Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Oct 16 , 2026 | 07:26 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Oct 16, 2026 08:44 IST

    కోనసీమలో కరెన్సీ అమ్మవారు

    • దసరా సందర్భంగా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి శ్రీ మహాలక్ష్మి అవతారం

    • నాలుగున్నర కోట్ల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ

    • కరెన్సీ తోరణాల మధ్య భక్తులకు మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తున్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

  • Oct 16, 2026 08:40 IST

    హైదరాబాద్: PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం

    • అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టిన కారు

    • వెనుక వస్తున్న మరో 5 కార్లు వరుసగా ఢీ, తప్పిన ప్రాణ నష్టం

  • Oct 16, 2026 08:24 IST

    రాజస్థాన్‌ బీజేపీ అధ్యక్షుడు మదన్‌ రాథోడ్‌ సంచలన వ్యాఖ్యలు

    • అమెరికా, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం వస్తే పాక్‌కు భారత్‌ మద్దతిస్తుందని వ్యాఖ్య

    • పాకిస్థాన్‌ పొరుగు దేశం కాబట్టే మద్దతుగా నిలుస్తామన్న రాథోడ్‌

    • జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో మదన్‌ రాథోడ్‌ వ్యాఖ్యలు

    • రాథోడ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల ఆగ్రహం

  • Oct 16, 2026 08:16 IST

    కాకినాడ: తుని మున్సిపాలిటీ రాజకీయాల్లో కీలక పరిణామం

    • తుని మున్సిపాలిటీ జనసేనకు కేటాయించడంతో పార్టీలు మారుతున్న ఆశావహులు

    • టీడీపీ నుంచి ఛైర్‌ పర్సన్ కుర్చీని ఆశించిన మళ్ల గణేష్ దంపతులు రాత్రికిరాత్రి జనసేనలో చేరిక

    • మళ్ల మీనాక్షిని తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటించిన జనసేన

  • Oct 16, 2026 08:05 IST

    ఢిల్లీ: డిసెంబర్‌ 11న కెనడా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

    • రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించనున్న ప్రధాని

    • కెనడా ప్రధాని మార్క్‌ కార్నీతో మోదీ చర్చలు

    • ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాల నిర్ణయం

    • మోదీ పర్యటన వివరాలను ప్రకటించిన కెనడాలోని భారత హైకమిషన్‌

  • Oct 16, 2026 08:02 IST

    మళ్లీ ఈ పార్కుకు రావొద్దు.. యూకేలో భారతీయ విద్యార్థులకు వార్నింగ్

    • ఇంగ్లండ్‌లోని సోలిహల్‌లో వెలుగు చూసిన ఘటన

    • భారతీయ విద్యార్థులకు శ్వేతజాతి యువకుల హెచ్చరిక

    • మళ్లీ ఆ పార్కుకు ఎప్పుడూ రావొద్దని వార్నింగ్

    • స్థానికులకు రక్షణగా తాము గస్తీ నిర్వహిస్తామన్న యూకే యువకులు

    • ఇది జాత్యాహంకారా ఘటన అంటూ నెట్టింట విమర్శలు

  • Oct 16, 2026 08:02 IST

    ఇరాన్‌పై భారీ దాడికి అమెరికా యోచన

    • జీబీయూ-43/బీ మాసివ్ ఆర్డినెన్స్ బ్లాస్ట్ బాంబ్ వినియోగంపై పరిశీలన

    • ఇంధన, అణుమౌలిక వసతులపై ప్రయోగించే ఛాన్స్

    • ఇరాన్‌పై అమెరికా ఇప్పటివరకూ ఎన్నడూ వినియోగించని బాంబు

    • ఇది అత్యంత శక్తిమంతమైన బాంబ్‌ అంటున్న నిపుణులు

    • ఎమ్ఓఏబీకి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పేరు

  • Oct 16, 2026 07:42 IST

    నంద్యాల: శ్రీశైలంలో 6వ రోజుకు చేరుకున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

    • సాయంత్రం కాత్యాయని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం

    • హంసవాహనంపై ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్న స్వామి అమ్మవారు

    • రాత్రి క్షేత్ర పురవీధుల్లో ఆదిదంపతుల గ్రామోత్సవం

  • Oct 16, 2026 07:38 IST

    ఐరోపా మద్దతు కోసం జెలెన్‌స్కీ ప్రయత్నాలు..

    • రష్యాతో అమెరికా అధ్యక్షుడు ఆయిల్ డీల్‌ కుదుర్చుకోవడంపై ఆందోళన

    • బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఐరోపా నేతలతో సమావేశం

    • ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయాలని విజ్ఞప్తి

  • Oct 16, 2026 07:37 IST

    మరింత తగ్గిన బంగారం ధరలు

    • 24క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,47,430

    • 22క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,35,140

    • కిలో వెండి ధర రూ.2,29,900

  • Oct 16, 2026 07:37 IST

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో పాఠశాలలో కాల్పుల కలకలం

    • బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడి దాడి

    • చిన్నారులు, టీచర్ సహా ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం

    • పోలీసులపై కాల్పులకు తెగబడిన దుండగుడు.. ఎదురుకాల్పుల్లో హతం

    • ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు.. మృతుల సంఖ్యపై రాని స్పష్టత

  • Oct 16, 2026 07:34 IST

    విజయవాడ: దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

    • మూలనక్షత్రం సందర్భంగా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలు

  • Oct 16, 2026 07:33 IST

    ఏపీలో మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం

    • పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

    • దక్షిణాదిలో పలు ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాలు

  • Oct 16, 2026 07:32 IST

    ఏపీలో స్థానిక ఎన్నికలకు నేటినుంచి నామినేషన్లు

    • మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల స్వీకరణ

    • 19న పరిశీలన, ఉపసంహరణకు 21 వరకు గడువు

  • Oct 16, 2026 07:32 IST

    తిరుమలలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు

    • ఉదయం మోహిని అవతారంలో స్వామివారి దర్శనం

    • సాయంత్రం మలయప్పస్వామికి గరుడ వాహన సేవ

  • Oct 16, 2026 07:31 IST

    తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

    • నేటి నుంచి 22 ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణ

    • నేటి నుంచి 22వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ

    • ఈనెల 28న పోలింగ్, 30న కౌంటింగ్ నిర్వహణ

    • నగరపాలక కార్యాలయంలోని వీసీ హాల్‌లో మేయర్ అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ

    • మిగిలిన 22 ప్రాంతాల్లో కార్పొరేటర్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ

  • Oct 16, 2026 07:30 IST

    విజయవాడ: ఇంద్రకీలాద్రిపై 6వ రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు

    • మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం

    • ఇంద్రకీలాద్రిపై అన్ని రకాల వీవీఐపీ, సిఫార్సు దర్శనాలు రద్దు

    • మూలనక్షత్రం సందర్భంగా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలు

    • సాయంత్రం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

  • Oct 16, 2026 07:29 IST

    ఢిల్లీ: నేడు తిరంగా ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

    • కనాట్‌ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌ నుంచి తిరంగా ర్యాలీ

  • Oct 16, 2026 07:28 IST

    బాసర జ్ఞానసరస్వతి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు

    • అర్ధరాత్రి నుంచే అక్షరాభ్యాసాల కోసం భక్తుల క్యూ

    • చిన్నారుల అక్షరాభ్యాసాలకు ప్రత్యేక ఏర్పాట్లు

    • ఉ.3గంటల నుంచే అక్షర శ్రీకర పూజలు ప్రారంభం

    • కాత్యాయని అలంకారంలో సరస్వతి అమ్మవారి దర్శనం

  • Oct 16, 2026 07:28 IST

    తెలంగాణలో నేడు కూడా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

    • అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండనున్న BLOలు

  • Oct 16, 2026 07:26 IST

    హైదరాబాద్: చిక్కడపల్లిలో హత్య కేసు 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

    • అశోక్ నగర్ ఫుట్‌పాత్ హత్య స్నేహితుడే నిందితుడు

    • మృతుడు డబ్బుల కోసం వేధింపులు, బెదిరింపులు

    • భరించలేక సుభాష్‌ను హత్య చేసిన ముంత నరేష్

    • నిద్రిస్తుండగా సుత్తితో దాడి క్లూస్ టీం, సీసీ కెమెరాలతో నిందితుని పట్టుకున్న పోలీసులు

    • చిక్కడపల్లి హత్య కేసులో నిందితుడు రిమాండ్‌కు