-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy Andhra Pradesh and Telangana National International Latest Breaking Live Updates on Jan 8th kjr
-
Breaking News: రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
ABN , First Publish Date - Jan 08 , 2026 | 06:34 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Jan 08, 2026 20:25 IST
రకుల్‌ప్రీత్ సోదరుడు అమన్‌ప్రీత్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
డ్రగ్స్ కేసులో నమోదైన కేసు కొట్టివేయాలని అమన్‌ప్రీత్ పిటిషన్
దర్యాప్తునకు సహకరించేందుకు అమన్‌ప్రీత్ సిద్ధం: న్యాయవాది
అమన్‌ప్రీత్, డ్రగ్స్ విక్రేతల మధ్య నగదు లావాదేవీలు: పోలీసులు
అమన్‌ను అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
-
Jan 08, 2026 20:24 IST
బాపట్ల: ఓ ఫంక్షన్‌లో బంగారం మాయంపై పోలీసుల అత్యుత్సాహం
ఓ మహిళను అనుమానితురాలిగా గుర్తించి పోలీసుల వేధింపులు
పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి మహిళను కొట్టిన పోలీసులు
పోలీసులు కొట్టడంతో గాయపడి జీజీహెచ్‌లో చేరిన మహిళ
మహిళను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శైలజ
మహిళను పోలీసులు కొట్టడంపై ఎస్పీతో మాట్లాడిన చైర్‌పర్సన్ శైలజ
-
Jan 08, 2026 17:32 IST
కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
ఈడీ తనిఖీలపై సీఎం మమతా అభ్యంతరాలపై హైకోర్టులో పిటిషన్
ఈడీ పిటిషన్‌పై రేపు కోల్‌కతా హైకోర్టులో విచారణ చేపట్టే అవకాశం
ఐ ప్యాక్ ఆఫీసుపై దాడుల్లో పలు పత్రాలు, హార్డ్ డిస్క్ స్వాధీనం
ఈడీ సోదాల తర్వాత ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసిన మమత
దర్యాప్తు సంస్థలతో కేంద్రం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తుందని ఆరోపణ
-
Jan 08, 2026 16:37 IST
ఢిల్లీ: కోల్‌కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ఈడీ తనిఖీలపై...
సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రకటనలపై స్పందించిన ఈడీ
సాక్ష్యాల ఆధారంగానే తనిఖీలు జరుగుతున్నాయన్న ఈడీ
రాజకీయ సంస్థలు టార్గెట్‌గా తనిఖీలు జరగడం లేదు: ఈడీ
బెంగాల్‌లో 6, ఢిల్లీలో 4 సహా మొత్తం 10 చోట్ల సోదాలు: ఈడీ
కేసు అక్రమ బొగ్గు స్మగ్లింగ్‌కు సంబంధించినది: ఈడీ
నగదు, హవాలా బదిలీలకు సంబంధించి సోదాలు నిర్వహణ
ఏ పార్టీ కార్యాలయంలోనూ సోదాలు జరగలేదు: ఈడీ
ఈ సోదాలకు ఏ ఎన్నికలతోనూ సంబంధం లేదు: ఈడీ
-
Jan 08, 2026 15:53 IST
అమరావతిలో ఎన్టీఆర్ ఐకానిక్ విగ్రహ ప్రాజెక్టుకు...
మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
NTR విగ్రహం, స్మారక చిహ్నం డిజైన్లు పరిశీలించిన మంత్రివర్గ ఉససంఘం
విగ్రహాలకు సంబంధించి ప్రాజెక్టు నివేదిక, ప్రాజెక్టు పరిధిపై సమీక్ష
ఏపీ గతం, వర్తమానం, భవిష్యత్ ప్రతిబింబించేలా...
విగ్రహం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేయాలని నిర్ణయం
కొలతలు సహా విగ్రహ వివరాలపై సమావేశంలో తుది నిర్ణయం
AGIC ద్వారా సరస్సు చుట్టూ వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి ఆమోదం
-
Jan 08, 2026 15:53 IST
ఏపీ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
అమరావతిలో NTR విగ్రహం, స్మృతివనం ఏర్పాటుపై చర్చ
నమూనా విగ్రహాలు పరిశీలించిన మంత్రులు, సభ్యులు
రాజధానిలోని నీరుకొండలో భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం
3,500 టన్నులతో భారీ కంచు విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం
విగ్రహంతో పాటు ఇతర డిజైన్లు ఫైనల్ చేసేందుకు సబ్ కమిటీ ఏర్పాటు
విగ్రహం ఏర్పాటు బాధ్యతలు పర్యవేక్షిస్ణ AGICL
-
Jan 08, 2026 15:52 IST
అమరావతి: ఏపీ కేబినట్ ఇంటర్నల్స్
తిరుమలలో మద్యం సీసాలు వేయడంపై కేబినెట్‌లో ప్రస్తావన
ఖాళీ సీసాలు వేసి అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు: చంద్రబాబు
పోలీసులు సాక్ష్యాలతో నిరూపించడంతో అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబు
సూర్యలంక టూరిజం హబ్‌గా మారుతుంది: చంద్రబాబు
ఇప్పటికే 1100 రూమ్‌లు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
ఇప్పుడు 3 హోటల్స్‌కు అనుమతి ఇచ్చాం: చంద్రబాబు
-
Jan 08, 2026 15:46 IST
టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
నిందితుడు రవికుమార్‌తో కుమ్మక్కై పరకామణి కేసును..
టీటీడీ, పోలీసులు బలహీనపరిచారు: ఏపీ హైకోర్టు
రవికుమార్, కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని..
సీఐడీ, ఏసీబీ నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతుంది: హైకోర్టు
నిందితుడు రవికుమార్ ఆస్తులు స్వీకరించే క్రమంలో టీటీడీ అధికారులు..
బోర్డు సభ్యులు, పోలీసులు చట్ట నిబంధనలు అనుసరించలేదు: హైకోర్టు
సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని..
చట్టప్రకారం ముందుకెళ్లాలని సీఐడీ, ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశం
బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని..
టీటీడీ, పోలీసు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశం
AVSO సతీష్‌కుమార్ మృతిపై దర్యాప్తు వేగవంతం చేయాలని CIDకి ఆదేశం
కేసు తీవ్రత దృష్ట్యా చార్జ్‌షీట్ దాఖలు వరకు దర్యాప్తును పర్యవేక్షిస్తాం: హైకోర్టు
పరకామణిలో సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి
కానుకల లెక్కింపు విధానం మెరుగుపరిచేందుకు..
అత్యుత్తమ ఆలోచనలతో ముందుకురావాలని టీటీడీ ఈవోకు హైకోర్టు ఆదేశం
-
Jan 08, 2026 15:39 IST
రాజధాని అమరావతిపై మరోసారి జగన్ అక్కసు
అసలు రాజధానే లేనిచోట చంద్రబాబు కార్యక్రమాలు పెడుతున్నారు: జగన్
రివర్ బేసిన్‌లో అమరావతిని నిర్మిస్తున్నారు: జగన్
అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలి: జగన్
-
Jan 08, 2026 14:42 IST
ఉపాధి హామీని రద్దు చేస్తే మళ్లీ వలసలు తప్పవు: సీఎం రేవంత్
అదానీ, అంబానీలకు ప్రజలను కూలీలుగా మార్చేందుకు కుట్ర
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హమీని రద్దు చేస్తున్నారు
వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్‌ను సృష్టిస్తున్నారు: సీఎం రేవంత్
నల్లచట్టాల విషయంలో క్షమాపణ చెప్పేవరకు వదల్లేదు: సీఎం రేవంత్
ఇప్పుడు ఉపాధి హామీ విషయంలోనూ క్షమాపణ చెప్పాల్సిందే: రేవంత్
కార్యకర్తల కష్టం, త్యాగాలతోనే అధికారంలో ఉన్నాం: సీఎం రేవంత్
మనకు వచ్చిన పదవులన్నీ కార్యకర్తలు ఇచ్చినవే: సీఎం రేవంత్
అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటున్నాం
సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతం పైగా మనమే గెలిచాం: సీఎం రేవంత్
మున్సిపల్ ఎన్నికల్లోనూ మనమే గెలవాలి: సీఎం రేవంత్
కష్టపడ్డోడు ఎప్పుడూ నష్టపోడు: సీఎం రేవంత్
కాంగ్రెస్ మంత్రులంతా కష్టపడి పైకొచ్చినవాళ్లే: సీఎం రేవంత్
పార్టీ అవకాశం ఇస్తేనే నాతోపాటు ఎవరికైనా గుర్తింపు: సీఎం రేవంత్
-
Jan 08, 2026 14:42 IST
గాంధీభవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
ఉపాధి హామీతో ఎన్నో విప్లవాత్మక మార్పులు: సీఎం రేవంత్
ఉపాధిహామీ పథకానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు: సీఎం రేవంత్
ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్
దేశంలో 80% మంది ఉపాధి హామీపై ఆధారపడి ఉన్నారు: రేవంత్
అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోంది
ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక మోదీ కుట్ర: రేవంత్
SIR వెనుక పెద్ద కుట్ర ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
జీ రామ్ జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశాం: రేవంత్
ఉపాధి హామీ పథకంతో వెట్టిచాకిరీ ఆగింది: సీఎం రేవంత్
పనికితగ్గ వేతనం డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది: సీఎం రేవంత్
ఉపాధి హామీతో గ్రామాల నుంచి వలసలు ఆగాయి: సీఎం రేవంత్
-
Jan 08, 2026 14:24 IST
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి గృహ గణన
జనగణన తొలి దశగా సెప్టెంబర్ 30 వరకు గృహ గణన
సమగ్ర జనగణనకు కేంద్రం ఏర్పాట్లు
2027లో పూర్తిగా డిజిటల్‌గా జనగణన
ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో..
కనీసం 30 రోజులపాటు గృహ గణన ప్రక్రియ
-
Jan 08, 2026 09:50 IST
సిరికొండలో చిరుత కలకలం..
నిజమాబాద్: సిరికొండ మండలం తిరుపతి గుట్ట ప్రాంతంలో చిరుతపులి సంచారం..
లేగ దూడపై దాడి చేసిన చిరుత.. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు అటవీ అధికారులు..
ట్రాప్ కెమెరాలో చిరుత దృశ్యాలు.
-
Jan 08, 2026 09:42 IST
పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు..
నంద్యాల : పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..
ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామ సమీపంలో పొలాల్లో ఘటన..
బస్సు డ్రైవర్లు రాజు, రామమద్దిలేటి, క్లీనర్ పవన్‌కు గాయాలు..
బస్సులోని ప్రయాణికులు సురక్షితం.
-
Jan 08, 2026 09:36 IST
స్కూలు వాహనాన్ని ఢీకొన్న లారీ.. 11మందికి గాయాలు..
చిత్తూరు: పలమనేరు సమీపంలో రోడ్డు ప్రమాదం..
గంగవరం మండలం పొన్న మాకులపల్లి వద్ద ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు..
కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల బస్సు.
బెంగుళూరు_చెన్నై ఎన్ హెచ్ 4 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది..
బెంగుళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ప్రమాదం..
స్కూలు వాహనాన్ని వెనక నుండి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం..
ప్రమాద సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు.
9 మందికి గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమం.
-
Jan 08, 2026 09:26 IST
నేటి సీఎం షెడ్యూల్ ఇదే..
అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ వివరాలు..
1.45 గంటలకు సచివాలయానికి వెళ్లనున్న సీఎం..
మధ్యాహ్నం 12.00 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు..
03.30 గంటలకు గుంటూరులో జరిగే SARAS మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం 06.30 గంటలకు విజయవాడలో జరిగే ఆవకాయ అమరావతి వేడుకల్లో పాల్గొంటారు.
-
Jan 08, 2026 08:43 IST
శ్రీవారిని దర్శించుకున్న నటులు..
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న హాస్య నటుడు బ్రహ్మానందం, నటుడు శ్రీరామ్,
గాయని మంగ్లీ..
-
Jan 08, 2026 06:34 IST
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
రంగారెడ్డి: మోకిలాలో ఘోర రోడ్డు ప్రమాదం
మీర్జాగూడ దగ్గర చెట్టును ఢీకొట్టిన కారు..
నలుగురు ICFAI విద్యార్థులు మృతి..
మృతులు సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్..
గాయాలపాలైన మరొకరిని ఆసుపత్రికి తరలింపు.