బెల్లం టీ చేస్తున్నారా? ఈ తప్పు చేయకండి..
ABN , Publish Date - Feb 10 , 2026 | 07:45 AM
బెల్లం టీ (Jaggery Tea) అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే, ఈ టీ తయారు చేసేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు పాలు విరిగేలా చేస్తాయి..
ఇంటర్నెట్ డెస్క్: ఉదయాన్నే టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే, ఈ టీని బెల్లంతో (Jaggery) తయారుచేస్తే.. అది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బెల్లం టీ ఉపశమనం కలిగిస్తుంది. కానీ, చాలా మంది ఈ టీని తయారు చేసేటప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు చేస్తారు. ఇవి పాలు విరగడానికి కారణం అవుతాయి. మీరు బెల్లం టీని రుచికరంగా చేయాలంటే ఈ తప్పులు చేయకండి..
బెల్లం టీ..
టీలో బెల్లం జోడించడానికి సరైన సమయం, పద్ధతి చాలా ముఖ్యం. చాలా మంది వేడి పాలలో నేరుగా బెల్లం వేస్తారు. ఇలా చేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. బెల్లంలోని ఆమ్ల గుణం (acidity) వేడి పాలతో కలిసి.. పాలలోని ప్రోటీన్లను విడదీయడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే, సరైన పద్ధతిలో చేస్తే పాలు విరగవు, టీ క్రీమీగా వస్తుంది.
బెల్లం టీ తయారీ విధానం :
ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకుని, అల్లం, యాలకులు (ఐచ్ఛికం) వేసి బాగా మరిగించాలి.
టీ పొడి వేసి 2-3 నిమిషాలు మరిగించాలి.
స్టవ్ ఆపి, బెల్లం తురుము వేసి కరిగే వరకూ కలపాలి.
విడిగా వేడి చేసిన పాలను ఇందులో పోసి, చిక్కటి టీని వడకట్టుకోవాలి.
ఇలా చేస్తే మీ టీ రుచిగా, చిక్కగా ఉంటుంది!
బెల్లం టీ ప్రయోజనాలు:
బెల్లంలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. బెల్లం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ఫైబర్ కంటెంట్ వల్ల గ్యాస్ సమస్యతో పాటూ బలహీనతను తగ్గించి శక్తిని పెంచుతుంది.
ముఖ్యమైన చిట్కాలు:
బెల్లం వేసిన తర్వాత పాలను నేరుగా మరిగించకూడదు, వేడి పాలు లేదా కాచిన పాలను చివర్లో కలపడం ఉత్తమం.
బెల్లం శ్వాసకోశంలోని శ్లేష్మాన్ని తొలగించి.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మధుమేహం (Diabetes) ఉన్నవారు బెల్లం టీ తాగే ముందు వైద్యులను సంప్రదించాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?
పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?
For More Latest News