-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 10th July 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 10 , 2026 | 06:02 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Jul 10, 2026 08:20 IST
దక్షిణ కొరియాలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ పర్యటన
కుకూ ఎలక్ట్రానిక్స్ HOD చోహన్ చుల్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఏపీలో గృహోపకరణాల యూనిట్ ఏర్పాటు చేయాలి: మంత్రి నారా లోకేశ్
దేశంలో 40 శాతం ఏసీలు, 35 శాతం టీవీలు ఏపీలో తయారీ: లోకేశ్
పరిశ్రమలకు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంది: లోకేశ్
ఆగ్నేయ, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతి సులభం: మంత్రి నారా లోకేశ్
-
Jul 10, 2026 08:15 IST
హర్యానా: గురుగ్రామ్‌లో భారీ ఎన్‌కౌంటర్
పోలీసుల కాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలు
గ్యాంగ్‌స్టర్ దీపక్‌నందాల్ ముఠా సభ్యులుగా గుర్తింపు
ఓ వ్యాపారి ఇంటిపై ఐదుగురు గ్యాంగ్‌స్టర్ల కాల్పులు
-
Jul 10, 2026 08:00 IST
సెమీఫైనల్స్ దూసుకెళ్లిన ఫ్రాన్స్
మొరాకోను 2-0 తేడాతో ఓడించిన ఫ్రాన్స్
మ్యాచ్‌లో గోల్ చేసిన స్టార్ ప్లేయర్ ఎంబాపె
-
Jul 10, 2026 07:30 IST
మేడ్చల్: ఘట్‌కేసర్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో దారుణం
కూల్ డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం
బాధితురాలి ఫిర్యాదుతో ఆటో డ్రైవర్ అరెస్ట్, రిమాండ్
-
Jul 10, 2026 07:07 IST
నేడు న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటన
రెండు రోజుల పాటు న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటన
40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో భారత్ ప్రధాని పర్యటన
భారత్-న్యూజిలాండ్ వాణిజ్యంపై కీలక చర్చలు
FTA అమలుపై చర్చించనున్న ప్రధాని మోదీ
-
Jul 10, 2026 07:07 IST
తమిళనాడు: నేడు కరూర్‌కు సీఎం విజయ్
తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు సీఎం పరామర్శ
కరూర్ బాధితులను కలవనున్న సీఎం విజయ్
-
Jul 10, 2026 07:06 IST
నేడు టీజీ20 లీగ్‌లో క్వాలిఫయర్-2 మ్యాచ్
కరీంనగర్‌తో తలపడనున్న హైదరాబాద్
-
Jul 10, 2026 06:58 IST
నేడు యూట్యూబర్ జోసెఫ్ రావణ్ కస్టడీ పిటిషన్‌పై విచారణ
కస్టడీ పిటిషన్‌పై విచారించనున్న గన్నవరం కోర్టు
-
Jul 10, 2026 06:57 IST
నేడు ఢిల్లీకి BRS నేతల బృందం
చీఫ్ ఎన్నికల కమిషన్‌తో భేటీకానున్న BRS నేతలు
SIRపై సీఈసీకి వినతిపత్రం ఇవ్వనున్న నేతలు
-
Jul 10, 2026 06:57 IST
నేడు చర్లపల్లి జైలు నుంచి బండి భగీరథ్ విడుదల
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్
-
Jul 10, 2026 06:56 IST
నేటి నుంచి రెండురోజుల పాటు విశాఖలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ పర్యటన
ఈ నెల 11న మహేంద్రగిరి యుద్ధనౌక కమిషనింగ్ వేడుక
యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
-
Jul 10, 2026 06:55 IST
నేడు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
భుజానికి చికిత్స కోసం వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆపరేషన్ తర్వాత పవన్‌కు 30 రోజుల విశ్రాంతి
-
Jul 10, 2026 06:54 IST
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ఉదయం 10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
అమరావతి రాజధాని అభివృద్ధిపై చర్చ
భూములిచ్చిన రైతులకు వార్షిక చెల్లింపులపై నిర్ణయం
-
Jul 10, 2026 06:02 IST
నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభకు హాజరుకానున్న రేవంత్
రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి