Chanakya Neeti on Forgiveness: ఇలాంటి వారిని అస్సలు క్షమించకండి.!
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:11 AM
క్షమించడం అనే గుణం మానసిక భారాన్ని తగ్గిస్తుంది. కానీ, ప్రతి సందర్భంలోనూ క్షమించడం సరైనదేనా? ఈ విషయంపై ఆచార్య చాణక్యుడు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో క్షమించడాన్ని చాలా పెద్ద గుణంగా భావిస్తారు. కానీ, కొన్ని సందర్భాలలో క్షమించడం మంచిది అనుకుంటే, మరికొన్ని సందర్భాలలో అది మనిషి బలాన్ని తగ్గించే విధంగా ఉండవచ్చు. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమించకూడదు? అని వివరించారు. ఆయన ప్రకారం, ఎలాంటి వారిని అస్సలు క్షమించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరిని క్షమించకూడదు :
పునరావృతమయ్యే తప్పులు: పదే పదే మోసం చేసేవారు, హింసించేవారు లేదా మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేసేవారిని క్షమించకూడదు.
పశ్చాత్తాపం లేనివారు: తమ చర్యలకు పశ్చాత్తాపపడకుండా, బాధ్యతను అంగీకరించని వారిని క్షమించడం మీకే హానికరం
మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేవారు: మీ మానసిక, శారీరక ఆరోగ్యానికి హాని కలిగించే వ్యక్తులను క్షమించడం కంటే, వారి నుండి దూరంగా ఉండటం ముఖ్యం.
ఎవరిని క్షమించాలి?
పశ్చాత్తాపపడేవారు: తమ తప్పును నిజంగా ఒప్పుకొని, క్షమాపణ కోరుతూ, ప్రవర్తనలో మార్పు చూపేవారిని క్షమించవచ్చు.
చిన్న తప్పులు చేసినవారు: అనుకోకుండా లేదా చిన్న పొరపాట్లు చేసినవారిని, వారి ప్రవర్తనలో మార్పు ఉంటే క్షమించడం మంచిది.
ఆత్మరక్షణ కోసం: మీ శత్రువల నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికి లేదా మీ మనశ్శాంతి కోసం, పగను వదిలేయడానికి క్షమించాలి.
క్షమించడం బలహీనత కాదు
క్షమించడం అంటే జరిగిన దాన్ని మర్చిపోవడం లేదా ఆ వ్యక్తిని మళ్లీ నమ్మడం కాదు. అది మీ అంతర్గత శాంతి కోసం, పగను వదిలించుకోవడానికి ఒక ప్రక్రియ. క్షమించినా, ఆ వ్యక్తి మళ్లీ అదే తప్పు చేయకుండా ఉండటానికి స్పష్టమైన హద్దులు పెట్టుకోవడం చాలా ముఖ్యం.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధృవీకరించలేదు )
Also Read:
దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలు ట్రై చేయండి.!
సూర్య నమస్కారాలు చేస్తే ఇన్ని లాభాలా..
For More Latest News