-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 8th November 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Nov 08 , 2026 | 08:21 AM
ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 21,012 మంది అభ్యర్థుల భవితవ్యం ఓట్ల లెక్కింపుతో తేలనుంది.
Live News & Updates
-
Nov 08, 2026 09:20 IST
అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం గురుకుల పాఠశాల వద్ద కారు, టిప్పర్ ఢీ
ప్రమాదంలో ఇద్దరి మృతి
సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను గవర్నమెంట్ హాస్పిటల్ తరలించిన పోలీసులు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న నర్సీపట్నం పోలీసులు
-
Nov 08, 2026 09:19 IST
యూత్ ఒలింపిక్స్ 2026: చరిత్ర సృష్టించిన తానియా
బీచ్ రెజ్లింగ్ విభాగంలో భారత్ మొట్టమొటది పతకం అందించిన తానియా
79 కేజీల విభాగంలో రజతం సాధించిన తానియా
-
Nov 08, 2026 09:04 IST
ఇజ్రాయెల్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని దక్కించుకోలేకపోయిన నెతన్యాహు నేతృత్వంలోని కూటమి
తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఐసెన్‌కాట్‌కు అవకాశం కల్పించిన అధ్యక్షుడు
28 రోజుల గడువు విధించిన ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్
-
Nov 08, 2026 09:01 IST
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రజలంతా తన కుటుంబ సభ్యులేనంటూ మోదీ సందేశం
ఐక్యత, సౌభ్రాతృత్వానికి దీపావళి ప్రతీక: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఒమర్ అబ్దుల్లా
అయోధ్య పదో దీపోత్సవంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
-
Nov 08, 2026 08:47 IST
హైదరాబాద్: ఫిన్ సర్వ్ కంపెనీలో భారీ సైబర్ మోసం
గంట వ్యవధిలో సంస్థ ఎకౌంట్లో నుంచి 7.9 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ నుంచి 39 అనధికార లావాదేవీల ద్వారా అకౌంట్‌లోని డబ్బుని ఇతర ఖాతాలకు మళ్లించిన సైబర్ నేరగాళ్లు
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేసిన కంపెనీ డైరెక్టర్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు
-
Nov 08, 2026 08:44 IST
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
ప్రజలకు సిరిసంపదలు కలగాలని అమ్మవారిని స్రార్థిస్తున్నా: మంత్రి లోకేశ్
-
Nov 08, 2026 08:43 IST
నేటినుంచి మెట్రో-ఆర్టీసీ పాస్ తగ్గించిన ధర అమలు
రూ.8,500 నుంచి రూ.4వేలకు తగ్గించిన పాస్ ధర
-
Nov 08, 2026 08:43 IST
నేడు నెక్లెస్ రోడ్డులో సీఎం రేవంత్ బర్త్‌డే వేడుకలు
మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
-
Nov 08, 2026 08:43 IST
తెలంగాణలో నేటి నుంచి చేయూత కొత్త పెన్షన్లు
దీపావళి కానుకగా 4.50 లక్షల మందికి పెన్షన్లు
కొడంగల్‌లో పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్
-
Nov 08, 2026 08:42 IST
యెమెన్‌లో వైమానిక దాడులు, 22 మంది మృతి
సనా సమీపంలో అల్-సరియా ప్రాంతంపై దాడులు
వైమానిక దాడిలో మరో 30 మందికి గాయాలు
సౌదీ అరేబియానే దాడి చేసిందని హుతీల ఆరోపణ
-
Nov 08, 2026 08:38 IST
హైదరాబాద్: ఫిలింనగర్ పీఎస్ పరిధిలో పోలీసుల దారి దోపిడీ
పోలీసులే దారిదోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు
ఈ నెల 4న షేక్‌పేట దగ్గర వ్యక్తిని బెదిరించిన కానిస్టేబుల్, హోంగార్డ్
బాధితుడి నుంచి రూ.50 వేలు దోపిడీ చేసిన పోలీసులు
బెదిరించిన కానిస్టేబుల్, హోంగార్డ్‌పై కేసు నమోదు
కేసు నమోదు తర్వాత పరారీలో కానిస్టేబుల్ మల్పూర్
హోంగార్డ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
-
Nov 08, 2026 08:21 IST
నేడు మూరత్ ట్రేడింగ్
దీపావళి సందర్భంగా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్
మ.2.05 గంటల నుంచి 15 ని. ప్రీ ఓపెనింగ్ సెషన్
మ.2.20 గంటల నుంచి ఈక్విటీ ట్రేడింగ్ సెషన్