ఈ 3 విషయాల్లో పిసినారితనం పనికిరాదు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:35 PM
డబ్బు ఆదా చేయడం మంచిదే.. కానీ, కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఖర్చు చేయడంలో పిసినారిగా ఉండటం మంచిది కాదని ఆచార్య చాణక్యుడు వివరించారు. అయితే, ఏ విషయాల్లో పిసినారితనం పనికిరాదో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: పొదుపు చేయడం మంచి అలవాటు అయినప్పటికీ, ప్రతి విషయంలో డబ్బు ఆదా చేయడం సరైన నిర్ణయం కాదని ఆచార్య చాణక్యుడు సూచించారు. కొన్నిచోట్ల ఖర్చు చేయడం ద్వారానే భవిష్యత్తులో లాభాలు పొందవచ్చని తన నీతి శాస్త్రంలో చెప్పారు. ముఖ్యంగా ఈ మూడు విషయాల్లో పెట్టే డబ్బు భవిష్యత్తులో మీకు మరింత ప్రయోజనం ఇస్తుందని చాణక్యుడు వివరించారు.
దానం
మన సంపాదనలో కొంత భాగాన్ని అవసరమైన వారికి సహాయం చేయడానికి ఖర్చు చేయాలి. పేదలకు, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందని అంటారు. ఇలా చేసే దానం మనసుకు తృప్తిని ఇవ్వడంతో పాటు, మంచి ఫలితాలు కూడా ఇస్తుంది.
విద్య
విద్యపై ఖర్చు చేసే డబ్బు ఎప్పుడూ వృథా కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం మన భవిష్యత్తును మెరుగుపరుస్తాయి. చదువులో పెట్టిన డబ్బు తర్వాత మంచి అవకాశాలు, ఆదాయాన్ని తీసుకొస్తుంది.
ఆరోగ్యం
ఆరోగ్యమే అసలు సంపద. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఖర్చు చేయడంలో ఎప్పుడూ వెనుకాడకూడదు. సమయానికి సరైన చికిత్స తీసుకుంటే పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే మనం మళ్లీ పనిచేసి సంపాదించగలం.
దానం, విద్య, ఆరోగ్యం.. ఈ మూడు విషయాల్లో ఖర్చు చేసిన డబ్బు ఎప్పటికీ వృథా కాదు. ఇవి మీ జీవితాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
Also Read:
ఆరోగ్య బీమా లేదా అత్యవసర నిధి.. ఏది ముఖ్యం
పెర్ఫ్యూమ్ అవసరం లేకుండా చెమట వాసన పోవాలా? ఈ చిట్కాలు ఫాలో అవండి
For More Latest News