Chanakya Advice To Men: అమ్మాయిలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఈ తప్పు చేయకండి.. పరువు పోతుంది..
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:27 AM
అమ్మాయిలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవే చివరకు వారి గౌరవం, ప్రతిష్ట, సమాజంలో ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు కొన్నిసార్లు నానా తిప్పలు పడుతుంటారు. అయితే అమ్మాయిలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది తెలీకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవే చివరకు వారి గౌరవం, ప్రతిష్ట, సమాజంలో ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు.
అహంకారం, గర్వం చూపించడం..
అమ్మాయిలను ఆకట్టుకోవడానికి తమ శక్తి, హోదా, సంపద గురించి గొప్పలు చెప్పుకోవడం చాలా మంది చేస్తుంటారు. కానీ, చాణక్యుడు దీన్ని మూర్ఖత్వంగా పేర్కొన్నారు. అమ్మాయిల ముందు అహంకారం చూపిస్తే.. చివరకు అపహాస్యమే ఎదురవుతుందని తన నీతి శాస్త్రంలో వివరించారు.
మర్యాదలేని మాటలు..
అమ్మాయిల ముందు డబుల్ మీనింగ్ జోకులు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. చాణక్య నీతి ప్రకారం.. భాషలో మర్యాద లేకపోతే వ్యక్తిత్వం పైనే మచ్చ పడుతుంది. ఇలాంటి మాటలు మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి.
కోపం..
చాణక్యుడి ప్రకారం.. అమ్మాయిల ముందు అరవడం, గట్టిగా మాట్లాడటం, దుర్భాషలాడడం.. మీ బలహీనతను బయటపెడుతుంది. శాంతంగా మాట్లాడే వ్యక్తికే నిజమైన గౌరవం లభిస్తుంది.
వ్యక్తిగత రహస్యాలు పంచుకోవడం..
అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కొంతమంది తమ వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక విషయాలు, రహస్య ప్రణాళికలు.. ఇలా అన్నీ చెప్పేస్తుంటారు. చాణక్యుడి ప్రకారం ప్రతి విషయాన్నీ అందరికీ చెప్పడం అవివేకం అవుంతుందట. ముఖ్యంగా మీ బలహీనతలను బయటపెట్టడం భవిష్యత్తులో మీకే ఇబ్బంది అవుతుందని తెలిపారు.
చెడు ప్రవర్తన..
మీ చూపు, మీ హావభావాలు.. మీ స్వభావాన్ని చూపిస్తాయి. అమ్మాయిల పట్ల అగౌరవంగా చూడడం, అసభ్యకరంగా ప్రవర్తించడం సమాజంలో మీకు చెడ్డ పేరు తెస్తుంది. ఇది జీవితాంతం మీ ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది.
అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే ఆడంబరం, అహంకారం కాదు.. మర్యాద, మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చాణక్యుడు చెప్పారు. ఇవి పాటిస్తే గౌరవం పెరుగుతుందని.. అలా కాకుండా తప్పులు చేస్తే పరువు పోతుందని సూచించారు.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజనపై కసరత్తు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..
For More Latest News