-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 9th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 09 , 2026 | 06:32 AM
ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తేలనుంది.
Live News & Updates
-
Nov 09, 2026 06:42 IST
కర్నూలు: నగరంలోని ఐటీసీ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం
కాలిపోయిన చెట్లు, ఇతర వస్తువులు
స్ధానికులు బాణా సంచా కాల్చడంతో నిప్పురవ్వలు సమీపంలోని ఐటీసీ కాంపౌండ్‌లోకి ఎగిరి పడటంతో చెలరేగిన మంటలు
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
-
Nov 09, 2026 06:40 IST
హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం
ఆస్బెస్టాస్ కాలనీలోని పేపర్ టీ కప్పులు, ప్లేట్ల తయారీ కంపెనీలో చెలరేగిన మంటలు
GRT Ghee, Haldiram గోడౌన్లలోనూ వ్యాపించిన అగ్నికీలలు
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు
మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న పలు కంపెనీలకు అంటుకున్న మంటలు
అగ్నిప్రమాదంలో ఐదు ఆటోలు, ఒక డీసీఎం వాహనం పూర్తిగా దగ్ధం
మూడు కంపెనీలు పూర్తిగా అగ్నికి ఆహుతి
ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు
మంటలను అదుపు చేసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Nov 09, 2026 06:37 IST
తూర్పుగోదావరి జిల్లాలో క్షుద్రపూజల కలకలం
నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో ఘటన
దీపావళి అమావాస్య నాడు క్షుద్ర పూజలు చేసిన ఆగంతకులు
గ్రామ శివారులో ఉన్న ఆలయం వద్ద గొయ్యి తీసి దానిలో దుస్తులు లేకుండా పూజలు చేస్తుండగా వ్యక్తిని గమనించిన స్థానికులు
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వ్యక్తిని నిలదీసిన స్థానికులు
ఘటనా స్థలంలో పసుపు కుంకుమ అన్నం ముద్దలు లభ్యం
-
Nov 09, 2026 06:33 IST
హైదరాబాద్‌లో 10 చోట్ల అగ్నిప్రమాదాలు
బాణసంచా నిప్పురవ్వలు పడి చెలరేగిన మంటలు
జీడిమెట్ల స్క్రాప్ గోడౌన్, బేగంబజార్‌లో ఓ భవనంలో అగ్ని ప్రమాదం
మైలార్‌దేవ్‌పల్లిలో ఈవెంట్ సామగ్రి గోడౌన్ దగ్ధం
సికింద్రాబాద్‌లో మెడికల్ డిస్ట్రిబ్యూటర్ షాపు దగ్ధం
జాంబాగ్‌లో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధం
-
Nov 09, 2026 06:32 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల ప్రమాదాలు
టపాసులు కాలుస్తూ 67 మందికి గాయాలు
మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో చికిత్స
సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో 12 మంది చేరిక
మిగిలినారు ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్
స్వల్పగాయాలతో గాంధీ, ఉస్మానియాలో 30 మందికి చికిత్స
-
Nov 09, 2026 06:32 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం..