Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 15 , 2026 | 08:04 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 15, 2026 08:12 IST

    ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

    • ఉద్యోగ నియామకాల గరిష్ఠ వయోపరిమితి పెంపు

    • 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన ఏపీ ప్రభుత్వం

    • నాన్-యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు వర్తింపు

    • సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వయోపరిమితి సడలింపు

  • Sep 15, 2026 08:11 IST

    తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

    • సా.6.21 నుంచి 6.35 గంటల మధ్య ధ్వజారోహణం

    • శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

    • రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి దర్శనం

    • ఈ నెల 23 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు

  • Sep 15, 2026 08:10 IST

    నేడు నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

    • పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీతక్క

    • కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై మోర్తాడ్‌లో సభ

  • Sep 15, 2026 08:09 IST

    ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తుల తాకిడి

    • ఉదయం నుంచే గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

  • Sep 15, 2026 08:09 IST

    అనంతపురం: రోటరీపురం దగ్గర ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

    • మహిళ హరిత మృతి, మరో ముగ్గురికి తీవ్రగాయాలు

  • Sep 15, 2026 08:09 IST

    హైదరాబాద్‌: నాగోల్ పరిధి బండ్లగూడలో దారుణహత్య

    • వైన్స్‌ షాపులో వ్యక్తిని కత్తులతో నరికిచంపిన దుండగులు

    • హత్య తర్వాత కారులో పరారైన నిందితులు

    • సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు

    • మృతుడు ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్‌ నయీమ్‌

    • పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు అనుమానం

  • Sep 15, 2026 08:05 IST

    కడప: పులివెందుల మైత్రి లేఅవుట్‌లో టీడీపీ వర్గీయుల ఘర్షణ

    • గణేష్‌ విగ్రహం ఏర్పాటు విషయంలో పుష్పనాథ్‌రెడ్డి మహబూబ్‌ బాషా, విజయ్‌కుమార్‌రెడ్డి వర్గీయుల ఘర్షణ

    • రాళ్లు, కర్రలతో పరస్పరం టీడీపీ వర్గాల దాడులు

    • గాల్లోకి ఒకరౌండ్‌ కాల్పులు జరిపిన హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా గన్‌మెన్‌

    • విజయ్‌ కుమార్‌రెడ్డి నివాసం దగ్గర 3 వాహనాలు ధ్వంసం

  • Sep 15, 2026 08:04 IST

    సికింద్రాబాద్: ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు

    • నేడు పోలీస్‌ కస్టడీకి ప్రధాన నిందితుడు మల్లేష్

    • ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న మల్లేష్‌