Pressure Cooker Safety Tips: ప్రెషర్ కుక్కర్ పేలేముందు కనిపించే సంకేతాలు ఇవే
ABN , Publish Date - Jan 17 , 2026 | 01:39 PM
ప్రెషర్ కుక్కర్ ప్రతి ఇంట్లో వాడే సాధారణ వంట పాత్రే అయినా.. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. కుక్కర్ పేలేముందు కొన్ని హెచ్చరిక సంకేతాలిస్తుంది. వాటిని సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే.. వంటగదిలో జరిగే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రెషర్ కుక్కర్.. ప్రతి ఇంట్లోనూ వాడే ముఖ్యమైన వంటపాత్ర. బంగాళాదుంపలు ఉడకబెట్టడం నుంచి పప్పు, బియ్యం వండటం వరకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనిని వాడటం వల్ల గ్యాస్ కూడా ఆదా అవుతుంది. కానీ, సరైన విధంగా ఉపయోగించకపోతే కుక్కర్ ప్రమాదకరంగా మారుతుంది. నీరు సరిపడా వేయకపోవడం, కుక్కర్‌ను ఎక్కువసేపు మంట మీదే ఉంచడం లేదా మూత సరిగ్గా పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే.. ప్రెషర్ కుక్కర్ పేలకుండా ఉండాలంటే ఈ ముందస్తు సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం.
కుక్కర్ పేలే ముందు కనిపించే సంకేతాలు..
కుక్కర్‌లో ఆవిరి సరిగా బయటకు రాకపోతే లోపల ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు విజిల్ ఆగిపోవడం, వింత శబ్దాలు రావడం, మూత ఎక్కువగా కదలడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ ప్రమాదానికి ముందస్తు హెచ్చరికలు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తే వెంటనే గ్యాస్ ఆపేయాలి. కుక్కర్‌లో ఒత్తిడి పూర్తిగా తగ్గిన తర్వాతే మూత తెరవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
ప్రతి వంట తర్వాత ప్రెషర్ కుక్కర్ వెంట్ పైపు, రబ్బరు సీల్ శుభ్రంగా ఉందో లేదో చూడాలి.
ప్రెషర్ కుక్కర్ వెంట్ పైపు మూసుకుపోకుండా చూసుకోవాలి.
సేఫ్టీ వాల్వ్‌ను కనీసం సంవత్సరానికి ఒకసారైనా తప్పకుండా మార్చాలి.
కుక్కర్ ఎక్కువగా విజిల్ వేస్తుంటే వెంటనే గ్యాస్ ఆపాలి.
సేఫ్టీ వాల్వ్ అనేది కుక్కర్ పేలకుండా కాపాడే ముఖ్యమైన భాగం. ఆవిరి బయటకు వెళ్లలేనప్పుడు అదనపు ఆవిరిని విడుదల చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది.
ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే, ప్రెషర్ కుక్కర్ వల్ల జరిగే ప్రమాదాలను సులభంగా నివారించవచ్చు. వంట కూడా సురక్షితంగా, ప్రశాంతంగా చేయవచ్చు.
Also Read:
రోజూ పాలు తాగుతున్నారా.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..
విటమిన్ సప్లిమెంట్స్ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి..
For More Latest News