వేసవిలో మొక్కలకు ఎప్పుడు నీరు పోయాలి?
ABN , Publish Date - Apr 28 , 2026 | 02:39 PM
వేసవిలో సరైన సమయంలో మొక్కలకు నీరు పోయడం చాలా ముఖ్యం. లేదంటే అవి ఎండిపోతాయి. అయితే ఉదయం నీరు పోయాలా? లేక సాయంత్రం నీరు పోయాలా? అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో మన ఆరోగ్యంతో పాటు మొక్కల ఆరోగ్యంపైనా శ్రద్ధ అవసరం. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతల వల్ల మొక్కలు త్వరగా ఎండిపోవచ్చు. కాబట్టి వాటికి సరైన సమయంలో నీరు పోయాలి. అయితే మొక్కలు ఉదయం నీరు పోయాలా? లేక సాయంత్రం నీరు పోయాలా? అనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఉదయం మొక్కలకు నీరు పోస్తే
ఉదయం (తెల్లవారుజామున) మొక్కలకు నీరు పోయడం ఉత్తమం. ఆ సమయంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నీరు నెమ్మదిగా మట్టిలోకి చేరి వేర్లకు బాగా అందుతుంది. రోజంతా మొక్కలు తేమను నిలుపుకుంటాయి, వేడిని సులభంగా తట్టుకుంటాయి. అలాగే నీరు త్వరగా ఆరిపోవడం వల్ల ఫంగస్ రాకుండా ఉంటుంది.
సాయంత్రం నీరు పోస్తే ఏమవుతుంది?
సాయంత్రం నీరు పోయడం కూడా కొంతవరకు మంచిదే. కానీ ఆ తేమ రాత్రంతా అలాగే ఉండిపోతుంది. దీని వల్ల బూజు, పురుగులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వేసవిలో మొక్కలకు నీరు పోయడానికి ఉదయం సమయం ఉత్తమం. మట్టి చాలా ఎండిపోయి ఉంటే మాత్రమే సాయంత్రం కొద్దిగా నీరు పోయవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News