ఈ చిట్కాలతో ఫర్నిచర్ చెదలకు చెక్
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:10 PM
మీ ఇంట్లోనూ చెదల సమస్య ఉందా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే..
ఇంటర్నెట్ డెస్క్: చెక్క తలుపులు, ఫర్నిచర్‌కు చెదల పట్టడమనేది పెద్ద సమస్యగా మారింది. ఎంతో విలువైన సామగ్రిని చెదపురుగులు నాశనం చేస్తున్నాయి. అయితే ఈ సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి. సాధారణంగా తేమ కారణంగా చెక్కకు చెదలు పడతాయి. తేమలో వృద్ధి చెందే చెదపురుగులు ఫర్నిచర్‌ను తినేస్తాయి. అయితే ఈ సమస్యను ఆరంభ దశలోనే గుర్తించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పురుగులు చెక్ పెట్టవచ్చు. ఫర్నిచర్‌ను కాపాడుకోవచ్చు. చెదలను నివారించేందుకు ఈ కింది చిట్కాలను పాటించండి.
తేమకు నో ఛాన్స్
తేమ ఉంటేనే చెదపురుగులు పెరుగుతాయి. ఈ తేమను నియంత్రించగలిగితే సమస్యకు పరిష్కారం దొరికినట్టే. అందుకే ఫర్నిచర్ చుట్టూ ఎట్టిపరిస్థితుల్లో నీరు చేరనివ్వకూడదు. గోడలు తడిగా ఉన్నా సమస్యే. అలాగే ఫర్నిచర్ ఉన్న గదుల్లోకి గాలి వచ్చేలా చూడాలి.
సూర్యరశ్మి ప్రభావం
చెక్క వస్తువులను అప్పుడప్పుడు సూర్యరశ్మిలో ఉంచాలి. దీని వల్ల చెదపురుగులు నశిస్తాయి. వేడి సూర్యరశ్మి ఆ పురుగులను తరిమికొడుతుంది. ఫర్నిచర్ ఉన్న గదిలోకి నేరుగా సూర్యరశ్మి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవడం కూడా మంచిది.
వేప చేసే మాయ
చెక్క ఉపరితలంపై వేప నూనెను లేదా వేప ఆకు రసాన్ని పూయడం వల్ల చెదలు దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లవంగ నూనె కూడా చెద పురుగులను నాశనం చేయగలదని వివరిస్తున్నారు.
గమనిక : ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని మీకు అందించాం. ఈ కథనంలోని అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ ధ్రువీకరించడంలేదు.
ఇవీ చదవండి
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే 9 ఆహార పదార్థాలు ఇవే..
వైఫల్యాన్ని విజయంగా మార్చుకోవాలా? చాణక్యుడు చెప్పిన సింపుల్ చిట్కాలు ఇవే.