
పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు, కార్యకర్తలు
-
Jul 12, 2026 12:21 IST
మార్కాపురం: ఎర్రగొండపాలెం మండలం మెట్టబోడు తండా దగ్గర ప్రమాదం
స్కూటీని వెనుక నుంచి ఢీకొన్న కారు.. స్కూటీపై ఉన్న రియాన్ (5) మృతి
బాలుడి తండ్రికి తీవ్ర గాయాలు
-
Jul 12, 2026 11:30 IST
హైదరాబాద్: గాంధీభవన్‌కు తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీ
గాంధీభవన్‌కు చేరుకున్న MLA మందుల సామేల్
MP చామల, MLA మందుల సామేల్ వర్గాల వివాదం
జగ్గారెడ్డికి తుంగతుర్తి పంచాయితీ పరిష్కార బాధ్యతలు
తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీపై సమీక్షిస్తున్న జగ్గారెడ్డి
-
Jul 12, 2026 11:30 IST
అనుమతి లేని నౌకపైనే దాడి చేశాం: ఇరాన్
హోర్ముజ్ జలసంధిని మూసివేశాం: ఇరాన్
-
Jul 12, 2026 11:15 IST
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిలో సైకో కన్పిస్తున్నారు: హరీశ్ రావు
మేం నీళ్లు పారించమంటే.. ఆయన రక్తం పారిస్తామంటున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు
హిట్లర్ తనకు ఆదర్శమన్న రేవంత్.. అలాగే మాట్లాడుతున్నారు: హరీశ్ రావు
సీఎం రేవంత్‌లో ఫ్రస్టేషన్ కనిపిస్తోంది.. అందుకే అలా మాట్లాడుతున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు
-
Jul 12, 2026 11:00 IST
రంగారెడ్డి: షాబాద్ హత్యల కేసు దర్యాప్తు వేగవంతం: చేవెళ్ల DCP యోగేష్
నిందితుడి కోసం 9 బృందాలతో గాలింపు: చేవెళ్ల DCP యోగేష్
నిందితుడు అటవీ ప్రాంతంలో వెళ్లినట్లు అనుమానం: చేవెళ్ల DCP
సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు: చేవెళ్ల DCP యోగేష్
-
Jul 12, 2026 10:42 IST
పార్వతీపురం మన్యం జిల్లా: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
పార్వతీపురం తహశీల్దార్ ఆఫీస్ ఆవరణలో చెట్టుకు ఉరేసుకున్న మహిళ
మృతురాలి వివరాలను సేకరిస్తున్న పోలీసులు
-
Jul 12, 2026 10:15 IST
ఇరాన్‌పై అమెరికా మూడో విడత దాడులు
సైప్రస్ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడులు
ఇరాన్ హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రయాణిస్తున్న సైప్రస్ నౌక
-
Jul 12, 2026 10:00 IST
కెనడా: టొరంటోలో కాల్పుల కలకలం, ఇద్దరి మృతి
లాటిన్ స్ట్రీట్‌లో ఘటన, పలువురికి గాయాలు
-
Jul 12, 2026 09:45 IST
జమ్మూకశ్మీర్ పహల్గాంలో మేఘ విస్పోటం
అనంతనాగ్ జిల్లాలో ఆకస్మిక వరదలు
ఆకస్మిక వరదలతో అమర్‌నాథ్ యాత్రికులకు ఇక్కట్లు
-
Jul 12, 2026 09:35 IST
జనగామ : జనగామలో పశు వధశాలపై మున్సిపల్ అధికారుల దాడులు
కూర్మవాడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న జంతు వధ కేంద్రం గుర్తింపు
మేకలు, గొర్రెల కళేబరాన్ని స్వాధీనం చేసుకున్న మున్సిపల్ సిబ్బంది
అక్రమంగా గొర్రెలు, మేకలను వధిస్తున్న వ్యాపారి కరణ్ లాలాకు రూ.లక్ష జరిమానా
-
Jul 12, 2026 09:33 IST
ఫిఫా ప్రపంచ కప్: సెమీస్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా
స్విట్జర్లాండ్‌పై 1-3 తేడాతో అర్జెంటీనా విజయం
సెమీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడనున్న అర్జెంటీనా
వరుసగా రెండుసార్లు ఫిఫా ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌కు చేరుకున్న జట్టుగా అర్జెంటీనా రికార్డు
ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయని మెస్సి
-
Jul 12, 2026 09:14 IST
ఎన్టీఆర్ జిల్లా: స్వగ్రామైన మూలపాడుకు అట్లూరి ప్రసన్నలక్ష్మి మృతదేహం
అమెరికాలోని న్యూయార్క్‌లో ఈనెల 5న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రసన్న
అమెరికాలో MS ఫైనాన్స్ పూర్తి చేసుకున్న ప్రసన్న లక్ష్మి
ఉద్యోగం సాధించి పూజ నిమిత్తం గుడికి వెళ్తుండగా కారు ఢీకొని మృతి
-
Jul 12, 2026 09:08 IST
మైసూరు: మహారాజ కాలేజ్ గ్రౌండ్‌కి గాయని జానకమ్మ మృతదేహం తరలింపు
ప్రజల సందర్శనార్థం మహారాజ కాలేజ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు
జానకమ్మ ఆఖరి చూపు కోసం భారీగా తరలివస్తున్న అభిమానులు
సాయంత్రం 4:30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
-
Jul 12, 2026 08:30 IST
హైదరాబాద్: వనస్థలిపురం పనామా దగ్గర వ్యక్తి మృతదేహం లభ్యం
మృతదేహంపై కత్తి గాట్లు ఉండటంతో హత్య చేసినట్లు అనుమానాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 12, 2026 08:15 IST
ప్రకాశం: ఒంగోలు బైపాస్ రోడ్డులో కారు బీభత్సం
వాహనంతో పాటు బైక్‌ను ఢీకొట్టిన కారు
AR కానిస్టేబుల్ మరియదాస్ మృతి, మరో ముగ్గురికి గాయాలు
-
Jul 12, 2026 08:00 IST
నంద్యాల: జిల్లాలో ట్రావెల్స్ బస్సుకు తప్పిన ముప్పు
డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పిన ట్రావెల్స్ బస్సు
పలువురు ప్రయాణికులకు గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు
హన్మకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు
-
Jul 12, 2026 07:46 IST
హైదరాబాద్: ఫిలింనగర్ రోడ్ నెంబర్ 5లో కారు బీభత్సం
హిల్ వ్యూ అపార్ట్‌మెంట్ గేటును ఢీకొట్టిన ఫెరారీ స్పోర్ట్స్ కారు
తెల్లవారుజామున 4గంటలకు అపార్ట్‌మెంట్ ఇంటి గేటుపైకి దూసుకెళ్లిన కారు
ఫెరారీ స్పోర్ట్స్ కారు ముందు భాగం ధ్వంసం
ఘటనాస్థలి నుంచి పరారైన యువకులు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న ఫిలింనగర్ పోలీసులు
-
Jul 12, 2026 07:26 IST
తూ.గో.జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై ప్రమాదం
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరి మృతి
దేవరపల్లి నుంచి నల్లజర్లకు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్
మృతులు దేవరపల్లికి చెందిన కార్మికులు కుక్కల శ్రీను (40), కళ్ళే రాజు(40)గా గుర్తింపు
కేసు దర్యాప్తు చేస్తున్న దేవరపల్లి పోలీసులు
-
Jul 12, 2026 07:23 IST
మార్కాపురం: బేస్తవారిపేటలో ప్రమాదం
చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
మృతుడు బేస్తవారిపేట మండలం చెట్టిచెర్ల గ్రామానికి చెందిన గురుస్వామిగా గుర్తింపు
కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 12, 2026 07:03 IST
హైదరాబాద్: నేడు గాంధీభవన్‌లో తుంగతుర్తి అంశంపై సమావేశం
నేడు మందుల సామేల్ వర్గంతో జగ్గారెడ్డి భేటీ
-
Jul 12, 2026 07:03 IST
హైదరాబాద్: నేడు పటాన్‌చెరులో BRS సభ్యత్వ నమోదు కార్యక్రమం
హాజరుకానున్న మాజీ మంత్రి హరీశ్ రావు
-
Jul 12, 2026 07:02 IST
హైదరాబాద్: నేడు TG20 ఫైనల్ మ్యాచ్
ఫైనల్లో ఖమ్మం Vs హైదరాబాద్ మ్యాచ్
-
Jul 12, 2026 07:01 IST
స్థిరంగా బంగారం ధరలు
రూ.1,44,330కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.1,32,700కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
కిలో వెండి ధర రూ.2,40,000
-
Jul 12, 2026 06:03 IST
నేడు మైసూర్‌లో S.జానకి అంత్యక్రియలు
అభిమానుల సందర్శన కోసం మైసూర్‌లో జానకి పార్థివదేహం
మైసూర్‌లోని మహారాజ కాలేజీ మైదానానికి జానకి పార్థివదేహం
-
Jul 12, 2026 06:03 IST
విశాఖలో భూ ప్రకంపనలు
తెల్లవారుజామున పలుచోట్ల కంపించిన భూమి
భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
సాగర్‌నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరులో కంపించిన భూమి
ఈస్ట్ పాయింట్ కాలనీ, HB కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో కంపించిన భూమి
-
Jul 12, 2026 06:01 IST
నేడు ముంబైకి ఏపీ సీఎం చంద్రబాబు
శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించనున్న చంద్రబాబు