-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Ap Telangana National and International Breaking Live Updates of 11th April 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Apr 11 , 2026 | 06:52 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Apr 11, 2026 08:49 IST
సినీ నిర్మాత, ఏషియన్ ఫిల్మ్స్ అధినేత సునీల్ నారంగ్‌కి టోకరా
బోగస్ అకౌంట్స్‌తో రూ.కోటి కాజేసిన అకౌంటెంట్ విశ్వనాథ్
నిందితుడు విశ్వనాథ్‌ను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
-
Apr 11, 2026 08:49 IST
అనంతపురం: కళ్యాణదుర్గంలో వైసీపీ నేత హైటెక్ మోసం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ సంతకాల ఫోర్జరీ
తన బ్యాంక్ ఖాతాలో రూ.7లక్షల కోట్లకు పైగా నగదు ఉందని నమ్మించిన నేత
నకిలీ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్ సృష్టించిన వైసీపీ నేత ఎర్రిస్వామి
ఎర్రిస్వామి ట్రాప్‌లో పడి రూ.లక్షలు పోగొట్టుకున్న సామాన్యులు
-
Apr 11, 2026 08:42 IST
కామారెడ్డి: భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం
అంబులెన్స్‌ను వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ఇద్దరి మృతి
మరొకరికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు..
మృతులు అంబులెన్స్ డ్రైవర్ సర్దార్ (35), రోగి సలేహ భాను (63)
-
Apr 11, 2026 08:41 IST
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు
ఉ.11గంటలకు జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమానికి సీఎం
అందుబాటులో ఉన్న నేతలతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు
ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ రాష్ట్ర కమిటీపై చర్చ
-
Apr 11, 2026 07:52 IST
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
జలమార్గాలను బ్లాక్ చేయడం తప్ప ఇరాన్ దగ్గర మరో ఆస్త్రం లేదు..
హోర్ముజ్ జలసంధిని తెరవాలన్నది మా డిమాండ్..
చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మరిన్ని దాడులు..
అత్యుత్తమ ఆయుధాలతో సైన్యం సిద్ధంగా ఉంది: డొనాల్డ్ ట్రంప్
-
Apr 11, 2026 07:49 IST
ఏపీ వ్యాప్తంగా నేడు పూలే జయంతి వేడుకలు
రాష్ట్ర పండుగగా.. అధికారికంగా జ్యోతిరావు పూలే జయంతి నిర్వహణ
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం
-
Apr 11, 2026 07:48 IST
సంగారెడ్డి: ఐలాపూర్‌కు హైడ్రా అధికారులు
కబ్జాకు గురవుతున్న భూములు గుర్తించి ఫెన్సింగ్ వేసేందుకు చర్యలు
ఐలాపూర్‌లో భారీగా మోహరించిన పోలీసులు
-
Apr 11, 2026 07:33 IST
నేడు ఇబ్రహీంపట్నానికి కేటీఆర్
మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన సభలో పాల్గొననున్న కేటీఆర్
మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించనున్న కేటీఆర్
-
Apr 11, 2026 07:32 IST
కడప: ఖాజీపేట విద్యార్థినిని చంపిన నిందితుడిపై కాల్పులు
మైదుకూరు నుంచి పోలీసులు తీసుకెళ్తుండగా జరిగిన ఘటన
బాసాపురం చెక్‌పోస్ట్ దగ్గర పారిపోయేందుకు యత్నంచిన నిందితుడు
అడ్డుకున్న పోలీసులపై దాడి, ఇద్దరు పోలీసులకు గాయాలు
కాల్పులు జరిపిన సీఐ వంశీధర్, నిందితుడి కాలికి గాయం
-
Apr 11, 2026 07:31 IST
నేడు పాకిస్తాన్‌లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు
ఇప్పటికే పాక్ చేరుకున్న US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
హోర్ముజ్ జలసంధిని తెరవాలని అమెరికా డిమాండ్
ఇస్లామాబాద్ చేరుకున్న ఇరాన్ ప్రతినిధులు
-
Apr 11, 2026 07:27 IST
IPLలో నేడు రెండు మ్యాచ్‌లు
చండీగఢ్‌లో మధ్యాహ్నం 3:30కు పంజాబ్ కింగ్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్
చైన్నైలో రాత్రి 7:30కు చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్
-
Apr 11, 2026 06:56 IST
సూర్యాపేట: కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదం
లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
16 మందికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు
ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు
-
Apr 11, 2026 06:52 IST
భూమిపైకి చేరిన ఆర్టెమిస్-2
పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయిన ఒరాయన్ క్యాప్సూల్
క్షేమంగా భూమికి చేరిన వ్యోమగాములు వైజ్‌మాన్, గ్లోవర్, క్రిస్టినా, జెరెమీ హాన్సెన్