ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అసలు నిర్లక్ష్యం చేయవద్దు
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:10 AM
ఉదయం లేవగానే ఈ లక్షణాలున్నాయా.. అయితే నిర్లక్ష్యం చేయవద్దు. అవి మీ అనారోగ్యాన్ని తెలియజేసే ముందస్తు సంకేతాలు కావచ్చు.
ఉదయం లేవగానే ఈ లక్షణాలున్నాయా.. అయితే నిర్లక్ష్యం చేయవద్దు. అవి మీ అనారోగ్యాన్ని తెలియజేసే ముందస్తు సంకేతాలు కావచ్చు.
ఛాతీ నొప్పి: ఉదయం లేవగానే ఛాతిలో తీవ్రమైన నొప్పి కలగడం, పట్టేసినట్టు అనిపించడం, బరువుగా అనిపించడం, చెయ్యి నొప్పి మొదలై దవడ, వీపు వైపు నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి గుండె సమస్యలకు సూచన కావచ్చు.
కాళ్లు చేతుల్లో వాపులు: ఉదయం లేవగానే కాళ్లు చేతులు వాపులు రావడం. దీన్ని కిడ్నీలు, కాలేయ, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించిన సంకేతంగా భావించాలి. రాత్రంతా శరీర ద్రవాలు నిలిచిపోవడం వల్ల కాళ్లు, చేతుల్లో విపరీతంగా వాపులు వస్తాయి. నిర్లక్ష్యం చేయడం ప్రమాదానికి దారి తీస్తుంది.
నీరసం: నిద్ర లేవగానే నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. రాత్రంతా నిద్రపోయినప్పటికీ నీరసంగా అనిపిస్తుంది. రాత్రంతా శరీర ద్రవాలను కోల్పోవడం వల్ల నీరసంగా అనిపించవచ్చు. లేదా రక్తహీనత కూడా కారణం అయిఉండవచ్చు. ఈ సమస్యను నివారించడానికి ఉదయం లేవగానే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఐరన్ ఉన్న ఆహారపదార్ధాలను తీసుకోవడం వల్ల రక్తహీనతను అరికట్టవచ్చు.
తల నొప్పి: నిద్రలేమి లేదా రాత్రంతా పళ్లు కొరకడం వంటి అలవాటు వల్ల ఉదయం లేవగానే విపరీతమైన తలనొప్పి ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటే మైగ్రేన్ సమస్యకు దారితీయవచ్చు. అధిక రక్తపోటు వల్ల కూడా తలనొప్పి సమస్య బాధిస్తుంది.
తల తిరగడం: ఉదయం బెడ్ మీద నుంచి లేవగానే ఒక్కసారిగా కళ్లు తిరిగినట్లు అనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. రక్తహీనత, షుగర్, విటమిన్ B12 లోపం, డీహైడ్రైషన్ వంటి కారణాల వల్ల కూడా తలతిరుగుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి.
కండరాలు బిగుతుగా మారడం: రాత్రంతా కదలకుండా ఒకే భంగిమలో నిద్రించడం వల్ల కండరాలు, కీళ్లు బిగుసు పోతాయి. ఇది ఆర్థరైటిస్ సమస్యకు సూచన కావచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.
వికారం, కడుపులో మంట: ఉదయం లేవగానే వికారం వంటి లక్షణాలు కలుగడం, వాంతులు రావడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. అవి జీర్ణకోశ సమస్యలను సూచిస్తాయి. గ్యాస్ట్రిక్, అసిడిటీ వంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది.
మలబద్ధకం: ఉదయం లేవగానే మలబద్దకం సమస్య చాలా మందిని వేధిస్తుంది. దీర్ఘకాలికంగా ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యను నివారించడానికి రోజూ తగినంత నీటిని తాగాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్నితీసుకోవాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయం పాటించాల్సిన చిట్కాలు:
ఉదయం నిద్ర లేచేటప్పుడు ఒక్కసారిగా లేవకుండా.. నెమ్మదిగా లేవాలి. ఒక పక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం వల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.
లేవగానే నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను అరికట్టవచ్చు.
అల్పాహారాన్ని స్కిప్ చేయవద్దు. ఉదయం పూట తృణధాన్యాలు, పాలు, పండ్లు వంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఉదయం పూట అల్పాహారాన్ని మానేయడం వల్ల గ్యాస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది.
లేవగానే ఫోన్‌ను చెక్ చేయడం మానేయాలి. దీని వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉదయాన్నే వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.