Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 14 , 2026 | 07:29 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 14, 2026 08:41 IST

    జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్

    • జెన్సన్‌ను ఎన్విడియా సీఈఓగా మళ్లీ నియమించాలంటూ పిటిషన్

    • ఎక్స్‌లో తెలిపిన టెక్ ఆంథ్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్

    • తాను పిటిషన్‌పై సంతకం చేయనున్నట్టు వెల్లడి

  • Nov 14, 2026 08:29 IST

    హైదరాబాద్: రాహుల్ గాంధీతో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

    • రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై చర్చిస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

    • పార్టీలో అంతర్గత విభేదాలను రాహుల్ గాంధీకి వివరించిన మహేష్ గౌడ్

  • Nov 14, 2026 08:28 IST

    ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు..

    • చైనాలో పుతిన్, జిన్‌పింగ్, ట్రంప్ మధ్య త్రైపాక్షిక సమావేశం

    • అణ్వాయుధాల విషయంలో పరస్పర అవగాహన పెంపొందించుకోవడంపై చర్చ

    • ఇరాన్ యుద్ధాన్ని ముగించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం

  • Nov 14, 2026 08:26 IST

    బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదు

    • కంగనాపై సిమ్లాలో బాలుగంజ్‌ పీఎస్‌లో కేసు

    • సోనియాపై అనుచిత పోస్టు పెట్టారంటూ ఫిర్యాదు

    • DGP ఆదేశాలతో కేసు నమోదుచేసిన షిమ్లా పోలీసులు

  • Nov 14, 2026 08:26 IST

    సూర్యాపేట: దురాజ్‌పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

    • హైవేపై బోల్తాపడిన డీసీఎం, ట్రాఫిక్‌ జామ్

  • Nov 14, 2026 08:23 IST

    హైదరాబాద్: హఫీజ్‌పేట్‌‌లో ఓ పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం

    • తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ప్రమాదం

    • ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు

    • సమాచారం అందుకున్న కూకట్‌పల్లి, పటాన్‌చెరువు ఫైర్ సిబ్బంది

    • రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

  • Nov 14, 2026 07:40 IST

    అసోంలో పెరిగిన మృతుల సంఖ్య

    • వ్యాన్‌ను ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య

    • ప్రమాద సమయంలో వ్యాన్‌లో 35 మంది ప్రయాణికులు

  • Nov 14, 2026 07:40 IST

    ఖమ్మం జిల్లా సరిహద్దులో పెద్దపులి సంచారం

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

  • Nov 14, 2026 07:40 IST

    మరో భారీ స్టార్‌షిప్‌ను ప్రయోగించిన స్పేస్‌ ఎక్స్‌

    • 26 స్టార్‌లింక్‌ V3 శాటిలైట్లను స్పేస్‌లో ప్రవేశపెట్టనున్న స్టార్‌షిప్‌

  • Nov 14, 2026 07:39 IST

    కర్నూలుకు రాప్తాడు కేసు నిందితుడు హేమంత్ తరలింపు

    • మెరుగైన వైద్యం కోసం కర్నూలు జీజీహెచ్‌కు తరలింపు

    • పల్మనరీ ఎంబాలజీ సమస్యతో బాధపడుతున్న హేమంత్

    • కర్నూలు జీజీహెచ్‌లో పోలీసుల పహారా మధ్య హేమంత్‌కు చికిత్స

  • Nov 14, 2026 07:39 IST

    తిరుపతి కలెక్టరేట్‌లో నేడు ఎన్నికల సంఘం కీలక సమావేశం

    • ​రాయలసీమ పరిధిలోని జిల్లాల ఎస్పీలతో ఎన్నికల కమిషన్ భేటీ

    • ​పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై పోలీసులతో చర్చ

    • ​కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలతో SEC అలర్ట్‌

    • ​గతంలో జరిగిన ఘటనల నివేదికలు, భవిష్యత్ చర్యలపై కమిషన్ సమీక్ష

    • ​సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు, కట్టుదిట్టమైన భద్రతపై దిశానిర్దేశం

  • Nov 14, 2026 07:38 IST

    నేడు పల్నాడు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

    • మురసు తుపాను నష్టాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం

    • పంట నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం

    • రేపు చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశం

  • Nov 14, 2026 07:38 IST

    ఏపీలో స్థానిక సంస్థలకు నేటి నుంచి నామినేషన్లు

    • ఈ నెల 16 వరకు నామినేషన్లు స్వీకరణ

    • 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు

    • ఈ నెల 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు

  • Nov 14, 2026 07:37 IST

    భారత్‌ సమ్మిట్‌ వివాదంపై స్పందించిన కేంద్రం

    • భారత్‌ సమ్మిట్‌కు హాజరుకావాల్సిన పలువురు విదేశీయులకు వీసా తిరస్కరణపై ప్రకటన

    • వీసాల మంజూరు అనేది ఏ దేశంలోనైనా సార్వభౌమాధికారం పరిధిలోకి వస్తుందని వెల్లడి

    • కేంద్ర హోంశాఖ ఆదేశాలతోనే 115 మంది వీసాలు రద్దు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్రం స్పందన

  • Nov 14, 2026 07:36 IST

    హైదరాబాద్: ఉదయం కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ భేటీ

    • మూడేళ్ల పాలన, పార్టీ పనితీరుపై రాహుల్‌ సమీక్ష

    • పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల ప్రస్తావన

    • SIRకు వ్యతిరేకంగా చేపట్టబోయే ర్యాలీ తేదీపై చర్చ

  • Nov 14, 2026 07:36 IST

    హైదరాబాద్‌లో భారత్‌ సమ్మిట్‌ -2026

    • నేడు భారత్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న రాహుల్‌, సీఎం రేవంత్‌

    • నేడు రాహుల్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న రేవంత్‌

    • లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ప్రతినిధులతో సమావేశానికి హాజరు

    • ఉ.9:45కు భారత్ సమ్మిట్‌లో భాగంగా అమెరికా, ఐరోపా ప్రతినిధులతో భేటీ

    • ఉ.10:30కు హైటెక్ సిటీ శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్‌కు సీఎం ర్యాలీ

    • ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్‌లో గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమం పథకం ప్రారంభోత్సవానికి హాజరు

    • మ.3 గంటలకు HICCలో భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి హాజరు

  • Nov 14, 2026 07:34 IST

    హైదరాబాద్‌ చేరుకున్న రాహుల్‌గాంధీ

    • స్వాగతం పలికిన సీఎం రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలు

    • HICC నోవాటెల్‌లో రాహుల్ గాంధీ బస

  • Nov 14, 2026 07:34 IST

    నేడు గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • అంబాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ

  • Nov 14, 2026 07:34 IST

    సరోగసీని నేరంగా పరిగణించాలని చైనా కీలక నిర్ణయం

    • అన్ని రకాల సరోగసీ ప్రక్రియలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన

    • పునరుత్పత్తి కేంద్రాల నిర్వహణకు ఇకపై చట్టబద్ధత ఉండదని వెల్లడి

    • ఈ తరహా సేవలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు

  • Nov 14, 2026 07:33 IST

    సౌదీకి వెళ్లే ఫ్లైట్స్‌ మరోసారి క్యాన్సిల్‌

    • హూతీలతో యుద్ధం నేపథ్యంలో సౌదీ వెళ్లాల్సిన విమానాలపై సస్పెన్షన్‌ పొడిగింపు

    • రియాద్‌, దమమ్‌కు ఈ నెల 30 వరకు, జెడ్డాకు ఈ నెల 21 వరకు విమాన సేవలు నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ నిర్ణయం

    • ఇండిగో, ఆకాశ ఎయిర్‌ సంస్థలు కూడా ఇప్పటికే సౌదీకి వెళ్లే ఫ్లైట్స్‌ను ఈ నెల 30 వరకు క్యాన్సిల్‌ చేస్తున్నట్లు ప్రకటన

  • Nov 14, 2026 07:32 IST

    అమెరికాలో నిలిచిపోయిన విమాన సేవలు

    • USలో విమాన రాకపోకలు నిలిపివేసిన FAA

    • ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్లలో కమ్యూనికేషన్‌ సమస్యలతో భద్రత దృష్ట్యా నిర్ణయం

  • Nov 14, 2026 07:32 IST

    ఖమ్మం: కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు ఆమోదం

    • సుజాతనగర్‌ దగ్గర 667 ఎకరాల్లో ఏర్పాటు

    • 6 ప్రాంతాల్లో సర్వే నిర్వహించి తుది ఎంపిక

    • ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం

    • భూసేకరణ, ఇతర అంశాలపై సర్కార్‌ దృష్టి

  • Nov 14, 2026 07:31 IST

    విశాఖ: నేడు ప్రజల సందర్శనకు సీఐఐ సమ్మిట్‌ ప్రాంగణం

    • ఏపీ అభివృద్ధి స్థానాన్ని వీక్షించే అవకాశం

  • Nov 14, 2026 07:31 IST

    నేడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమావేశం

  • Nov 14, 2026 07:29 IST

    అండర్‌-19 ఆసియాకప్‌లో నేడు భారత్‌-పాకిస్థాన్‌ ఫైనల్‌

    • ఉదయం 10:30 నుంచి మ్యాచ్‌