రిపబ్లిక్ డే రోజు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్రదేశాలు బెస్ట్.!
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:39 PM
జనవరి 26 రిపబ్లిక్ డే రోజు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఢిల్లీకి సమీపంలోని చారిత్రక, ప్రకృతి, ప్రశాంతమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించండి.
ఇంటర్నెట్ డెస్క్: గణతంత్ర దినోత్సవం ఈసారి లాంగ్ వీకెండ్‌లో వచ్చింది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజు మీరు ఎక్కడికైనా వెళ్లాలని ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఢిల్లీకి దగ్గరలోనే చాలా మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చరిత్ర, ప్రకృతి, అడ్వెంచర్, ఆధ్యాత్మికత అన్నీ ఒకే ట్రిప్‌లో ఆస్వాదించవచ్చు. ఈ కథనంలో ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న బెస్ట్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆగ్రా
చరిత్రను ఇష్టపడే వారికి ఆగ్రా బెస్ట్ ప్లేస్. ఢిల్లీ నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి సుమారు 4 గంటలు పడుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఉదయం, సాయంత్రం సమయంలో తాజ్ మహల్ చూడటం ప్రత్యేక అనుభూతి. అలాగే ఆగ్రా ఫోర్ట్, అక్బర్ సమాధి కూడా చూడవచ్చు.

రిషికేశ్ & హరిద్వార్
శాంతి, ప్రశాంతత కోరుకునే వారికి రిషీకేశ్ అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ యోగా, ధ్యానం చేయడంతో పాటు రివర్ రాఫ్టింగ్, బంగీ జంపింగ్ వంటి అడ్వెంచర్ కార్యకలాపాలు కూడా చేయవచ్చు. లక్ష్మణ్ ఝుల, రామ్ ఝుల చూడదగినవి. ఇంకా కొంచెం ఆధ్యాత్మిక అనుభవం కావాలంటే సమీపంలోని హరిద్వార్ వెళ్లి హర్ కి పౌరి వద్ద గంగా ఆర్తి చూడవచ్చు.

నీమ్రానా
ఢిల్లీ నుంచి నీమ్రానా సుమారు 115 - 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఢిల్లీ - జైపూర్ హైవే(NH48) ద్వారా కారు లేదా బస్సులో వెళ్తే, ప్రయాణ సమయం సుమారు 2.5 నుంచి 3.5 గంటల వరకు పడుతుంది. ఈ ప్రదేశం చరిత్రను ఇష్టపడే వారికి బాగా నచ్చుతుంది. 15వ శతాబ్దానికి చెందిన నీమ్రానా ఫోర్ట్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం ఇది లగ్జరీ హెరిటేజ్ హోటల్‌గా ఉంది. పురాతన మెట్ల బావి కూడా చూడవచ్చు.

జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
వన్యప్రాణులను ఇష్టపడే వారికి ఇది బెస్ట్ డెస్టినేషన్. ఢిల్లీ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఇక్కడ పులులు, ఏనుగులు, చిరుతలు వంటి జంతువులనూ చూడవచ్చు. జీప్ సఫారీలు ప్రధాన ఆకర్షణ. ప్రకృతిలో ప్రశాంతంగా గడపడానికి ఇదో అద్భుతమైన ప్రదేశం.

జైపూర్
చరిత్ర, సంస్కృతి కలయికగా జైపుర్ నిలుస్తుంది. ఇది ఢిల్లీ నుంచి సుమారు 5 గంటల దూరంలో ఉంది. హవా మహల్, సిటీ ప్యాలెస్, అమెర్ ఫోర్ట్ లాంటి చారిత్రక కట్టడాలు చూడవచ్చు. జోహ్రీ బజార్ వంటి మార్కెట్లలో షాపింగ్ చేయడం కూడా మంచి అనుభవం.

Also Read:
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
భయమెరుగని నాయకత్వ పటిమకు నేతాజీ ప్రతీక: ప్రధాని మోదీ
For More Latest News