Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 31 , 2026 | 06:00 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 31, 2026 07:55 IST

    యాదగిరిగుట్టకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా

    • శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్న గవర్నర్ శుక్లా

    • జనార్దన సరస్వతీ 26వ వేద విద్వాన్ మహాసభకి చీఫ్‌గెస్ట్‌గా హాజరుకానున్న గవర్నర్

  • Oct 31, 2026 07:45 IST

    అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో గంటపాటు కుండపోత వర్షం

    • పొంగిపొర్లిన శేషుగెడ్డ.. పట్టణంలోకి చేరిన వరద నీరు

    • అగ్నిమాపక కాలనీలోని ఇళ్లలోకి ప్రవేశించిన వరద నీరు

    • ఎలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం

  • Oct 31, 2026 07:35 IST

    హైదరాబాద్: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై గచ్చిబౌలి పోలీసుల దాడి

    • ఓ ఫామ్‌లో పేకాట ఆడుతున్న 27 మంది అరెస్ట్.. రూ.10 లక్షల నగదు స్వాధీనం

    • గత నాలుగు నెలలుగా రోజుకు రూ.20 లక్షల వరకూ లావాదేవీలు

    • నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • Oct 31, 2026 07:30 IST

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

    • 10 కంపార్టుమెంట్లలో వేచిఉన్న భక్తులు

    • శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

    • నిన్న శ్రీవారి హండీ ఆదాయం రూ.3.69 కోట్లు

  • Oct 31, 2026 07:20 IST

    సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళులు

    • పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

    • కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు నేతలు

  • Oct 31, 2026 07:15 IST

    ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తి స్థల్‌లో కాంగ్రెస్ నేతల నివాళులు

    • నివాళులర్పించిన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ

    • కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీలు

  • Oct 31, 2026 07:00 IST

    హైదరాబాద్: మొయినాబాద్‌లో విషాదం

    • విద్యుత్‌ తీగలు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి

    • కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమం పొలాల్లోకి వెళ్లిన విద్యార్థులు

    • పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని చూసి పరుగులు తీసిన విద్యార్థులు

    • ఈ క్రమంలో విద్యుత్ షాక్‌తో మోహన్‌తో పాటు మరో విద్యార్థి మృత్యువాత

  • Oct 31, 2026 06:45 IST

    నంద్యాలలో పోలీసుల తనిఖీలు

    • వైద్యుడి ఇంట్లో రూ.76 లక్షల స్వాధీనం

    • కేసు నమోదు, నగదు వివరాలపై ఆరా

  • Oct 31, 2026 06:40 IST

    త్వరలో గగన్‌యాన్‌ D1 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

    • గగన్‌యాన్‌లో భాగంగా మానవసహిత ప్రయోగానికి సిద్ధం: ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్

    • ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రాకెట్‌ ప్రయోగాలకు ప్రాధాన్యత

    • ఈ ఆర్థిక సంవత్సరంలో 2 పీఎస్‌ఎల్‌వీ, 1 గగన్‌యాన్‌, 1 ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు: ఇస్రో చైర్మన్

  • Oct 31, 2026 06:35 IST

    GSLV-F18 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌

    • విజయవంతంగా కక్ష్యలోకి చేరిన NVS-03 ఉపగ్రహం

    • కక్ష్యలో 13 ఏళ్లపాటు పనిచేయనున్న NVS-03 ఉపగ్రహం

    • నావిగేషన్‌ వ్యవస్థ బలోపేతానికి NVS-03 ప్రయోగం

    • ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ అణు గడియారాలు అమరిక

  • Oct 31, 2026 06:30 IST

    ఢిల్లీ: గార్మెంట్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

    • నలుగురి మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

  • Oct 31, 2026 06:25 IST

    ఆర్నబ్‌ తుఫాన్‌తో ఏపీవ్యాప్తంగా పెరిగిన జలవనరులు

    • నాలుగురోజుల్లో 380 TMCల మేర నీటి లభ్యత

    • ప్రధాన రిజర్వాయర్లలో అదనంగా చేరిన 7.63 TMCల నీరు

    • చిన్న నీటిపారుదల చెరువుల్లోకి చేరిన 22.12 TMCల నీరు

    • ఏపీలో 46.2 TMCల మేర పెరిగిన భూగర్భ జలాలు

    • 3,900 చెరువుల్లో ప్రమాద స్థాయికి నీటిమట్టాలు

  • Oct 31, 2026 06:20 IST

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,42,250

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,30,390

    • కిలో వెండి ధర రూ.2,09,900

  • Oct 31, 2026 06:15 IST

    భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

    • అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, వైభవ్‌లను వన్డే జట్టులోకి తీసుకోవాలి: యువరాజ్ సింగ్

    • అవకాశం కల్పించకపోతే వారి ప్రతిభను అన్యాయం చేసినట్లే: యువీ

  • Oct 31, 2026 06:10 IST

    నేడు ఢిల్లీలో ఇండి కూటమి మాక్‌ పార్లమెంట్‌

    • CEC జ్ఞానేశ్‌కుమార్‌ అభిశంసనకు తీర్మానం

    • ఖర్గే నివాసంలో భేటీకానున్న ఇండి కూటమి నేతలు

    • తీర్మానం ప్రవేశ పెట్టనున్న మల్లికార్జున ఖర్గే

    • ముగింపు ప్రసంగం చేయనున్న రాహుల్‌ గాంధీ

  • Oct 31, 2026 06:05 IST

    అమెరికాలో నవంబర్‌ 3న మధ్యంతర ఎన్నికలు

    • పలు రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్‌ ప్రారంభం

    • ఇల్లినోయి రాష్ట్రంలోనూ కొనసాగుతున్న పోలింగ్‌

    • ఈ క్రమంలోనే షికాగోలో ఓటు వేసిన పోప్‌ లియో-14

  • Oct 31, 2026 06:02 IST

    ఏపీలో కేంద్ర బృందాల పర్యటన

    • ఇవాళ, రేపు ఏపీలో పర్యటన: విపత్తుల సంస్థ MD

    • ఏపీలో అర్నబ్ తుఫాన్‌ నష్టాల్ని పరిశీలించనున్న బృందం

    • కోనసీమ, కాకినాడ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పర్యటన

    • నవంబర్ 2, 3న కరువు పరిస్థితులను పరిశీలించనున్న బృందం

  • Oct 31, 2026 06:00 IST

    నేడు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • పలు అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు