Share News

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Nov 15 , 2026 | 09:59 AM

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు టెక్ నిపుణులు. లేకపోతే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ ధరలకు రెక్కలొచ్చాయి. వాటి రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో కొందరు సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే పాత ఫోన్ కొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఫోన్ల పేరుతో కొంతమంది అమ్మకపుదారులు దొంగతనానికి గురైన మొబైల్స్‌ను అంటగడుతున్నారు. వీటిని కొన్న వినియోగదారులు చట్టపరమైన చిక్కుల్లో పడుతున్నారు. అందుకే పాత ఫోన్ కొనే ముందు ఈ కింది విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.


బిల్లు, బాక్సు తప్పనిసరిగా అడగాలి

  • సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తున్న సందర్భంలో దాని అసలు బిల్లు, బాక్సును తప్పనిసరిగా అడగాలి.

  • అవి లేని ఫోన్లను కొనుగోలు చేయకపోవడమే మంచిది.

IMEI నంబర్‌ను చెక్ చేయాలి

  • పాత ఫోన్‌లో IMEI నంబర్‌ను చెక్ చేయాలి. ఇందుకోసం *#06# డయల్ చేయాలి.

  • ఫోన్‌లో కనిపిస్తున్న నంబర్‌ను, బిల్లు/బాక్స్‌పై ఉన్న సంఖ్యతో పోల్చిచూడాలి.

ఇవీ పరిశీలించాలి

  • అమ్మకపుదారుడి సమక్షంలోనే పాత ఫోన్‌ స్క్రీన్, టచ్, కెమెరా, స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించాలి.

  • బ్యాటరీ స్థితినీ తనిఖీ చేయాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఫోన్లలో బ్యాటరీ సమస్యలు తరచూ వస్తాయి.

ఆ ఖాతా లాగ్ అవుట్ చేయాలి

  • పాత యజమానికి సంబంధించిన గూగుల్ లేదా యాపిల్ ఐడీ ఖాతాలను ఫోన్ నుంచి లాగ్ అవుట్ చేయాలి.

  • ఆ తరువాత మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.


ఇవీ చదవండి

పేపర్‌, ఫ్యాబ్రిక్‌ లైట్లతో ఇంటికి కొత్త అందం!

ఫిట్‌నెస్‌ అలవాటుగా మారాలి!

Updated Date - Nov 15 , 2026 | 10:08 AM