Share News

కారణం లేకుండా కొంతమంది ఎందుకు ఏడుస్తారో తెలుసా?

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:21 PM

కొంతమంది కారణం లేకుండా ఏడుస్తారు. అయితే ఇలా ఎందుకు ఏడుస్తారు? కారణం లేకుండా ఏడవడం మంచిదేనా?.. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కారణం లేకుండా కొంతమంది ఎందుకు ఏడుస్తారో తెలుసా?
Crying Without Reason Benefits

ఇంటర్నెట్ డెస్క్: కారణం లేకుండా ఏడవడం చాలా మందికి భయంగా లేదా బలహీనతలా అనిపించవచ్చు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇలా ఏడవడం శరీరం, మనసుకు మంచిదే. ఇది సహజమైన ప్రతిచర్య. తీవ్రమైన భావోద్వేగాలు, అలసట, లోపల దాచుకున్న ఒత్తిడి కారణంగా కూడా మనకు అకస్మాత్తుగా ఏడుపు రావొచ్చు. మీరు ఎప్పుడైనా గది తలుపు మూసుకుని, కారణం తెలియకుండానే ఏడ్చారా? అలా జరగడం సాధారణమే. ఇది శరీరం ఒత్తిడిని తగ్గించుకునే ఒక మార్గం.


ఏడుపు వల్ల ఏం జరుగుతుంది?

  • ఏడ్చినప్పుడు లోపల దాచుకున్న భావోద్వేగాలు బయటకు వస్తాయి.

  • మనసు తేలికగా అనిపిస్తుంది.

  • ఒత్తిడి తగ్గుతుంది.

  • శరీరం ప్రశాంత స్థితికి చేరుతుంది.

నిపుణుల ప్రకారం, ఏడుపు వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ (PNS) యాక్టివ్‌ అవుతుంది. ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే వ్యవస్థ.


కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్) ఎలా తగ్గుతుంది?

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఇది ఎక్కువకాలం ఉంటే ఆరోగ్యానికి హానికరం. అలాంటి సమయంలో ఏడవడం వల్ల కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. మనసుకు ఉపశమనం లభిస్తుంది.


ఏడుపు బలహీనత కాదు..

నిపుణుల ప్రకారం, ఏడుపు బలహీనతకు సంకేతం కాదు.. అది భావోద్వేగ సమతుల్యతకు సంకేతం. ఏడవడం వల్ల శరీరం ప్రశాంతంగా మారుతుంది. ఒంటరిగా లేదా సురక్షితమైన చోట ఏడవడం మంచిదే. ప్రియమైనవారి దగ్గర ఏడవడం మరింత మంచిది. భావోద్వేగాలను అణచివేయడం వల్ల ఛాతీలో భారంగా అనిపించడం, గొంతు, తలలో ఉద్రిక్తత ఏర్పడతాయి. ఏడుపు ఈ అంతర్గత ఒత్తిడిని బయటకు తీస్తుంది. భావోద్వేగాలను దాచిపెట్టడం వల్ల స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. శరీరం అలసిపోతుంది. నిపుణుల ప్రకారం, కారణం లేకుండా ఏడుపు రావడం సహజం. ఇది ఆరోగ్యానికి మంచిది. మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి, ఏడుపు వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!

For More Latest News

Updated Date - Feb 09 , 2026 | 01:44 PM