Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 13 , 2026 | 07:25 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 13, 2026 08:40 IST

    హైదరాబాద్ సీపీగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న మహేష్ భగవత్

  • Nov 13, 2026 08:40 IST

    అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ DEE సత్యనారాయణ అరెస్ట్

    • నేడు ACB కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు

  • Nov 13, 2026 08:02 IST

    నేటి నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

    • 54 ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే

    • ఉ.8గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం

  • Nov 13, 2026 08:01 IST

    నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ

    • HICC నోవాటెల్‌లో రాహుల్ బస

    • రేపు ఉ.11గంటలకు గిగ్ వర్కర్లతో రాహుల్ భేటీ

    • శిల్పకళా వేదిక నుంచి HICC వరకు గిగ్‌ వర్కర్లతో ర్యాలీ

    • గిగ్‌ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ఆవిష్కరణ

    • రేపు మధ్యాహ్నం భారత్ సమ్మిట్‌లో రాహుల్ ప్రసంగం

    • రేపు రా.8గంటలకు ఢిల్లీకి రాహుల్ తిరుగు ప్రయాణం

  • Nov 13, 2026 08:01 IST

    నేడు, రేపు కర్నాటక, గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

    • బెంగళూరులో రూ.15,600 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించనున్న ప్రధాని

    • రవాణా, విద్యుత్‌, రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం

    • ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న మోదీ

    • బెంగళూరు మెట్రో పింక్‌ లైన్‌ ప్రారంభించనున్న ప్రధాని

    • రేపు గుజరాత్‌లోని అంబాజీ ఆలయంలో మోదీ పూజలు

  • Nov 13, 2026 07:41 IST

    హైదరాబాద్‌: హైటెక్స్‌లో నేడు, రేపు భారత్‌ సమ్మిట్‌

    • నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ

    • సదస్సులో తెలంగాణ రైజింగ్‌ థీమ్‌తో ప్రత్యేక సెషన్లు

    • 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరు

  • Nov 13, 2026 07:38 IST

    నేడు విశాఖలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన

    • CII సదస్సుకు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి

  • Nov 13, 2026 07:37 IST

    ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నేడు తొలి దశ నోటిఫికేషన్

    • ఏపీలో మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

    • నేడు తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్

    • ఈనెల 26న తొలి విడత పోలింగ్, అదే రోజు ఫలితాలు

    • 29న రెండో విడత పోలింగ్, ఫలితాలు

    • డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్, ఫలితాలు

  • Nov 13, 2026 07:37 IST

    విశాఖ: రెండో రోజు 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

    • AU ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాండ్‌లో సమ్మిట్

    • పెట్టుబడులే లక్ష్యంగా CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

  • Nov 13, 2026 07:25 IST

    ఢిల్లీని కమ్మేసిన తీవ్ర వాయు కాలుష్యం

    • 500 మీటర్లకు పడిపోయిన రోడ్లపై విజిబిలిటీ

    • ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం

    • ఢిల్లీలో AQI 402 పాయింట్లుగా నమోదు

    • పంట వ్యర్థాల దహనంతో పెరుగుతున్న కాలుష్యం

    • ఢిల్లీ ఎన్సీఆర్‌లో GRAP III ఆంక్షలు అమలు

  • Nov 13, 2026 07:25 IST

    నేడు భారత్-న్యూజిలాండ్ 4వ వన్డే

    • 5 వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యంలో భారత్

    • వర్షం కారణంగా రద్దయిన మూడో వన్డే