Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 17 , 2026 | 07:09 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 17, 2026 08:08 IST

    బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు మరోసారి హత్య బెదిరింపులు

    • అమితాబ్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ను చంపుతానంటూ గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ ధిల్లాన్‌ హెచ్చరిక

    • ముంబైలో తనకు చెందిన 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారని ధిల్లాన్‌ వ్యాఖ్య

  • Nov 17, 2026 08:01 IST

    కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ బ్లో అవుట్

    • మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ లీక్

    • తాడివారిమెరక దగ్గర ONGC రీడ్రిల్లింగ్ పాయింట్ నుంచి లీక్

    • రీ డ్రిల్లింగ్ చేస్తుండగా భారీ శబ్ధంతో వెలువడిన గ్యాస్

    • చుట్టుపక్కల గ్రామాలకు విస్తరిస్తున్న CNG గ్యాస్

    • గ్యాస్ లీక్‌తో భయాందోళనలో సమీప గ్రామాల ప్రజలు

    • గ్యాస్ లీక్‌ను నివారించేందుకు అధికారుల చర్యలు

    • మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు

  • Nov 17, 2026 07:34 IST

    తెలంగాణపై అక్వాన్‌ తుపాను ప్రభావం

    • ఈ నెల21న తెలంగాణలోని పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు

    • ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌

    • ములుగు, నల్లగొండ, జనగామ, యాదాద్రి, వరంగల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

    • గంటకు 40-5 కి.మీ. వేగంతో ఈదురుగాలులు: SDMA

    • కోస్తాంధ్రలో రేపటి నుంచి భారీ వర్షాలు: SDMA

  • Nov 17, 2026 07:33 IST

    నేడు రెండోరోజు మనీలాలో ప్రధాని మోదీ పర్యటన

    • ఆసియాన్‌-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులకు హాజరుకానున్న మోదీ

    • ప్రధాని హోదాలో మోదీకి ఇది 13వ ఆసియాన్‌ సదస్సు

    • ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు మార్కోస్‌ జూనియర్‌ ఆహ్వానం మేరకు వెల్తున్న మోదీ

    • క్వాడ్‌ నేతల ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొననున్న ప్రధాని మోదీ

  • Nov 17, 2026 07:33 IST

    ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల సమరం

    • నామినేషన్ల దాఖలుకు నేటితో ముగియనున్న గడువు

    • రేపు నామినేషన్ల పరిశీలన

    • నామినేషన్ల ఉపసంహరణకు 21 వరకు గడువు

    • 26న తొలి విడత పంచాయతీ ఎన్నికు, అదే రోజు కౌంటింగ్‌

  • Nov 17, 2026 07:32 IST

    నేడు ఏపీ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన

    • నామినేషన్ల ఉపసంహరణకు 1 వరకు గడువు

    • ఈ నెల 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు

  • Nov 17, 2026 07:32 IST

    నేడు ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన

    • రేవంత్‌ వెంట వెళ్లనున్న మంత్రి ఉత్తమ్‌, అధికారులు

    • ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌తో భేటీకానున్న రేవంత్‌

    • సమ్మక్కసాగర్‌ ప్రాజెక్ట్‌పై చర్చించనున్న రేవంత్‌

    • ఎన్‌వోసీ జారీపై చర్చించనున్న రేవంత్‌ బృందం

    • ప్రాజెక్ట్‌ ముంపు సమస్యపైనా చర్చించే అవకాశం

  • Nov 17, 2026 07:31 IST

    నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

    • ఉదయం 9:15కు ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు

    • అడ్వకేట్‌ సిద్ధార్థ్‌ లూథ్రా నివాసంలో వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు

    • పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం

    • రాత్రి 7:30కు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం

  • Nov 17, 2026 07:30 IST

    ట్రంప్ ప్రభుత్వంలోని కీలక అధికారులే లక్ష్యంగా ఇరాన్ భారీ కుట్ర!

    • అప్రమత్తం చేసిన అమెరికా నిఘా సంస్థలు

    • వాషింగ్టన్‌ డీసీలో డర్టీ బాంబు లేదా రసాయన ఆయుధంతో దాడికి ప్రణాళికలు

    • తక్షణ దాడికి ఆధారాలు లేవని.. ముందస్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నిఘా వర్గాల వెల్లడి

    • గత వారంలోనే ముందస్తు భద్రతా చర్యలపై ప్రణాళికలు ప్రారంభించిన అమెరికా ఉన్నతాధికారులు

    • అమెరికా భూభాగానికి ప్రస్తుతం ముప్పు లేదన్న వైట్‌హౌస్‌ ప్రతినిధి లారెన్‌ బిస్

  • Nov 17, 2026 07:21 IST

    అమెరికాలో తగ్గిన భారతీయ విద్యార్థుల సంఖ్య

    • 2025-26 విద్యా సంవత్సరంలో 6.5 శాతం తగ్గినట్లు గణాంకాల వెల్లడి

    • కరోనా ప్రభావం తర్వాత తొలిసారిగా తగ్గిన విద్యార్థుల సంఖ్య

    • కఠినమైన వీసా తనిఖీలు, అపాయింట్‌మెంట్లు, ప్రాసెసింగ్‌లో జాప్యం తగ్గుదలకు కారణాలు

    • భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గితే ఇరు దేశాలకూ నష్టమని విశ్లేషణ

  • Nov 17, 2026 07:09 IST

    కేరళం: శబరిమలలో భక్తుల రద్దీ

    • అయ్యప్పస్వామి దర్శనానికి 8గంటల సమయం