Share News

కొత్త ఇంటికి మారేటప్పుడు ఈ వస్తువులను తీసుకెళ్లొద్దు!

ABN , Publish Date - May 13 , 2026 | 11:25 AM

కొత్త ఇంట్లోకి మారడం జీవితంలో ఒక కొత్త ఆరంభంగా భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, పాత ఇంటి నుంచి కొన్ని వస్తువులను కొత్త ఇంటికి తీసుకెళ్లడం అశుభంగా పరిగణిస్తారు.

కొత్త ఇంటికి మారేటప్పుడు ఈ వస్తువులను తీసుకెళ్లొద్దు!
Vastu Tips For New Home

ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఇంట్లోకి మారడం అంటే కొత్త ఆశలు, కొత్త ప్రారంభానికి సంకేతం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, పాత ఇంట్లోని కొన్ని వస్తువులను కొత్త ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వస్తువులు ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయని నమ్మకం. మరి కొత్త ఇంటికి తీసుకెళ్లకూడని వస్తువులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..


పాత చీపురు

వాస్తు ప్రకారం చీపురును లక్ష్మీదేవి ప్రతీకగా భావిస్తారు. కానీ పాత చీపురును కొత్త ఇంటికి తీసుకెళ్లడం మంచిది కాదని చెబుతారు. పాత ఇంటి నెగెటివ్ ఎనర్జీ కూడా దానితో వస్తుందని నమ్మకం. అందుకే కొత్త ఇంటికి కొత్త చీపురే వాడాలి.

పగిలిన పాత్రలు, అద్దాలు

పగిలిన గాజు పాత్రలు, అద్దాలు కొత్త ఇంటికి తీసుకెళ్లకూడదు. ఇవి ఇంట్లో మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు పెరగడానికి కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

పనిచేయని గడియారాలు

ఆగిపోయిన లేదా పాడైన గడియారాలను కొత్త ఇంట్లో ఉంచడం అశుభంగా భావిస్తారు. ఇవి కుటుంబ సభ్యుల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయని నమ్మకం. మరమ్మత్తు చేయలేని గడియారాలను తీసుకెళ్లకుండా వదిలేయడం మంచిది.


ముళ్ల మొక్కలు

కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను కొత్త ఇంట్లో పెట్టకూడదని వాస్తు చెబుతోంది. ఇవి కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు పెంచుతాయని భావిస్తారు. బదులుగా తులసి, మనీ ప్లాంట్ వంటి మొక్కలు మంచివిగా చెబుతారు.

తుప్పు పట్టిన ఇనుప వస్తువులు

తుప్పు పట్టిన పాత ఇనుప వస్తువులు లేదా అనవసరమైన చెత్తను కొత్త ఇంటికి తీసుకెళ్లకూడదు. ఇవి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెంచుతాయని నమ్మకం.

కొత్త ఇంట్లో మంచి ఆరంభం కోసం

కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో గణేశుడి విగ్రహం, తులసి మొక్క, గంగాజలం, నిండు కలశంతో అడుగుపెట్టడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే ఇంటి గడపపై పసుపు, కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేయడం కూడా మంచిదని చెబుతారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఢిల్లీలో ఉచితంగా సందర్శించగల అద్భుతమైన ప్రదేశాలు ఇవే

ఐస్ ఫేషియల్.. వేసవిలో చేయించుకోవడం మంచిదేనా?

For More Latest News

Updated Date - May 13 , 2026 | 11:25 AM