Reuse Tea Leaves: వాడేసిన టీ పొడిని బయట పడేయకుండా.. ఇలా చేసి చూడండి..
ABN , Publish Date - Jan 13 , 2026 | 08:50 AM
చాలా మంది ఇంట్లో రోజూ టీ చేస్తారు. కానీ మిగిలిన టీ పొడిని ఎందుకు పనికిరాదని చెత్తగా పారేస్తారు. అయితే వాడిన టీ పొడి వృథా కాకుండా.. ఇలా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ప్రతి ఇంట్లోనూ రోజూ టీ తయారు చేస్తారు. టీ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన టీ పొడిని ఎందుకు పనికిరాదని చెత్తబుట్టలో వేస్తారు. నిజానికి వాడిన టీ పొడిని మీరు వివిధ పనులకు మళ్లీ ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల అది వ్యర్థం కాకుండా.. ఇంట్లో ఉపయోగకరంగా మారుతుంది.
మొక్కలకు ఎరువుగా..
వాడిన టీ ఆకులు సేంద్రీయ పదార్థాలతో నిండినవి కాబట్టి, వాటిని మట్టిలో కలపడం ద్వారా మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగించవచ్చు. వాడేసిన టీ పొడిని ఎండబెట్టి మట్టిలో కలపండి లేదా ఎరువులతో కలిపి మొక్కల అడుగున వేయండి.
పాత్రలు శుభ్రం చేయడానికి..
నాన్-స్టిక్ పాత్రలు సరిగ్గా శుభ్రం కాకపోతే.. వాడిన టీ పొడిని నీటిలో మరిగించి, కొద్దిగా వెనిగర్ కలపండి. ఈ ద్రావణాన్ని పాత్రల్లో కొంతసేపు ఉంచి, తరువాత డిష్ వాషింగ్ లిక్విడ్‌తో శుభ్రం చేస్తే దుర్వాసన పోతుంది. అలాగే పాత్రలు శుభ్రమవుతాయి.
ఫ్రిజ్‌లో దుర్వాసన తొలగించడానికి..
వాడిన టీ పొడిని బాగా కడిగి, కాటన్ వస్త్రంలో చుట్టి ఫ్రిజ్‌లో ఒక మూలలో ఉంచండి. ఇది ఫ్రిజ్‌లోని దుర్వాసనను సమర్థవంతంగా తొలగిస్తుంది.
చర్మానికి ఉపయోగం..
వాడిన టీ ఆకులు చర్మానికి కూడా మేలు చేస్తాయి. వాటిని స్క్రబ్‌గా ఉపయోగించి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయవచ్చు. తేనె, పెరుగు లేదా నిమ్మకాయ కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసి ఉపయోగించవచ్చు. అంతేకాదు, వాడిన టీ ఆకులతో వేడి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి, కండరాలు సడలిపోతాయి, నొప్పి తగ్గుతుంది.
సహజ జుట్టు కండీషనర్,,
టీ ఆకులు జుట్టుకు మెరుపు, ఆరోగ్యం ఇస్తాయి. వాడిన టీ పొడిని శుభ్రమైన నీటితో కడిగి, జల్లెడ ద్వారా వడకట్టి, తరువాత మళ్ళీ నీటిలో మరిగించి కడగడం వల్ల జుట్టుకు సహజంగా మెరుపు వస్తుంది. ఈ విధంగా వాడిన టీ పొడిని వ్యర్థం కాకుండా.. ఇంట్లో వివిధ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News