పిల్లలతో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ చిట్కాలు మీ కోసమే..
ABN , Publish Date - Feb 22 , 2026 | 05:47 PM
చిన్నారులతో కలిసి ప్రయాణం చేయడం చాలా మందికి టెన్షన్‌గా అనిపిస్తుంది. అయితే సరైన ప్రణాళిక, కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఉంటే పిల్లలతో చేసే ట్రిప్ కూడా సంతోషకరమైన అనుభవంగా మారుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలతో కలిసి ప్రయాణించడం ఉత్సాహంగా అనిపించినా, తల్లిదండ్రులకు ఇదో పెద్ద సవాలు. వారి భోజనం, నిద్ర, భద్రత ఇలా ప్రతి చిన్న విషయం కూడా పెద్ద బాధ్యతగా మారుతుంది. ప్రయాణ సమయంలో పిల్లలు చిరాకు పడటం, ఒకేచోట కూర్చోలేకపోవడం సహజం. దీనివల్ల తల్లిదండ్రులు త్వరగా అలసిపోతారు. కానీ సరైన ప్రణాళిక ఉంటే, పిల్లలతో చేసే ప్రయాణం జీవితంలో మరపురాని అనుభవంగా మారుతుంది. ఇప్పుడు మీ ట్రిప్‌ను టెన్షన్ ఫ్రీగా మార్చే సులభమైన టిప్స్‌ను ఓసారి చూద్దాం..
లెస్ లగేజ్
అవసరం లేని వస్తువులు ఎక్కువగా తీసుకెళ్లొద్దు. బ్యాగ్ ఎంత చిన్నదిగా ఉంటే అంత సౌకర్యవంతంగా ఉంటుంది. డైపర్లు, వైప్స్ అవసరమైనన్ని మాత్రమే తీసుకోండి. కానీ బట్టలు, బొమ్మలు ఎక్కువగా తీసుకోవద్దు.
ప్రయాణంలో జాగ్రత్త
విమానంలో టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఒత్తిడి వల్ల పిల్లలకు చెవుల్లో నొప్పి రావచ్చు. అలాంటి సమయంలో మిఠాయి, లాలీపాప్ లేదా నమిలే ఆహార పదార్థాలేవైనా ఇవ్వండి. చిన్నపిల్లలకు పాలు పట్టవచ్చు. ఇలా చేయడం వల్ల చెవి నొప్పి తగ్గుతుంది.

పిల్లలను బిజీగా ఉంచండి
దూర ప్రయాణాల్లో పిల్లలు బోర్‌గా ఫీలవుతారు. అందుకే కలరింగ్ బుక్స్, చిన్న బొమ్మలు, పజిల్స్ తీసుకెళ్లండి. వారికి ఇష్టమైన కార్టూన్లు లేదా వీడియోలు ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇంట్లో చేసిన ఆహారం
బయటి ఫుడ్ తినడం వల్ల పిల్లలకు జీర్ణ సమస్యలు రావచ్చు. కాబట్టి ఓట్స్ కుకీలు, పండ్లు, శాండ్‌విచ్‌లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకెళ్లండి. గ్యాస్ లేదా కడుపు నొప్పి వచ్చే ఆహారాలు ఇవ్వొద్దు.
పిల్లలకు నచ్చే ప్రదేశాలు
మీకు మాత్రమే నచ్చే ప్రదేశాలు కాకుండా, పిల్లలకు సరదాగా ఉండే ప్రదేశాలను ఎంచుకోండి. వాటర్ పార్క్, జూ, పార్క్ లేదా ఇంటరాక్టివ్ మ్యూజియం లాంటి ప్రదేశాలకు తీసుకెళ్లండి. పిల్లలు ఆడుకుని అలసిపోతే రాత్రి బాగా నిద్రపోతారు.

భద్రతకు ప్రాధాన్యం
రద్దీ ప్రదేశాల్లో పిల్లలు తప్పిపోయే అవకాశముంటుంది. వారి జేబులో మీ మొబైల్ నంబర్ ఉన్న కార్డు పెట్టండి. జ్వరం, కడుపు నొప్పి, గాయాల కోసం చిన్న ఫస్ట్‌ఎయిడ్ కిట్ వెంటపెట్టుకోండి. పిల్లలతో ప్రయాణం సహనానికి పరీక్ష. అయినా అదే సమయంలో వారికి కొత్త విషయాలు నేర్పే మంచి అవకాశం కూడా. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
యువతలో బీపీ పెరగడానికి కారణం తెలుసా?
పాదాలలో ఈ 4 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..!
For More Latest News