Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Apr 21 , 2026 | 05:54 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Apr 21, 2026 06:49 IST

    అమెరికా-ఇరాన్‌ మధ్య రెండో విడత చర్చలపై తీవ్ర సందిగ్ధత

    • నేడు అమెరికా-ఇరాన్‌ రెండో విడత చర్చలపై లేని స్పష్టత

    • ఇరుదేశాల మధ్య చర్చలు ఉంటాయన్న డొనాల్డ్‌ ట్రంప్‌

    • వాన్స్‌ బృందాన్ని పాకిస్థాన్‌కు పంపిన డొనాల్డ్‌ ట్రంప్‌

    • చర్చలపై తమకు ఎలాంటి ప్రణాళికలూ లేవని చెబుతున్న ఇరాన్‌

  • Apr 21, 2026 06:48 IST

    నేడు శ్రీశైలం డ్యామ్‌ను సందర్సించనున్న KRMB ఛైర్మన్‌ సుబ్రాంగ్‌ బిశ్వాస్

    • శ్రీశైలం డ్యామ్‌ స్థితిగతులు, మరమ్మతులను పరిశీలించనున్న కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌

    • ఏపీ, టీజీ జలవనరుల అధికారులతో సుబ్రాంగ్‌ బిశ్వాస్‌ సమావేశం

  • Apr 21, 2026 06:44 IST

    తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు సన్నాహాలు

    • అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్న కార్మికులు

    • నేటితో ముగియనున్న జేఏసీ గడువు

    • యాజమాన్యంతో చర్చలపై సందిగ్ధం

  • Apr 21, 2026 06:44 IST

    ఏపీలో ఇవాళ తీవ్ర వడగాలులు వీచే అవకాశం

    • ఏపీలో ఇవాళ 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం

  • Apr 21, 2026 06:43 IST

    నేడు ఏపీవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఒకరోజు సమ్మె

    • మార్చి వేతనాల కోసం మున్సిపల్‌ కార్మికుల సమ్మె

  • Apr 21, 2026 06:42 IST

    సింగపూర్‌లో ఏపీ మంత్రుల పర్యటన

    • నేటి నుంచి 27 వరకు ఏడుగురు మంత్రులకు శిక్షణ

    • పలు అంశాలపై శిక్షణ తీసుకోనున్న మంత్రులు

  • Apr 21, 2026 06:41 IST

    ఢిల్లీ: ఉదయం 11 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌కు ప్రధాని మోదీ

    • ప్రధాని మోదీ నేటి రాజస్థాన్‌ పర్యటన రద్దు

    • HPCL రిఫైనరీలో అగ్నిప్రమాదం కారణంగా రద్దు

    • మోదీ చేతుల మీదుగా ప్రారంభించాల్సిన రిఫైనరీ

    • HPCL రిఫైనరీ ప్రారంభోత్సవం వాయిదా

  • Apr 21, 2026 05:57 IST

    NDA తరఫున తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

    • నేడు, రేపు, ఎల్లుండి తమిళనాడులో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం

    • మధ్యాహ్నం కోయంబత్తూరు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

    • కోయంబత్తూరు, హోసూరు, చెన్నై, ఆవడి సహా పలు ప్రాంతాల్లో ప్రచారం

    • హోసూరులోని తాలిలో బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

  • Apr 21, 2026 05:54 IST

    తెలంగాణలో సంక్షేమ వారోత్సవాలు

    • నేటి నుంచి హాస్టళ్లలో పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహణ

    • రేపు విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్

    • ఈనెల 26న తెలంగాణ వ్యాప్తంగా బడిబాట